అరుణోదయ రోషినీ తదుపరి భాగానికి స్వాగతం

ఆరుగురు జంటలు గేమ్లో ఇన్వాల్వ అయ్యి ఉండంగా అరుణ్ వీళ్ళని ఎలా అవుట్ చేయాల అని ఆలోచిస్తూ బంగారం వీళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. ఏదో ఒకటి చేయకపోతే నైట్ అంతా మనం ఇలాగే వెళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండాలి నేనేం చేసినా నీకు ఓకేనా అని అడిగాడు

ఏదైనా చేసుకో కానీ ఎవ్వరూ హర్ట్ అవ్వకుండా చేయాలి అని చెప్పింది రోషిని ఇది మరీ బాగుంది బంగారం పాము చావాలి కర్ర విరగకూడదంటే ఎలా నాకు పరిమిషన్ ఇచ్చినట్టే ఉంటావు మళ్ళీ మీ అన్నలు సైడే ఆలోచిస్తావు ఏంటో నీతో ఎలా వేగాలో ఏంటో ఫ్యూచర్లో ఉన్నాడు అరుణ్

ఇంకా ఛాన్స్ ఉంది బావ ట్రై చేద్దామా అన్నాడు అజయ్ నవ్వుతూ తల తిప్పకుండా, అరే సామి నువ్వు గేమ్ లో ఉన్నావు రా అయినా కూడా నీ పాము చెవులు ఇటు వేసే ఉన్నావా గేమ్ లో ఈ రూల్ కూడా పెట్టీ ఉండాల్సింది నేను తప్పు చేశాను అన్నాడు అరుణ్

రుచిత అఖిల్ కళ్ళలోకి చూస్తూ విసుగు పుట్టి అయినా నువ్వేంటి ఎ గేమ్ ఇంత సీరియస్గా తీసుకున్నవు తనంటే నీకు పడదని నాకు తెలుసు నేను ఇంతకంటే ఎక్కువ సేపు నిల్చుకొలేను అని రాధ వైపు చూసి ఐ యామ్ డన్ అంది

గుడ్ మొదటి జంట అవుట్ కమాన్ ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నట్టు అరుణ్ అరుస్తూ అయ్యో బంగారం పడతావు చూసుకో అన్నాడో లేదో నిఖిల్ వెంటనే అయ్యో జాగ్రత్త బుజ్జి అంటూ ఇటు తిరిగితే ఓకే వన్ మోర్ జంట అవుట్ అన్నాడు అరుణ్, నిఖిల్ అరుణ్ వైపు చూసి వెధవ చీట్ చేస్తావంటే ఆ చెయ్యక రాత్రంతా మీ జంటలు మోహలు చూసుకుంటూ కూర్చొవాల నేను నా బంగారంతో మాట్లాడుకోవద్ద వేళ్ళు ఏళ్లవయ్య అన్నాడు

ఇందు వైపు చూసి సారీ అన్నాడు ఇట్స్ ఓకే బావ మనకి ఫ్యూచర్లో చాలా అవకాశాలు వస్తాయిలే డోంట్ వర్రీ అయిన విల్ల నలుగురు లో ఎవరు గెలుస్తారో చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మనం మిగిలిన గేమ్ ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది థాంక్యూ అని చెప్పి తన ప్లేస్ లో వెళ్లి కూర్చున్నాడు

రేయ్ నా గేమ్ చెడగొట్టావంటే తమ్ముడు అని కూడా చూడను నా దగ్గర దెబ్బలు తింటావ్ అన్నాడు వరుణ్ వచ్చాడండి పెద్ద అన్నయ్య బావ లేడిపిస్తుంటే తమ్ముడు అని చూడవు కానీ ఇప్పుడు మాత్రం తమ్ముడు సపోర్ట్ కావాలా చాన్సే లేదు నిన్ను ఓడించడానికి ఏ ఛాన్స్ నేను వదులుకోను అన్నాడు, అరుణ్ మీ అన్నయ్య ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్టే నన్ను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది సుచీ నీ గురించి అయితే కొంచెం ఆలోచిస్తానులే వదినా అన్నాడు

బావ నేను ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోవు కదా అంది శ్రావ్య ఏంటో చెప్పు అని విజయ్ అడగగా బంగారంతో మనకి టైమ్ గడపడానిక చాలా అవకాశాలే వస్తాయి కానీ పెద్ద బావ కి అవకాశాలు తగ్గినట్టే అని నాకు అనిపిస్తుంది. ఎందుకు మనం ఓడిపోకూడదు అంది శ్రావ్య, కానీ కావాలని ఓడిపోకూడదని మన గేమ్ రుల్ లో ఉంది మర్చిపోయావా అలా చేస్తే అన్నయ్య ఒప్పుకోడుగా అన్నాడు విజయ్

