హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీ ముందుకు వచ్చేస్తున్నాను మన పక్కింటి ఎదురింటి అలాగే మన వీధి ముచ్చట్లు గురించి మంచిగ డిస్కస్ చేయడానికి

పక్కింటి ముచ్చట్లు అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువే కదా మరి నాకు కూడా కొంచెం ఎక్కువే అందుకే నాకు తెలిసినవి నేను గమనించినవి  మితో పాటు పంచుకోవాలని ఇలా వచ్చేసాను  

ముందుగా నేను గమనించిన మా వీధి ముచ్చటని మీతో పంచుకుంటాను

అదేంటంటే మా వీధిలోకి సాయంత్రం 6 గంటలకు ఒక అమ్మాయి కాదు అమ్మాయి కంటే కొంచెం ఎక్కువ వయసున్నా ఆవిడ బాగా అందంగా రెడీ అయి స్కూటీ లో వచ్చి మా వీధి మధ్యలో ఒక సైడ్ కి అపి నిల్చుకొని ఏదో పార్కులో తన ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న ప్రియురాలు లాగా ఎదురు చూస్తూ ఉంటుంది

తను వచ్చిన ఒక పది నిమిషాల లోపల ఒక వైట్ కలర్ కార్ వచ్చి ఆగుతుంది అది డ్రైవ్ చేసుకుని వచ్చేడ్రైవ్ చేసుకుని వచ్చేది కూడా అబ్బాయి కంటే కొంచెం వయసు ఎక్కువ ఉన్నా అతనె. ఈమె వెంటనే స్కూటీ దిగి ఆ కారులోకి కూర్చుంటుంది. లోపల ఏం జరుగుతుందో ఏం చేసుకుంటారు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళకి ఏం ముచ్చట్లు ఉంటాయో నిజంగా నాకు తెలియదు. 

ఏమో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి ఈ దారించుకున్నారేమో అనుకున్నాను అందర్నీ అలా తప్పుడు దృష్టితో చూడకూడదు కదా

ఒక రోజంటే ఓకే రెండు రోజులు అంటే ఓకే పోనీ ఒక వారం అయినా ఓకే ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్గా ఇలా కలుసుకుంటారా కాదు కదా నాకు అక్కడ డౌట్ కొట్టింది ఒక వారం రోజులు కాదు పది రొజులు కాదు దగ్గర దగ్గర నెల రోజులు నేను సేమ్ సీన్ రిపీటెడ్ గా గమనించాను మనం గమనించిన విషయం మనలోనే దాచుకోలేము కదా…..దాచుకుంటే లావైపోతామాయె….

ఇదే విషయం మా పక్కింట్లో ఉండే నైబర్ కి చెప్పాను…ఎందుకంటే ఒకవేళ నేనేమైనా పొరబడుతున్నానేమో నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నాను ఏమో అని తన సలహా కోసమని తనకి చెప్పాను…

తను కూడా గమనించింది ఒక వారం రోజులు. అప్పుడు మాకు ఈ విషయం మీద డౌట్ మొదలు అయింది….

దీన్ని ఎలాగైనా ఆపాలని అనుకున్నము కాని…ఎల అనేది మాకు ఎదురైనా ఒక పెద్ద ప్రశ్న ఇంట్లో వాళ్లకి అలాగే వీధిలో మిగతా వాళ్ళందరికీ చెబుదామా అంటే అనవసరంగా వాళ్లని సమస్యల్లో ఇరికించిన వాళ్ళం అవుతాం ఏమో కదా అని ఆలోచించాం.

వాళ్ళంతట వాళ్ళనే ఈ వీధిలోకి రాకున్ద అపెస్తె సరిపోతుంది కదా దానికి ఏం చేయాలో ఆలోచిద్దామని అనుకున్నాము

దానికి  నేనేం చేశాను తెలుసా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళని బెదిరించలేదు ఏమీ చేయలేదు

 ఫోన్ వీడియో ఆన్ చేసి నేనేదో మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నట్టు చుట్టూ కూడా వీడియో తీస్తున్నట్టు వాళ్ళ ముందు కొంచెం బిల్డప్ ఇచ్చాను అంతే దెబ్బకి నెక్స్ట్ డే నుంచి రావడం ఆపెసారు…

 వాళ్ళు అలా చేస్తుంటే మీకేంటండి నొప్పి అంటారేమో కదా… చూడండి చేసేదే తప్పు అది మళ్ళీ ఇలా పబ్లిక్ గా చేయాలా అక్కడ ఎంతమంది టీనేజ్ పిల్లలు తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద ఎంత బ్యాడ్ ఇమ్ప్రెస్సన్ పడుతుంది అది మనకి మంచిదా చెప్పన్ది ….

మన సమాజం మీద మనకెంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అలాగని వాళ్ళని బెదిరించి ఏమి చేయలేను. నాకు అంత ధైర్యం కూడా లేదు బట్ నేను అది ఆపాలి అనుకున్నాను దానికి సింపుల్ సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే దానికి నెను చెసిన్దె కరెక్ట్ అనిపించింది

వాళ్లతో మాట్లాడలేదు వాళ్ళని బెదిరించలేదు కానీ మనకు కావాల్సిన పని జరిగిపోయింది …ఇప్పుడు వాళ్లు మా వీధిలోకి రావడం లేదు లేండి 

మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా అయితే నాతో పంచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెను మీకు డైలీ తీసుకొస్తూ ఉంటాను అలాగె ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు చదివేయాలంటే నా  website ni ఫాలో అయిపోండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *