21 రోజుల తర్వాత అర్జున్ కోరిక మీద నందన్ తల్లిదండ్రులతో కుటుంబ సమేతంగా అన్నవరం చేరుకున్నాడు తమ ఇంటి యువరాణి కి పేరు పెట్టడానికి
పూజ శాంతి హోమం అనంతరం పూజారి గారు అమ్మాయికి ఏ పేరు పెట్టదలుచుకున్నారని అడగగా యశోద అత్తమామల వైపు చూడగా
మా వైపు చూస్తావ్ ఏంటి అర్జున్ ఆల్రెడీ ఏదో ఒక పేరు అనుకునే ఉంటాడుగా వాడి చెల్లెలు కోసం వాడిని అడగండి అన్నారు ఇద్దరు
నందన్ అర్జున్ వైపు చూడగా నాన్న చెల్లికి శ్రీజ అని పేరు పెడదాం అని చెప్పాడు పట్టుబట్టల తో మెరిసిపోతున్న చెల్లిని చూసి
మంచి పేరు అని పూజారి గారు కూడా చెప్పడంతో యశోదా నందన్ లు కూతురిని ఒడిలో పెట్టుకుని కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని
బియ్యంలో శ్రీజ అని పేరు రాసి చెవిలో మూడు సార్లు పిలవగా తర్వాత అర్జున్ తర్వాత పాప నాన్నమ్మ తాతయ్యలు పిలిచి
అందరూ అక్షింతలు వేసాక అర్జున్ మొండికి వేసి మరి పాపని ఒడిలో పడుకోబెట్టుకొని తన చిట్టి చేతులు మధ్యలో తన
వేలు పెట్టి పాప బోసి నవ్వులు చూసి మురిసిపోతూ థాంక్యూ స్వామి నేను అడిగినట్టే చెల్లిని ఇచ్చినందుకు తనని నేను
వరలక్ష్మీ వ్రతం వస్తుంది కదా దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఐటమ్ , కేవలం 219 రూపాయలకే అమెజాన్ lo కొనాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి
చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని దేవుడితోపాటు తల్లిదండ్రులకు కూడా చెప్పాడు.
ముందు నువ్వు పెద్దవాడివి అవ్వు తర్వాత మీ చెల్లిని చూసుకుందువని నానమ్మ అంటే నేను పాప కంటే పెద్దవాడిని
కదా అందుకే నేను చెల్లిని చూసుకుంటాను నువ్వు నమ్మకపోతే ఫో నాన్నమ్మ అమ్మ నాన్న నన్ను నమ్ముతారులే అన్నాడు నేను కూడా నీ పార్టీ నే లేరా మనవడా అన్నారు తాతయ్య.
ఈ కుటుంబం సంతోషం మూడు నెలల ముచ్చట కాబోతుందా శాశ్వతంగా ఉండబోతుందా అనేది కాలమే చెప్పాలి
అదే సమయానికి హైదరాబాదులోని ఇంకొక ఇంట్లో ఇంటి ముందంతా మామిడి తోరణాలు వేలాడుతున్నాయి.
పూల పరిమళం గాలిలో తేలుతోంది. బంధువుల సందడి, చిన్నపిల్లల నవ్వులు… ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నా, ఆ ఇంటి గోడలకే తెలిసిన ఒక లోతైన విషాదం ఇంకా చెదరలేదు.
దేవకి అమ్మానాన్నలు అన్నయ్య వదినలు వచ్చిన బంధువులకి మర్యాదలు చేయడంలో తలమునకలై ఉన్నారు. విహాన్ మాత్రం తనకేమీ సంబంధం లేనట్టు దూరంగా సోఫాలో అలాగే కూర్చున్నాడు.
ఈ రోజు బాబుకు ఇరవై ఒకటో రోజు వేడుక. హాల్లో మధ్యలో చిన్న ఊయల. కొత్త బట్టలు వేసుకున్న పసిబాబు అందులో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని చేతికి చిన్న నల్లదారం కట్టారు. నుదుటిపై నల్లటి బొట్టు. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు.
“దీర్ఘాయుష్మాన్ భవ…” అంటూ పెద్దలు అక్షింతలు వేస్తుంటే, బాబు చిన్నగా నవ్వాడు.
ఆ నవ్వు చూసి అందరూ సంతోషించారు. కానీ ఆ నవ్వు చూసిన ప్రతి సారి తల్లి దేవకీ గుండెల్లో ఒక కత్తి దిగినట్టే అనిపిస్తోంది.
ఆ ఊయలలో ఈ రోజు ఇద్దరు పిల్లలు ఉండాల్సింది కద బాబుతో పాటు తన కవల చెల్లెలు కూడా. ఆమె కోసం కొన్న చిన్న గులాబీ రంగు ఫ్రాక్ ఇంకా అల్మారాలో కొత్తగానే ఉంది. ఆమెకు పెట్టాలనుకున్న వెండి పట్టీలు చిన్న పెట్టెలో అలాగే ఉన్నాయి. ఆమె పేరుతో చేయించిన చిన్న బంగారు డాలర్ కూడా తెరవని కవర్లోనే ఉంది.
దేవకీ చూపు ఎప్పటికప్పుడు ఆ ఖాళీ మూలవైపే వెళ్తోంది.
