అరుణోదయ రోషిని – Part 41

తల్లి మాటలు విన్న తర్వాత పూజతకి నిద్దరే పట్టలేదు అది సంతోషమో దిగులో అర్థం కాలేదు

పెళ్లి తర్వాత కచ్చితంగా తన పేరెంట్స్ తో ఏమో కానీ తన చెల్లితో అయితే తనకి గ్యాప్ వస్తుంది ఆ విషయం తనకి అర్థమవుతుంది

ఆ విషయంలో ఆ కుటుంబాన్ని తప్పు పట్టలేదు తన చెల్లిది అత్యాశ అయితే  అటువైపు వాళ్లది జాగ్రత్త

ఆ కుటుంబం నుంచి ఫేవరెట్ ఇజం ఎక్స్పెక్ట్ చేయడం కంటే తన చెల్లిని మంచిగా మార్చడమే తన ముందున్న మార్గమని అనుకుంది పూజిత

అనుకున్నదే తడువుగా తన పక్కనే నిద్రపోతున్న రుచితని తట్టి లేపింది.  ఏంటక్కా మంచి నిద్రలో లేపావు అనీ అడిగింది రుచి

రుచి నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అడిగింది నువ్వు చెప్పడమును చేయకపోవడం  ఆ ఏంటో చెప్పు అనింది

అజయ్ కి దూరంగా ఉండవా ఎందుకంటే తనకి పెళ్లి కుదిరిపోయింది అది కాక నిశ్చితార్థం అప్పుడు నువ్వు చేసింది అందరికీ తెలుసు ఏదో పెద్ద మనసుతో

అది నాన్న వరకు ఎవరు తీసుకురాలేదు అంతే అంది

షాపింగ్ అట్ అమెజాన్:

(మనకి శ్రావణమాసం స్టార్ట్ అయింది కదా రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వడం పరిపాటి కదా ఇక్కడ క్లిక్ చేసి జర్మన్ సిల్వర్ బౌల్ విత్ స్పూన్ అమెజాన్ సైట్ నుంచి బై చేయండి ఓన్లీ 99 రూపాయలు మాత్రమే. కొనడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి)

(అందమైన రాధాకృష్ణుల పెయింటింగ్ ఉండే బ్యాగ్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడేవి. చాలా చక్కగా ఉంటాయి అవి కొనాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. 25 బ్యాగ్స్ @ 299)

నిశ్చితార్థం అప్పుడు నేనేం చేశాను అక్క అని ఏమీ తెలియనట్టు అమాయకంగా అడిగింది రుచి

దయచేసి నా దగ్గర కూడా అబద్ధం చెప్పద్దు రుచి, అదే కాదు ఎగ్జిబిషన్ అప్పుడు నువ్వు చేసింది కూడా అందరికీ తెలుసు

పెళ్లి షాపింగ్ లో నాతోపాటు నిన్న తీసుకురావద్దని రోషిని నాకు స్ట్రైట్ గానే వార్నింగ్ ఇచ్చింది

అంటే నువ్వు తన మాటలు నమ్ముతున్నావా అందుకు ఒప్పుకున్నావా అని అడిగింది రుచి. నేను ఒప్పుకోకపోతే ఆ విషయం నాన్న వరకు వస్తుంది తర్వాత నువ్వేం చేయగలవు అంది

తన అక్క అంటే ఎంతో కొంత ఇష్టం ఉన్న రుచి నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ షాపింగ్ చేసేటప్పుడు నువ్వెక్కడ తగ్గదు నువ్వు ఎవరికంటే తక్కువ కాదు బెస్ట్ తీసుకో అని చెప్పింది

మే బి నేను మీ చెల్లెలు గా నీతో రాలేకపోవచ్చు కానీ వన్స్ నేను అజయ్ భార్యని అయ్యాక నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను ముఖ్యంగా రోషిని సంగతి చెప్తానని మనుసులో అనుకుంది రుచిత

ముందు రోజు ప్లానింగ్ తో బాగా అలసిపోయిన రోషిని ఫుల్ గా నిద్రపోయి లేటుగా నిద్రలేచి జానకమ్మ దగ్గర తిట్లు తింటున్నప్పుడు అక్కడికి వచ్చిన రాఘవ

