అరుణోదయ రోషిని తదుపరి భాగం చదవడానికి రెడినా మీరు, నేనైతే రెడీ రాయడానికి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్
వర్మ గారి కుటుంబ సభ్యులు అనుకున్న విధంగానే ప్రెస్ మీట్ అద్భుతంగా జరగడంతో అంతా హ్యాపీ, మర్సటి రోజు ఉదయం సిటీ ఎడిషన్ అంతా వీళ్ళ బిజినెస్ డీటెయిల్స్ తో నిండిపోయింది
ఫ్యామిలీ ఫోటో ఆరోజు హాట్ ఆఫ్ ద టాపిక్ అయింది ఇదే విధంగా ఒకసారి వర్మ గారి 50వ పెళ్లిరోజు సెలబ్రేషన్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ మీడియాలోకి వచ్చిన ఇప్పుడు బిజినెస్ విషయాల పరంగా మీడియాకి ఫుల్ ఫీస్టయింది
ముఖ్యంగా అరుణ్ అండ్ రోషిని జంటగా దిగిన ఫోటో హైలెట్ అయింది, త్వరలో పెళ్లి పీటలు ఎక్కుపోతున్న వర్మ గారి రెండో తరం అని కూడా న్యూస్ పబ్లిష్ అయింది.
ఆ ఫోటో అప్పుడే చదువు ముగించుకొని ఇండియాలో ఆడుగు పెట్టిన శ్రీదేవి ప్రసాద్ ల ముద్దుల కూతురైన రమ్య కంట్లో పడింది ఈ కట్ అవుట్ ని ఇంతకుముందు కూడా ఎక్కడో చూసినట్టున్నానే అనుకుంటూ రివైండ్ చేసుకుని తినే కదా అనుకొని ఆ ఫోటోతో నేరుగా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఇతను మీకు కాబోయే అల్లుడు అయితే ఎలా ఉంటుంది అని అడిగింది
నీకు నచ్చితే అలాగే చూద్దాం బేబీ ఇంతకీ ఎవరితను అని అడిగింది శ్రీదేవి, ఈ రోజంతా పేపర్లో వీళ్లే ఉన్నారుగా చూడు అని చెప్పి డాడ్ నన్ను మీ బిజినెస్ కి సీఈఓ గా ఎప్పుడు అపాయింట్ చేస్తున్నారు అప్పుడే నాకు బిజినెస్ సర్కెల్లో ఐడెంటిటీ వస్తుంది వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి నాకు ఈజీ అవుతుంది నా ప్లాన్స్ నేను వేసుకోగలము అని చెప్పింది రమ్య
అప్పుడే పేపర్ చూసిన ప్రసాద్ వీళ్లంతా సోషల్ ఫ్రిక్ కాదు బేబీ, పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్ కూడా వీళ్లు అటెండ్ కారు ఏదో అఫీషియల్ అయితే మాత్రమే అటెండ్ అవుతారు సెలబ్రేషన్ కి చాలా దూరంగా ఉంటారు అని చెప్పాడు ప్రసాద్
ఇట్స్ ఓకే డాడ్ వాళ్లు కాకపోతే ఏమైంది మనం మార్చేద్దాంలే ముందు మీరు నన్ను మీ బిజినెస్ లోకి ఎంటర్ చేయండి చాలు అని చెప్పింది ఓకే బేబీ నేను నా పనిలో ఉంటానని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోగా మామ్ నాకు ఒక విషయం చెప్పు డాడ్ మొదటి భార్య కూతురు ఉంది కదా తనంటే నాన్నకి ఏ కోసానైనా ప్రేమ ఉందా అని అడిగింది
అసలు తను ఒకటి ఉందనే విషయం మీ డాడీకి గుర్తు లేదు బేబీ ఆ విషయంలో నీకు ఎటువంటి భయం అవసరం లేదు అని చెప్పింది శ్రీదేవి
వీళ్ళిద్దరూ కాబోయే వధూవరులని పేపర్లో వేశారు కదా బేబీ మరి నువ్వేంటి ఇతను కాబోయే అల్లుడు అంటున్నావు అని అడిగింది శ్రీదేవి. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా మమ్మీ? చెడగొట్టడం మనకెంత సేపు చెప్పు ఆ విషయం నేను నీకు వేరేగా చెప్పాలా అని నవ్వింది రమ్య కానీ జాగ్రత్త బేబీ ఏది చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయి చాలు అని చెప్పింది శ్రీదేవి.