“అమ్మా… బాబుని ఎత్తుకో…” అని తన అమ్మగారు పలికినా…దేవకీ చేతులు ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చాయి. “ఇద్దరినీ ఎత్తుకోవాలని ఎదురుచూసిన ఈ చేతుల్లో… ఇప్పుడు ఒక్క బాబు మాత్రమే…” అని మనసులోనే ముక్కలైంది.
ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
తన భార్య వేదన గుర్తించిన భర్త వాసుదేవ్ దగ్గరకు వచ్చాడు. “దేవకీ… ఈ రోజు మన బాబు కోసం నవ్వాలి.” అంటే ఆమె మెల్లగా తల ఊపింది.
“నవ్వుతాను… కానీ నాకు పాప గుర్తొస్తోంది.” అని దేవకీ చెప్తే వాసుదేవ్ గొంతు కూడా బరువెక్కింది. తన చిన్నారి రాకుమారి కోసం అందరి కంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఎదురుచూసింది తనే మరీ
అయిన తన బాధని నొక్కిపెట్టి బార్య నీ ఓదారుస్తూ”నాకూ గుర్తొస్తుంది… ప్రతి క్షణం. కానీ మన బాబు మన కళ్లలో కన్నీళ్లు కాదు… ప్రేమ చూడాలి.” అని ఆ మాటలు చెప్పి నపుడు అతని కళ్లూ తడిశాయి.
అప్పుడే పురోహితుడు పిలిచాడు బాబుని తీసుకుని రండి అని ” ఇద్దరూ కలిసి బాబుని ఎత్తుకునీ పూజలో కూర్చున్నారు.
పూజ మొదలైంది సవ్యం గా ముగిశాక బాబు పేరు ఏమనుకుంటే అది బియ్యం లో రాసి చెవిలో మూడు సార్లు చెప్పండమ్మా అన్నాడు
భార్య భర్తలు ఇద్దరూ ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ ఉండగానే ఇద్దరూ పేరేమి అనుకోలేదనే విషయం గుర్తొచ్చి, వదిన విహాన్ని తీసుకొని రావా అని చెప్పింది దేవకీ
అల్లకో బాధో తెలియని వయసులో ఏం చేయాలో తెలియక దూరంగా కూర్చుని కోపంగా ఉన్నానని మాత్రం అందరికీ తెలియజేస్తున్నాడు విహాన్
అతని దగ్గరికి వెళ్లిన నర్మదా కన్నా నీకు చెప్పాను కదా మీ అత్తయ్య ఆల్రెడీ బాధలో ఉందని తనని నువ్వు ఇలా ఇంకా బాధ పెడతావా చెప్పు అత్తయ్య పిలుస్తుంది కదా రా వెళ్దామంటూ బుజ్జగించి చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చింది
బాబుకి ఏం పేరు పెడదాం విహాన్ అని అడిగింది దేవకి, వేదాన్ష్ అన్నాడు మూతి ముడుచుకుంటూ
అదే పేరుని కన్ఫామ్ చేసి బియ్యం లో రాసి మొదట తల్లిదండ్రులు తర్వాత అమ్మమ్మ తాతయ్యలు తర్వాత అత్తమామలు చెవిలో పేరు చెప్పారు
అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. దేవకీ కి మాత్రం మరో నవ్వు వినిపించినట్టు అనిపించింది.
“అమ్మా…”ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు.
కానీ ఆమె మనసులో మాత్రం తన చిన్నారి నవ్వుతూ కనిపించింది.
జయ కళ్ల నుంచి రెండు కన్నీటి బొట్లు జారాయి.
ఆమె వాటిని వెంటనే తుడుచుకుంది.
బాబును గుండెలకు హత్తుకుని మెల్లగా చెప్పింది…
“నువ్వు ఒక్కడివి కాదు నాన్నా… నీ చెల్లెలి ప్రేమ కూడా నీతోనే ఉంది. మేము ప్రతిరోజూ ఆమెను గుర్తు చేసుకుంటాం… నిన్ను రెట్టింపు ప్రేమతో పెంచుతాం.”అని
ఆ మాటలు విన్న నందన్ ఆమె భుజంపై చేయి వేసాడు.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్న నవ్వు నవ్వారు.
ఆ నవ్వులో బాధ ఉంది…
ఆశ ఉంది.
కోల్పోయిన బిడ్డ జ్ఞాపకం ఉంది…
బతికి ఉన్న బిడ్డ కోసం బ్రతకాలనే ధైర్యం ఉంది.
ఆ రోజు ఇంట్లో పండుగ జరిగింది.
కానీ ఆ కుటుంబానికి మాత్రం అది ఒక వింత రోజు…
ఒక బిడ్డ కోసం దీపాలు వెలిగించిన రోజు…
మరో బిడ్డ జ్ఞాపకానికి మనసులో నిశ్శబ్దంగా ఒక దీపం వెలిగించిన రోజు.
ఆనందంగా కూతురికి నామకరణం చేసిన జంటకి కను కూతురు ఈ లోకంలోనే లేదని తెలిసిన రోజు
ఒక గంట కన్నీరు ఇంకో గంట సంతోషంతో తమ కూతురు కానీ కూతురు కోసం బాధపడుతున్న జంటకి అసలు కూతురు ఇంకో దగ్గర పెరుగుతుందని తెలిసిన రోజు.
విధి ఆడుతున్న వింత నాటకం గురించి తెలుసుకోవాలంటే చదువుతూనే ఉండండి నీ వైపు అలా చూస్తూ ఉంటే
ఈ స్టోరీ ఎలా ఉందో చదివి కామెంట్ ఇచ్చేయండి
