అరుణోదయ రోషిని తదుపరిభాగానికి స్వాగతం
సుచరితని తీసుకొని తన వెళ్లాలనుకున్న ప్లేస్ కి వెళ్లడానికి రెడీ అయిన రోషినితో అజయ్ కూడా వెళ్లడానికి రెడీ అయ్యాడు
సెక్యూరిటీ ఎవ్వరు లేకుండా రోషిని డ్రైవింగ్ లో సుచి అజయ్ రోషిని అర్ధగంట ప్రయాణం తర్వాత చేరుకోవాల్సిన ప్లేస్ కి చేరుకున్నారు
దారిలో ఎక్కడికి వెళ్తున్నాం బంగారం మనం అని అడిగింది సుచి. పెళ్లి పిలుపులు అక్క అసలే ఇప్పుడు మనం వెళ్లి పిలవాల్సిన వాళ్ళు చాలా స్పెషల్
ఇలాంటి స్పెషల్ పిలుపుల్లో నేను కొంచెం ఎక్స్పర్ట్నీ లే నీకు కూడా కొంచెం చూపిద్దామని తీసుకెళ్తున్నాను అంతే అని ఒక ఇంటి ముందు కార్ ఆపింది రోషిని
ఆ ప్లేస్ చూడగానే ఎమోషనల్ అయింది సుచిరిత. ఇక్కడ కి ఎందుకు బంగారం అంది సుచి.
అలా ఎలా వదిలేస్తాం అక్క తెలుసుకోవాల్సిన లెక్కలు తెల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి కదా పద అంది.
రోషిని ఒక పక్క అజయ్ ఒక పక్క నిల్చుకో గా ముందుకు కదిలిన సుచి డోర్ బెల్ కొట్టింది.
ఇంట్లో పని ఆమె డోర్ ఓపెన్ చేయంగానే ఆమెని తోసుకొని ముగ్గురు ఇంటి లోపలికి వెళ్లిపోయారు
సుచరిత భయపడుతూ ఉండగా రోషిని నేరుగా వెళ్లి సోఫాలో కూర్చుని నిల్చుకునీ ఉన్న అజయ్ ని రోషిని కూడా మీరెందుకు నిలుచుకోవడం కూర్చుండి ఇది మన ఇల్లే కదా కూర్చోండి అంది.
హాలు గోడలంతా ఓన్లీ రమ్య ఫోటోలు తో నిండిపోవడంతో ఒళ్ళు మండిన రోషిని వెంటనే లేచి తన చేతికి అందిన ఫోటోలన్నీ పీకి కింద పడేసింది.
దాంతో భయపడిన పని వాళ్ళు వెంటనే రమ్య అమ్మగారైన శ్రీదేవికి ఫోన్ చేశారు.
ఇంటికి ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారని తెలుసుకున్న శ్రీదేవి వెంటనే తన భర్తకి ఫోన్ చేసి బయటికి వెళ్లిన కూతుర్ని కూడా త్వరగా ఇంటికి రమ్మంది
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి సుచరిత తెలియదు, తను ఉన్నపుడు ఉన్న పని వాళ్ళందరూ మారిపోయారు.
లేడీస్ క్లబ్లో మీటింగ్కు వెళ్లి హొయలు పోతున్న శ్రీదేవి హడావిడిగా అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసింది.
ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పుకోవడానికి షాపింగ్ కి వెళ్ళిన రమ్య కూడా ఇంటికి చేరుకుంది. ప్రసాద్ కూడా భార్య కోపంగా మాట్లాడడంతో త్వరగానే ఇంటికి వచ్చాడు.
దగ్గర దగ్గర ముగ్గురు ఒకేసారి ఇంటికి చేరుకొని అజయ్ హెల్త్ తో మిగిలిన ఫోటోలు కూడా పీకి పడేసి అలసిపోయిన రోషిని సోఫాలో కూర్చోబోతు ఉండగా ఇంటికి చేరుకున్నారు.
ఎవరివి వే నువ్వు నా ఇంటికి వచ్చి నా కూతురు ఫోటోలే పీకి పడేస్తున్నావని రంకెలు వేసింది శ్రీదేవి.
దాంతో ఒళ్ళు మండిన రోషిని కాళ్లు మీద కాళ్లు వేసుకొని సోఫాలో కూర్చుని హలో హోల్డ్ అండ్ ఇది నీ ఇల్లు ఏంటి మా అక్క ఇల్లు అంది సుచరిత ను చూపిస్తూ.
కోపంలో ఊగిపోతూ మొదట సుచరితని ఎవరూ చూడకపోవడంతో వెంటనే ప్లేట్ పిరాయిస్తూ ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తొచ్చిందా తల్లి అని సీరియల్ వేషాలు వేయడం స్టార్ట్ చేసింది శ్రీదేవి.
