ఆఫీసులో జరిగిన మీటింగ్ గురించి బ్రీఫ్ గా తన తండ్రికి మెసేజ్ పంపించాడు రాఘవ్.. ఇంట్లోనే ఉండి అటు ఆడవాళ్లు ఎక్సైట్మెంట్ చూస్తూ వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ రోషిని తనతో మాట్లాడిన మాటల గురించి గుర్తు చేసుకున్నారు వర్మ గారు..

ఒక పది రోజుల క్రితం  రోషిని తన ఫుల్ ఎఫర్ట్ అంతా పెట్టి తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తన అమ్మకి మాత్రమే డిజైన్ చేయాలనుకున్న స్పెషల్ హారాన్ని ఆ ఇంటికి మూలమైన జానకమ్మ గారికి స్పెషల్ గిఫ్ట్ గా వాళ్ల పెళ్లి రోజు కానుకగా ఇవ్వమని వర్మ గారికి చూపించింది…

అది ఒక లాంగ్ హారం మూడు స్టెప్పుల్లో ఒక్కొక్క స్టెప్ కి లక్ష్మీ సరస్వతి పార్వతుల మూర్తులని ఎగ్జిక్యూట్ చేసి ఆ మూడు స్టెప్పులని కాసులతో కలిపింది…

ఇది మన ఇంట్లో వాళ్లకి తప్ప బిజినెస్ చేయడానికి వీలు లేదు తాతయ్య అని గట్టిగా చెప్పింది.. అప్పుడు అది వర్మ గారికి అర్థం కాకపోయినా నీ కోరిక ప్రకారమే ఇది మీ అమ్మమ్మకి గిఫ్ట్ చేస్తాను రా అన్నారు.. వాళ్ల మేకర్స్ లోనే ఎక్స్పర్ట్ అయినా ఒక అతని  ని పిలిపించి ఆ డిజైన్ చూపించి ఇంచ్ కూడా మార్పు లేకుండా చేయమని చెప్పడం తను ఎంతో జాగ్రత్తగా చేసి వర్మ గారికి ఇవ్వడం అది పెళ్లి రోజు జానకమ్మకి బహుకరించడం ఆమె అది వేసుకోవడంతో స్టేజి మీద నిండుగా కనిపించారు జానకి గారు అందరి కళ్ళకి..

ఆవిడ కోసం ఫ్యాషన్ డిజైనింగ్ లో తను నేర్చుకున్న మెలకువలు అన్ని ఉపయోగించి పట్టుచీర డిజైన్ కలర్ కాంబినేషన్ పై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది శ్రావ్య.. దానికి తగినట్టే రోషిని ఇన్ని రోజులు తను నేర్చుకున్న మెలకువలని అన్నిటిని రంగరించి ఎంతో నేర్పుగా ఒక నగైనా హెవీగా ఉండేలా డిజైన్ చేసింది…అవన్నీ తలుచుకొని నవ్వుకున్నారు వర్మ గారు..

మరుసటి రోజు న్యూస్ పేపర్ చూస్తున్న అందరికీ జానకమ్మ డ్రెస్సింగ్ స్టైల్ అలాగే వేసుకున్న గోల్డ్ ఒక హాట్ టాపిక్ అయిపోయింది.. ఎంతైనా బంగారం షాపు ఓనర్లు కదా ఆమాత్రం ఉంటుంది అని కూడా అనుకున్నారు.

ఇవేమీ తెలియని మన రోషిని పాప మధ్యాహ్నం వరకు హ్యాపీగా స్లీప్ వేసి అదేపనిగా మోగుతున్న ఫోన్ సౌండ్ కి కళ్ళు తెరిచింది.. లిఫ్ట్ చేసి హలో అనగానే.. బంగారం ఇంకా నిద్ర లేవలేదా వెళ్లి తిని మళ్ళీ వచ్చి పడుకో రా కావాలంటే అన్నాడు రోషన్..

అన్నయ్య అంది రోషిని.. నో మోర్ డిస్కషన్.. నువ్వు వెళ్తావా రంగి ఆంటీ ని పైకి పంపమంటావా అన్నాడు రోషన్.. వద్దులే నేనే ఫ్రెష్ అయ్యి వెళ్తాను అని చెప్పింది అలా అయితే ఇంకో హాఫ్ అవర్ రెస్ట్ తీసుకోవచ్చు అని.. తన ఆలోచన తెలిసినట్టే.. నేను నీ సంగతి తెలిసే అందరి లంచ్ కంప్లీట్ అయ్యాక ఇంకా హాఫ్ ఎన్ అవర్ ఎక్స్ట్రా వెయిట్ చేసి మరి కాల్ చేస్తున్నాను బుజ్జి… వెళ్లి తినేసి మళ్ళీ నాకు కాల్ చేయి అని చెప్పి కట్ చేశాడు రోషన్..

అన్నయ్య మాటల్ని వేద వాక్కుల భావించే మన రోషిని.. రోషన్ చెప్పినట్టుగానే టూ మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది..

హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న అమ్మమ్మని అత్తని అమ్మల్ని చూసి.. తన కోసమే ఎదురు చూస్తున్న రంగి తో అందరూ తిన్నారా అంటి అని అడిగింది.. అందరూ తినేసారు బుజ్జి నువ్వే లేటు దా తిను అంటూ వడ్డించగా.. ఎవరు లేకపోవడంతో లైట్ గా తిని ఎస్కేప్ అయిపోవచ్చు అనుకుంటూ ఉండగా.. వచ్చావా అంటూ కుందన వచ్చి ప్లేట్ చేతిలోకి తీసుకుంది తినిపించడానికి..

అన్నయ్య ఫోన్ చేశాడు గా అంటూ తినడానికి నోరు తెరుస్తూ రత్నం వైపు చూసి ఏంటి మీ చెల్లి నా వైపు గుర్రు గా చూస్తుంది.. ఎందుకు అంది రోషిని.. నిన్ను లేపడానికి ఇప్పటికే రెండుసార్లు ని రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టింది అయినా నువ్వు నిద్ర లేవలేదు.. అన్నయ్య కాల్ చేయంగానే లేచి వచ్చావు కదా అదే విషయాన్ని అన్నయ్య ల్యాండ్ లైన్ ఫోన్ చేశాడు.. నువ్వు లేచి భోజనానికి వస్తున్నావని అందుకే ఆ కోపం అని చెప్పింది కుందన చిన్నగా..

ఆ మీ చెల్లికి నన్ను కోపగించుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి అందులో ఇదొకటి లైట్లే.. అంటూ తినేసి అందరూ వెళ్లిపోయారా ఇల్లంతా బోసిగా ఉంది అని అడిగింది.. అందరూ నీకు సాయంత్రం కాల్ చేస్తా అని చెప్పమన్నారు అని కూడా చెప్పింది కుందన..

ఆ వెధవ ఆఫీసుకి వెళ్ళాడా ఊరికి వెళ్ళాడా అని అడిగింది.. వెధవ ఏంట్రా బుజ్జి అలా అనొచ్చా.. ఇది రత్న వినాలి మళ్లీ నీకు కోటింగ్ పడుతుంది అంది నవ్వుతూ.. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అర్థమైందా ఇంకెవరి గురించి మన రాజు గురించే..

ఏమోరా నేను అంత స్పెసిఫిక్ అడగలేదు మరి నువ్వే కాల్ చేసి అడుగు అంది.. నేను వాడికి కాల్ చేయను వెధవ ఏది నేను చెప్పిన మాట వినడం లేదు అంది..

ఆ. అందరూ నువ్వు చెప్పినట్టే వింటారు మరి పెద్ద దిగొచ్చింది యువ రాణి అంది రత్న.. హాల్లోనించే గట్టిగా.. అప్పటికే తినడం అయిపోయిన రోషిని హాల్లోకి వచ్చి తన అమ్మమ్మ దగ్గర కూర్చుని.. ఏంటమ్మమ్మా మీ చిన్న కూతురు ఏదో అంటుంది అంటే నేను యువరాణిని కాదా మరి..అంది..

హాల్లోకి వచ్చి తన అమ్మమ్మ పక్కన కూర్చుని.. ఏంటమ్మమ్మా నీ చిన్న కూతురు నా పోస్ట్ పీకేస్తున్న కూడా నువ్వేమీ నాకు సపోర్ట్ చేయట్లేదు నువ్వు కూడా నీ చిన్న కూతురు పార్టీయేనా అని అడిగింది రోషిని..

నేను మాత్రం ని పార్టీనే కోడలా నువ్వే ఈ ఇంటికి ఎప్పటికీ యువరాణివి కాబోయే మహారాణివి అంది రాధిక.

చూసావా అంటూ లేని కాలర్ ఎగరేస్తూ రత్న వైపు చూసి.. ఇంకేంటి విశేషాలు కొత్త పెళ్లి కూతురా అని అడిగింది జానకమ్మని… మీ అమ్మమ్మ హాట్ టాపిక్ ఈరోజు సిటీలో అంది రాధిక…

హాయ్ హాయ్ అవునా ఎందుకనో అని అడిగింది.. ఇంకెందుకు మా అత్తయ్య డ్రెస్ కి నగల కి అందరూ ఫిదా మార్నింగ్ నుంచి అందరూ ఒకటే కాల్స్…అంది రాధిక

అందుకే విసుగు వచ్చి అందరం ఫోన్ లు సైలెంట్ లో పెట్టేసాం అంది కుందన..

మనం ఫంక్షన్ హాల్లో చేసాం కాబట్టి సరిపోయింది.. అదే ఇంట్లో చేసుంటే పరిస్థితి ఏంటి అంటారు అంది రోషిని..

ఏముంది ఇంటీరియర్ డిజైనర్స్ గా మీ అత్త మామ్ లు కొత్త ఆఫీస్ ఓపెన్ చేయాల్సి వచ్చేది అంది రత్న..

ఎందుకలా అనిందంటే రోషిని పుణ్యమా అంటూ ఆఫీస్ కి వెళ్లే పని లేకుండా అలానే ఖాళీగా కూర్చోలేక.. వర్మ నిలయానికి కొత్త హంగులు అద్దడంలో బిజీ అయ్యారు వదిన ఆడపడుచులు.. ఆ ప్రాసెస్ లోనే.. బెస్ట్ కలర్ కాంబినేషన్ ఇంటీరియర్ డిజైనింగ్… పెద్ద పెద్ద శాండలర్స్.. తో పాటు ఇంపోర్టెడ్ షో పీసెస్ తో ఫుల్లుగా ఇంటిని ఆధునికరించారు… ఫర్నిచర్ ని కూడా ఫుల్లుగా మార్చి మొత్తానికి ఇంటికి ఒక కొత్త కళను తీసుకురావడంలో విజయం సాధించారు..

అవన్నీ తలుచుకొని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా పైన రోషిని ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంది సుప్రియ నుంచి.. కానీ అదేమీ తెలియని మన రోషిని పాప ఇక్కడ ఇంట్లో వాళ్లతో ఆనందంగా మాటల్లో పడింది..

వీళ్ళ మాటలు విని ఆఫీసు రూమ్ లో నుంచి అక్కడికి వచ్చారు వర్మ గారు… ఫోన్ కాల్స్ ఆగిపోయాయి అన్నారు వర్మ గారు.. లేదు మావయ్య మేమే వాటి పీక నొక్కి సైలెంట్లో పెట్టామంది రాధిక..

ఇప్పుడే ఇలా ఉంటే రేపు పిల్లల్ని సొసైటీకి పరిచయం చేశాక.. వాళ్లకి వచ్చే పెళ్లి ప్రపోజల్స్ ని ఎలా తప్పించుకుంటారు అన్నారు వర్మ గారు నవ్వుతూ.. ఆ బాధ లేదు కదా ఆల్రెడీ సెట్ అయిపోయాయని చెప్పొచ్చుగా నాన్న అంది కుందన..

ఆఫీస్ నుంచి అబ్బాయిలు వచ్చాక ఈరోజు నేను మీ అందరితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు వర్మ గారు..

దాంతో రోషిని ఏదో సెన్స్ చేసి అలాగే అని తల ఊపింది…

ఏదో పని ఉండి పైకి వెళ్లిన రంగి రోషిని ఫోన్ తీసుకుని వచ్చి బుజ్జమ్మ నీ ఫోన్ అదే పనిగా మోగుతుంది ఎవరో చూడు అంటూ రోషన్ చేతిలో పెట్టింది…

అది సుప్రియ నుంచి కావడం అలాగే చాలా మిస్డ్ కాల్స్ తన క్లాస్మేట్స్ నుంచి ఉండడంతో ఫోన్ అటెండ్ చేయకుండా పెట్టి.. తల పట్టుకుని కూర్చుంది..

ఏమైంది అన్నారు అందరు ఒకేసారి.. నిన్న జరిగిన ఫంక్షన్ వీడియో కవరేజ్ గురించి నేను మర్చిపోయాను తాతయ్య… ఇప్పుడు మా క్లాస్మేట్స్ అందరికీ నేను అ ఈవెంట్ లో మీతో ఎందుకు ఉన్నానో తెలిసిపోయింది కదా… అంటే ఆల్మోస్ట్ నేనెవరో అందరికీ కన్ఫామ్ అయిపోయింది కదా అంది… అయితే ఏమైంది అది ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా అంది జానకమ్మ…

నా ద్వారా తెలిసి ఉంటే వేరేలా ఉండేది కదా అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళంతట వాళ్లకి తెలిసిపోయింది అదే నాకు కొంచెం గిల్టీ గా ఉంది అంది రోషిని…

పలుకుబడి ఉన్న తాతయ్యతో పాటు అందమైన అన్నయ్య లు ఉండడం కూడా ప్రాబ్లం ఏ తెలుసా అమ్మమ్మ అంది… ఏమోనే నాకు దాని గురించి పెద్ద పరిచయం లేదంది జానకమ్మ…

అమ్మమ్మ ఈ టైంలో జోకులేసావంటే… నువ్వు తింటున్న స్వీట్లు లెక్క నీ కూతుళ్ళకి కోడలికి చెప్తాను జాగ్రత్త అంది…

ఇది మరీ బాగుంది నన్ను అంటావేంది అంది జానకమ్మ…

ఇప్పుడు మీ అన్నయ్యల గురించి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగింది రత్న…