ఏంటండీ టైటిల్ ఏమో మనీ machine అని పెట్టాను కానీ మా ఇంటి పనిమనిషి గురించి అంటున్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారా
కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు నేను నీకు చెప్పబోయేది మా ఇంటి పనిమనిషి గురించే
పనిమనిషి అనే కంటే కూడా ఆమె నడిచే ఏటీఎం అని చెప్పాలి
ఆమె రోజుకి 18 గంటల పని చేస్తుంది దగ్గర దగ్గర 30 ఇళ్లలో పనిచేస్తుంది
గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంటుంది నేను అడిగాను ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ ఏ కదమ్మా ఎందుకు ఇంత కష్టపడుతున్నావని
ఆమె ఒకటే చెప్పింది, మీరు నా కష్టాన్ని చూస్తున్నారమ్మ నేనునాకు జరిగిన అవమానాన్ని గుర్తించుకుంటున్నాను
అవి తలుచుకున్నప్పుడల్లా నాకే తెలియకుండా నాలో శక్తి వస్తుంది 30 ఏంటమ్మా ఇంకో 30 ఇల్లులు అయినా చేసేయగలను అంది
అంతగా ఏమి జరిగింది అని అడిగాను. మొదట్లో చెప్పేది కాదు గాని తర్వాత తర్వాత ఓపెన్ అయింది
ఆమె కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ చెప్తుంటే లిటరల్ గా నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగేవి
కొన్ని కొన్ని ఏదో స్టోరీలో చూస్తే ఏడుపొస్తుంది కానీ అలాంటివి రియల్ లైఫ్ లో face చేసిన వాళ్ళని మీట్ అయినప్పుడు ఎలా ఉంటుందో మీరే ఊహించండి
ఆమె పేరు వళ్లి ఇంట్లో మొదటి కూతురు అంట, ఆమె తర్వాత ఇద్దరు చెల్లెలు లాస్ట్ గా ఒక తమ్ముడు అంట
ఇంట్లో మొదట కూతురని అన్ని పనులు మొదట ఆమె చేతే చేయించేవాళ్లు అంట, అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నానమ్మ ముసలిదని చెల్లెలు చిన్నవాళ్ళని చెప్పేవాళ్లట
ఊహ తెలిసిన తరువాత ఆడపిల్లలన్నీ పనులు నేర్చుకోవాలని చెప్పేవాళ్లట
కనీసం ఊరిలో ఉన్న స్కూలుకు కూడా పంపలేదట, ఈమె దురదృష్టమో తర్వాత పుట్టిన వాళ్ళ అదృష్టమో కానీ తర్వాత పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను మాత్రం స్కూలుకి పంపేవాళ్ళట
అని అర్థం చేసుకునే వయసొచ్చే లోపల 15 సంవత్సరాలకి బంధువుల అబ్బాయని పచ్చి తాగుబోతు ki ఇచ్చి పెళ్లి చేసేసారట
లోకం పోకడ తెలుసుకునే లోపల ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయిపోయిందట
ఊర్లో రోజు పనికి పోయిన అది రోజు వారి ఖర్చులకు సరిపోయేది కానీ పిల్లల స్కూలుకు అని వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక
రోజు పడుకునే ముందర ఏడ్చుకునేదట
అమ్మానాన్నల సపోర్ట్ లేదు అత్తమామ అంతకంటే పట్టించుకోరు మొగుడు సంగతి సరే సరే ఎటువంటి తప్పు చేయకూడదు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే
వాళ్ళ ఊరు నుంచే చెన్నైకి వచ్చి మేస్త్రి పని చేస్తున్నాయన ఒకరోజు ఊరికి వెళ్లారట
తనని నాకేదైనా పని ఇప్పిస్తావా అని అడిగితే ఊర్లో ఉన్నట్టు ఉండదమ్మా అంటే పర్వాలేదన్న నాకు ఎప్పటికంటే ఒక పది రూపాయలు ఎక్కువ వచ్చినట్టే అని
చెబితే సరే అమ్మ రేపు నాతోపాటు టౌన్ కి వచ్చేయంటే అలానే అని చెప్పి ఇద్దరు బిడ్డలను తీసుకొని చెన్నైకి బస్సు ఎక్కేసింది అంట
అప్పటికే పెద్ద బాబుకి నాలుగు సంవత్సరాలు చిన్నవాడికి రెండు సంవత్సరాలట
కన్స్ట్రక్షన్స్ సైట్లోనే వాళ్ళిద్దర్నీ ఒక పక్కన కూర్చోబెట్టి వాళ్ళని చూసుకుంటూ పని చేసుకునేదట
తర్వాత కన్స్ట్రక్షన్ ఓనర్ ఇంట్లోనే పనికి కుదిరిందట
ఒక రెండు సంవత్సరాల కష్టపడిన తర్వాత పిల్లలిద్దరినీ స్కూలుకి పంపి