మనం కావాలని ఓడిపోతున్నట్టు అందరికీ తెలిసేలాగా ఓడిపోతామా ఏంటి చూస్తూ ఉండు అని ఆలోచించి ఆలోచించి వరుణ్ అన్నయ్య పెద్ద బావని చూస్తున్నాడు అని అరిచింది శ్రావ్య, ప్రామిస్ బంగారం నేను చూడలేదు అయినా నేను చూస్తున్నానని చెప్పిందంటే శ్రావ్యా నన్ను చూసినట్టే కదా సో విజయ్ శ్రావ్య అవుట్ అన్నాడు వరుణ్

అయ్యో వదిన మీ ఓవర్ ఎక్సైటేమెన్నట్ తో ఓడిపోయావు కదా వచ్చేయండి వచ్చేయండి అంది రోషినీ, డన్ బావ పద అంది శ్రావ్య, నువ్వు సూపర్ అంటే సూపర్ అని ఎవరు చూడకుండా శ్రావ్య ముగ్గు మీద ముద్దు పెట్టేసి వెళ్లి తన ప్లేసులో కూర్చున్నాడు విజయ్

అజయ్ గారు మీరు ఏమీ అనుకోనంటే నేనొక మాట చెప్తాను నన్ను తప్పుగా అనుకోకుండా నేను చెప్పింది చేస్తారా అని అడిగింది బిందు, ఏంటి అన్నట్టు అజయ్ చూడడంతో, నా వలన మీకు బంగారానికి దూరం ఎప్పటికీ రాకుండా నా సాయి శక్తుల ప్రయత్నిస్తాను, అలాంటప్పుడు మనకి ఈవారం టైం ఇంపార్టెంట్ కాదేమో కొంచెం ఆలోచించండి ఎందుకంటే చాలాసేపటి నుంచి బంగారం మన చుట్టూ తిరుగుతూనే ఉంది తను ఎంత కాలు నొప్పులు గా ఉంటాయి అది కాకుండా ఈ అవకాశం పెద్దబావకి చాలా అవసరమని నాకు అనిపిస్తుంది. నేను చెప్పిందానికి అంగీకరిస్తే మనం డ్రాప్ అయిపోదామా ప్లీస్ అంది

అది అర్థం చేసుకున్న అజయ్ అన్నయ్య ప్లీజ్ నాకోసం డ్రాప్ అయిపోవా అని మాట్లాడుతూ రోషన్ వైపు చూడడంతో అజయ్ అన్నయ్య అవుట్ అంది రాదా

ఇద్దరు సైగలు చేసుకుని నవ్వడం రోషిని చూసేసి అదే విషయం అరుణ్ కి చెప్పింది పర్వాలేదు బంగారం ఇద్దరూ ట్రాక్ లొకి వచ్చేసినట్టే మనం ఒకరకంగా సక్సెస్ అయినట్టే అన్నాడు అరుణ్

కమాన్ అన్నయ్య పెద్ద బావ మీ ఇద్దరే ఉన్నారు రేస్ లో అంది రోషినీ

నువ్వు నిల్చుకోలేకపోతే మనం డ్రాప్ అయిపోతాం అన్నాడు పూజితతో రోషన్, అలా అడిగితే అన్నా తను మనసులో ఏమనుకుంటుందో ఓపెన్ అయితుందేమో అనుకున్నాడు రోషన్ ఆలా ఏం లేదు ఇలా అయినా మీతో గడిపే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది తప్పితే మీకోసం చేస్తున్నానని అనలేదు పూజిత

ఇంతకంటే ఊరుకో లేకపోయినా రోషన్ అసలు రోషిని గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో ఉన్నదున్నట్టు నాకు ఇప్పటికైనా చెప్పు అన్నాడు రోషన్, నీ వలన నాకు నా చెల్లికి దూరం వస్తుందనుకుంటే నిన్ను వదులుకోవడానికి నేను నిమిషం కూడా ఆలోచించను ఈ విషయం నేను నీకు పెళ్లికి ముందే క్లియర్ చేశాను అయినా నువ్వు నాకు నా చెల్లికి తెలియకుండానే దూరం పెంచుతున్నవ్ ఆ విషయం నాకు బానే అర్థమవుతుంది

ఇప్పుడు నా ఇద్దరు తమ్ముళ్లు వాళ్ళు ఆడలేకపోయారు అనుకుంటున్నావా నాకోసం సక్రిఫైజ్ చేసి ఓడిపోయారు ఆ విషయం నాకు అర్థమైంది నీకు ఎందుకు అర్థం కావట్లేదా అని నాకు అర్థం కావడం లేదు

నీకు అర్థం కావడం లేదా అర్థం చేసుకోవడం లేదా అని నీకు నువ్వే ఒకసారి ఆలోచించుకో చెల్లెలి మీద ప్రేమ ఉండడం మంచిదే ఎందుకంటే నా చెల్లెలు మీద నాకు కూడా ప్రేమే ఉంది కానీ నీలాగా గుడ్డి ప్రేమ అయితే లేదు నా చెల్లెలు తప్పు చేస్తే సరిదిద్దడానికి నేను నిమిషం కూడా ఆలోచించను అంతేకానీ తను ఏం చేసినా కరెక్ట్ అని గుడ్డిగా తనని ఫాలో కాను

