సుచరిత సవతి చెల్లెలు ఎగ్జిబిషన్ కి వచ్చి హడావిడి చేయడం మొదలు పెట్టింది దాంతో సుచరిత కౌంటర్ కి చేరుకున్నారు బిందు అజయ్లు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా తెలిసిన వాళ్ళ వస్తూ ఉంటే వాళ్లకి అన్ని కౌంటర్స్ చూపిస్తూ వాళ్ళని ఎంగేజ్ చేయడంలో బిజీగా ఉన్నారు.

ఎగ్జిబిషన్ మొత్తానికి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది డైమండ్ నెక్లెస్ దానిని లాస్ట్ లో వేలం వేయడానికి నిర్ణయించుకొని డిస్ప్లే కి పెట్టింది రోషిని అదే జానకమ్మ తన 50వ పెళ్లిరోజున ధరించిన హరం మోడల్.

కుటుంబ సభ్యులంతా దానిని బిజినెస్ కి పెట్టాలని చూసిన రోషిని మనసు  ఒప్పుకోక దాన్ని ఇలా వేలంకి పెట్టి చారిటీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఎవరి హడావిడిలో మళ్ళీ ఉండగా అరుణ్ కౌంటర్ కి వెళ్లిన రుచిత ఎగ్జిబిషన్ కి స్పెషల్ అట్రాక్షన్ అయిన డైమండ్ నెక్లెస్ లాక్ తీసి వేరేచోట పెట్టేసింది తనని ఉద్యోగం నుంచి తీసేసిన రోషిని నీ ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని అలా ప్లాన్ చేసింది.

ఇందు ఫోన్ కాల్ తో సుచరిత దగ్గరికి వచ్చాడు నిఖిల్ అక్కడే మిగిలిన వాళ్ళందరూ ఉండడంతో ఏంటి అందరూ ఇక్కడే చేరారు అని అడిగాడు ఈమె ఎవరో వచ్చి వదిన వాళ్ళ చెల్లెలు అంటుంది బావ అంది ఇందు.  తను ఎవరో నీకు తెలుసా సూచీ అని అడిగాడు నిఖిల్ లేదన్నయ్యా నాకు తెలియదు అని చెప్పింది నిజంగానే సుచరిత తనని గుర్తుపట్టలేదు అందుకే అలా చెప్పింది ఎప్పుడో 15 సంవత్సరాల వయసులో ఇల్లు దాటిన సుచరిత తనని నిజంగానే గుర్తు పట్టలేదు

ఇంతలో వరుణ్ కూడా అక్కడికి రావడంతో తినే కదా నాకు కాబోయే బావగారు అని వయ్యారాలు వాళ్లకు పోసి హలో బావ నేను మీ మరదల్ని అని సెకండ్ కోసం చేయి చాచగా నాకు మా బంగారం తప్ప ఎవరు మరదలు లేరండి సారీ మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు

ఎగ్జిబిషన్ డిస్టర్బ్ అవ్వకూడదని నిర్ణయించుకున్న  వరుణ్ ఇంకొక వన్ అవర్ లో ఆక్షన్ స్టార్ట్ అవుతుంది అది అయ్యాక మాట్లాడుకుందాం ప్లీజ్ అప్పటివరకు ఆప్షన్ హాల్లో వెయిట్ చేయండి అని చెప్పి అక్కడే వాలంటీర్ గా పనిచేస్తున్న రాదని పిలిచి తనని ఆక్షన్ హాల్కి తీసుకువెళ్ళు అని చెప్పాడు రాధా సరే అంటూ రండి అని తీసుకెళ్లింది.

తను ఎవరో నీకు గుర్తు రావట్లేదా అని అడిగాడు అజయ్ లేదు అజయ్ మా నాన్నకి ఒక కూతురు ఉందని తెలుసు కానీ తను తిన కాద అని నాకు తెలియదు తనని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నాకు సరిగా గుర్తులేదు అని నిజాయితీగా చెప్పింది సుచరిత

ఓకే ఓకే ఈ విషయాలు తర్వాత డిలీట్ చేద్దాం ముందుగా ఎవరి కౌంటర్స్ కి వాళ్ళు వెళ్ళండి అని చెప్పాడు నిఖిల్ బిందు కి థాంక్స్ చెప్పి తన పనికి వెళ్లిపోయాడు అజయ్.

