టైం తక్కువగా ఉండడంతో ఇంట్లో పనులంతా ఆడవాళ్లు చక్కబెడుతుంటే బయట పనులు అంతా మగవాళ్ళు అన్ని పంచుకొని చకచకా చేసేసుకుంటూ ఉన్నారు. వర్మ నిలయంలో…ముందుగా అఫీషియల్ మీటింగ్ ఏ కాబట్టి పెద్దమ్మ పెదనానన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన రోషిని వాళ్ళు వచ్చేంతవరకు ఒప్పుకోకుండా వెనుకబడి ఫోను లు చేస్తూనే ఉంది అన్నయ్యలు ఎంగేజ్మెంట్ కి వాళ్లు కూడా ఉండాలని పట్టుబట్టి మరి…

దాంతో శారదా శరత్ లు కూడా తప్పక వర్మ నిలయం చేరుకున్నారు… తార కూడా తన భర్తతో వర్మ నిలయం చేరుకుంది  అన్న తమ్ముడు పిలుపు మేరకు…ఊరిలో కళ్యాణం పనులు అన్నదానం పనులు అన్నీ ఎలా జరుగుతున్నాయో అని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు వర్మ గారు తన అనుభవంతో..ఊరు వెళ్లిన అరుణ్ అజయ్ క్షణం తీరిక లేకుండా ఊపిరాడని పనులతో ఫుల్ బిజీ అయిపోయారు…

మూడు జంటలకి నిశ్చితార్థం ఉంగరాలు సెలెక్ట్ చేసే బాధ్యతను రోషినికే ఇచ్చారు అంతా కలిసి.. దాంతో తనే వర్మ జ్యువెలర్స్ లో ఫేమస్ డిజైనర్ని ఇంటికి పిలిపించి తనకి ఎలా కావాలో అలా డిజైన్ చేపించింది… ఆ డిజైన్ ఎలా అంటే అందరి పేరులోని ఫస్ట్ లెటర్ హైలెట్ అయ్యేటట్టు దాని చుట్టూ లవ్ సింబల్ డైమండ్స్ తో పొదిగేలా డిజైన్ చేయించింది.

రోషన్ ఉంగరం పూజిత పేరు వచ్చేలా పూజిత ఉంగరం రోషన్ పేరు వచ్చేలా… వరుణ్ ఉంగరం సుచరిత పేరు వచ్చేలా సుచి ఉంగరం వరుణ్ పేరు వచ్చేలా… విజయ్ ఉంగరం శ్రావ్య పేరు వచ్చేలా శ్రావ్యా ఉంగరం విజయ్ పేరు వచ్చేలా డిజైన్ చేయించింది…

ఇంకో నాలుగు ఉంగరాలు కూడా అదే డిజైన్తో సీక్రెట్ గా రెడీ చేపించింది రోషిని మూడు అజయ్ కి అరుణ్ కి తనకైతే ఇంకో ఉంగరంలో ఏ లెటర్ పెట్టాలో తెలియక ఇది ఎవరికి చెందుతుందో అని మనసులో అనుకొని… ఈ బంధం ఎవరితో ముడి పడిపోతుందో అనుకుంటూ అన్య మనస్కంగా బి లెటర్ తో చేయించింది… ఉంగరాలు బాధ్యత తనదే కావడంతో ఈ సీక్రెట్ తను ఎవరికి రివిల్ చేయలేదు ఆఖరికి అరుణ్ కి కూడా…ఆ డిజైన్ని ఆ థాట్ ని అందరూ వావ్ అనకుండా ఉండలేకపోయారు…

మనము అలసిపోయి ఆగిపోయిన సమయం ఎవరికోసం ఆగదు కదా అన్నట్టుగా పరుగులు పెట్టి వాళ్ళు బయలుదేరాల్సిన టైం రానే వచ్చింది…వాళ్లు ప్రయాణం చేయవలసిన బస్సు రానే వచ్చింది… పెద్దవాళ్లు కూడా ఉండడంతో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా స్లీపర్ క్యారవాన్ బుక్ చేశాడు రోషన్…అమ్మాయిలకు పెట్టవలసిన లాంఛనాలతో పాటు సీతారాములకు సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు తలంబ్రాలు అన్నీ దగ్గరుండి మరి బస్సులో సర్దించింది రత్న….

 

గుడిలో పూల డెకరేషన్ నుంచి వచ్చిన అతిథులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన ఏర్పాట్లు వరకు అన్ని క్షణం తీరిక లేకుండా ఫోన్లో మాట్లాడుతూనే  ఉన్నారు చంద్ర రాఘవ రఘురామ్ లు…ఊర్లో ముఖ్యమైన వాళ్ళకి స్వయంగా ఫోన్లు చేసి మరీ విషయం చెప్పారు కుందన రాధికలు…పూజిత ఫ్యామిలీ రామ్ ఫ్యామిలీ సపరేట్గా వాళ్ళు అక్కడికి చేరుకుంటామని చెప్పినా వర్మ గారు వినిపించుకోకుండా పట్టుబట్టి అందరం కలిసే వెళ్దామని వాళ్ళను కూడా ఇక్కడికే రప్పించారు…

వచ్చిన అదితి లను చూసుకోవడంలో బిజీ అయిపోయింది రంగి… శ్రావ్య కూడా తన అమ్మతోపాటు పనులు చేయడానికి హెల్ప్ చేస్తూ ఉండడంలో పెళ్లికూతురువి నీకెందుకు తల్లి ఈ పనులు నీ మరదల్ని చూసి నేర్చుకో ఎంత ఆనందగా సోఫాలో కూర్చొని ఉందొ అంది రత్న… రోషిని ని చూస్తూ

అప్పుడే ఆటు గా వచ్చిన కుందనతో మామ్ ఎంత బిజీగా ఉన్నా నీ చెల్లి కళ్ళని నా మీదే ఉంటాయి చూడు అంది రోషిని… కుందన నోరు తెరిచే లోపల అక్క నేను నీ కూతుర్ని ఏమీ అనలేదు నాకు చాలా పనుంది అంటూ వెళ్ళిపోయింది.

తనతో నీకెందుకు బంగారం అంది కుందన రోషినితో… ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేసే పనులు నేను చేశాను కదా నా మీద కుళ్ళు మీ చెల్లికి అంది రోషిని ఉక్రోసంగా…ఏంటి మనవరాలా నా కూతురు మీద పడ్డావు అంది జానకమ్మ అప్పుడే అక్కడికి వచ్చి… నీ కూతురు మీద నీకున్న ప్రేమలో వందో వంతు కూడా నీ కూతురికి తన కూతురి మీద లేదు అదే నేను మా మామ్ కి చెప్పుకుంటున్నానులే అంది రోషిని…

అప్పుడే రెడీ అయి వచ్చిన రత్న చూసావా అమ్మ నా మీద నీకు చాడీలు చెప్తుంది దీనికి ఈ మధ్య నోరు బాగా ఎక్కువవుతుంది అందరూ దీన్ని నెత్తిన పెట్టుకునే వాళ్లేగా అందుకే పొగరు అంది…నేను ఎవరి నెత్తి మీద ఉన్నాను సోఫా మీదనే గా ఉన్నాను అంది రోషిని… దాంతో అందరూ కొంచెం నవ్వడంతో… అన్ని పనులతో పాటు తను కూడా రెడీ అయి అక్కడికి వచ్చిన రాధిక అబ్బ మా కోడలికి ఎవరి స్ట్రెస్ ఎలా తగ్గించాలో బాగా తెలుసు దెబ్బకు అందరు రిలాక్స్ మూడ్లోకి వచ్చేసారుగా అంది.