బెటర్ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో సరిదిద్దుకుంటే మన ఇద్దరికీ అంత మంచిది ఒక ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లడం అంటే అంత ఈజీ కాదు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పటికైనా నువ్వు నీ నిర్ణయం చెప్పచ్చు ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించుకుంటాను మీ చెల్లిని దృష్టిలో పెట్టుకొని నా చెల్లెల్ని హార్ట్ చేస్తే మాత్రం అదే నీకు నాకు లాస్ట్ రోజు ఇది నేను నిన్ను భయపడమని చెప్పడం లేదు జాగ్రత్త పడమని చెప్తున్నాను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని కరాకండిగా చెప్పేసాడు

అయినా కూడా నోరు తెరవలేకపోతున్న పూజితను చూసి ఒకరకంగా అసహనంగా ఫీల్ అవుతున్నాడు రోషన్ ఇది పక్కవాళ్ళకి వాళ్ళిద్దరూ ఏదో డీప్ గా మాట్లాడుకున్నట్టు అనిపించింది

మనమిద్దరం ఓడిపోతే ఎలా ఉంటుంది వరుణ్ అని అడిగింది ఎందుకు అలా అనుకుంటున్నావ్ అంటే చూడు మనిద్దరికీ బంగారం అన్న తనతో టైం గడపడం అన్న బోలెడంత ఇష్టం కాని రోషన్ అన్నకి అయితే ఇది అవసరం ఇలా అయినా పూజిత బంగారంతో ఎక్కువ టైం గడిపితే మంచిదని నాకనిపిస్తుంది అప్పుడే పెళ్లి తర్వాత మనమంతా హ్యాపీగా ఉండగలం ఒకసారి ఆలోచించు ప్లీజ్ అని సుచరిత చెప్తూ ఉండగానే ఇంతైనా ఓడిపోవచ్చు కదా రోషన్ అని రోషన్ వైపు తిరిగాడు వరుణ్

హేయ్ బావ ఓడిపోయాడు అన్నయ్య గెలిచాడు అన్నయ్య గెలిచాడు అని అరిచారు అజయ్ విజయ్

ఏంట్రా నువ్వు కూడా కావాలని ఓడిపోయావా వాళ్ళలాగా లేకపోతే నిజంగానే ఓడిపోయావా అని అడిగాడు మేము ఎక్కడ కావాలని ఓడిపోయాం అని వచ్చారు అజయ్ విజయ్. మీ కథలన్నీ నాకు తెలుసులే ఏదైతే అది అయింది ఫైనల్ గా పెద్ద బావ గెలిచాడు అని అనౌన్స్ చేశాడు అరుణ్

కంగ్రాట్యులేషన్స్ పెద్ద బావ సక్సెస్ఫుల్గా మీ చెల్లి డ్రైవర్ పోస్ట్ ఒక వారం రోజులు గెలుచుకున్నందుకు అన్నాడు ఇది టూ మచ్ కన్నా ఇలాగే టేస్ట్ చేశావంటే నీతో వారం రోజులు మాటలు కట్ చేస్తాను జాగ్రత్త అన్ని రోషిని చెప్పడం తో అంత పని చేయకు బంగారం ప్లీజ్ ఎంతైనా నీ దాసున్ని కొంచెం కనికరించవా అన్నాడు అరుణ్

ఒరేయ్ వెధవ నీ కంగారు నువ్వు బంగారం నిన్ను ఏమని పిలిచిందో నువ్వు సరిగా వినలేదు అన్నాడు వరుణ్ అప్పుడు రివైండ్ చేసుకున్నా అరుణ్ ఓ బుజ్జి నువ్వు నన్ను కన్నా అని పిలిచేసావా థాంక్యూ గెలిచింది పెదబావ అయినా నేను గెలిచినంత సంతోషం వచ్చింది అన్నాడు

అందరూ రోషిన్ కి కంగ్రాట్స్ చేప్పాక ఈ టైంలో కార్లన్నీ రమ్మని చెప్పడం ఇష్టం లేక రోషన్ పూజిత నీ రుచితని డ్రాప్ చేయడానికి వెళితే అజయ్ బిందు ఇందు రాదని డ్రాప్ చేయడానికి వెళ్లగా వరున్ సూచీ, అఖిల్ నిఖిల్ లని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు

విజయ్ శ్రావ్య, అరుణ్ రోషన్ ముగ్గురు తిరిగి వచ్చే వరకు టైం స్పెండ్ చేసి వాళ్ళు వచ్చాక ఎవరి రూం కి వాళ్ళు వెళ్ళిపోయారు

ఇదండీ ఇవాళ్టి ఎపిసోడ్, మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చదువుకుందాం

https://thequriouslife.com/10-best-and-powerful-daily-habits-for-your-healthier-and-happier-life/

One Response

  1. Nice bagundhi but pujitha manasu lo emi Undo artham kavatam ledu.may be ruchitha baga brain wash chesindi Anukunta twaraga change avvu puji ledantay manchi family miss avutavu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *