నీ వైపు అలా చూస్తూ ఉంటే

Telugu story: సిటీలోని ఒక ఫేమస్ హాస్పిటల్ లో మెటర్నటీ వార్డు ముందర రెండు కుటుంబాల సభ్యులు ఆందోళనగా

అటు ఇటు తిరుగుతూ తమ ఇంటికి రాబోయే చిన్నారుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు

అదే హాస్పిటల్లోని వినాయకుడి విగ్రహం ముందర ఇద్దరు చిన్నారులు నిలబడి వినాయక మా ఇంటికి ఒక చిన్న బేబీ వస్తుందని

నాన్న చెప్పాడు ఆ బేబీ పాపే అయ్యేలా చూడవా అని ఒక చిట్టి అన్నయ్య కోరుకుంటుండగా, అంతే వయసున్న ఇంకో అబ్బాయి

మా అత్తయ్యకి ఇద్దరు బేబీస్ వస్తారంట ఆ ఇద్దరిలో ఒక్కరు అమ్మాయి అయ్యేలా చూడవా అని వేడుకుంటున్నాడు

ఆ చిన్నారులు వేడుకున్నట్టుగానే ఇద్దరు కోరికను దేవుడు విన్నాడు

ఒక అబ్బాయి నానమ్మ అక్కడికి వెతుక్కుంటూ వచ్చి అర్జున్ నువ్వు కోరుకున్నట్టుగానే నీకు చెల్లెలు పుట్టింది రా అని సంతోషంగా చెప్పింది

అబ్బాయి కళ్ళు తెరిచి అవునా నానమ్మ చెల్లిని నువ్వు చూసావా అని సంతోషంగా అడిగాడు ఇంకా లేదు నువ్వు కూడా రా వెళ్లి చూద్దామని అబ్బాయిని తీసుకువెళ్లిపోయింది

ఇంకాసేపటికి ఇంకో అబ్బాయి మామయ్య వచ్చి విహాన్ నువ్వు కోరుకున్నట్టుగానే నీకు మరదలు కూడా పుట్టింది

పద వెళ్లి చూద్దాం అంటూ చెప్పగా నాకు తెలుసు నేను అనుకుంటే జరుగుతుందని థాంక్యూ గాడ్ నేను అడిగింది ఇచ్చావు

కదా ఇకమీదట తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతని నేను తీసుకుంటాను అని తన మామయ్య తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు

ఇద్దరు చిన్నారుల కోరిక తీరినందుకు ఆ గణపయ్య మొహంలో కూడా నవ్వు కనిపించింది కానీ బ్రహ్మ తాత ఆ ఇద్దరు తలరాతని వేరే విధంగా రాశాడని ఆ క్షణం గణపయ్య కి కూడా తెలియదేమో

మెటర్నటీ వార్డులో రెండు గంటల ప్రసవ వేదన తర్వాత తన రెండో సంతానానికి జన్మనిచ్చింది యశోద

అదే వార్డ్ లో ఇంకొక బెడ్ లో తమ ప్రేమకి గుర్తులుగా ఒక మగ బిడ్డకి తరువాత ఒక ఆడబిడ్డ కి జన్మనిచ్చింది దేవకి

అదే విషయం బయట ఉన్న కుటుంబ సభ్యులకి తెలిసి సంబరాలు చేసుకుంటూ ఉండగా అనుకోని విధంగా ఎవరు

ఎదురు చూడని విధంగా సైలెంట్ గా బ్రహ్మయ్య నర్స్ రూపంలో యశోదమ్మ కూతురిని దేవకి దగ్గరికి, దేవకి జన్మనిచ్చిన ఆడపిల్లని యశోదమ్మ దగ్గరికి చేర్చాడు

ఆ విషయం మార్చిన నర్సు కూడా తెలియదు కానీ డెలివరీ చేసిన డాక్టర్ మాత్రం దేవకీ కూతురు చెస్ట్ మీద స్టార్ మార్క్ ని గుర్తించింది

రెండు రోజుల తర్వాత అర్జున్ కుటుంబం సంతోషంగా తమ సొంత ఊరికి చేరుకోగా విహాన్ కుటుంబం మాత్రం పాపని కోల్పోయి బాబును తీసుకొని విషాదంగా హాస్పిటల్ ను వీడారు

రెండు రోజుల తర్వాత పాప అటాప్సి రిపోర్ట్ చూసిన డాక్టర్ తను చూసిన స్పెషల్ మార్క్ దాంట్లో మెన్షన్ చేయకపోవడంతో

అనుమానపడి తన ఉద్యోగం రిస్క్ చేయలేక సీక్రెట్ గా ఎంక్వయిరీ చేసి పాపలు ఇద్దరు మిస్ ప్లేస్ అయిన విషయం తెలుసుకున్న ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే సమాధి చేసుకుంది

ఇద్దరి చిన్నారి కోరికలు తీరాయి కానీ ఒకరి బాధ ఇంకొకరికి సంతోషం అయితే ఇంకొకరి సంతోషం ఒకరికి తెలియకుండానే బాధను మిగిల్చింది

నర్సు చేసిన పొరపాటు డాక్టర్ ధైర్యం చేయలేని విషయం రెండు కుటుంబాలని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే చదువుతూనే ఉండండి నీ వైపు అలా చూస్తూ ఉంటే

చెల్లెలు అంటే అమితమైన ప్రేమ పెంచుకున్న అన్నయ్య పుట్టగానే మరదల్ని దూరం చేశాడని దేవుడి మీద కోపం పెంచుకున్న ఒక బావ?

వాళ్లకే తెలియకుండా దేవుడు ముందర ఒకేసారి చేతులు జోడించిన ఆ ఇద్దరు చిన్నారులు ఫ్యూచర్లో ఒకరికొకరు ఇద్దరు పడితే శత్రువులుగా మిగిలిపోతారా బావబామ్మర్దలుగా ఆదర్శంగా నిలుస్తారా

ఈ కద ఎన్ని మలుపులు తిరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్లో చదువుకుందాం