ఉదయాన్నే రెండు మూడు ఇళ్లల్లో పని చేసుకుని తర్వాత కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్లి సాయంత్రం రెండుమూడి ఇళ్లల్లో పని చేసేదట
తన ఊరు వదిలేసిన సంవత్సరానికి వాళ్ళ ఆయన కూడా తనని వెతుక్కుంటూ వచ్చాడట
మొదట్లో పచ్చి తాగుబోతులా ఉండి తన కష్టం చూసి పిల్లల పెరిగే కొద్దీ కొంచెం కొంచెం మారి ఆమె భర్త కూడా కన్స్ట్రక్షన్ లో పనికి కుదిరాడట
ఇక్కడ విల్లిలా కష్టపడుతుంటే అక్కడ ఊర్లో ఏమో బతకలేక బయటికి వెళ్లిపోయారని రూమర్స్ స్టార్ట్ అయ్యాయంట
వాళ్ల మాటలు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదంట ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఊరికి వెళ్లడమే కదా అనుకుంటే అనుకున్నారులే అని వదిలేసింది అంట
వీళ్ళిక్కడ కష్టపడుతూ రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటున్నప్పుడే వాళ్ళ పెద్ద చెల్లెలికి పెళ్లయిపోయిందట
ఈమె అప్పటికే ఒక అయిదారు ఇళ్ళల్లో పని చేస్తుండడంతో అందరూ వర్కింగ్ లేడీస్ అవ్వడం వల్ల లీవ్ పెట్టడం కుదరక పెళ్లికి మాత్రమే వెళ్లి వచ్చేసిందట
ఈమె పెళ్లికి రూపాయి కట్నం ఇవ్వలేదు గాని మొదటి చెల్లెలకు మాత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారని రెండు లక్షల ఖర్చు పెట్టి ఫర్నిచర్ తీసిచ్చారట
అమెజాన్లో వెట్ గ్రైండర్ ఆఫర్లో పోతూ ఉంది కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
First trigger point:
ఈమె నోరు తెరిచి నాకు ఒక బీరువా తీసి ఇవ్వండి మీ తరఫునుంచి అని అడిగిందంట వాళ్ళ అమ్మ నాన్నని. మేము తీసేస్తే ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు పని చేసే కన్స్ట్రక్షన్స్ సైట్ లోనా అని అడిగారంట
ఏమీ మాట్లాడకుండా మరుసటి రోజే తిరిగి వచ్చేసిందంట
అప్పుడే అనుకునిందంట ఎలాగైనా సరే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని
Second trigger point:
కొద్ది రోజులకి వాళ్ల చెల్లెలికి కూతురు పుడితే రెండు సవర్లకి చైన్ పెట్టారటవాళ్ల బంధువులు ఎవరో
పెద్దమ్మాయికి ఏమి పెట్టలేదు కదా అని అడిగితే ఒక గ్రామ ఉంగరం చేసి ఇచ్చిందంట వాళ్ళమ్మ
Third trigger point:
తర్వాత వాళ్ళ రెండో చెల్లికి పెళ్లి కుదిరితే మొదట చెల్లెలు ఫ్యామిలీ అందరికీ బట్టలు పెట్టి వీళ్ళ పిల్లలకి కనీసం కర్చీఫ్ కూడా కొనివ్వలేదంట ఆమెకు కూడా కనీసం జాకెట్టు కూడా తాంబూలంగా ఇవ్వలేదట
అది ఆమె ముందే ఎక్స్పెక్ట్ చేసిన అక్కగా బాధ్యతగా చెల్లెలి పెళ్లికి వెళ్లి మరుసటి రోజే వచ్చేసిందట
అప్పటికి పిల్లలు వాళ్ల పనులు వాళ్ళు చేసుకునే అంత మాత్రం వచ్చేయడంతో ఉదయాన్నే వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టి స్కూలుకు పంపేశాక
వాళ్ళ భర్తని కూడా పనికి పంపేశాక ఈమె ఎన్ని ఇల్లు కుదిరితే అన్ని ఇల్లులు చూసుకునిందంట దగ్గర 20 ఇళ్లల్లో పనిచేసేదట
పిల్లల్ని భర్తని చూసుకుంటూనే రోజుకి 18 గంటలు పనిచేసేదట ఆమె భర్త కూడా పనిచేస్తూ ఉండడంతో ఇద్దరు మిగిల్చిన డబ్బులు పెట్టి ఔట్స్కట్స్ లో మొదట్లో స్థలం కొనుక్కున్నారట
తర్వాత మొదట్లో ఈమె పని చేసిన కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ హెల్ప్ చేయడంతో అలాగే పని చేస్తున్న ఇళ్లల్లో లోన్ తీసుకుని ఒక పది నెలలు జీతం లేకుండా పనిచేసేలా అడ్వాన్స్ తీసుకొని మొదటి ఫ్లోర్ ఇల్లు కట్టుకునిందట
వాళ్ల రెండో చెల్లి పెళ్లి తర్వాత దాదాపు అయిదు సంవత్సరాలు తర్వాత ఈమే గృహప్రవేశానికి పిలవడానికి తిరిగి ఊరికి వెళ్లిందట