అప్పుడే సెలబ్రెటీ హోదాలో ఆ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యాడు వర్ధన్ అప్పటికే  కుమ్మించుకున్న దెబ్బలు తగ్గిపోవడంతో  అన్ని కౌంటర్లు చూసినట్టే చూస్తూ నేరుగా రోషిని కౌంటర్ కి వెళ్ళాడు కావాలనే షో ఆఫ్ చేయడానికి మాస్క్ కూడా లేకుండా వచ్చిన అక్కడ యూత్ కంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఉండడంతో తనని ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు

ఒక మంచి హిట్ కొట్టి పబ్లిక్ అట్రాక్షన్ అయిపోవాలని ఇంకా తమ్ముడు సంవత్సరాలుగా బాగానే కష్టపడుతున్న తన అదృష్టమో దురదృష్టమో ఇంకా తనకు అవకాశం రాలేదు. కౌంటర్ లో రోషినితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ తనని కింద నుంచి పై వరకు కళ్ళతోనే తినడం ప్రారంభించాడు ఎందుకో తన చూపులు నచ్చకపోవడంతో సైలెంట్ గా శ్రావ్య కి మెసేజ్ చేసింది

శ్రావ్య ఆక్కడికి రాగానే ఏంటి మరదల్స్ నన్ను మిస్ అవుతున్నావా అంటూ రోషినీ వైపు చూసి వెంటనే వర్ధన్ వైపు చూసింది. హలో సార్ నైస్ టు మీట్ యూ అని విష్ చేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అడిగింది. మీ ఫ్యామిలీ అంతా అసలు సినిమాలు చూడరా సిస్ నేను యాక్టర్ నీ అన్నాడు.

ఓ అవునా? సారీ బ్రో. మాకు అంత టైం లేదు అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఏమీ అనుకోవద్దు. రండి మిగిలిన కౌంటర్స్ నేను చూపిస్తాను మీకు అంటూ అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ట్రై చేసింది. మీ మరదలు పేరెంటో తెలుసుకోవచ్చా అన్నాడు ఎందుకు తెలుసుకోకూడదు తన పేరు రోషిని తనే ఈ ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేస్తుంది అని చెప్పింది.

ఓ నైస్ చిన్న వయసులోనే మీరంతా చాలా కష్టపడుతున్నారు ఆల్ ది బెస్ట్ అని చెప్పి రోషి నీ వైపు చూస్తూనే ఇంకా ఎక్కువ లాగితే బాగోదని శ్రావ్య వెనక వెళ్లిపోయాడు ఒక రెండు మూడు కౌంటర్లు చూపించి ఆక్షన్ హాల్లో వదిలి పెట్టేసి తన కౌంటర్ కి వెళ్లిపోయింది శ్రావ్య హమ్మయ్య అనుకుని

అదే హాల్లో కూర్చుని ఇంకా అరుణ్ తో మాట్లాడే అవకాశం రాకపోనందుకు అసహనంగా ఫీల్ అవుతూ పక్క సీట్లో కూర్చున్న వర్ధన్ వైపు చూసి సార్ గారు హీరో కదా అనుకొని హలో హీరో గారు మీరు కూడా ఎగ్జిబిషన్ కి వచ్చారా అని అడిగింది అయ్యో ఇది ఎగ్జిబిషన్ తెలియదండి ఏమైనా చిప్స్ దొరుకుతాయి ఏమో మంచిన్ఘ్ కోసం వచ్చాను అన్నాడు వర్ధన్ కూడా అంతే వెటకారంగా

హీరో గారికి వెటకారాలు ఎక్కువే అంటూ గబా గబా తన ఫోన్ గ్యాలరీ వెతికి ఒక ఫోటోని వర్ధన్ ముందు పెట్టింది. అదే ఇంతకుముందు రోషిని ఇంట్లో చెప్పకుండా మాల్కి వెళ్ళినప్పుడు హీరో గారు రోషిని చూసి మనసు పారేసుకుని కళ్ళప్పగించి చూస్తున్నప్పుడు సీక్రెట్ గా రమ్య తీసిన ఫోటో

ఏంటి ఇప్పుడు ఈ ఫోటో చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా అద్భుతాలు కనిపించినప్పుడు అలా మైమరిచి చూడడం సర్వసాధారణమే దీనివల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు అన్నాడు వర్ధన్ కూడా అంతే వెటకారంగా

నిన్ను బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం నాకేం లేదు కానీ నువ్వు కూడా నా బాపతే అని చెప్తున్నాను అంతే అంది రమ్య అంటే అన్నాడు వర్ధన్ నువ్వు తనకి లైన్ వేస్తున్నావు నేను తన బావని ఇష్టపడుతున్నాను మనమిద్దరం టీమ్ అయ్యాం అనుకో ఇద్దరం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆలోచించుకో అంటూ హెయిర్ ఎగరేస్తూ ఇంకోవైపు కి తిరిగింది

గోరోజనం ఎక్కువే కానీ ఏమో మనకి ఉపయోగపడొచ్చు అనుకుంటూ నంబర్స్ ఎక్సేంజ చేసుకుందామా అన్నాడు వర్ధన్. సూర్ అంటూ గుమ్మడికాయ దొంగలు ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు.

విజిటర్లతో అనుకున్న దానికంటే ఎక్కువగా అన్ని కౌంటర్లు నిండిపోయి సేల్స్ తో పాటు ఆర్డర్స్ కూడా పెరిగాయి దాంతో అందరూ బిజీ బిజీగా గడిపారు.  లాస్ట్ లో వేలం టైం అవడంతో అందరూ హాల్ కి చేరుకున్నారు.

