అరుణోదయ రోషీనీ తదుపరి భాగాన్ని చదవడానికి రెడీగా ఉన్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి
చంద్రుడు కాంతి సముద్రంలో మెరిసిపోతుంది. ఆకాశమంతా దట్టమైన మేఘలుతో మెరిసిపోతోంది. అలలు ఒడ్డును ముద్దాడుతూ మృదువైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి.
అరుణ్, రోషినీ ఇద్దరూ చెప్పులు చేతిలో పట్టుకుని ఇసుక మీద నెమ్మదిగా నడుస్తున్నారు. చల్లని గాలి రోషినీ జుట్టును ముఖంపైకి తీసుకొస్తుంటే, అరుణ్ మెల్లగా ఆ జుట్టును చెవి వెనక్కి సర్దాడు.
“ఇలా నీతో నడుస్తుంటే… సమయం ఆగిపోతే బాగుండనిపిస్తోంది,” అని అరుణ్ చిరునవ్వుతో అన్నాడు.
రోషినీ అతని వైపు చూసి సిగ్గుగా నవ్వింది. “సమయం ఆగిపోతే… మన ప్రేమ కథ ముందుకు ఎలా వెళ్తుంది?” అంది చిలిపిగా. ముందుకు జరగకపోయినా పర్వాలేదు బంగారం. మీ అన్నలు మన మధ్యలో రాకుండా ఉంటే అదే చాలు అన్నాడు
ఇద్దరూ ఒక పెద్ద రాయిపై కూర్చున్నారు. అలలు వారి కాళ్లను తాకి వెనక్కి వెళ్తుంటే, రోషినీ తన తలను అరుణ్ భుజంపై ఆనించింది.
“ప్రపంచమంతా శబ్దంగా ఉన్నా… నీ దగ్గర ఉంటే మాత్రం మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా?” అని రోషినీ మెల్లగా చెప్పింది.
అరుణ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, వేళ్లను పెనవేసుకున్నాడు.
“నా జీవితంలో నాకు దొరికిన అతి అందమైన బహుమతి నువ్వే,” అన్నాడు అతను ఆమె కళ్లలోకి చూస్తూ. అబద్దాలు చెప్పకు బంగారం ముందు మన కుటుంబం ఫస్ట్ నీకెప్పుడూ నాకు తెలుసు ఆ విషయం దాంట్లో నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు అన్నాడు అరుణ్
రోషినీ అతని చూపును తట్టుకోలేక చిరునవ్వుతో తలవంచింది. కొన్ని క్షణాలు ఇద్దరూ మాటలు లేకుండానే ఒకరి సాన్నిధ్యాన్ని మరొకరు ఆస్వాదించారు. వారి మధ్య ఉన్న నిశ్శబ్దమే వేల మాటలు మాట్లాడింది.
దూరంగా అలల శబ్దం, చల్లని సముద్రపు గాలి… ఆ రాత్రిని వారి ఇరువురు కి మరింత మధురంగా మార్చాయి.
అరుణ్ మెల్లగా ఆమె నుదుటిపై ఒక ప్రేమపూర్వక ముద్దు పెట్టాడు. “ఎన్ని జన్మలైనా… ఇలాగే నీతో కలిసి జీవితం గడపాలని ఉంది,” అని అతను అన్నాడు.
రోషినీ అతని భుజంపై మరింత దగ్గరగా వాలి, “అయితే ప్రతి రోజూ మన ప్రేమకి మరో అందమైన జ్ఞాపకం అవుతుంది,” అని చిరునవ్వుతో చెప్పింది.
అలా సముద్ర అలల సాక్షిగా, మాటలకంటే మనసులు ఎక్కువగా మాట్లాడుకున్న ఆ రాత్రి… వారి ప్రేమలో మరొక మధురమైన అధ్యాయంగా నిలిచిపోయింది.
ఇక వెళ్దామా బావ అంది రోషిని అబ్బా ఉండవే బంగారం దొరక్క దొరక దొరికిన అవకాశంఇప్పుడు తిరిగి వెళ్ళామంటే ఖచ్చితంగా మీ అన్నలు నీకోసం ఇంకా మేల్కొనే ఉంటారు నాకు ఒక మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అన్నాడు
అబ్బా ఎప్పుడు అన్నయ్య ల గురించే మాట్లాడతావ్ ఏంటి బావ నాకంటే నువ్వే వాళ్ళని ఎక్కువ తలుచుకుంటున్నావ్ ఆ విషయం తెలుస్తుందా నీకు అంది రోషిని నవ్వుతూ.
ఏం చేయను నా పరిస్థితి అలా చేశారు మరి మీ అన్నలతో పాటు నా అన్న కూడా నీకే సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ల గురించే కాకుండా అప్పుడప్పుడు నా గురించి కూడా కొంచెం పట్టించుకో బుజ్జి అన్నాడు అరుణ్ దీనంగా.
వాళ్ళ ప్లేస్ వాళ్లదే నీ ప్లేస్ నీదే కదా బావ వాళ్ళతో కాంపిటీషన్ నీకెందుకు చెప్పు అంది. ఇలాంటి మూమెంట్స్ నాకు నితో చాలా కావాలి బుజ్జి అంతే ఇంకేమి లేదు అన్నాడు. సరే లే ట్రై చేద్దాం ఏడవకు అంది.
మన ఎక్సిబిషన్ సక్సెస్ అయిన సుబసందర్బంలో న గిఫ్ట్ అంటూ పెద్ద కొండపల్లి బొమ్మ రోషీనీ ముందు పెట్టీ షర్ట్ లో దోపిన చిప్స్ ప్యాకెట్ రోషీ నీ చేతిలో పెట్టాడు. తనకి తెలుసు అది పూర్తి అయ్యేంతవరకు తను అక్కడి నుంచి కదలదు అని.
రిషి నీ అరుణ్ బుజం మీద తల ఆంచి చిప్స్ తింటూ అరుణ్ కి తినిపిస్తూ ఊగుతున్న బొమ్మ నీ చూస్తూ దూరంగా ఉన్న చంద్రుణ్ణి, చంద్రుడు సముద్రం మీద వెడచల్లుతున్న కాంతి నీ చూస్తూ మురిసిపోయింది.
బంగారం నీకు తెలుసా నిన్ను హ్యాపీ చెయ్యడం చాలా ఈజీ అన్నాడు అరుణ్. అంత లేదు నేను ఓన్లీ నీ దగ్గర మన ఫ్యామిలీ దగ్గర మాత్రమే బెండ్ అవుతాను అంది. అది నిజమే లే అని రోషీనికి లిప్లాక్ ఇచ్చేశాడు అరుణ్ మళ్లీ ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అని.
బావ నిన్ను అంటూ ఇసుకలో అరుణ్ తరిమి అలసిపోయిన రోషీని ఇక వెళ్దాం అంటే సరే లే ఇప్పటికే బాగా అలిసిపోినట్లు ఉన్నావ్, నీ అన్నలు నిన్ను ఇలా చూస్తే నాకే నష్టం అంటూ తనని రెండు చేతులలో ఎత్తుకుని నడవడం మొదలు పెట్టాడు.
నన్ను మోయడానిక మ అన్నల పేరు వడుకోవల్సిన పని లేదు నీకు ఇష్టం ఐతే చాలు అంది. నిన్ను జీవితాంతం మోయడానిక నేను రెడీ బంగారం అంటూ తనకి మాటలు చెబుతూ ఇంటికి వచ్చేశాడు.
కూరగాయలు ఆర్గనైజ్ చేసుకోవడానికి మంచి వస్తువు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి Click here
వెల్లుల్లి ఓలవడం చాలా కష్టం కదా అది ఈజీ చేసుకోవాలంటే ఇది మీ దగ్గర ఈ వస్తువు ఉండాల్సిందే ఇక్కడ Click చేసి ఆ వస్తువు కొనుక్కోండి
ఈ రోజు ఓన్లీ కపుల్స్ కి అంకితం అందుకే ఇక్కడికి అపెస్తున్న
మిగిలిన కత నెక్ట్ ఎపిసోడ్ లో చదువుకుందాం
Bagundi couple day