ఒకప్పుడు బతకలేక ఊరు నుంచి వెళ్లిపోయారా అని ఎగతాళి చేసిన వాళ్లే ఈమె ఇల్లు చూసి నోరు మూసుకున్నారట
ఇప్పుడు గాని లీవ్ పెట్టకుండా ప్రతిరోజు ఇంటికి వచ్చి పని చేస్తూ ఉండడంతో ఈమె కష్టాన్ని గుర్తించిన ఒక ఓనర్ ఈమె గృహప్రవేశానికి గుర్తుగా ఆమె ఎంతో ఆశపడిన బీరువా తీసి ఇచ్చిందట
అందుకే ఆమెకి పని చేయడం చాలా ఇష్టం అంట సొంత వాళ్లు కూడా వాళ్ళని పక్కన పెట్టినప్పుడు ఈమె పని చేసిన ఓనర్లే ఆమెకి ఇంటికి లోన్ ఇచ్చారట ఇంట్లో కావలసిన వస్తువులు అన్నీ కొనిచ్చారట
ఇప్పటికే ఆమె చెన్నై కొచ్చి 20 సంవత్సరాలట ఒక పది ఇల్లులు 20 సంవత్సరాల నుంచి దాదాపు కంటిన్యూస్ చేస్తూనే ఉంది
ఆమె సొంత తమ్ముడు అయితే ఇంకొక మెట్టు ఎక్కి ఆమెకి డెలివరీలైన రెండుసార్లు మా అక్కకి కూతురు పుట్టకూడదని దేవుడికి మొక్కుకున్నాడట పుడితే ఒకవేళ తనకి ఇచ్చి పెళ్లి చేస్తారు అని
ఈ విషయం ఆ అబ్బాయి చెప్పాడట తనకే పెళ్లిచూపులు చూస్తున్నప్పుడు అనవసరంగా మా అక్కకి కూతురు పుట్టకూడదని మొక్కుకున్నాను మా అక్కకే కూతురు ఉంటే నాకు బయట వెతికే పని లేదు అని
Conclusion:
although వీళ్ళకి డబ్బు లేదని పక్కన పెట్టిన ఈమె తల్లిదండ్రులే ఇప్పుడు ఈమే దగ్గర వచ్చి ఉంటున్నారట ఈమె తమ్ముడు అయితే పెళ్లి చేసుకొని ఈమె ఇంటి పైనే ఈమె కష్టంతో కట్టిన ఇంట్లోనే కాపురం
ఉంటున్నాడు అంట
ఆమె ఇప్పుడు ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉంటుంది నేను పని మానేస్తానన్న నేను పని చేసే వాళ్ళు ఒప్పుకోరు అని. అలాగే ఆమెకి నేను గమనించినంతవరకు ఆమె చేసే పని అంటే చాలా ఇష్టం
ఆ ఇష్టం ఆమె మాటల్లో కూడా నాకు కనిపించేది ఆమె గర్వంగా చెప్తూ ఉండేదే నా కష్టమే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది
మేము బీరువా కొనిస్తే ఎక్కడ పెట్టుకుంటావని అడిగిన వాళ్ళ కళ్ళముందురే నేను ఇప్పుడు లగ్జరీ బీరువా వాడుతున్నాను
నాకు కూతురే పుట్టకూడదని కోరుకున్న నా తమ్ముడే ఇప్పుడు నాకు కూతురు లేదని రోజు ఏడుస్తున్నాడు
also సొంత చెల్లెలి పెళ్లికి తాంబూలానికి నోచుకోని ఆమె ప్రతి వరలక్ష్మీ వ్రతానికి అలాగే దీపావళికి ఆమె ఎన్ని ఇళ్లల్లో పనిచేస్తుందో అందరి దగ్గర సంతోషంగా తాంబూలం తీసుకుని స్టేజికి వచ్చేసింది
నేను మొదట ఆమెకి చీర పెట్టినప్పుడు అదే చెప్పింది ఆమె దగ్గర దగ్గర చీరలు కొని 20 సంవత్సరాల అయిందట
after all ఆమె కష్టమే ఆమెని ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని, ఈరోజుటికి పని మానేయకుండా ఇంకా చేస్తూనే ఉంది
afterwards ఆమెకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అప్పుడప్పుడు మా బాబుకి ఆమె స్టోరీని ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్తుంటాను
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డబ్బులు లేకపోతే ఆయన వాళ్ళు కూడా పరాయి వల్ల గానే చూస్తారు. అది ఆమె చెప్పినప్పుడు విన్నాక నాకు ఇంకా క్లియర్ గా అర్థమైంది
తల్లిదండ్రులు కూడా అలా వేరుగా చూస్తారని మీరు అంటారేమో ఖచ్చితంగా చూస్తారు సంపాదించే వాళ్ళను ఒకల సంపాదన లేని వాళ్ళు ఒకలా ఇప్పటికీ చూస్తున్నారు
ఈ రియల్ స్టోరీ చదివాక మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పేయండి మీ అనుభవాన్ని కూడా పంచుకోవాలనుకుంటే నాతో కామెంట్ రూపంలో పంచుకోవచ్చు
as a results she is real heroin.