అరుణోదయ రోషిని – 39

అరుణోదయ రోషిని తదుపరి భాగం:

అందరూ ఆఫీస్ కి వెళ్ళిపోయాక రమా దిగులుగా కూర్చోవడం గమనించాడు రామ్. కారణమేంటో భార్య మణి గారి దిగులుకి అని అడిగాడు

అన్ని తెలిసి ఏమీ తెలియనట్టు అడుగుతారు ఏంటండీ రాత్రంతా సుచి నిద్రపోలేదు తెలుసా ఎందుకైనా మంచిది ఒకసారి మనం బాబాయ్ గారిని కలుద్దామా అని అడిగింది

నేను కూడా అదే అనుకుంటున్నాను ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళ్దాం బయలుదేరు అని హడావిడి చేసి ఇద్దరు బయలుదేరి వర్మ నిలయం చేరుకున్నారు

వీళ్ళకోసమే అన్నట్టుగా చిన్నవాళ్ళంతా ఆఫీసులకు వెళ్ళిపోగా పెద్దవాళ్ళంతా హాల్లోనే కూర్చొని ఉన్నారు.

రమ వైపు తీక్షణంగా చూసిన జానకమ్మ ఏంటమ్మా మీ ఆయన ఏమైనా ఈ వయసులో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడా ఏంటి మొహం అలా ఉంది అని అడిగితే అత్తో మీ కోడలు నా చెల్లి నేను కాదు

అన్నాడు రామ్ దాంతో అందరూ నవ్వితే అది అలా నవ్వుతూ ఉండాలి ఇప్పుడు చెప్పు ఎందుకంత దిగులుగా ఉన్నావ్ అని అడిగింది జానకమ్మ్మ

మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది కదా పిన్ని. సుచరిత ఎంత భయపడి ఉండకపోతే వెంటనే పెళ్లి గురించి మాట్లాడు అంటుంది ఆలోచించండి అంది

https://omg10.com/4/11363402

దీని గురించి అయితే మీరు చాలా లేట్ అక్క పెళ్లి మాటలు నిన్నే అయిపోయాయి కదా ముందుగా రోషన్ కి వరుణ్ కి చేసి తర్వాత అజయ్ కి విజయ్ కి చేయాలని నాన్న చెప్పేశారు అంది రత్న

మీకు చెప్పడమే తరువాయి మేము చెప్పే లోపల మీరే వచ్చేసారు అంది కుందన. నీకు ఓకేనా అన్నయ్య అని అడిగింది రాధిక

నాకు జరిగిన వాటిని తలుచుకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేస్తే మంచిదనిపిస్తుంది రా అన్నాడు రామ్

రిటర్న్ గిఫ్ట్: ఇవ్వాలంటే బెస్ట్ ఐటమ్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఇదే విషయం వెంకటేష్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పేతే మంచిదేమో కదా నాన్న అన్నాడు రాఘవ్. లేట్ ఎందుకు ఫోన్ చేయమంటే చంద్ర వెంటనే

ఫోన్ చేసి విషయం చెప్పగా ఒక వన్ అవర్ లో పర్మిషన్ తీసుకొని వస్తానని ఫోన్ కట్ చేశాడు వెంకటేష్.

వెంకటేష్ ఫ్యామిలీ వచ్చేలోపల మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా

చెప్పిందాని ప్రకారం తన ఫ్యామిలీ తనని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది కదా ఇప్పుడు ఏదో ఉండబట్టే కదా వాళ్ళు తనని వెతుక్కుంటూ వచ్చారు

లీగల్ గా ఏదైనా ప్రాబ్లం చేస్తారేమోనని భయంగా ఉంది బాబాయ్ అంది రమా

అంత దూరం వెళ్తారని నేను అనుకోవడం లేదమ్మా మన అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది

అది కాక తను మేజర్ అంత దైర్యంగా పబ్లిక్ లోకి వెళ్తారని నేను అనుకోవడం లేదు వెళ్లిన మనమేమి అంత చేతకాని వాళ్ళం కాదు కదా చూసుకుందాంలే అన్నారు

