అరుణోదయ రోషిని – తెలుగు కథ  తదుపరి భాగానికి మీ అందరికీ స్వాగతం

వారసులకి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా వర్మ కుటుంబ సభ్యులు ఆ రాత్రిని సెలబ్రేట్ చేసుకోవడానికి కాబోయే వియ్యంకులు కుటుంబాలందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు.

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రోషిని ఫ్రెష్ అయ్యి తన డ్రాయింగ్  రూమ్లోకి వెళ్లిపోయింది.  మొదటగా ఇంటికి చేరుకున్న శ్రావ్య కుటుంబం అందర్నీ పలకరించాక రోషిని ఎక్కడ వచ్చినప్పుడు నుంచి కనిపించడం లేదు అని అడిగింది శ్రావ్య

అందరికీ స్నాక్స్ అందిస్తున్నా రంగి చిన్ని తన డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళారమ్మా అని చెప్పింది. ఓ మేడం గారు ఆ డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళారా ఇంకా ఎప్పటికోగానే బయటికి రారుగా అంది శ్రావ్య

అప్పుడే అక్కడికి చేరుకున్న సుచరిత ఆ మాట విని ఇంకేముంది ఏదో కొత్త డిజైన్ ఐడియా వచ్చే ఉంటుంది తొందరలో అందరికీ మంచి ప్రజెంటేషన్ రెడీ అనమాట అనింది ఎందుకంటే రోషినీ ఏదైనా డిజైన్ వేసింది అంటే మొదట అది కుటుంబ సభ్యులకి రెడీ చేసి ఇస్తుంది తర్వాతే అది మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది

ఇప్పటి వరకు రోషిని ఎవరికి చెప్పని విషయం ఏంటంటే తను వేసే పెయింటింగ్స్ తో ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఆ డబ్బులని డొనేట్ చేయాలని డిసైడ్ అయ్యింది దానికి సంబంధించిన వర్క్ సీక్రెట్ గా చేసుకుంటూ ఉంది అప్పుడప్పుడు

బంధువులుగా ఇంటికి చాలాసార్లు వచ్చినా కాబోయే వియ్యంకులుగా మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెట్టింది బిందు కుటుంబం

ఇప్పటికి చాలాసార్లు ఆ ఇంటికి వచ్చి అతిధుల మర్యాదలు అందుకున్న వెంకటేష్ కుటుంబం తన చిన్న కూతురు చేసిన పనికి ఎక్కడ అందరి దగ్గర తలదించుకోవాల్సి వస్తుందో అని భయం భయంగా మొదటిసారి ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు

పెద్దవాళ్లంతా  అదితి మర్యాదలతో బిజీగా ఉంటే  యంగ్ బాచ్ అంతా గార్డెన్లో అరేంజ్ చేసిన సీట్స్ లో కూర్చున్నారు

బిందుకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం నెర్వస్ గ ఉంటే ఇందు తనని కంఫర్ట్ చేయడంలో బిజీగా ఉంటే సుచరిత శ్రావ్య కూడా తనకి దగ్గరగా కూర్చున్నారు పూజిత మాత్రం రోషన్ కి దగ్గరగా కూర్చుంటే తనకి ఇంకోవైపు కూర్చుంది రుచిత

పూజిత మాత్రం డైరెక్ట్ గానే అరుణ్ కి సైట్ కొట్టుకుంటా ఉంటే అజయ్ విజయ్ రోషన్ లు అరుణ్ణి ఏడిపించడంలో బిజీగా ఉంటే వరుణ్ మాత్రమే సుచికి సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు

నోట్లోకి ఈగలు దురుతాయు నోరు ముయ్యరా అని వెక్కిరించారు అఖిల్ నిఖిల్ లు వరుణ్ణి ఒకరిద్దరు బామ్మర్దులనే భరించడం కష్టమంటే నాకేంటో బంపర్ ఆఫర్ ఐదు మంది ఉన్నారు అన్నాడు వరుణ్

ఎంత అదృష్టం చేసుకున్నావు బావ అన్నాడు అజయ్  వీళ్ళ మాటలు వింటూ నవ్వుతూ ఒక వైపు పూజిత ని చూస్తూనే ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్న రోషన్ నీ మా అక్క ఇక్కడ ఉంటే ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు బావ అని అడిగింది రుచిత, ఆపుతావా నువ్వు అలా మాట్లాడొచ్చా సారీ రోషన్ అంది పూజిత

ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి తన డిజైనన్లో డీప్ గా మునిగిపోయి ఉన్నా రోషిని అది ముగిసాక టైం చూసి ఓహ్ అందరూ వచ్చేసి ఉంటారుగా అని గబగబా రెడీ అయ్యి కిందకి రాగా అక్కడ ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఉండగా అన్నయ్య వాళ్ళు ఎక్కడ అని అడిగితే వాళ్లంతా గార్డెన్లో ఉన్నారు వెళ్ళు బంగారం అన్నాడు రఘురామ్

అలాగే అంటూ అందరినీ పలకరించి పెద్ద వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని గార్డెన్లోకి వెళ్లిపోయింది రోషినీ తను గార్డెన్ లోకి వచ్చి అందర్నీ చూసి సారీ నేను లేట్ అయినట్టున్నాను అంది

అబ్బా బంగారం లేట్ అయితే అయ్యావు కానీ నిన్ను చూసాకే బావగార్లకి అన్నయ్యలకి ఊపిరి వచ్చినట్టుంది అంది శ్రావ్య సరదాగా

ANNI Designer Women’s Rayon Viscose Straight Printed Kurta with Palazzo | Elbow Length Sleeve Kurti Set | Close Neck with Back Slit | Soft Comfortable Fabric | 2 Piece Outfit only rs 499 to buy click here

అందరూ ఇక్కడ ఉంటే మామూలుగా నువ్వు ఇక్కడే ఉండాలే అంత బిజీగా ఏం చేస్తున్నావు బుజ్జి అని అడిగింది బిందు

నీకు ఇంకా బంగారం నుంచి సర్ప్రైజ్ రాలేదు కదా అందుకే నీకు తెలియదు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ కొత్తగా ఏదో డిజైన్ వేసే ఉంటుంది ఆ డిజైన్లో ఏదో ఒక ఆర్నమెంట్ నీకు ప్రజంటేషన్ గా వస్తుంది చూస్తూ ఉండు అంది సుచరిత

ఇది మాకు మామూలే నీకు కూడా అలవాటైపోతుందిలే అంది శ్రావ్య ఓకే అయితే నేను కూడా ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది బిందు

అన్నయ్య బావ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పింది రోషిని, మాకు తెలియని విషయాలు కొత్తగా ఏమున్నాయి బంగారం అంది సుచరిత

ముఖ్యంగా మీ అందరికీ చాలా పెద్ద సారీ నేను ఎప్పటినుంచో ఒక ఎగ్జిబిషన్ పెట్టాలని దానికి సంబంధించిన డిజైన్స్ వేస్తున్నాను ఆ డిజైన్స్ తో ఎగ్జిబిషన్ హోస్ట్ చేసి ఆ వచ్చిన మనీ ని మన ఫ్యామిలీ పెట్టబోయే ట్రస్ట్ కి డొనేట్ చేయాలనుకుంటున్నాను అది పూర్తిగా నేను సంపాదించింది అయ్యి ఉండాలి అనుకున్నాను

మాక్స్ చాలా వరకు డిజైన్స్ వేసేసాను ఇవి మన డిజైనర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్లు రెడీ చేశాక తాతయ్యతో మాట్లాడి ఎగ్జిబిషన్ పెట్టేస్తే సరి అంది రోషిణీ

మా బంగారం చాలా పెద్దది అయిపోయింది గా చాలా పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తుంది అన్నాడు రోషన్

అన్నయ్య ప్లీజ్ మోసెయ్యొద్దు నేనేదో ట్రై చేస్తున్నాను  ప్లీజ్ హెల్ప్ చేయొచ్చుగా అంది ప్లీజ్ చేస్తావ్ ఏంటి బంగారం ఆర్డర్ వెయ్యి అన్ని అవే జరిగిపోతాయి అన్నాడు అరుణ్

అదేంటి తను ఏం చెప్పినా సరే అంటున్నారు ఎగ్జిబిషన్ అంటే చాలా మంది వర్క్ చేయాలి చాలా ఇన్వెష్ట చేయాలి కదా దానికి తాతయ్య ఒప్పుకుంటారా అంది రుచిత

అది వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటుంది కదా నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావ్ అన్నాడు అఖిల్

https://www.mobtrk.link/view.php?id=5545474&pub=3350972

బంగారం ఇవాళ సూర్యదేమైనా తప్పుగా ఉదయించాడా అని అడిగింది శ్రావ్య ఎందుకలా అడుగుతున్నావని చిన్నగా అడిగింది రుచిత అఖిల్ కి మా బంగారం అంటే ఇష్టం లేదులే ఫస్ట్ టైం తనని సపోర్ట్ చేస్తునట్టు మాట్లాడుతుంటే అలా అనిపించింది అని అంతే చిన్నగా చెప్పింది శ్రావ్య

నీ బంగారం నీ ఇష్టపడని వాళ్లు కూడా ఉన్నారాఅని మళ్లీ అంటే క్వశ్చన్ మార్క్ గా అడిగింది ఇందు కొందరికి కళ్ళు గుడ్డిలే ఏం చేయలేం మనతో కలుపుకొని ముందుకు నడిపించడం మన బాధ్యత అంది శ్రావ్య

అందర్నీ పక్కకి జరిపేసి రోషిని కి చెరొక వైపు చేరిపోయారు అరుణ్ రోషన్ లు. ఆర్ యు షోర్ బంగారం అన్నారు ఇద్దరూ ఒకేసారి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అలసిపోతావ్ అవసరమా అన్నాడు రోషన్

ఇది నా టాలెంట్ ని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం కదా, కష్టం ఏముంది మీరంతా ఉన్నారు కదా నాతో హెల్ప్ చేయడానికి పర్వాలేదులే ఈ కారణాలు చెప్పి తాతయ్య దగ్గర ఎక్స్ట్రాలు చేయద్దు ఇద్దరు అని వార్నింగ్ ఇచ్చింది రోషిని.

స్టాప్ చేయడం నీకు హెల్ప్ చేస్తామే కానీ నిన్ను వెనక్కి ఎప్పుడు లాగం బంగారం నీకు ఆ డౌటే అక్కర్లేదు అన్నారు అజయ్ విజయ్ లు

నేనేమైనా హెల్ప్ చేసేది ఉంటే ఎనీ టైం నాకు ఇన్ఫార్మ్ చెయ్ వన్ కాల్ అవేలో ఉంటాను అని చెప్పింది బిందు

మన గ్యాంగ్ లోకి కొత్తగా వచ్చిన బిందు మనతో కలిసిపోవడానికి శతవిధాల ట్రై చేస్తుంది. ఈ పూజిత ఏంటి వదిన సైలెంట్ గా ఉంది అని అడిగింది శ్రావ్య సుచరితని

మనం వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసామా, చెల్లెమ్మ గుడిలో అంత సీన్ చేసింది అక్కకేమో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని సుచరిత కూడా అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది

వీళ్ళు ఎవరు నీకు హెల్ప్ చేసిన చేయకపోయినా నేను హెల్ప్ చేయడానికి ఆల్వేస్ రెడీ బంగారం అన్నాడు వరుణ్ థాంక్యూ బావ అంది రోషిని, ఇకమీదట నేను కూడా ఎప్పుడూ నీ పార్టీనే బంగారం అంది బిందు

దాంతో బిందువైపు ఓరగా ఒకసారి చూసి మళ్ళీ చూపు మార్చేశాడు అజయ్. నేను కూడా మా అక్క పార్టీ నే ఆల్వేస్ అంది ఇందు. నేను కూడా బిందు పార్టీనే నా వైపు నుంచి కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పింది రాదా అలాగైనా అరుణ్ కి దగ్గరగా ఉండే అవకాశం వస్తుందన్న ఆశతో

ఇక్కడ ఇలా నడుస్తూ ఉంటే అక్కడ పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక లుక్కేద్దాం రండి

https://www.qckclk.com/view.php?id=5545473&pub=3350972

అందరూ క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటే వెంకటేష్ మాత్రం మౌనంగా ఉండడం గమనించిన చంద్ర, బావగారు ఎందుకో మౌనంగా ఉన్నట్టున్నారు ఇవాళ అని అడిగాడు

మీ ముందు ఇలా కూర్చోవాలంటే నాకు ఒక రకంగా సిగ్గేస్తుంది, రుచిత చేసిన తప్పుని నేను సమర్ధించలేను కానీ క్షమించమని మాత్రం మిమ్మల్ని  అడగగలను, వీలైతే తనని క్షమించండి అన్నాడు వెంకటేష్,  ఈ సిచువేషన్ వస్తుందని ముందే ఊహించిన రోషిని నిన్న రాత్రి ఇంట్లో వాళ్ళందరికీ జరిగిన విషయం వివరంగా చెప్పేసింది

ఒక రకంగా ఆ పొరపాటు వల్లే వాళ్లకి మంచి జరగడంతో అర్జున్ లక్ష్మీలు ఏమి మాట్లాడలేక మౌనంగా ఊరుకుంటే, పొరపాటు ఒక రకంగా మంచి చేయడంతో అతిపెద్ద తప్పుగా కనిపించకపోయినా ఒకవేళ అది జరగరానిది జరగడానికి దారితీసుంటే ఏం జరిగేది అది తలుచుకుంటే జానకమ్మకి కోపం ముంచుకొస్తున్న కాబోయే వియంకులని ఏమీ అనలేక మౌనంగా ఊరుకుంది

ఈ విషయం రోషిని అబ్బాయిలెవరు దగ్గర లేనప్పుడు చెప్పింది జానకమ్మకి మరీ మరీ చెప్పింది ఎక్కువ మాట్లాడొద్దు అన్నయ్య బాధపడతాడు అని మనందరి మధ్యలో పూజిత వదిన నలిగిపోవడం నాకు ఇష్టం లేదు పెద్దదానిగా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం అని చెప్పింది రోషీనీ

మా బంగారం పెద్దదైపోయిందని ఇంకొకసారి రుజువు అయింది గా అని చెప్పారు వర్మ గారు. జరగాల్సిందే జరిగిపోయింది ఆ రామయ్య దయవల్ల మనకు అంత మంచే జరిగినప్పుడు దీనిమీద ఇంకా మీదట డిస్కషన్ అనవసరం బంగారం చెప్పింది కదా వాళ్ళంతటి వాళ్లు మాట్లాడితే తప్ప మనం ఈ విషయాన్ని మాట్లాడకూడదని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరంగా ఇంకొకసారి చెప్పారు వర్మ గారు

ముందు ముందు ఎపిసోడ్ లో రోషిని కండక్ట్ చేయబోయే ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుందో సవ్యంగా జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే వైట్ ఫర్ ది అప్ కమింగ్ పార్ట్స్

వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తుంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అని వివరాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి ఒకసారి చదవండి https://thequriouslife.com/what-are-the-healthy-foods-for-weight-loss/

నోట్ ఆరుణోదయ రోషిని తదుపరి భాగాన్ని త్వరగా పబ్లిష్ చేస్తాను.

18 Responses