బొట్ మీద రోషిని గెంతుతూ ఉంటే ఆమె ఆనందాన్ని ఒకవైపు నిల్చుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు అరుణ్.. ఆడి ఆడి అలసిపోయిన రోషిని అక్కడే అరేంజ్ చేసిన డెస్క్ మీద కూర్చుంది . సముద్ర గాలి ఆమె జుట్టును నిదానంగా ఆడిస్తోంది. ఆమె కన్నుల్లో అలల ప్రతిబింబం మెరుస్తోంది. అరుణ్, ఆమె పక్కనే కూర్చొని , చేతిలో చిన్న గిటార్‌తో ఒక మెలోడీని వాయించాడు. రోషిని ఆ మెలోడీని వింటూ, తన మనసంతా అతనిలో లీనమ్ చేసి బయట ప్రపంచం మరిచి పోయింది కాసేపు..
అలల చప్పుడు, గిటార్ రాగం, — అన్నీ కలిసి వారిని ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్లాయి. రోషిని చిరునవ్వుతో అరుణ్ వైపు చూస్తుంది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు కలిసాయి. ఆ చూపుల్లో మాటలకన్నా ఎక్కువ భావాలు ఉన్నాయి — ప్రేమ, ఆశ, భయం, ఆనందం అన్నీ కలిసిన మంత్రంలా.
అరుణ్ కాస్త దగ్గరికి వంగగా. రోషిని మొదట కంగారు పడ్డ, వెంటనే తన మనసు చెప్పిన మాటకి తల వంచి కళ్ళు మూసుకొని ఆ క్షణం ని ఆహ్వానించింది. ఆ క్షణంలో సముద్రం కూడా స్తబ్దుగా నిలిచిపోయినట్టుగా అనిపించింది. రోషిని కళ్ళు మూసుకున్నాయి.
అరుణ్ తన పెదవులను ఆమె పెదవులపై మెల్లగా ఉంచాడు. అది ఒక సున్నితమైన, నిర్మలమైన మొదటి ముద్దు — ఒక కలల క్షణంలా. గాలి గట్టిగా వీచినా, అలలు గట్టిగా కొట్టుకున్నా, వారిద్దరికీ ప్రపంచం ఆగిపోయినట్టే అనిపించింది.
ఆ క్షణం వారిద్దరి హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలింది. మొదటి ముద్దు సముద్రం సాక్షిగా వారిద్దరి ప్రేమను మరింత బలంగా కట్టి వేసింది… అరుణ్ ఆరు సంవత్సరాల నిరీక్షణ కి ఫలితం అది.. రోషిని ఆ ముద్దులో మమేకమైపోయి ఉండగా.. ఒక్కసారిగా డెక్కుపైన వెలిగిన లైట్లు ఆకాశంలో పేలిన క్రాకర్స్ తో ఈ లోకంలోకి వచ్చింది…
ఇంతలో పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ స్వీట్ హార్ట్ అన్నాడు అరుణ్… థాంక్యూ అంటూ అరుణ్ణి హత్తుకుని చుట్టూ చూడగా.. షిప్ డెక్ అంత హ్యాపీ బర్త్డే రోషిని అనే లైట్స్ తో వెలిగింది..
రోషిని అదంతా సంభ్రంగా చూస్తూ ఉండగానే అరుణ్ ఫోన్ మోగింది… అది వాళ్ళ గ్రూప్ కాల్ కావడంతో అరుణ్ నవ్వుతూ రోషిని వైపు ఫోన్ పెట్టాడు… అందరూ హ్యాపీ బర్త్డే బంగారం అని వీడియా కాల్ లో గట్టిగా చెప్పాక 10 మినిట్స్ లో ఇంట్లో ఉండలేదంటే మేమంతా బంగారంతో వన్ వీక్ ట్రిప్ కి వెళ్దామని బావలు వార్నింగ్ ఇచ్చారు.. కాల్ కట్ అయ్యాక అరుణ్ రోషిని తో రిటర్న్ అయ్యి బావలు చెప్పినట్టుగానే పదినిమిషాల్లో కాదు కానీ 15 నిమిషాల్లో వాళ్ళ ఇంటి టెర్రస్ మీద ఉన్నాడు..
అక్కడికి రాగానే రోషన్ రోషినిని హత్తుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం థాంక్స్ ఫర్ కమింగ్ టూ అవర్ లైఫ్ అని చెప్పాడు.. అజయ్ విజయ్ కూడా చెరో వైపు హత్తుకొని బర్త్డే విషెస్ చెప్పాక.. వరుణ్ కూడా సైడ్ హగ్ చేసుకొని విష్ చేశాక కేక్ కటింగ్ అనంతరం అందరూ ఎంజాయ్ చేసి… రోషిని కోరిక మేరకు నిద్రపోకుండా అందరూ నైట్ బైక్ రైడింగ్ ఎంజాయ్ చేసి జానకి గారు చెప్పినట్టే పూజకి గంట ముందే ఇంటికి చేరుకున్నారు..
రోషిని ఆ రోజు జ్ఞాపకాల్లో ఉండగానే అది మేడం నాకు గుర్తొచ్చే మూమెంట్ సముద్రం చూడగానే అంటూ ప్రజెంట్ లోకి తీసుకొచ్చాడు అరుణ్..
నువ్వు అన్నయ్యలని బాగా అవాయిడ్ చేస్తున్నావ్ బావ అంది రోషిని… ఓహో మేడం నేను ఎంత ఫ్యామిలీ మాన్ ని అయినా మనకంటూ కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉండాలి… వాళ్లకి కూడా కొంచెం స్పేస్ ఇవ్వు లేకపోతే మీ వదినలు ఫ్యూచర్లో నిన్ను తిట్టుకోగలరు అన్నాడు… అలా ఇద్దరు స్వీట్ అండ్ హాట్ గా మాట్లాడుకొని ఇంటికి వెళ్దాం బావ మనమిద్దరమే వచ్చాం కదా ఇక్కడ వద్దు అని రోషిని బలవంత పెట్టడంతో తిరిగి వర్మ నిలయం చేరుకున్నారు ఇద్దరు…
వర్మ నిలయం చేరుకొని ఏమీ తెలియనట్టు ఎవరు గదలకు వాళ్ళు వెళ్లి పడుకున్నారు..
మరిసటి రోజు లోకల్ న్యూస్ పేపర్ అంతా వర్మ దంపతుల మ్యారేజ్ ఈవెంట్ విశేషాలతో నిండిపోయింది.. ఇప్పటివరకు నెక్స్ట్ తరం వారసుల గురించి మీడియాకు తెలియకపోవడంతో అది వాళ్ళకి పెద్ద అవకాశం అయింది…
లోకల్ న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్స్ అంతా ఈ ఫ్యామిలీ ఈవెంట్ గురించి మారుమోగించింది…
ఇవేమీ తెలియనని మన రోషిని పాప పూజ అనంతరం అందరికీ మస్కా కొట్టి రూమ్ లోకి వెళ్లి డీప్ స్లీప్ వేసింది… ఎర్లీ మార్నింగ్ ఏ వచ్చిన చుట్టాలంత టాటా బాయ్ బాయ్ చెప్పేయడంతో..
మిగిలిన వాళ్ళు తనని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆఫీసుకు వెళ్లిపోగా ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే నిన్న ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కూర్చుని.. వాళ్లకి కూడా వాళ్ల సర్కిల్లో తెలిసిన వాళ్ల నుంచి ఫోన్స్ వస్తూ ఉండడంతో అందరికీ బదులు చెబుతూ బిజీగా ఉన్నారు ఎవరికివారు..
సుప్రియ సుప్రియ అన్న అరుపుతో తన రూమ్ లో నుంచి బయటకు వచ్చింది సుప్రియ… మేడం గారు చదువు అయిపోయాక ఉద్యోగ ప్రయత్నాలు ఏమి చేయకుండా ఫ్రీ టైం ఎంజాయ్ చేయాలని ఇంట్లోనే ఉన్నారు…
డైలీ ఈ టైం కి ఆఫీస్ కి పరుగులు పెట్టే అమ్మానాన్న హాల్లో కూర్చొని తనని పిలవడం ఏంటో అర్థం గాక వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది…
ఏంటి నాన్న పిలిచారు అని అడిగింది,. మీ ఫ్రెండ్ రోషిని వాళ్ళ ఫ్యామిలీని నువ్వు కలిసావా అని అడిగారు.. ఆ కలిసాను నాన్న మా కాలేజీ మొదటి రోజు తన అమ్మానాన్న వచ్చారు… ఇంకా తన అన్నయ్యలు బావలు మా కాలేజీలోనే కదా చదివారు.. శ్రావ్యని కూడా తనే పరిచయం చేసింది తనకి కాబోయే వదినగా అని చెప్పింది సుప్రియ.. తను ఎవరో తెలుసా నీకు అని అడిగాడు… ఎవరు అంటే ఏం అడుగుతున్నారు నాన్న మీరు నాకు అర్థం కాలేదంది సుప్రియ… తన నాన్న ముఖంలో సంతోషం అమ్మ మొహంలో కన్ఫ్యూషన్ గమనించి..
దీనికి అర్ధగంట ముందు ఏం జరిగింది అంటే ఆఫీస్ కి రెడీ అయిన తన భర్త ఆఫీస్ కి బయలుదేరకుండా తీరుబడిగా న్యూస్ చూస్తూ ఉండడంతో ఏమైందండీ ఆఫీస్ కి బయలుదేరకుండా అలా ఉన్నారు అని అడిగింది సుప్రియ అమ్మ… నిన్న మా చైర్మన్ సార్ వాళ్ళ 50త్ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది కదా దానికి సంబంధించిన న్యూస్ వస్తుంటే చూస్తూ ఉన్నానని అదే రిపీటెడ్ గా వస్తుంటే తన భార్యకు కూడా చూపించాడు
స్టేజ్ పైన రోషిని ని చూసిన ఆమె… ఈ అమ్మాయి ఏంటి అక్కడ ఉంది అని అడిగింది… వాళ్ల మనవరాలు కాబట్టే అక్కడ ఉంది అయినా ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నావ్ అని తిరిగి అడిగారు ఆయన.
ఆ అమ్మాయి మన సుప్రియ ఫ్రెండ్ అండి ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది అని చెప్పిందామె… వాట్ తను మన సుప్రియ ఫ్రెండ్ నా.. తను ఎవరో తెలుసా మాకు కాబోయే చైర్మన్ అని మా ఆఫీసులో గుసగుసలాడుకోవడం నేను చాలా సార్లు విన్నాను అని చెప్పాడు అతను… లడ్డు కావాలా నాయనా అన్నట్టే ఎక్స్ప్రెషన్ పెట్టింది సుప్రియ అమ్మ… ఇంతలో సుప్రియ అని పిలిచాడు అతను..
అప్పుడే న్యూస్ మళ్లీ సుప్రియ కు చూపించి తిను నీ ఫ్రెండ్ నా అని అడిగాడు.. అవును తనే నా ఫ్రెండ్ అంది.. మళ్లీ తనే తన్నేంటి మా చైర్మన్ సార్ తో ఉంది అని అడిగింది … ఎందుకేంటి తను స్వయానా ఆయనకి మనవరాలు కాబట్టి…నీకు నువ్వు చదివిన కాలేజీలో సీటు ఎలా వచ్చిందో తెలుసా అని అడిగిన తండ్రికి తెలియదు అన్నట్టు తల ఊపింది సుప్రియ
మా ఎంప్లాయిస్ కోటలో మా చైర్మన్ సారు తీసుకుని నిర్ణయం వల్ల నీకు వచ్చిన ర్యాంకుకి అంత తక్కువ ఫీజులో నువ్వు అక్కడ చదువుకోగాలిగావు అన్నారు… బోనస్ గా ఆ కాలేజీ కాబోయే చైర్మన్ తోనే కలిసి చదువుకున్నవ్ అన్నారు…
వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు రిచ్ అనుకున్నాను కానీ కాలేజీ ఓనర్లని మనకి జీతం ఇచ్చే వాళ్ళని తెలియదు నాన్న అంది… నువ్వు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడిగింది సుప్రియని వాళ్ళ అమ్మ… తను మా అందరితో మామూలుగా కలిసిపోయి సరదాగా ఉన్నా వాళ్ళ ఇంటికి మాత్రం పిలవలేదు బహుశా ఆ నిజం అందరికీ తెలియకూడదు అనుకున్నారేమో అందుకే ఎప్పుడూ ఇంటికి పిలవలేదని చెప్పింది సుప్రియ..
(మొత్తానికి సుప్రియ కి రివీల్ అయింది ఇంకా ఎన్ని సర్ప్రైజులు ఉన్నాయో.. ముందు ముందు చదువుకుందాం)
ఆఫీసుకు వెళ్లిన జెంట్స్ అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే జూలరి కి సంబంధించిన ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయని మేనేజర్ అందరికీ మీటింగ్ ఇన్ఫామ్ చేశాడు…
మీటింగులో కూర్చున్న తర్వాత రఘురాం మేనేజర్ ని అడిగాడు ఎందుకు ఇంత అర్జంటుగా మీటింగ్ అరేంజ్ చేశారు అని..
సార్ జ్యువెలరీ కి సంబంధించిన ఆర్డర్లు బల్క్ గా వస్తున్నాయి.. అది కూడా ఇలాంటి సెట్స్ కి అంటూ.. నిన్న ఫంక్షన్ లో జానకమ్మ గారు వేసుకున్న లాంగ్ హారం అని న్యూస్ పేపర్ చూపించాడు వర్మ జ్యువలరీ సేల్స్ మేనేజర్…
అందరూ ఇలాంటి హారమే కావాలని అడుగుతున్నారు సర్ అది సేల్ కి రెడీగా లేదని చెప్పినా కూడా వినడం లేదు ఏం చేయాలో తెలియక మిమ్మల్ని మీటింగ్ కి పిలవాల్సి వచ్చింది.. లాస్ట్ మినిట్ లో ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి.. కానీ కష్టమర్స్ తో రిలేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సర్ అందుకే తప్పలేదు అన్నాడు మేనేజర్…
అక్కడ ఇంట్లో లేడీస్ ది కూడా అదే పరిస్థితి… సేమ్ డిజైనర్ తో మాకు కూడా అదే లాంటి హారం డిజైన్ చేసి ఇవ్వమని వాళ్ళ సర్కిల్లో వాళ్లకి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకే పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతున్నారు…
ఓకే మేనేజర్ గారు మన సైడ్ నుంచి హారం రెడీ అయ్యాక ఒక ప్రకటన రిలీజ్ చేస్తామని కాల్ చేసిన వాళ్ళకి చెప్పండి అని అప్పటికప్పటికీ డిసైడ్ చేసి చెప్పాడు రాఘవ్…
ఓకే సార్ అని అక్కడ నుంచి మేనేజర్ వెళ్ళిపోయాక.. అల్లుళ్లు కొడుకులు ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం చూసినా రాఘవ రఘురాం చంద్రలు… ఎందుకు నవ్వుతున్నారు అన్నట్టు అడిగారు…
ఆన్సర్ తెలిసి కూడా ప్రకటన ఇస్తామని చెప్తుంటే నవ్వు రాక ఏమొస్తుంది నాన్న అన్నాడు అరుణ్..
నేను మామయ్య తో మాట్లాడతాను అన్నాడు చంద్ర… అవసరమా నాన్న అన్నాడు రోషన్… ఇది బిజినెస్ కదా నాన్న ఏం కాదులే అన్నాడు భరోసాగా.. నేను మాత్రం అంత సాహసం చేయలేను అన్నాడు రఘురామ్… మేము కూడా మీ సైడే డాడ్ అన్నారు అజయ్ విజయ్ లు… మీరేంటి గోడ మీద పిల్లుల అన్నాడు రాఘవ్ వరుణ్ అరుణ్ లని…
అలా ఉంటేనే మా భవిష్యత్తుకు మంచిది మాకు పనుంది మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అంటూ అరుణ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు… వరుణ్ కూడా తమ్ముడిని ఫాలో అయిపోయాడు..
ఏదన్నా సాయంత్రం ఇంటికి వెళ్ళాక నాన్నతో డైరెక్ట్ గా మాట్లాడుకుందాం లే బావలు మీరు కూడా వెళ్లి పని చూసుకోండి అంటూ రాఘవ కూడా తన కాబిన్ కి వెళ్ళిపోయాడు..
ఏరా మీరైనా నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అన్నట్టు ముగ్గురు కొడుకులు వైపు చూసాడు చంద్ర.. డాడ్ ని చూసి తెలుసుకోండి నాన్న.. ఎలా తనకి సంబంధం లేదన్నట్టు సైడ్ అయిపోయారు మీరు ఎందుకు పులి నోట్లో తల పెడతారు అన్నారు ముగ్గురు…
వీళ్ళు ఎవరు గురించి మాట్లాడుకుంటున్నారో అసలు ఆ హారం కి సంబంధించిన కథ ఏంటో.. చంద్ర తన పనిలో విజయం సాధిస్తాడా లేదా..నెక్స్ట్ పార్ట్ లో చదువుకుందాం..https://thequriouslife.com/