అంతలో వెంకటేష్ గారు కూడా రావడంతో పెల్లి అనుకున్నట్లుగానే ఇద్దరు పిల్లలకి ముహూర్తాలు పెట్టించడానికి గురువుగారి దగ్గరికి బయలుదేరాలి అనుకున్నారు

స్టాఫ్ రూమ్ లో ఒక్కటే దిగులుగా కూర్చుని ఉన్న సుచరిత దగ్గరికి వెళ్ళాడు రాజు

తన ఎదురుగా వేడివేడి టీ పెట్టి తాగు అన్నాడు

బంగారం ఫోన్ చేసిందా అని అడిగితే తెలుసుగా అన్నాడు తను ఎందుకు అయితే ఫోన్ చేసిందో నువ్వు అలాగే ఉన్నావు అన్నాడు నవ్వుతూ

ఆల్రెడీ ఏం జరిగిందో కూడా నీకు తెలిసే ఉంటుంది గా మార్నింగ్ మళ్లీ నాకు ఎదురు వచ్చింది. నాకు చెల్లి గాని చెల్లి, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు

నువ్వెందుకు హ్యాండిల్ చేయడం తాతయ్య చూసుకుంటారులే అంత ఈజీగా వదిలేస్తారా ఏంటి అన్నాడు

నావల్ల తాతయ్య వాళ్ళకి టఫ్ సిట్యుయేషన్ ఎదురవ్వడం నాకు ఇష్టం లేదు అంది

ఎదురైనా తాతయ్య వాళ్ళు వెనుకడుగు వేస్తారని నేను అనుకోవడం లేదు అనవసరమైన విషయాలు గురించి ఎక్కువ ఆలోచించకుండా జరగబోయే నీ పెళ్లి గురించి

కలలు కంటూ ఉండు.  ఓపిక ఉంటే క్లాస్ కి వెళ్ళు లేదంటే ఆఫీస్ కి వెళ్లు బంగారం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది నాకు తెలిసి అన్నాడు

లేదులే క్లాస్ కి వెళ్తాను ఈవినింగ్ కావాలంటే ఇంటికి వెళ్తాను అనవసరంగా తన పనిని డిస్టర్బ్ చేయడం ఎందుకు

అసలే మేడమ్ గారు ఇప్పుడు చైర్మన్ అంది నవ్వుతూ

నీకు తెలుసా నిన్ను చూస్తే నాకు జలసి అనింది. అదేంటమ్మా నన్ను చూస్తే ఎందుకు జలసి అన్నాడు రాజు

నాకు బంగారం పరిచయమై కొద్దిరోజులే అయింది కానీ నువ్వు తన పుట్టినప్పటినుంచి తనతోనే ఉన్నావు కదా అందుకే నాకు నువ్వంటే కొంచెం జెలసి అంది

నేను ఇప్పటి వరకు ఉన్నానేమో కానీ ఇక మీదట మీరు జీవితాంతం కలిసే ఉంటారుగా అది ఒకే ఇంట్లో అప్పుడు నేను కదా నిన్ను చూస్తే జలసి ఫీల్ అవ్వాలి అన్నాడు

మనం ఇలా ఒకరి గురించి ఒకరు అనుకుంటున్నామని తెలిస్తే అనవసరంగా ఏదో ఒక పనిష్మెంట్ వస్తుంది అవసరమా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం

నువ్వు నీ పని చూసుకో నేను క్లాస్ కి వెళ్తున్నాను ఇది బంగారం దగ్గర చెప్పద్దు ప్లీజ్ అంది

sure నువ్విలా గుడ్ గర్ల్ లాగా అనవసరమైన విషయాలు ఆలోచించకుండా జాలీగా ఉంటే నేను చెప్పనులే బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు

పెద్దవాళ్ళంతా గురువుగారి దగ్గరకు వెళ్తున్న విషయం రోషినికి మాత్రం ఫోన్ చేస్తే రోషిని అరుణ్ తీసుకొని గుడికి వచ్చేసింది.