అయితే, సరిగ్గా అదే సమయానికి అరుణ్ కి మిస్ అయిన సంగతి గమనించాడు, విఐపి కస్టమర్స్ ఎగ్జిబిషన్ మెయిన్ అట్రాక్షన్ అయిన ఐదు కోట్ల విలువైన రేర్ డైమండ్ నెక్లెస్‌ను చూడాలని అడిగారు. తీరా చూస్తే, ఆ లాకర్ తాళం ఎక్కడో మిస్ అయ్యింది. ఎంత వెతికినా దొరకడం లేదు.

అది మెల్లిమెల్లిగా కుటుంబ సభ్యులందరికీ తెలియడంతో రోషిణి కంగారు పడిపోతూ, “అరుణ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ నెక్లెస్ చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రెస్ వాళ్లు కూడా దాన్ని షూట్ చేయాలనుకుంటున్నారు” అంది.

అరుణ్ క్షణం ప్యానిక్ అవ్వకుండా ఆలోచించాడు. “నువ్వు కంగారు పడకు రోషిణి. బ్యాకప్ కీస్ నా కార్ గ్లోవ్ బాక్స్‌లో ఉన్నాయి, నేను ఇప్పుడే వెళ్లి తెస్తాను. అంతవరకు నువ్వు కస్టమర్లకి మన మిగతా కలెక్షన్స్ చూపిస్తూ మేనేజ్ చెయ్” అని ధైర్యం చెప్పి వెళ్లాడు. అరుణ్ కార్ దగ్గరికి వెళ్లేసరికి పూజిత కంగారు పడితు భయపడుతూ తాళం చెవి తీసి అరుణ్ చేతిలో పెట్టింది.

ఏమి జరుగుతుందో అరుణ్ అంచనా వేయగలిగి టైం లేదు తర్వాత మాట్లాడుకుందాం థాంక్స్ ఫర్ ద కి అంటూ నిమిషాల్లో తాళం తీసుకువచ్చి లాకర్ ఓపెన్ చేశాడు. ఆ డైమండ్ నెక్లెస్‌ని డిస్‌ప్లేలో పెట్టగానే హాల్‌లోని లైట్ల వెలుతురుకి అది మెరిసిపోయింది. దాన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. ఆ రోజంతా బిజినెస్ చాలా అద్భుతంగా సాగింది.

సాయంత్రానికి వాళ్లు అనుకున్న టార్గెట్ కంటే డబుల్ సేల్స్ జరిగాయి. ఆహారం వేలం పాట కూడా స్టార్ట్ అయ్యి పోటాపోటీగా ముగిసి అనుకున్న దానికంటే డబల్ రేట్ కి అమ్ముడుపోయి కుటుంబ సభ్యులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చింది.

అక్కడికక్కడే రోషినివచ్చిన మనీ ని చారిటీ కి అనౌన్స్ చేసి చారిటీకి చైర్మన్ గా  వర్మ గారిని నిలబెట్టేసింది.  దాంతో రిపోర్టర్స్ అంత హర్షం వ్యక్తం చేయగా హాళ్లంతా చప్పట్లతో మారుమోగపోయింది.

ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక విసిటర్స్ రిపోర్టర్స్ వెళ్లిపోయాక కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు

ఎగ్జిబిషన్ ముగిసిన తర్వాత, హాల్‌లో ఖాళీగా కూర్చుని అరుణ్, రోషిణి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

“ఈరోజు నీ వల్లే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అరుణ్ థాంక్స్ అంది రోషిణి ఏంటి మరదల్ నాకు థాంక్యూ చెప్తున్నావ్ ఏంటి కథ అన్నాడు అరుణ్ బై మిస్టేక్ వచ్చేసింది మహానుభావ వదిలేయన ప్లీజ్ అండి దాంతో అందరూ నవ్వడంతో రోషిని ఉడుక్కోవడంతో అందరూ ఇంకా నవ్వారు

 ఒకే ఒక ఇది మన కుటుంబం టీమ్‌వర్క్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు అరుణ్ గర్వంగా.

ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, కుటుంబం అండదండలు కష్టం కలసి వాళ్ల కలల ఎగ్జిబిషన్‌ను సూపర్ హిట్ చేశాయి. ఫ్యామిలీ అంతా తదుపరి ఎగ్జిబిషన్‌ను ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని అక్కడే ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు అందరూ స్నాక్స్ తింటూ.

అందరూ వెళ్లిపోయిన రమ్య అక్కడే ఉండడంతో తనకి కూడా స్నాక్స్ సర్వ్ చేసిన రంగి ఎవరమ్మా మీరు అని అడగడంతో అందరూ చూపు తన వైపు తిరిగింది

రమ్య మేడం ఏం చెప్పబోతుందో రుచిత మేడం చేసిన ఘనకార్యం పూజ ఎలా కీ అరుణ్ కి ఇచ్చిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కీ మీ ప్రోత్సాహం బలంగా ఉండాలి

థాంక్యూ మై డియర్ లవ్లీ రీడర్స్.

https://thequriouslife.com/

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *