ఒక పెద్ద ఫంక్షన్ హాల్ దగదగమైన వెలుగులతో నిండిపోయింది బంగారు రంగు థీమ్ డెకరేషన్, జాజి, గజ్రా, బెలూన్లతో అలంకరించిన వేదిక అందంగా మెరిసిపోతుంది..కొడుకు కోడలు.. కూతుళ్లు అల్లుళ్ళు, మనవలు మరియు మనవరాలు కలిసి వర్మ దంపతులని హాల్లోకి తీసుకువచ్చారు..

వర్మ దంపతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో ఆదిదంపతుల్లా అనిపిస్తుంటే.. కుందన రత్న రాధికలు ఒకే రకం పట్టుచీర వేరువేరు కలర్లతో రెడీ అయ్యారు… అల్లుడులు కొడుకు ఒకే రకమైన షేర్వానీలో తమ ధర్మపత్నిలకు తగిన మ్యాచింగ్ కలర్లతో రెడీ అయ్యారు…ఐదుగురు మనవళ్ళు బంగారం రంగు షేర్వానీలో మెరిస్తే.. రోషిని అదే రంగు హాఫ్ శారీలో రెడీ అయ్యి అరుణ్ గుండెలో మన్మధ బాణాలు నాటింది..

(ఆగండీ ఆగండీ ఇంతకీ ఇక్కడ ఎం జరుగుతుందనే కదా మీ అందరి డౌట్.. అదే చెప్తున్నా ఇవాళ వర్మ జానకి గార్ల 50 సంవత్సరాల పెళ్లి వేడుక)

“అయ్యో, ఇంత హంగామా ఎందుకు? మేమేమైనా సినిమా స్టార్‌లమా?” అని వర్మ గారు అనగానే, రోషిని వెంటనే, “తాతయ్యా, మీరు మా సినిమా హీరో!” అంది.దాంతో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు సంతోషం గా..అమ్మమ్మ తాతయ్య ల పెళ్లికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సారి వారికి గుర్తుండిపోయే స్వర్ణోత్సవం జరపాలి!” అని అందరిని ఒప్పించింది రోషిని..అందరు దానికి ఒప్పుకుని సంతోషం గా ఏర్పాట్లు చేశారు…

బంగారు అక్షరాలతో అచ్చేసిన ఆహ్వాన పత్రాలు బంధువులకు, స్నేహితులకు పంపబడ్డాయి. “మహేంద్ర వర్మ & జానకి – 50 ఏళ్ల ప్రయాణం, 50 ఏళ్ల ప్రేమ కథ. మా ఆనందంలో మీరు కూడా భాగస్వాములు కావాలి.” అనె సందేశం తో, వేడుకకు ముందు రోజు, జానకి గారు గారు పాత ట్రంక్ తెరిచి చూసారు. అందులో 1975లో వారి పెళ్లి ఫోటోలు, ముద్దుబొమ్మలాగా చిన్నపిల్లల ఫొటోలు ఉన్నాయి. “ఏవండీ, చూడండి … నీ మీసాలు ఎంత పొడవుగా ఉన్నాయో అప్పట్లో,” అని లక్ష్మి నవ్వుతూ చూపించారు. “హహా… నువ్వే పెట్టమన్నావు కదా! అప్పుడు నీకది ఫ్యాషన్‌గా కనిపించింది,” అన్నారు వర్మ గారు.

ఆ జ్ఞాపకాలు వారిని కొద్దిసేపు మరో యుగంలోకి తీసుకెళ్లాయి…వర్మ గారు ప్యూన్ గా తన జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి బిలనియర్ గా ఎదిగినంతవరకు తన జీవితంలో తనకి తారసపడిన వాళ్లందరూ ఆల్మోస్ట్ ఈ వేడుకకు హాజరయ్యారు.. వాళ్లలో తమ బంధువులు స్నేహితులు ఆత్మబంధువులు.. తమ పిల్లలకు కాబోయే వియ్యంకులు అందరూ ఉన్నారు..

అతిథులు అందరు కూర్చునగానే, ప్రొజెక్టర్ ఆన్ అయింది. స్క్రీన్‌పై ఒకదాని తర్వాత ఒకటి పాత ఫొటోలు మెరుస్తున్నాయి. మట్టిగుడిసెలో మొదటి ఇల్లు…రాఘవ్, కుందన పాఠశాలకి వెళ్ళిన రోజు…
కుందన ఓనిలా వేడుక…పిల్లల పెళ్లిళ్లు, మనవళ్ల పుట్టినరోజు  జుట్టు తొలగింపు వేడుక…రత్న దత్తత వేడుకలు, రోషిని అన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి వాటిలో..

ఆ ఫొటోలను చూస్తూ జానకి గారి కళ్ళలో నీరు చేరింది. “ఏవండీ, ఇంతకీ మనం ఈ దశకు చేరతామా అనుకున్నామా?” అని అడిగింది. వర్మ గారు ఆమె చేయి పట్టుకుని, “నువ్వు పక్కన ఉంటే ఏదైనా సాధ్యమే,” అన్నారు. ఆ మాట విన్నవెంటనే హాల్లో చప్పట్లు, హర్షధ్వానాలు మొదలు అయ్యాయి..పండితులు మంత్రాలు చదువుతున్నారు… గురువు గారు అవి అన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు.. రోషిని మాట మీద అయన ఈ వేడుకకి ముహూర్తం పెట్టి తన శిష్యు లతో అన్ని జరిపిస్తున్నారు. పిల్లలు కొత్త మంగళసూత్రం తెచ్చారు. జానకి గారు కొంచెం నవ్వుతు వణికుతూ, “ఇది మళ్లీ కడతారా?” అని అడిగారు.

వర్మ గారు చిరునవ్వుతో, “ఒక్కసారి కాదు, వందసార్లు కూడా కడతాను. నువ్వు నా జీవితానికి అర్థం,” అన్నారు. అలా మంగళసూత్రం కట్టగానే, అందరి కళ్ళలో నీరు మెరిసింది. కొందరు నిజంగా కన్నీళ్లతో తడిచారు.

పెద్ద అల్లుడు రఘురామ్ మైక్ పట్టుకుని, “అత్త మామ … మేము సాధించిన విజయాల వెనుక మీ కష్టమే ఉంది. మీరు మా కోసం త్యాగాలు చేశారు. ఈ రోజు మా గర్వం మీరు,” అన్నాడు… మీ ఇంటి ఆడపిల్లనిచ్చి నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు..

పెద్ద కూతురు కుందన, “అమ్మా, నువ్వు ఎప్పుడూ చిరునవ్వుతోనే కష్టాలను ఎదుర్కొన్నావు. నువ్వు నా ఆదర్శం,” అంది. చిన్న అల్లుడు చంద్ర, “మామ, నీ నిజాయితీ, నీ పట్టుదల మాకు పాఠం. ఈ రోజు మేమంతా మీ ముందున్నాం అంటే అది మీ వల్లే,” అన్నాడు.. మా అమ్మ మా నాన్న ఎంతో పుణ్యం చేసుకునే ఉంటారు… అందుకే మేము మీ నీడలో చేరామన్నాడు…

అన్నా తమ్ముడు మాటలతో తార ఓకింత సిగ్గు పడింది… తను అత్యాశపడిన సందర్భాలు గుర్తొచ్చి తల్లిదండ్రులను క్షమించమని మనసులోనే వేడుకుంది. రాఘవ్ అండ్ రాధికా ఇద్దరినీ హత్తుకుని మీరే మాకు ఆదర్శం మీ అడుగుజాడల్లో నడుస్తాం అన్నారు. ఆ మూమెంట్ చూసిన రామ్ రమలకు చాలా సంతోషంగా అనిపించింది..

మనవలు–మనవరాళ్లు గట్టిగా అరవసాగారు: “తాతయ్యా, అమ్మమ్మా నానమ్మ – వీ లవ్ యూ అంటూ!” రామ్ మైక్ పట్టుకుని, “ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఐదు సంవత్సరాలు కూడా నిలవడం కష్టం. కానీ మీ బంధం 50 ఏళ్లకు చేరింది. ఇది కేవలం దాంపత్యం కాదు, సమాజానికి ఆదర్శం,” అన్నారు. అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు.భోజన సమయం వచ్చింది. అరటాకులో వడ్డించిన వంటకాలు – పులిహోర, గుత్తి వంకాయ, అల్లం పచ్చడి, బూందీ లడ్డూ, పాయసం తో నిండిపోయింది.. అందరికి కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది

మనవలు వేదికపై డ్యాన్స్ చేశారు.. అరుణ్ రోషిని లు జంటగా చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది…రోషన్ పూజితతో రెండు స్టెప్పులు వేస్తే వరుణ్ సుచితతో రెండు స్టెప్పులు వేశాడు.. విజయ్ శ్రావ్య స్టెప్పులు వేస్తుంటే నేను అన్నట్టు అజయ్ వైపు చూసింది  ఇందు.. నీకు అంత సీన్ లేదన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు అజయ్…

రామ్ రమలు, రాధికా రాఘవులు, కుందన రఘురామ్ లు, చంద్రా రత్నాలు, శ్యామ్ లహరిలు, వెంకటేష్ కవితలు అర్జున్ లక్ష్మి, ల తో పాటు, శరత్ శారదలు, కళ్యాణి సుధాకర్ లు వర్మ దంపతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే… లహరి తార, అత్త మామలు, భవాని శంకర్ లు వర్మ దంపతులని ఆశీర్వదించారు..

“తాతయ్యా, మీరు కూడా డ్యాన్స్ చేయాలి!” అని అజయ్ పట్టుబడగా, వర్మ గారు తడబడి, “అయ్యో ఈ వయసులో…” అని మొదలు పెట్టగానే, జానకి గారు అతని చేతి పట్టుకుని చిన్న స్టెప్పులు వేశారు. అది చూసి హాలంతా కేరింతలతో మార్మోగిపోయింది..

రాధ బిందు, రుచి… ఈ కుటుంబం లో భాగం కాలేనందుకు బాధపడుతున్న… మొఖం పై నవ్వు పులుముకుని… ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశారు. అఖిల్ నిఖిల్, రాజు హరి లు ఏర్పాట్లు పర్యవేక్షణ లో బిజీ గా ఉన్నారు…

వేడుక ముగింపు క్షణంలో వర్మ గారు మైక్ పట్టుకుని మాట్లాడారు అందరి కోరిక మీద: “మా జీవితం కష్టాలతో కన్నీటి తో  నిండి ఉండేది. కానీ ఒకరికొకరం అండ అయ్యాము ప్రేమని వదిలిపెట్టలేదు. ఓర్పు, గౌరవం, ప్రేమ ఉంటేనే పెళ్లి 100 ఏళ్లు కొనసాగుతుంది. మీరు అందరూ మీ జీవితాల్లో ఈ పాఠం పాటించండి.” అన్నాడు

జానకి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, “ఇంతకాలం నా పక్కన నడిచిన భర్తకు, మాకు అండగా నిలిచిన పిల్లలకు నా ఆశీస్సులు,” అన్నారు. ఆ మాటలతో అందరూ నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టారు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన వర్మ దంపతులు కిటికీ దగ్గర కూర్చుని చంద్రుణ్ని చూశారు.

జానకి, మనం నిజంగా అదృష్టవంతులం,” అన్నారు వర్మ గారు. “అవును అండి అంది … కానీ నిజమైన అదృష్టం ఏమిటంటే, మన సంతానం,” అని ఆమె భుజంపై తల వాల్చారు ఆయన. చంద్రుడు సాక్షిగా, వారి ప్రేమ మరింత బలపడింది..

ఆ రోజు కేవలం ఒక వేడుక కాదు. అది ఒక కుటుంబ చరిత్ర. ప్రేమ, ఓర్పు, విశ్వాసం ఉంటే పెళ్లి ఒక స్వర్ణోత్సవం వరకు కొనసాగుతుందని చూపిన సాక్ష్యం. ఫంక్షన్ హల్ నుంచి ఇంటికి చేరుకున్న అందరు అలసి ఎవరి గదులకి వాళ్ళు వెళ్లి నిద్రపోగా…అరుణ్ మాత్రం అందరు నిద్రపోయారు అని కన్ఫర్మ్ చేసుకుని స్పేర్ కి తో డోర్ ఓపెన్ చేసి రోషిని రూమ్ కి వెళ్ళాడు..

తను ఊహించినట్టుగానే ఫంక్షన్ హాల్ నుంచి రావడం అలాగే బెడ్ పై పడి ఆదమరిచి నిద్రపోతుంది..నువ్వు నా నిగ్రహానికి మరింత పరీక్ష పెడుతున్నావ్ బంగారం అని తన గుండె మీద చేయి వేసుకొని కంట్రోల్ కంట్రోల్ అని తనకు తానే చెప్పుకుని ఎలానే బుజ్జి నీతో అనుకున్నాడు మనసులో అరుణ్…

అంతేగా మరి ఎదురుగా అజంతా శిల్పం కి ప్రతి రూపం లా ఉన్న తన చెలి రూపం చూస్తూ.. నువ్వు నన్ను చెడగొట్టేస్తున్నావ్ బుజ్జి… నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్ర పోతున్నావ్ అనుకున్నాడు….మళ్ళీ తనే అంతేలే ఈ రోజంతా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు తిరిగావ్ గా… కనీసం నగలు తీసే ఓపిక కూడా లేకుండా పడుకున్నావ్.. అనుకుని.. బెడ్ పై కుర్చీని.. మెల్లిగా ఒక్కో నగ తీయడం మొదలు పెట్టాడు.. అన్ని తీసి లాస్ట్ గా వడ్డానం తీసేటప్పుడు కొంచెం కష్టపడ్డాడు…

దాంతో కొంచెం డిస్టర్బ్ అయినా రోషిని.. పడుకోనివ్వు అరు అంది… పడుకో కాదని ఎవరన్నారు.. ఎదో అలా షికారు కి వెళదాం అని అందరు నిద్ర పోయేదాకా వెయిట్ చేసి వస్తే తమరు ముందే నిద్రపోయారు…ఎలాగో నిద్రపోయావ్ కదా నా పని ఇంకా సులువుగా ఉంటుంది అని పక్కన పడుకోబోయాడు… అరు నన్ను ఏడిపించావు అంటే అన్నయ్యకి చెప్తాను అంది.. ఆ మీ అన్నయ్యని చూస్తే ఓ భయపడిపోతున్నారు మరి అంటు పక్కన పడుకొని తనని హగ్ చేసుకున్నాడు అరుణ్…

ఇప్పుడు నీకేం కావాలి ఎందుకిలా నన్ను సతాయిస్తున్నావ్ అని అడిగింది నిద్రలోనే.. అరుణ్ హగ్ ని ఫీలవుతూ..అది పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావ్ బంగారం.. ఇప్పుడు తమరు లేచి ఫ్రెష్ అయితే మనిద్దరం అలా షికారుకు వెళ్దాం అన్నాడు.. అర్ధరాత్రి షికార్లు బంద్ అని అన్నయ్య చెప్పినట్టు ఉన్నాడుగా అంది రోషిని…

అవునా ఇప్పుడు మనిద్దరం బైక్ లో బయటకు వెళ్దాం అనుకున్నాను బైక్ డ్రైవింగ్ కూడా నువ్వే చేయాలి అనుకున్నాను మరి ఆలోచించుకో అన్నాడు.. అంతే నిద్రమత్తు ఒక్కసారిగా వదిలి లేచి కూర్చుని నిజం గా నా బావ అని అడిగింది.. నిజంగా నిజం బంగారం నీదే ఆలస్యం ఆలోచించుకో మరీ అన్నాడు అరుణ్ స్టైల్ గా లేచి కూర్చుని…

ఏంటో బావగారు ఇవాళ వరాల జల్లు కురిపిస్తున్నాడు నా మీద అని అడిగింది రోషిని ఓరగా చూస్తూ…ఈరోజు మన ఫ్యామిలీకి ఓ స్పెషల్ డే కదా.. అది నీకు ఇంకా స్పెషల్ చేయాలని ఏదో మా తాపత్రయం అన్నాడు…

టెన్ మినిట్స్ బావ అని జీన్స్ టీ షర్ట్ హుడి తీసుకొని.. రెస్ట్ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్ చేసుకొని.. తన పొడవైన వాలు జడని క్లచ్ లో బంధించి… అరుణ్ ముందు నిలబడి నేను రెడీ అంది…

నాకు తెలుసు బంగారం ఏం చెప్తే నువ్వు ఇంత హుషారు అవుతావో.. అయినా బైక్ డ్రైవింగ్ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం అన్నాడు.. ఇష్టమని నన్ను ఏమైనా మీరు డైలీ యూస్ చేయినిస్తున్నారా… అన్నిటికి రెస్ట్రిక్షన్స్ అదేమైనా అంటే పడితే దెబ్బలు తగులుతాయి బంగారం అంటారు … బెంజ్ డ్రైవ్ చేయడం కంటే బైక్ డ్రైవ్ చేస్తే వచ్చే కిక్కే వేరులే.. మాటలతో టైం వేస్ట్ చేయకు పద పద పద అంటూ అరుణ్ చేయి పట్టి లాగింది…

మరి మీ అన్నయ్యలకు తెలిస్తే అన్నాడు కళ్ళు ఎగరేస్తూ.. తెలియదని నేను అనుకోవడం లేదు ఆల్రెడీ నువ్వు అన్నయ్యకి చెప్పే ఉంటావు నా దగ్గర వేషాలు వేయకు అంది… అబ్బబ్బ ఎలా బంగారం అన్నా చెల్లెలు ఇద్దరు ఒకే సింక్ లో ఉంటారు అన్నాడు… ఏదో మాకు అలా కలిసి వస్తుందిలే ఇప్పుడెలా మెయిన్ డోర్ గుండా నా లేకపోతే మన రహ దారిలోనా అని అడిగింది.

మనదారి నుంచి వద్దులే మెయిన్ డోర్ లో నుంచే వెళ్దాం అన్నాడు అరుణ్.. రోషన్ ఇచ్చిన వార్నింగ్ గుర్తు రావడం తో…ఇంతకీ వీళ్ళ దారి రహస్యం ఏంటి అంటే అరుణ్ తన బావల నుంచి అన్నయ్య నుంచి తప్పించుకోవడానికి.. తన రూమ్ బాల్కనీ నుంచి వుడెన్ స్టైర్ కేస్ ఫోల్డబుల్ ఆరెంజ్ చేసుకున్నాడు… కొద్ది రోజులు బాగానే ఎస్కేప్ అయినా రోషిని ని ప్రతి క్షణం వాచ్ చేస్తుండే రోషన్ కంట్లో త్వరగా నే పడ్డాడు… దాంతో పాపం బావకి సరెండర్ అవ్వక తప్పలేదు…. మన అరుణ్ కి…

అనుకున్నట్టుగానే మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ రంగీ హాల్ లోనే ఉండడంతో డోర్ క్లోజ్ చేసుకోమని చెప్పాడు..జాగ్రత్తగా వచ్చేయండి బాబు అని ఆరోజు తను కూడా అలసిపోవడంతో డోర్ క్లోజ్ చేసుకుని పడుకోవడానికి వెళ్లిపోయింది రంగి…

యూత్ అందరికీ ఫేవరెట్ అయిన ఒకే ఒక బైక్ అయినా… లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్ ముందర ఆగాడు అరుణ్… అది రోషన్ గిఫ్ట్ రోషిని కి… దానిని వీళ్లిద్దరు తప్ప ఇది వరకు ఎవరు డ్రైవ్ చేయలేదు..కీస్ రోషిని కి ఇచ్చాడు చెప్పినట్టు గా నే… వెంట రావడానికి ట్రై చేసిన సెక్యూరిటీ ని కంటి చూపుతో నే వద్దు అని చెప్పాడు అరుణ్… కానీ మన పాప మాత్రం అవేం పట్టనట్టు హ్యాపీ గా బైక్ స్టార్ట్ చేసి అరుణ్ ని కూర్చోమని చెప్పి ఎక్కడ కి అని అడిగింది..

ఎం మన ప్లేస్ బోర్ కొట్టిందా అన్నాడు అరుణ్.. లేదులే నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయేమో అని అడిగాను అంటూ బైక్ రైస్ చేసి ముందుకు దూకించింది..తను డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తుంటే అరుణ్ సంతోషం గా చూస్తున్నాడు..

కొంచం దూరం వెళ్ళాక ఎవరు లేని నిర్మానుష్య మైన ప్లేస్ రావడం తో హ్యాండిల్ అరుణ్ కి ఇచ్చి తన రెండు చేతులని గాల్లో చాపి ఎంజాయ్ చేస్తూ లవ్ యూ అరు అని అరిచింది…ఇంతలో వాళ్ళు రావలసిన ప్లేస్ రావడం తో వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసాడు…

ఇంతకీ మన లవర్స్ ఎక్కడికి వచ్చారు అనే కదా మీ డౌట్… వాళ్ళ బీచ్ హౌస్ కి..అదే వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ మరి.. మేడమీద సిమెంట్ బల్ల పై కూర్చొని ఆకాశం లో చందమామ ని ఎదురుగ ఉండే సముద్రం అలలని ఒకేసారి చూడడం.. రోషిని కి ఇష్టం మైన వాటిలో ఒకటి.. అందుకే మన యూత్ అంత టైమ్ దొరికినపుడు.. లేకపోతే టైమ్ దొరికించి కుని మరి వారం లో ఒకసారి అక్కడికి వచ్చేస్తారు..

ఎప్పుడో ఒకసారి అరుణ్ టైమ్ బాగున్నప్పుడు మాత్రమే ఇద్దరు వస్తారు…అది అరుణ్ కి చాలా నచ్చే టైమ్… సిమెంట్ బల్ల పై ఇరువురు అనుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ.. తన ప్రియాసఖీ తన బుజం పై నిద్రపోవడం.. లేకపోతే అలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉదయం సూర్యోదయం చూడడం…ఈరోజు కూడా తనకి బాగా కలిసి వచ్చిన విషయం ఆ రోజు పౌర్ణమి అవ్వడం..చంద్రుడి వెలుగు సముద్రం పై పడి అది రిఫ్లెక్ట్ అవుతుంటే తన చెలి మోము ఆనందం తో మెరిసి పోతుంది…

మేడపైకి వచ్చిన వెంటనే రోషిని అంత కలియతిరిగి… తరువాత ఆకాశం లోకి చూస్తూ అరె ఇవాళ పౌర్ణమి కదా.. ఎంత బాగుందో.. అన్నయ్య లు పెద్ద బావ కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా అంది…

వాళ్ళకి బానే ఉంటుంది నాకే బాగోదు అని మనసులో అనుకుని.. అరె వాళ్లకి స్పెస్ అవసరం బంగారం… ఫోన్ లో అయినా ముచ్చట్లు చెప్పుకోవాలి గా.. మనలా ఎలానో కుదరదు.. ఇవాళ అందరు ఎంత అలిసిపోయి ఉన్నారు చెప్పు అందుకే మన ఇద్దరం వచ్చాము అని చెప్పి ఉఫ్ ని అన్నలు పిచ్చి పాడుగాను అని మనసులో అనుకున్నాడు…

ఇక ఇద్దరు అనుకుని బల్ల పై కూర్చున్నారు అలసి పోయి..బంగారం నీకు సముద్రం చుస్తే ఎం గుర్తుకు వస్తుంది అన్నాడు అరుణ్… నేను చెప్తాను కానీ నీకేం గుర్తు వస్తుంది అంది రోషిని..

అరుణ్ రోషిని ని అదే విషయం అడగగా మొదటిసారి తను వైజాగ్ వచ్చినప్పుడు తామంతా కలిసి అక్కడ టైం స్పెండ్ చేసిన విషయమే గుర్తొస్తుందని చెప్పింది.. నీకేం ఎక్కువ గుర్తొస్తుంది బావ అని తిరిగి అడిగింది రోషిని అరుణ్ణి… నాకేం గుర్తొస్తుందో నీకు తెలియదా అని అరుణ్ నవ్వుతూ కళ్ళు ఎగరేయడంతో… రోషిని బుగ్గలు సిగ్గుతో ఎరుపు రంగు పులుముకుంటే  ఒక్కసారిగా ఇద్దరు రోషిని 21 వ పుట్టినరోజు రోజుని తలుచుకున్నారు ..

ఆ రోజు అందరు బీచ్ హౌస్ కి వచ్చి ఎంజాయ్ చేయాలి అని పెద్ద వాళ్ళని ఒప్పించగా ఉదయం పూజ టైమ్ కి ఇంట్లో ఉండాలి అనే కండిషన్ తో పర్మిషన్ ఇచ్చారు… పార్టీ ఏర్పాట్లు అన్ని ఈవెంట్ ఆర్గనైజషన్ కి అప్పగించి అర్ధరాత్రి ఏర్పాట్లు మాత్రం వీళ్ళు స్వయంగా చేసుకోవడానికి ఆఫీస్ నుంచి అటే వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు…

ఆ ఇంట్లో ఎవరికీ 12 గంటలకు విషెస్ చెప్పే అలవాటు లేదు పెద్దవాళ్లకు.. కానీ పిల్లలు ఎంజాయ్ మెంట్ ని కాదు అనరు….