(గొప్పతల్లి కూతురికి చాలా బాగా హితబోధ చేస్తుంది కదా ఇలాంటి తల్లులు మన మధ్యలో చాలా మంది ఉన్నారు)
వర్ధన్ హాస్పిటల్ కి వెళ్లి అరుణ్ రోషన్లు కుమ్మిన కుమ్ముడు కి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడే ఉంటే తన రెప్టేషన్ కి ప్రాబ్లం అవుతుందని స్పెషల్ రిక్వెస్ట్ మీద డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, అరుణ్ రోషనీల ఫోటోని తదేకంగా చూస్తూ నన్ను హాస్పిటల్ బెడ్ మీద పడేలా చేసిన చేసిన నీ అన్న మీద నీ బావ మీద నాకు ఎంత కోపంగా ఉన్నా, నిన్ను చూసే వాళ్ళిద్దర్నీ క్షమించేయాలనిపిస్తూ ఉంది అని అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన రోజా కొడుకు ఏం చూస్తున్నాడో చూసి తన ద్వారా విషయం తెలుసుకుంది. తినే నీకు కాబోయే కోడలు ఫిక్స్ అయిపో అన్నాడు రోషిని చూపించి
బిజినెస్ సర్కిల్లో ఫోటో అంటే బానే సెటిల్ అయిన ఫ్యామిలీ కద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నీ కెరియర్ కి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పింది. పెద్దవాళ్లతో వ్యవహారంగా ఉంది జాగ్రత్తగా ఉండు అని చెప్పింది సరే అన్నాడు వర్ధన్ కూడా
బ్యాక్ టు వర్మ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫీస్
రాఘవ రఘురాం చంద్ర కలిసి వారసులకి తగ్గిన విధంగా సెపరేట్ క్యాబిన్సు రెడీ చేసి వాళ్ల వాళ్ల నేమ్ బోర్డ్స్ విత్ డెసిగ్నేషన్ అరేంజ్ చేసి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా రెడీ చేసి ఆరోజు ఇనాగ్యులేషన్ కూడా చేసేసారు. రోషిని తప్ప మిగతా ఐదుగురు అక్కడ ఆల్రెడీ వర్క్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు సపరేట్ గ వర్క్ చేయలేదు టీం మెంబెర్స్ లోనే కలిసిపోయి పని చేశారు.
ప్రెస్ మీట్ కారణంగా ఆల్రెడీ ఆఫీస్ అంతా వీళ్ళ గురించి తెలియడంతో సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లో లోపల ఏమీ చేయలేక రగిలిపోయిన వాళ్లు కూడా అంతేమంది ఉన్నారు, నిన్నటి వరకు వీళ్ళతో కలిసి పనిచేసేవాళ్లే వీళ్లకు బాసులని తెలియడంతో కొందరికి కష్టంగా ఉన్న ఏమీ చేయలేని పరిస్థితి మరి
రోషిని కి మాత్రం నిజంగా ఇది స్పెషల్ డే అని చెప్పాలి. ఇంట్లో స్పెషల్ పూజితో పాటు గుడికి వెళ్లి శివయ్య దర్శనం తో పాటు గురువుగారి ఆశీర్వాదం తీసుకొని స్పెషల్ గ ఆఫీస్ కి ఎంట్రీ ఎప్పటినుంచో ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులందరు మనసుల్ని తృప్తితో నింపేసింది.
వర్మ గారే స్వయంగా తన కాబిన్లో తన సీట్లో తన తదనంతరం చైర్మన్ అయినా రోషిని నీ కూర్చోబెట్టి కొడుకు అల్లుళ్ళ వైపు మనవల్లవైపు సాధించాను అన్నట్టు చూసి మీసం వెళ్లే సారు. అందరి ఆనందాల మధ్య రోషిణి తన బాధ్యతని స్వీకరించింది
ఇది స్వయంగా వీక్షించడానికి ఇంటి నుంచి వచ్చిన జానకమ్మ రాధిక కుందన రత్నలు, ఎలాగైతే బ్యాక్ డోర్ నుంచి వచ్చారో అలాగే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయారు. రోషన్ విజయ్ వరుణ్లు తమ తమ ప్రియసఖి ల కు ఇది వాళ్ళ ఫోన్ ద్వారా లైవ్ ఇచ్చుకున్నారు
అది ముందే ఎక్స్పెక్ట్ చేసిన రోషిని శ్రావ్య కి ముందుగానే ఇన్స్ట్రక్ట్ చేసింది బిందుకి కూడా లైవ్ ఆడ్ చేయమని. స్టాఫ్ మీటింగ్ ఏర్పాటులో మిగిలిన వాళ్ళు ఉంటే బిందు స్వయంగా రోషినికి ఫోన్ చేసి కంగ్రాట్యులేషన్స్ చెప్పగా పూజిత మాత్రం మెసేజ్ పెట్టి కామ్ గా ఊరుకుంది
వర్మ గారు కుటుంబ సెలబ్రేషన్లో ఎంప్లాయిస్ నీ ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ ఆ రోజు స్వీట్స్ పంచిపెట్టారు.
ఆరోజు మీటింగ్లో రోషిని తన మొదటి నిర్ణయం చెప్తూ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇకమీదట వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఫ్రీగా చదువుకుంటారని ఎంప్లాయిస్ పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుందని చెప్పింది అలాగే వీళ్ళు చేపడుతున్న మిడిల్ క్లాస్ ఇంటి కల ప్రాజెక్టులో ఎంప్లాయిస్ కి 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుందని చెప్పింది
అదే విషయం ఆ రోజు అందరికీ మెయిల్ వెళ్లడంతో పాటు స్వీట్ బాక్సులు కూడా అందరికీ చేరడంతో ఎంప్లాయిస్ సెలబ్రేషన్స్ కూడా హ్యాపీగా జరగడంతో అందరూ సంతోషంగా ఇంటికి చేరుకున్నారు
ఇక రఘురాంకి చంద్ర కి అయితే సంతోషం మామూలుగా లేదు తమ చిన్నారి తల్లి వర్మ సామ్రాజ్యానికి చైర్మన్ అవడంతో
ఆఫీసులో పని అయిపోవడంతో రోషిని కోరిక మేరకు అందరూ వర్మ నిలయంచేరుకున్నారు తమ ప్రైవేట్ సెలబ్రేషన్స్ కి రోషీని పాపకి అందరూ సెలబ్రేషన్లో ఉండాలని ఫీలింగ్ ఉండడంతో శ్రావ్య కుటుంబాన్ని బిందు కుటుంబాని అలాగే సుచరిత కుటుంబం ని పూజిత కుటుంబం ని కూడా ఇన్వైట్ చేసేసింది పర్సనల్గా
అందరూ ఇంటికి చేరుకోవడంతో ఐదుగురు మనవాళ్ళకి రోషినికి కలిపి దిష్టి తీసి రోషిని నీ రెస్ట్ తీసుకోమని తన రూమ్ కి పంపేసింది జానకమ్మ. అందరూ హాల్లో గెదర్ అవడంతో, మామలు ఈ రోజైనా మీ కూతురు నీ బయటికి తీసుకువెళ్లి తనతో సమయం గడిపే అవకాశం నాకు ఇస్తారా లేకపోతే ఇది కూడా ఫ్యామిలీ అకౌంట్లోకి వేసేస్తారా అనీ అడిగాడు అరుణ్.
దానికి నాన్నని డాడీని అడగడం ఎందుకురా రోషిని వస్తే బంగారం గా తీసుకువెళ్ళు అన్నాడు అజయ్, అరే బావగా ఇంకా ఎందుకురా నామీద పగ నీకు నీ లైఫ్ పార్టనర్ మీద కొంచెం ఫోకస్ పెట్టుకొని నన్ను ఫ్రీగా వదిలేయచ్చు కదా అన్నాడు అరుణ్.
దానికి ఇంకా కొంచెం టైం ఉందిలే బంగారం కి కొంచెంరెస్టు తీసుకునే అవకాశం ఇవ్వు అన్నాడు రోషన్. ఇంకొక వారం రోజులు మీరిద్దరూ బయటికి వెళ్లే ఛాన్స్ లేదు కానీ వెళ్లి రెడీ అవ్వండి గెస్ట్ లు వచ్చే టైం అయింది అని అందరికీ కలిపి వార్నింగ్ ఇచ్చింది రాధిక
ఆరోజు మార్నింగ్ నుంచి పేపర్ చూస్తూనే కూర్చుంది సుప్రియ. అదే సమయంలో ఆఫీసులో ఇచ్చిన పెద్ద స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి చేరుకున్నారు సుప్రియ నాన్న. ఆ పేపర్ లో ఏమి చూస్తున్నావురా అని అడిగాడు కూతుర్ని.
ఏమీ లేదు నాన్న నాతో పాటు చదువుకున్న మామూలు అమ్మాయి అనుకున్నా నా ఫ్రెండ్ ఈరోజు మా నాన్నకి బాస్ అయింది కదా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పింది సుప్రియ. మీ అమ్మ చెప్పింది నువ్వు అజయ్ బాబుని ఇష్టపడ్డావని అది ఇష్టం తోనే ఆగిపోతే మంచిది అంతకుమించి ఆశపడొద్దు అని చెప్పాడు కూతురికి
నాకు మరి అంత అత్యాశ లేదు నాన్న అని చెప్తే చెప్పడంతో మంచిది ఇక మీదటైనా నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టు నీకు తగిన జాబ్ గురించి ఆలోచించు అని హితబోధ చేసి కూతురు మనసులోని బాధని కొంచెం తగ్గించగలిగారు సుప్రియ నాన్న.
ఒక తండ్రి ఏమో కూతురికి అత్యాశ పడద్దని చెప్తున్నాడు ఒక తల్లి ఏమో ఏమైనా పర్వాలేదు నువ్వు నచ్చిన వాడిని దక్కించుకుంటే అంతే చాలు అంటుంది సమాజంలోని మనుషులు ఇలాగే రకరకాలుగా ఉంటారేమో కదా ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్తే నేను చాలా సంతోషిస్తాను
అరుణ్ రోషిని కదా ప్రయాణం ఇంకా ఎన్ని మలుపుల తిరగబోతుందో ముందు ముందు తెలుసుకుంటూ ఉందాం
ఈ వెబ్సైట్ నీ చూసి మీ అభిప్రాయం చెప్పగలరు https://thequriouslife.com/
https://shorturl.fm/X6ZiP
https://www.cdnnd.com/view.php?id=5545520&pub=3350972