చాలమ్మా నిన్న అంతా బంగారం ఎంత అలసిపోయిందో తెలుసు గా ఒక్క రోజు నిద్రపోతే ఏమైంది అన్నాడు

ఇలా వెనకేసుకొచ్చే దాన్ని చెడగొడుతున్నారు అన్నయ్య ఇవాళ పూజ అని తెలుసు కదా

అది చేయాల్సింది తనే అని తెలుసు కదా, ఇంత లేట్ గా నిద్ర లేచి వస్తే ఎలా పంతులు గారు వచ్చే టైం అయింది అంది రత్న

చిన్నత్త మీ వర్రీ నాకు అర్థమవుతుంది 10 నిమిషాలు టైం ఇవ్వు బంగారం నీ బంగారు బొమ్మలా రెడీ చేసి తీసుకొని వస్తాను ఈ లోపల మీరు పూజ ఏర్పాట్లు చూసుకోండి

అంటూ రోషినీ నీ తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది శ్రావ్య

తనని రెడీ చేసేటప్పుడు మా పెళ్లి కొంచెం లేటుగా చేయమని చెప్పి మంచి పని చేశావు బంగారం లేకపోతే ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోతుంది

అని శ్రావ్య చెప్పేటప్పుడే ఆ రూమ్ లోకి వచ్చిన బిందు నాది కూడా సేమ్ ఒపీనియన్ మరదల్

ఇప్పుడు మీ అన్న గారు నా గురించి ఏమనుకుంటున్నారో కొంచెం తెలుసుకోవాలి నేను అంది

సోపూర్ మీ నాన్నగారి బిజినెస్ ని ఒంటి చేత్తో రన్ చేస్తున్నావ్ కాబోయే ఆయన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నావా అంది

నాకేమీ అతీత శక్తులు లేవమ్మా, మీ చిన్న వదిన పెద్ద వదినల లా లవ్ కూడా లేదా ఏ

ఏం చేయమంటావు చెప్పు ఈ పెళ్లిళ్ల సాకుతో అటు ఇటు రాకపోకలు పెరుగుతాయి కాబట్టి ఏదో కొంచెం టైం దొరికిందని

ఆశ, అన్న బిందుతో  ఇలా చిన్న చిన్న వాటికే పొంగిపోతే ఫీచర్లో నిన్ను ఒంటి చేతి మీద ఆడిస్తాడు మా అన్నయ్య

కొంచెం టఫ్ గా ఉండడానికి ట్రై చెయ్ అని ఉచిత సలహా ఇచ్చింది రోషిని

మనం ఇక్కడ ఇలా మాటలు పెట్టామంటే చిన్నత్త రూమ్ కొచ్చి అందర్నీ కొడుతుంది అని తొందర పెట్టింది శ్రావ్య

ఓహో ఇప్పటినుంచే అత్తగారి మాటల్ని తూచా తప్పకుండా పాటించే ఉత్తమ కోడలు లిస్టులో చేరిపోదామని ట్రై చేస్తున్నావా అని ఆటపట్టించింది రోషిని

నువ్వు ఎంత ఆట పట్టించిన నా ఇద్దరు అత్తలు సో స్వీట్ అబ్బా అంది శ్రావ్య

ఓహో అత్తల పార్టీలో చేరిపోయి నాకు అగైనెస్ట్ గా అవుదాం అనుకుంటున్నావా చూసుకో మరి ఫ్యూచర్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది రోషిని

రెడీనా పంతులుగారు వచ్చేసారని కుందనా రూమ్ లోకి రావడంతోనేను ఎప్పుడో రెడీ మామ్ నీ కోడళ్లే చిన్నత్త మంచిదా పెద్ద మంచిదా అని డిబేట్ పెట్టుకున్నారు అంది రోషిని

నిజంగా మేము అలా మాట్లాడలేదు అంది శ్రావ్య. నిజంగా అదే మాట్లాడారు మామ్ కావాలంటే బిందు వదినని అడుగు అని అమాయకంగా చెప్పింది శ్రావ్య

వామ్మో ఏంటి బంగారం ఇలా ఇరికించావు ఇదంతా నీ వల్లే అన్నట్టు శ్రావ్య వైపు చూసింది బిందు