శ్యామ్ లహరి లను చూసి మీరు రెడీగా అని అడిగింది  రాధిక… మేము ఎప్పుడో రెడీ వదిన… కూతురి నిశ్చితార్థానికి కూడా ఇంత రిలాక్స్డ్ గా కూర్చునే అదృష్టం నాకే దక్కింది కాబోలు.. అన్ని పనులు చేసుకునే భావ గారు నాకు దొరికాక నాకేంటి కష్టం అన్నాడు శ్యామ్ నవ్వుతూ…మరే వంకలు బాగా వెతకడంలో మా ఆయన తర్వాతే ఎవరైనా పనుల్లో ఒక చెయ్యొద్దమని లేకుండా ఆడవాళ్ళతో పాటు రెడీ అయి కూర్చున్నాడని దెప్పి పొడిచింది లహరి…

పెళ్లి పనులన్నీ మామ చేతే చేయిద్దాం లే అత్త డోంట్ వర్రీ అంది రోషిని… ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నీకు తెలిసినంత ఎవరికి తెలియదు బంగారం అన్నాడు  శ్యామ్…

ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు బస్సులో పెట్టాల్సిన లగేజ్ అంతా పెట్టేశారు… అందరూ భోజనాలు కూడా అయిపోయాయి…లేటుగా వచ్చిన రాజు కూడా రెడీ అయిపోయాడు హరితో పాటు…జానకమ్మ అందరు వైపు ఒకసారి చూసి ఇక బయలుదేరుదామా అని అడుగుతూ ఉండగా రోషిని ఇంకా సోఫా మీద కాలు మడిచి కూర్చోవడంతో…అందరూ తనవైపు వింతగా చూస్తున్న పట్టించుకోకుండా ఇంచ్ కూడా కదలలేదు రోషిణి..

అమ్మమ్మ నీ పెద్ద మనవళ్లు ఇద్దరూ పనులతో పాటు వాళ్ళ కాబోయే భార్యలకి సైట్ కొట్టుకుంటూ భోజనం చేయడం కూడా మర్చిపోయారు మరి చూసుకో అంది రోషిని…..వరుణ్  రోషన్ ఒకేసారి జానకమ్మ దగ్గరికి చేరి… భోజనం చేయనిది నిజమే కానీ బంగారం చెప్పింది మాత్రం కారణం కాదు అన్నారు… అబద్ధం అమ్మమ్మ నమ్మకు అంది రోషిని…దాంతో రత్న రోషిని తల మీద మోట్టి ఇరికించడానికి రెడీగా ఉంటావే అంది… నాన్న మీ ఆవిడ నా మీద మెన్హ్యాండ్లింగ్ చేస్తుంది అని చంద్రకి వినపడేలాగా అరిచి చెప్పింది రోషిని…

దాంతో అందరూ రత్నని ప్రశ్నించడానికి ముందే వాళ్లేదో పనుల్లో బిజీగా ఉంటే నువ్వు వెళ్లి తినిపించవచ్చుగా ఎన్నిసార్లు వాళ్ళు నీకు తినిపించలేదు అంది రత్న రోషినిని…అబ్బా వాళ్ళు తినకపోతే మాత్రం పనుల్లో బిజీ నేను తినకపోతే మాత్రం తప్పించుకుని తిరుగుతానా ఏమ్ న్యాయం ఏమ్ న్యాయం… అని రోషిని మాట్లాడుతూ ఉండంగానే ఇక తను ఎవరు చెప్పినా వినదని రోషన్ వరుణ్ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో రంగి ఇద్దరికీ వడ్డించగా చకచకా తినేసారు ఇద్దరు…

తినేసాక సోఫా దగ్గరకు వచ్చి ఇప్పుడు హ్యాపీ నా బంగారం అన్నారు ఇద్దరూ ఒకేసారి  అప్పుడు లేచింది తను తన కూర్చున్న సోఫాలో నుంచి…ఇక అన్ని పనులు అయిపోవడంతో అందరి భోజనాలు అయిపోయి రెడీ కూడా అయిపోవడంతో జంటలు జంటలుగా బస్సు దగ్గరికి కదిలారు…

ముందుగా వర్మ దంపతులు బస్సు ఎక్కాక… తర్వాత శ్రావ్యా నానమ్మ తాతయ్యలు అలాగే పూజ వల్ల బామ్మ తాత బస్సు ఎక్కాక… రాధిక రాఘవ్, రఘురాం కుందన, రత్నాచంద్రులు ఎక్కాక… రామ్ రామ, కవిత వెంకటేష్, శ్యామలహరి ఎక్కాక… శారద శరత్… తార తార భర్త కూడా వాళ్ళని అనుసరించారు… తర్వాత ముగ్గురు పెళ్లికూతురులతోపాటు కాబోయే పెళ్లికొడుకులు ఎక్కాక… పెళ్లికూతురుల అన్నలు చెల్లెలు కూడా ఎక్కేసారు…

రాజు రోషిని మాత్రం బస్సుకి ఒక సైడు నిలబడి ఉంటే… రంగి సెక్యూరిటీ కి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి తాళం పెట్టి వచ్చి బస్సు ఎక్కాక.. హరి కూడా సెక్యూరిటీ కి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బస్ ఎక్కాడు. రోషిణి బిందెడు నీళ్లతో ఎదురు రాగా బస్సు ముందుకు కదిలాకా… ఆ బిందె ని జాగ్రత్తగా దించి ఒక సైడుకి పెట్టిన రాజు బస్సు ఎక్కాక చివరగా రోషిని బస్సు ఎక్కింది. అందరూ ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చున్నాక బస్సు ముందుకు కదిలింది తన గమ్యం వైపు…

సీతారాముల కళ్యాణం జరిపించడానికి బయల్దేరిన వర్మ కుటుంబం మధ్యలో ఆ శివయ్య ని దర్శించుకోవడానికి గుడికి చేరుకున్నారు… రోషన్ పూజ, వరుణ్ సుచరిత, విజయ్ శ్రావ్య ల పేరు మీద అర్చన చేపించి,,, తీర్థ ప్రసాదాల స్వీకరించి గురువుగారి దర్శనానికి వెళ్లారు అంతా. ముందుగా కాబోయే జంటలు ఆశీర్వాదం తీసుకున్నాక

నిఖిల్ని దీవిస్తూ నీ తలరాతలో ఉండే వాళ్ళు నిన్ను చేరవలసిన సమయంలో చేరుతారు అని దీవించారు… అఖిల్ ని కోపం అనర్ధానికి దారితీస్తుంది అది తగ్గించుకోమని దీవించారు… రుచిని చూస్తూ పక్క చూపులు చూడడం అంత మంచిది కాదు అన్నారు….

రాజు, హరి లను  సీగ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు…

రోషిని ని చూసి బాధ్యతలు పెరుగుతున్నాయి… దేవుడు కలపబోయే కొత్త బంధాన్ని సాదరంగా ఆహ్వానించు.. మనం అనుకున్నవన్నీ యధావిధిగా జరగాలని ఏం లేదు… బంధం బీటలు వారకుండా అడ్డుగా నిలవాల్సింది నువ్వే విజియోస్తు అంటూ  దీవించారు గురువుగారు. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టే ధైర్యం చేయదనే మన పెద్ద వాళ్ళ మాటని గుర్తుతెచ్చుకుంటూ మసులుకో… అంతా దైవేచ్ఛ… అని చెప్పి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు.

మీరు కూడా కళ్యాణానికి రావచ్చు కదా తాతయ్య అంది రోషిని… ఈ శివయ్య సన్నిధి ని వదిలి నేను రానని నీకు కూడా తెలుసు కదా తల్లి… వెళ్లి రా విజయోస్తు అన్నారు…మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని తిరిగి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ సీతారాముల కళ్యాణం తో పాటు ఇంకెవరికి కళ్యాణం జరగబోతుందో తెలుసుకుందాం…నెక్స్ట్ ఎపిసోడ్ నోటిఫికేషన్ రావాలంటే నన్ను ఫాలో అవ్వండి చాలు