మిగిలిన వాళ్ళకి సర్ప్రైజ్ గా ఉండాలని అందుకే  సుచరిత దగ్గరికి తనే వెళ్లాలనుకున్న కుదరక రాజుని పంపింది

వీళ్ళ రాకను గమనించిన గురువుగారు వర్మ గారి ద్వారా విషయం తెలుసుకొని పది రోజుల్లో ఒక ముహూర్తం 20 రోజుల్లో ఇంకో ముహూర్తం ఉందని చెప్పగా

రోషిని ఏమాత్రం ఆలోచించకుండా పది రోజుల్లోని ముహూర్తమే కాయమ్ చేసేయండి తాతయ్య అంది

లేడికి లేచిందే పరుగన్నట్టు పది రోజుల్లో అంటే కష్టం కదా మనవరాల అంది జానకమ్మ

ఈరోజుల్లో అనుకుంటే కానిది ఏముంది అమ్మమ్మ నువ్వు ఎలా జరగాలో చెప్పు అలా జరిపించేదం అంతే

దానికోసం పోస్ట్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వదిన అక్క తొందరగా మన ఇంటికి వచ్చేయడం మీకు ఇష్టం లేదా చెప్పు అంది

సరే అలాగే కానిద్దాం లే మరి అంది జానకమ్మ  అది మా అమ్మమ్మ అంటే

తాతయ్య ఈ పెళ్లిలో మాకు ఎటువంటి సర్ప్రైజ్లు లేవు కదా అంది గురువుగారిని చూస్తూ

పెళ్లిలో ఎటువంటి సర్ప్రైజ్ లు లేవుగాని పెళ్లి పనులు అంటూ నువ్వు తిరిగేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు అన్నారు

మీరు చెప్పారు కదా ఇంకా జాగ్రత్తగా ఉంటాను మరి అంది

మామయ్య తాతయ్య చెప్పారు నాకు కన్యాదానం ఇచ్చేదైనా తీసుకునేదైనా అమ్మాయి  ఇంటి దగ్గర లేకపోతే గుడిలో జరగాలని

మనకి రెండు పెళ్లిళ్లు ఒకే దగ్గర జరగాలి కాబట్టి ఇంటిలో కుదరదు అందుకని ఈ గుడిలోనే చేస్తే ఎలా ఉంటుంది అని  అడిగింది రాఘవని

ఏం తాతయ్య ఈ గుడిలో పెళ్లిళ్లు చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తారా మరి అంది గురువుగారిని

అన్ని నువ్వే నిర్ణయించేస్తున్నావ్ గా ఆ శివయ్య సన్నిధిలో నీ నోట ఆ మాట వచ్చిందంటే అది ఆయన ఆజ్ఞగా. ఏం వర్మ నీకు సమ్మతమేనా అని అడిగారు

అమ్మాయిల తల్లిదండ్రులకు ఇబ్బంది లేదంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు గురువుగారు అన్నారు వర్మ గారు

రామ్ వెంకటేశులు కూడా ఒకేసారి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పగా సుభస్య శీఘ్రం అన్నారు గురువుగారు

ఇంకేం అబ్బాయిల అమ్మాయిల జాతక చక్రం ప్రకారం ఆ ముహూర్తం ఇద్దరికీ బాగుంది

మీ ఇంటి మహాలక్ష్మి చేత పందిరి గుంజ నాటించి పెళ్లి పనులు మొదలు పెట్టుకోమని చెప్పారు గురువుగారు

అందరూ గురువు గారికి నమస్కారం చేసి బయలుదేరగా రఘురాం మాత్రం గురువుగారి దగ్గరే ఆగిపోయాడు

ఎందుకు ఆగాడు నాకైతే తెలియదు మరి మీకు తెలిస్తే నాకు చెప్పండి

ఎందుకు అగడో మరీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చదువుకుందాం

వర్మగారింట పెళ్లి సందడి ఆరంభం అందరూ ఆహ్వానితులే