అమ్మ తల్లి మా అత్తలని పొగడ్డం తప్పే ఇంకెప్పుడూ అలా చేయను దయచేసి ఇలా ఇరికించకు అని బతిమిలాడింది శ్రావ్య

అది అలా రండి దారికి లేకపోతే నా ముందే నన్ను ఎప్పుడు తిట్టే మీ అత్తలని పొగుడుతావా ఇది జస్ట్ డెమో నే బాగుందా అంది

అయ్యో వాళ్ళు ఇంకా మన ఇంటికి రానేలేదు బంగారం అప్పుడే భయపెట్టేస్తే ఎలా అన్న కుందన తో అంటే ఏంటత్తా మేం కోడలు అయిపోతే ఎంతైనా ఏడిపించుకోవచ్చని పర్మిషన్ ఇస్తున్నావ నీ కూతురికి

అని వాపోయింది శ్రావ్య,  అది నువ్వు బంగారంతో పెట్టుకోక ముందు ఆలోచించాలి సరే సరే ఇది మనం తర్వాత పెట్టుకుందాం కానీ పంతులుగారు వచ్చేసారు త్వరగా రండి అని పూజ జరిగే దగ్గరికి తీసుకుని వెళ్ళింది ముగ్గురిని

పంతులుగారు చెప్పినట్టే మొదట వినాయకుడికి పూజ చేసి తర్వాత  పందిరి గుంజ నాటించి పూజ పూర్తి చేపించారు రోషిని చేత, తర్వాత కాబోయే పెళ్ళికొడుకుల చేత కూడా పూజ చేపించారు

అమ్మ ఇంక మీరు పెళ్లి పనులు బేశుగ్గా ప్రారంభించుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చి సంభావన పుచ్చుకొని పంతులుగారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హాఫ్ శారీలో పుత్తడిబొమ్మలా రెడీ అయిన రోషిని నుంచి చూపు తప్పించుకోవడం అరుణ్ కి కత్తి మీద సామ్ అయిందని చెప్పాలి

అక్కడే ఉంటే బావల చేత దొరికిపోయి రోస్ట్ అయిపోతానని అనుకున్నా అరుణ్ నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నానని చెప్పాడు

వెళ్లేటప్పుడు రోషిని రేపు మాల్ అంతా ఒక రెండు గంటలు కుటుంబం కి బుక్ చేయమని చెప్పింది

అరుణ్ సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇద్దరి పెళ్లికూతురుల ఫ్యామిలీని రేపు షాపింగ్ కి మాల్కు వచ్చేయమని జానకమ్మ చేత పిలిపించింది రోషిని

తాతయ్య కార్డ్స్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే ఇవాళ ఈవినింగ్ కి వచ్చేస్తాయి బంగారం అన్నారు వర్మ గారు

మీరంతా మాల్ లో షాపింగ్ చేస్తూ ఉండండి నేను సుచి అక్క వచ్చి మీతో జాయిన్ అవుతాం మధ్యలో మాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పింది రోషిని

మీరిద్దరేనా నో వే నేను మీతో వస్తానన్నాడు అజయ్ ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అంది రోషిని

 

ఏంటో రోషినికి సుచికి ఉండే సపరేటు పని తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్

ఈ ఎలా ఉందో చదివేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పేయండి

ఈ ఎపిసోడ్ లో ఎక్కడైనా ఇక్కడ క్లిక్ చేయండి అని నేను మెన్షన్ చేసి ఉంటే అవి అమెజాన్ సైట్ లింక్స్ మాత్రమే ఆ లింక్ త్రూ మీరు ఏదైనా వస్తువు కొనుగోలు నాకు 1% కమిషన్ వస్తుంది అంతే.

మీరు ఏదైనా వస్తువులు అమెజాన్ నుంచి కొనాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్తే ఆ లింకు మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇస్తాను దాని ద్వారానే నాకు రెవెన్యూ వస్తుంది

లేకపోతే నో రెవిన్యూ ఈ సైట్ మెయింటెనెన్స్ కూడా డబ్బులు రావు

మీరేదైనా వస్తువు అమెజాన్ నుంచి కొనాలనుకుంటుంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఆ కామెంట్ లో లింక్ ఇస్తాను మీకు ప్రైస్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు కాకపోతే నాకు వన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది

Leave a Comment