అరుణోదయ రోషిని తదుపరి భాగానికి స్వాగతం. అరుణోదయ రోషిని ముందు భాగానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెంకటేష్ గారు జరిగిన దానికి క్షమాపణ చెప్పడంతో వర్మ గారు జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ మన మధ్య ఇక రాకూడదని అందరికీ స్క్రిప్ట్ గా చెప్పారు.
రుచితని రిజైన్ చేపించదల్సిన డిసిషన్ కూడా వర్మ గారితో పర్సనల్గా డిస్కషన్ చేశాకే ఎగ్జిక్యూట్ చేసింది రోషిని.
కిచెన్ స్టాఫ్ అంతా ఇంట్లోకి బయటకి హడావిడిగా తిరుగుతుండడంతో ఏంటి రంగీ అని అడిగింది జానకమ్మ. చిన్నమ్మ భోజనాలు అందరికీ గార్డెన్ లో అరేంజ్ చేయమన్నారు అమ్మ అవే చూసుకుంటున్నాం అని చెప్పింది రంగి
రోషిని పెట్టాలనుకున్న ఎగ్జిబిషన్ గురించిన ప్రపోజల్ అన్నయ్యలకి బావలకి చెప్పింది. నువ్వు అనుకున్నట్టే చేద్దాము ప్లానింగ్ ఏంటో చెప్పరా బుజ్జి అని అందరూ ఏకకంఠంతో అడిగారు. ఎగ్జిబిషన్ పెట్టడం అంటే దానికి చాలా ఖర్చవుతుంది ఏమో కదా అంత డబ్బు నీ దగ్గర ఉందా మరి అని అడిగింది రుచిత.
ఏంటన్నయ్య రాకూడని డౌట్లు అన్ని వస్తున్నట్లున్నాయి బుజ్జి దగ్గర అంత మాత్రం డబ్బులు కూడా లేదనుకుంటున్నారా పక్కన వాళ్ళు అని అడిగింది శ్రావ్య అరుణ్ణి.
నిన్న అయితే సహాయం చేయమని అడగదలే డోంట్ వర్రీ రుచిత అంది సుచిరిత. తన ఉద్దేశం అది కాదు సుచరిత తప్పుగా అనుకోవద్దు అంది పూజిత. మీ చెల్లి ఉద్దేశాలు ఏంటో నువ్వు క్లియర్ గా ఉంటే చాలులే మాకు అనవసరం అని అంతే గాటుగా చెప్పింది సుచరిత.
ఇది ఎవరే అంది వచ్చిన అవకాశాన్ని చేతులారా తప్పించేటట్టు ఉంది వాళ్ళ అక్కకి అని అడిగింది ఇందు రాదని చెవిలో గుసగుసగా. బిందు హుష్ అనడంతో వాళ్ళిద్దరూ గుసగుసలు ఆగిపోయాయి.
ఎవరికి ఉండే వాళ్ళు కి ఉంటాయి కానీ నీ ప్లానింగ్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా బుజ్జి మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నాడు రోషన్. మేము కాదు నేను అన్నాడు అరుణ్మీరెవరు దీంట్లో నేను కానీ బుజ్జి గాని అడిగేంత వరకు వేలు పెట్టేదానికి వీల్లేదు ఇంక్లూడింగ్ నువ్వు రోషన్ బావ అన్నాడు అరుణ్ స్ట్రిక్ట్ గా
ఓహో నో, నో ఆర్గుమెంట్స్ ఎవరు ఏం చేయాలో నేను అన్ని క్లియర్ గా ప్లాన్ రెడీ చేసేసాను. ఇది మన ఫ్యామిలీ తరఫున అయినా నేను ప్రైవేట్ గా ఆర్గనైజ్ చేస్తున్నది కాబట్టి అందరూ షేర్ తీసుకోవాల్సిందే నో వాలంటరీ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పింది రోషిని.
మా బుజ్జి మాకు పే చేసే అంత పెద్దది అయిపోయిందా అన్నారు అజయ్ విజయ్. ఎస్ పుణ్యం మొత్తం నాకే కావాలి నో షేరింగ్, అలాగే ఎవరి టైమ్ ని నేను ఊరికెనే వాడుకోవాలి అనుకోవడం లేదు అలా వాడుకుంటే ఫీచర్లో నేను చాలామందికి సమాధానం చెప్పాల్సి రావచ్చు సో నో మెస్.
బంగారం ఏది ప్లాన్ చేసినా కరెక్ట్ గానే ఉంటుంది సో తనని ఫాలో అయిపోవడమే మనందరికీ బెస్ట్ అన్నాడు వరుణ్. యువర్ ది బెస్ట్ పెద్ద బావ అంది రోషిని. చిన్న బావ కూడా ది బెస్ట్ నే కాకపోతే నేనే నీ కళ్ళకు కనిపించను అన్నాడు అరుణ్.
మీ తమ్ముడు నిన్ను చూసి కుళ్ళు కుంటున్నాడు బావ అంది రోషిని. ఓకే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నో మోర్ లాక్ ప్లాన్ ఏంటో చెప్పరా బుజ్జి అన్నాడు రోషన్.
ఫస్ట్ నేను వేసిన డిజైన్స్ ఆర్నమెంట్స్ గా ప్రిపేర్ చేసి ఎగ్జిబిషన్లోనే సేల్ కి పెట్టిన తర్వాతే మన వర్మ జ్యువెలర్స్ లో సేల్ కి వెళ్తాయి.
మార్కెటింగ్ సంబంధించిన విషాలన్నీ పూజ వదిన డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది మోడల్స్ని సెలెక్ట్ చేసే విషయం సుచరితక్క చూసుకుంటుంది మోడల్స్ డ్రెస్ డిజైన్ చేసే డ్యూటీ శ్రావ్య వదిన చూసుకుంటుంది. సిటీలో ఉండే వి వి ఐ పిల సెలబ్రెటీల్ లిఫ్ట్ రెడీ చేసే బాధ్యత బిందు వదినది.
ఎగ్జిబిషన్ కి ఏ ప్లేస్ కంఫర్ట్ గా ఉంటుందో అది మనకి అవైలబుల్ గా ఉంటుందో లేదో ఎంక్వయిరీ చేసే బాధ్యత నిఖిల్ అన్నయ్య చూసుకుంటాడు.
డిజైన్స్ రెడీ అయ్యాక అవి జాగ్రత్తగా ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయడం వాటి సెక్యూరిటీ అంతా అరుణ్ బావ చూసుకుంటాడు. గెస్ట్లను చూసుకునే బాధ్యత రోషన్ అన్నది. వెన్ యు ఫైనల్ అయ్యాక దాని డెకరేషన్ బాధ్యత అంతా వరుణ్ బావది.
క్యాటరింగ్ ఫైనలైజేషన్ అంతా అజయ్ అన్నది పంప్లేట్స్ సిటీలో హోల్డింగ్స్ అరేంజ్మెంట్స్ బాధ్యత అంతా విజయ్ అన్నది. ఇది ప్లాన్ పెద్దవాళ్ళకి పనులు చేయడంలో నో ఎంట్రీ ఓకేనా అంది రోషిని.
అంటే బాగానే ఉంది కానీ బుజ్జి మామలు ఒప్పుకుంటారా వాళ్ళ హెల్ప్ తీసుకోలేదని అలిగితే ఏం చేస్తావ్ అన్నాడు వరుణ్. బుజ్జి తలచుకుంటే ఒప్పించడం ఎంతసేపులే కానీ అదేమీ ప్రాబ్లం లేదులే అన్నాడు నిఖిల్. మరి నాకేమీ పని చెప్పవా అని అడిగాడు అప్పుడే ఫోన్లో వీళ్ళ సంభాషణ వింటున్న రాజు నిన్ను ఊరికేనే వదిలే ప్రసక్తే లేదు
మొదలే మనది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మన కాలేజీలో క్యాంపెయిన్ రన్ చేసి ఎవరికైనా మోడలింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉందేమో వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేసి సుచరిత అక్కకి ఇవ్వు అంది రోషిని డీల్ ఓకే చైర్మన్ గారు అన్నాడు రోషన్ దూరంగా ఉన్నావ్ దెబ్బలు పడవు అనుకుంటున్నావేమో వచ్చినప్పుడు నీ కోట నీకు ఇచ్చేస్తాను జాగ్రత్త అంది రోషిని
మరి నాకేమీ వర్క్ ఇవ్వవా రోషిని అన్నాడు హరి ఎందుకు లేదు ఎగ్జిబిషన్ ప్లాన్ చేయాలంటే అక్కడ వర్క్ చేయడానికి వాలంటీర్స్ కావాలి కదా, మనం వాళ్ళకి పే చేసిన కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేయాల్సిన బాధ్యత మీదే స్టార్ట్ యువర్ వర్క్ ఫ్రొం టుమారో, డేట్ అనౌన్స్ చేస్తాం తొందరలోనే అని చెప్పింది.
మాకు డబల్ ఓకే అన్నారు అందరూ ఏకకంఠంతో అఖిల్ కి రుచితకి ఏమి వర్క్ ఇవ్వలేదు రోషిని వాళ్లని ఇన్వాల్వ్ చేయడం కూడా తనకు ఇష్టం లేదు.
బుజ్జి నీకు ఇష్టమైతే నేను కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చా అన్నాడు అఖిల్ మొదటిసారి రోషినీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ. సుచి అక్కకి హెల్ప్ చేయొచ్చు కావాలంటే నాకేమభ్యంతరం లేదు అంది రోషిని థాంక్స్ రా బుజ్జి మంచి అసిస్టెంట్ ని ఇచ్చావు బాగా పనిలాగేస్తాను గా నేను అంది సుచి.
బుజ్జి నాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది నేను ఇన్వాల్వ్ అవ్వచ్చా మీ అందరికీ ఇష్టమైతేనే అంది ఇందు. శ్రావ్య వదినకి ఇష్టమైతే తనకి హెల్ప్ కావాలంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు నీకు కూడా ఎలాగో డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా అంది.
అప్పటికే గార్డెన్ లో బఫే అరేంజ్ అయిపోవడంతో అదే విషయం లోపల ఉన్న పెద్ద వాళ్ళకి బయట ఉన్న చిన్న వాళ్ళకి ఇంఫాం చేసింది రంగి.
అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ భోజనాలను ఆస్వాదించారు భోజనాలు అనంతరం పెద్ద వాళ్లంతా ఇళ్లకు వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటే చిన్నవాళ్ళంతా మా అందరికీ ఇవాళ పార్టీ ఉంది నైట్ ఇక్కడే అందరం అని చెప్పాడు రోషన్.
ఇక్కడ కాదు బీచ్ హౌస్ కి వెళ్దాం అన్నయ్య ప్లీజ్ అంది రోషిని. బీచ్ హౌస్ కి ఇప్పుడు ఎందుకురా కావాలంటే వీకెండ్ వెళ్లొచ్చు రేపు ఆఫీస్ కి వెళ్ళాలి కదా పూజ టైమ్ కి నువ్వు లేకపోతే అమ్మమ్మ ఒప్పుకోదు అలసిపోతావ్ బుజ్జి అన్నాడు రఘురాం, చంద్రం కూడా వద్దురా బుజ్జి అనడంతో ఆలోచిస్తున్నారు మీరు ఎంత రచ్చ చేసినా మేము ఏమి అనుకోను కానీ పెట్టుకోండి మీ ప్రోగ్రాం అన్నాడు రఘురాం
రామ్ రామ బయలుదేరుతు జాగ్రత్త గా ఇంటికి వచ్చి చేరండి అని అఖిల్ నిఖిల్ సుచరితలకి చెప్పి వెళ్లారు. వెంకటేష్ కవితలు కూడా కూతుర్లకి జాగ్రత్త చెప్పగా అర్జున్ లక్ష్మి కూడా జాగ్రత్త అన్నట్టు చూసి బయలుదేరే ముందర ఫోన్ చేస్తే డ్రైవర్ని పంపుతానని చెప్పి వెళ్ళిపోయారు.
Aquaminder Smart Water Bottle Glows & Beeps to Remind You to Drink More 770 ml Chug Cap Bottle For Adults and Kids Perfect For Gift, Travel, Gym, Yoga, Black, Silicone: Click here
శ్యామలహరిలు కూడా వర్మ దంపతులతో కలిసి ఇంట్లోకి వెళ్లిపోగా కుందన రాధిక రత్నాలు ఎటువంటి కోతి పనులు చేయకుండా జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి అని అందరికీ కలిపి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్లారు రఘురాం చంద్ర రాఘవులు వాళ్ల అలాగే అంటారు కానీ మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు
భోజనాలు తర్వాత చైర్స్ రౌండ్ గా అరేంజ్ చేసుకుని సర్కిల్లో కూర్చున్న యంగ్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఏంటి ప్లాన్ అన్నట్టు చూసారు రోషన్ వైపు, నాకేం తెలియదు బుజ్జి చెప్పమంటే చెప్పాను అన్నాడు రోషన్ అవును మరి గార్డెన్ లో భోజనం చేసేటప్పుడు మెల్లిగా అన్న చెవిలో మాట వదిలేసింది అందరం ఇవాళ కలిసి టైం స్పెండ్ చేయాలి అని.
చెల్లెలు ఆర్డర్ వేయడం అన్న కాదనడమా అందుకే అప్పటికప్పటికీ అందరికీ చెప్పేసాడు కలిసి టైం స్పెండ్ చేస్తున్నట్టు. రోషినికి చెరొక వైపు కూర్చుని ఉన్న సుచరిత శ్రావ్య లు ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా బుజ్జి లాస్ట్ లో ఆపావంటే ఏదో కారణం ఉంది ఏంటది అన్నారు ఇద్దరు.
ప్లాన్ ఏం లేదమ్మా ఏదో మీ కు కాబోయే భర్తలతో కాసేపు టైమ్ స్పెండ్ చేస్తారని జాలి చూపించాను మీ మీద అంతే అంది. ప్లాన్ ఏంటి బుజ్జి అన్నాడు అరుణ్.
నేనే ఇంకా ఆలోచించలేను నీకేం చెప్పను బావ అని మనసులో అనుకుంటూ ఉండగా నా హెల్ప్ కావాలా అన్నట్టు కమ్యూనికేట్ చేశాడు అరుణ్ అవునన్నట్టు తల ఊపింది రోషిని.
ఇప్పుడే వస్తానని అరుణ్ లోపలికి వెళుతూ ఉండగా, నేను అమ్మమ్మ తాతయ్యలా రూమ్ కి వెళ్లి వస్తానని రోషిని కూడా అరుణ్ వెనకే వెళ్ళింది.
రోషినిని గార్డెన్ లో ఉన్న చెట్ల వెనక్కి తీసుకెళ్లి ఏంటి బంగారం ప్లాన్ ఏం లేకుండా వీళ్ళందర్నీ ఆపేసి ఏం చేయాలనుకున్నావ్ అన్నాడు అరుణ్.
ప్లానైతే ఏం లేదు కానీ కపుల్ నైట్ లాగా ఉండాలి, ఇద్దరం కలిసే ఉండాలి కానీ ఎవరి జంటతో వాళ్ళు ఉండాలి ఏం ప్లాన్ చేస్తావో నాకు తెలియదు ఇది నేను నీకు ఇస్తున్న టాస్క్ బావ ప్రు యువర్ సెల్ఫ్ అని అందరి దగ్గరికి వెళ్లిపోయింది.
రోషిని ఇచ్చిన టాస్క్ అరుణ్ పూర్తి చేస్తాడా అరుణ్ ప్లానింగ్ ఏంటో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.
https://thequriouslife.com/how-to-budget-with-an-irregular-income/
Hehehe arun balika bakra 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Papam arun neku pedda task ichindi ga ne bangaram