అనుకున్నట్టుగానే రోజు కంటే కాస్త ముందుగా వాళ్ళ పనులు ముగించుకొని ఆఫీస్ నుంచి బీచ్ హౌస్ కి వెళ్లి ఆ ఇంటి టెర్రస్ ని అందంగా రెడ్ అండ్ వైట్ రోజా పూలతో అదే రెడ్ అండ్ వైట్ బెలూన్లతో అలంకరించారు వాళ్ళ స్వహస్తాలతో..మిగిలిన నలుగురు అక్కడే ఫ్రెష్ అవ్వాలని నిర్ణయించుకొని అరుణ్ణి మాత్రం ఇంటికి పంపారు రోషిని ని తీసుకురావడానికి…

అరుణ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ ముగించుకుని మిగిలిన వాళ్ళకి డిన్నర్ ప్యాక్ చేయించి రోషినితో అక్కడి నుంచి తిరిగి బీచ్ హౌస్ కి స్టార్ట్ అవుతూ తను చేయాల్సిన పనులు చేయదల్చిన పనులు ఎంతవరకు వచ్చాయో తెలుకోవడానికి దారిలోనే ఒకచోట కారాపి దిగి మాట్లాడి మళ్లీ వచ్చాడు.. ఏంటో బావగారు సీక్రెట్ ఫోన్ కాల్స్ అని అడిగింది రోషిని..

నీ దగ్గర నాకేం సీక్రెట్స్ ఉంటాయి బంగారం నీకే తెలుస్తుందిలే పదా అంటూ సరదాగా మాట్లాడుకుంటూ బీచ్ హౌస్ కి చేరుకున్నారు..

వాళ్లకి అక్కడ సరదాగా టైం స్పెండ్ చేయడం అలవాటే కాబట్టి అందుకే వాళ్లంతా అక్కడ ఉన్నారని అనుకుంది రోషిని తన పుట్టినరోజు సంగతి మర్చిపోయి.. వీళ్లు కూడా తనకే మాత్రం డౌట్ రాకుండా బిహేవ్ చేయడంతో దాని గురించి తను పెద్దగా ఆలోచించలేదు…

కరెక్ట్ గా 11 గంటలకి బావలు విత్ యువర్ పర్మిషన్ మీ చెల్లి తో నేను అలా బీచ్ లోకి వెళ్ళొస్తాను అన్నాడు అరుణ్..ఏదో సెన్స్ చేసిన రోషన్.. మెల్లిగా చెవిలో హద్దులు దాటావంటే చీరేస్తాను కరెక్ట్ గా టైంకి తీసుకొని రా అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు..మాకామాత్రం తెలుసులే బావ బాయ్ అంటూ రోషినిని తీసుకుని బీచ్ వైపు వెళ్ళాడు

నేరుగా వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న చిన్న సైజు క్రూజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు.. రోషిని దాన్ని చూసి ఎక్సయిట్ అవ్వడంతో నచ్చిందా అని అడిగాడు అరుణ్.. చాలా అంటే చాలా నచ్చింది అన్న రోషిని తో అయితే లేట్ ఎందుకు పదా అంటూ దానిలో ఎక్కాక అది బయలుదేరి సముద్రంలో కొంచెం దూరం తీసుకెళ్లాక ఆగింది.. రోషిని దాన్ని డెక్ పైనుంచి దగ్గర నుంచి సముద్రం దూరం నుంచి ఆకాశం చూస్తూ బావ వాట్ ఏ వండర్ఫుల్ సీనరీ అంటూ తన చేతులు బారుగా చాపి తిరుగుతూ తన ఆనందాన్ని వెల్లడించింది..ఆకాశం నీలం వర్ణంలో తెల్లటి నక్షత్రాలు.. నిండు చందమామ తో  వెన్నెల కురిపిస్తోంది. సముద్రం మీద అలలు మెల్లగా తాకుతూ ఒక తీయని రాగాన్ని వినిపిస్తున్నాయి అన్నట్టు గా ఉంది…అరుణ్ తన మరదలి ఆనందాన్ని ఫోన్ లో ఫోటో, వీడియో ల రూపం లో బందిస్తూ ఉన్నాడు..

ఇదండి మన రోషిని ప్రయాణం.. ఇది నిరంతరం కొనసాగాలని అల్ ది బెస్ట్ చెప్పేయండి నేను మీరు మెచ్చేలా మన రోషిని అరుణ్ ల గిల్లి కజ్జాలునీ అందమైన కావ్యం గా రాసి మీ ముందు పెడతాను…

గివ్ యువర్ కామెంట్ రేటింగ్ అండ్ ఫైనల్లీ ఫాలో మీ.