అచ్చచు తనకైనా ఇన్నాళ్లు కి ఇల్లు గుర్తొచ్చింది మీకిప్పుడు కూడా గుర్తులేదు కదా ఆంటీ అంది రోషిణి.
ఇంతకీ ఎవరమ్మా నువ్వు అని అడిగాడు ప్రసాద్. నేనెవరో తెలియకుండానే నా గురించి ఎంక్వైరీ చేయకుండానే నీ కూతురు మా ఫ్యామిలీ ఎగ్జిబిషన్ కి వచ్చిందా, నేను మరి అంత అమాయకు రాలి లాగా కనిపిస్తున్నానా అక్క అంది రోషిణి.
అజయ్ సుచరిత ఒకపక్క రోషిని యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తూనే తను ఏం చేయబోతుందని క్యూరియస్ గా ఎదురు చూస్తూ ఉన్నారు.
నువ్వు నా కూతురికి బాగా కావలసిన దానివి అని అర్థమవుతూనే ఉంది కానీ ఇలా ఎందుకు వచ్చి రచ్చ చేస్తున్నవ్ అని తనే తగ్గి అడిగాడు ప్రసాద్.
ఇప్పుడు పాయింట్ కి వచ్చావ్ అంకుల్ ఎంతైనా కన్నింగ్ బిజినెస్ మాన్ వీ కదా ఈపాటికి ఏదో నీ బుర్ర లో వెలిగే ఉండాలే
వెలగకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు నేను చెప్తాను కదా ముందుగా బీపీలు ఏమైనా ఉంటే టాబ్లెట్ వేసుకోండి.
అసలే మనం తెలుసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అసలే నాకు టైం చాలా తక్కువ ఉంది అంది.
పళ్ళు కొరుకుతూ తన డ్రెస్ ని గుప్పిట పట్టి నలిస్తున్న రమ్యను చూసి బాగా మండుతున్నట్టుంది లోపల అనుకుంది మనసులో సుచి.
ఏంటండీ ఆంటీ గారు ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయాలని తెలియదా మీకు మీకే తెలియకపోతే మీ కూతురికి ఏం తెలుస్తుంది చెప్పండి
అసలే మా ఫ్యామిలీకి మర్యాదలు అంటే ప్రాణమాయే. మీ కూతురు సారీ మీ చిన్న కూతురు మీ పెద్ద కూతురికి తోడుకోడలుగా వెళ్లాలనుకుంటుంది ఆ విషయమైనా మీకు తెలుసా.
అందుకే మర్యాదలు బాగా నేర్పించండి. ఆ ఏదేదో మాట్లాడేస్తుంది ఏంటి అనుకుంటున్నారా, అనుకోవడంలో తప్పు లేదులే ఇంతకీ మేము వచ్చిన విషయం ఏంటో చెప్పలేదు కదూ అక్కడికే వస్తున్నా.
తిను సుచరిత మా రామ్ పెదనాన్న కూతురు అలాగే మా పెద్ద బావకి కాబోయే భార్య. ఈ విషయాన్ని ఎవరు మార్చలేరు మార్చాలని ట్రై చేసిన అక్కర్లేని బంధాలని వదిలేసి ఇప్పుడు లేని ప్రేమలు నటించాలని చూసినా
సొసైటీ కి ఒక కూతురే ఉందని చెప్పుకుంటూ తిరుగుతున్న మీకు ఆల్రెడీ వదిలేసిన పెద్దకూతురు ఉందని తనకు రావాల్సిన ఆస్తి కూడా అప్పనంగా మీరే మింగేస్తున్నారని
అలాగే బిజినెస్ లో తమరు చేసిన మోసాలన్నీ మీడియాకి ఇచ్చేస్తాను విత్ ప్రూఫ్స్.
నేను వచ్చిన విషయం క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, పిలవని పేరంటానికి రావడం మీకే కాదు మాకు కూడా తెలుసు
ఆ మర్చిపోయాను ఏదో జన్మలో పుణ్యం చేసుకొని మా అక్క జన్మకి కారణమయ్యారు కాబట్టి తన పెళ్లికి వచ్చి అక్షింతలు వేయొచ్చు.
సింగిల్ గా వస్తారో సకుటుంబ సపరివార సమేతంగా వస్తారో మీ ఇష్టం ఆప్షన్ ఇస్ యువర్స్
నేను చెప్పింది కాకుండా నా కూతురు కాకరకాయ నాకే హక్కు ఉంది మీరు ఎవరు పెళ్లి చేయడానికి అంటూ సినిమా డైలాగులు వేశారు అనుకోండి నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా మారదు.
సో నేను చెప్పొచ్చేదేంటంటే కామ్ గా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోతారో గొడవ పెట్టుకుని ఆస్తి పోగొట్టుకుంటారో
మీ ఇష్టం ఛాయస్ ఇస్ యువర్స్ అని తను చెప్పాల్సింది చెప్పేశాక, అన్నయ్య అక్క వెళ్దామా వీళ్ళకి అసలు మర్యాదలు చేయడమే రావట్లేదు నాకు అసలే ఆకలేస్తుంది అంది రోషిని
వామ్మో బంగారం నీతో మామూలుగా ఉండదని తల విదిలించిన అజయ్ వెళ్దాం బంగారం అన్నాడు.
నువ్వేమైనా చెప్పాల్సిందే ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్ అక్క మళ్ళీ అవకాశం రాదు అంది రోషిని.
ప్రసాద్ ఎదురుగా వెళ్లి నిల్చుకున్న సుచి దయచేసి నా తండ్రినని ఎక్కడ చెప్పుకోవద్దు ఆ హక్కు మీకు లేదు ఆ అర్హత కూడా నేను మీకు ఇవ్వాలనుకోవడం లేదు ఎలా అయితే నన్ను వదిలించుకున్నారో అలాగే ఉండనివ్వండి
లేనిపోని బంధాలని కలుపుకోవాలని చూడొద్దు. ఆ బంధం కూడా ఎందుకు కలుపుకోవాలి అనుకుంటున్నారో నాకు తెలుసు.
తనని చూశారు కదా అంటూ రోషిని వైపు చూపించి తనకి నా మరిది కి మధ్యలో ఎవరైనా రావాలని చూస్తే కాళ్లు చేతులు విరిచేయడానికి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను
నన్ను సపోర్ట్ చేయడానికి వెనక నా పుట్టినిల్లు మెట్టినిల్లు ఉంది అని చెప్పి పని అయిపోయింది బంగారం వెళ్దాం అంది సుచి.
వెళదాం అని రమ్య ఎదురుగా నిల్చుకున్న రోషిని చందమామని దూరం నుంచి చూడాలి అనుకోవాలి కానీ అది నాదే అనుకోకూడదు అమ్మ ఆ అదృష్టం అందరికీ దక్కదు జాగ్రత్త.
పిలవని పేరంటానికి అలా వెళ్ళకూడదు మీ అమ్మ నీకు చెప్పినట్టు లేదు మా అమ్మలు నాకు నేర్పించారు అందుకే నేను నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో.
మా బావ చుట్టుపక్కల తిరిగినట్టు నాకు తెలిసిన తిరగాలని ట్రై చేసిన కాళ్లు ఇరగొట్టిచ్చి ఇంట్లో కూర్చోబెటేస్తాను.
జాగ్రత్తగా ఉంటావు కదూ ఉంటావు లే నాకు తెలుసు అని చెప్పి అక్కడ నిలుచుకుని సినిమా చూస్తున్న పని వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి మా అక్క పెళ్లికి గిఫ్ట్ అంది.
మా అక్క మా బావతో సంతోషంగా ఉండాలని దీవించండి అంది.
ఓ ఇంకా పెళ్లి ఎక్కడో చెప్పలేదు కదా అని పెళ్లి జరిగే ప్లేస్ టైం తో సహా చెప్పి అందరూ రావచ్చు వచ్చి దీవించొచ్చు అని చెప్పి వచ్చిన పని అయిపోవడంతో ఎలా వచ్చిందో అలానే బయటకు వెళ్ళిపోయింది రోషిని
కింద పడిపోయిన తన ఫోటోలు చూసిన రమ్య నిన్ను అంత ఈజీగా వదలను చూస్తూ ఉండు అనుకుంది.
మన ఇంటికి వచ్చి అంత ధైర్యంగా రచ్చ చేసి వెళ్తున్న తనని ఈజీగా వదలకూడదు ఏం చేస్తారో చేయండి అని భర్తని ఉసిగొలిపింది శ్రీదేవి.
పని వాళ్లు మాత్రం తమకి వచ్చిన అనుకోని డబ్బును చూసి సంతోష పడి రోషిణి చెప్పినట్టుగానే సుచి సంతోషంగా తన భర్తతో కలిసి ఉండాలని మనసులోనే దీవించారు.
బయటికి వెళ్లిన అజయ్ ముందుగానే డ్రైవింగ్ సీట్లో కూర్చుని రోషిని సుచి కార్ ఎక్కగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక్కడికి మన ముగ్గురమే కాకుండా మన గ్యాంగ్ అంతా వచ్చుంటే సూపర్ గా ఉండేది బంగారం.