అందమైన అన్నయ్యలు ఉండడం ఎంత ప్రాబ్లమో నీకేం తెలుసు నన్ను అడుగు నేను చెప్తాను అంది రోషిని.. అప్పుడే అక్కడికి వచ్చిన రంగి నాకు చెప్పమ్మా నేను వింటాను అంది… నువ్వు ఒకదానివే అది తానా అంటే నువ్వు తందానా అంటావ్ అంది రత్న… ఊరుకొండమ్మ అమ్మాయిగారి మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయి అంది రంగి.. వీళ్ళు ఇలాగే మనల్ని డిస్టర్బ్ చేస్తారు కానీ మీరు చెప్పండి అమ్మ అన్ది…
చెప్తాను కానీ దానికంటే ముందు నేను ఒకటి కన్ఫామ్ చేసుకోవాలి అత్త నువ్వు నిజం చెప్పు.. మామయ్య కోసం మామ్ తో ఫ్రెండ్షిప్ చేసావా మామ్ తో ఫ్రెండ్షిప్ చేశాక మావయ్యను ప్రేమించావా అని అడిగింది..
అంతలేదు మీ మామయ్య నా వెనక పడ్డాడు అంది రాధిక.. ఏంటి చర్చ మా గురించే జరుగుతున్నట్టు ఉంది అన్నాడు రాఘవ్ అప్పుడే అక్కడికి ఆఫీస్ నుంచి రావడం తో…
మీ కోడలు మీ విన్యాసాల గురించి అడుగుతుంటే చెప్పబోతున్నాను ఇంతలో మీరు వచ్చారండి అంది రాధిక…
అంతగా ఏమి అడుగుతుంది రా చిట్టితల్లి అన్నాడు రఘురాం.. మీ బావ గారు లవ్ స్టోరీ కావాలంట అన్నయ్య అంది రాధిక.. మీరు చెప్పండి డాడ్ మీరైతే రెండు సైడ్ల కవర్ చేస్తారు అంది రోషిని…
వాడు ఏం చెప్తాడు దొంగ వెధవ మీ మామ్ నుండి తప్పించుకోవడానికి నన్నే సలహాలు అడిగేవాడు.. ఇక మీ మామ్ ఏమో చేసుకుంటే ఈయనగారే చేసుకుంటానని మంకు పట్టి కూర్చుంది…
ఇక మీ అత్త ఏమో నా ప్రపోజల్ ని కూర్లో కరివేపాకు తిసినట్టు తీసేసింది… ఒకపక్క మీ అత్తయ్యనీ ఒప్పించుకుంటూ మీ డాడీని మా చెల్లిని లవ్ చేయరా అని బతిమిలాడుకుంటూ… నే నా కాలేజీ లైఫ్ నాకే తెలియకుండా అయిపోయింది అన్నాడు దీనంగా రాఘవ్…
పూర్ మావయ్య ఇక్కడ మామ్ విక్టిమ్ అనుకున్న కానీ రివర్స్లో మీరు బాధితుడు అయ్యారా..
సేమ్ నావి కూడా మీ కష్టాలే మావయ్య… అందమైన అన్నయ్యలు బావలు ఉండడం ఎంత పాపమో తెలుసా… ఎవరితో నైనా ఫ్రెండ్షిప్ చేయాలంటేనే నాకు చిరాకు వచ్చింది తెలుసా…
దొంగ మొహాలు ఒకటి రెండు రోజులు నాతో బాగా మాట్లాడి.. తర్వాత మీ అన్నయ్య నెంబర్ ఇవ్వవా మీ బావ నెంబర్ ఇవ్వవా నేను ట్రై చేసుకుంటా అని నాకే చెప్తున్నారు…
నా కాలేజీ లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళు తప్ప ఎవ్వరూ లేరు మామయ్య అని రోషిని చెప్తూ ఉండంగానే ఇంకొకసారి సుప్రీయ నుంచి కాల్ వచ్చింది…
ఈవిడ గారు కూడా మీ రెండో కోడలు కావాలని బాగా తహతహలాడుతుంది డాడ్ ఏం చెప్పమంటారు అంది రోషిని… ఇంతలో వెరీ సారీ తెలియకుండా నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అన్న మెసేజ్ కూడా పెట్టింది సుప్రియ… ఆ మెసేజ్ కూడా అందరికీ చూపించి చూశారా ఇప్పటివరకు ఒక టార్చర్ అంటే ఇక మీదట ఇలాంటి టార్చర్ మొదలు…
నాకు ఏం చేయాలో తెలియడం లేదు తాతయ్య అంది వర్మ గారి పక్కన కూర్చుంటూ…
ఇంతలో యంగ్ బ్యాచ్ కూడా అక్కడికి రావడంతో ఏంటి ఏదో చర్చ కార్యక్రమం వాడి వేడిగా జరుగుతుంది అన్నాడు అరుణ్… నీకు వచ్చిన ప్రపోసల్స్ గురించి చెప్తుంది సుపుత్ర మా కోడలు అన్నాడు రాఘవ్..
అవునా నాన్నా నాకు అన్ని ప్రొపొసల్స్ వచ్చాయా అన్నాడు అరుణ్ సిగ్గుపడుతు…
రేయ్ మెలికలు తిరగడం ఆపు చూడలేక చస్తున్నామన్నాడు రోషన్… మీకెంతయినా కుళ్లు లే బావ నేనంటే అన్నాడు… కుళ్ళు నిన్ను చూసే అన్నట్టు లుక్కారు అజయ్ విజయ్లు…
ఈ విషయంలో సుచి ఎంతైనా నా సేవియర్ అన్నాడు వరుణ్.. ప్రపంచం మునిగిపోతున్న కూడా సుచి అంటూ కలవరిస్తూనే ఉంటారు కదా పెదబాబు అంది రంగి.. దాంతో అందరూ ఉదయం నుంచి పడ్డ టెన్షన్ వదిలేసి హాయిగా నవ్వుకున్నారు…
ఓకే అందరూ వెళ్లి ఫ్రెష్ అయ్యి త్వరగా ఇక్కడికి వచ్చేయండి మీ తాతయ్య ఏదో మీతో మాట్లాడాలంట అన్నారు జానకి గారు..
నేను కూడా మీరు వచ్చే లోపల వేడివేడి పకోడీ పట్టుకొస్తానని రంగి కూడా కిచెన్ లోకి వెళ్లిపోయింది…
చెప్పినట్టుగానే ఎవరి గదులకు వాళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి 15 నిమిషాల్లో మళ్ళీ తిరిగి అంతా ఒక దగ్గర చేరుకున్నారు…
మావయ్య గారు ఏం మాట్లాడినా తను ఏమనుకున్నాడో దాని గురించి రోషిని ని ఎలా ఒప్పించాల అని ఆలోచనలో ఉన్నాడు చంద్రు…
అందరూ ఆయనకేసి చూస్తూ ఉండడంతో ఒక్క సారి దీర్ఘంగా శ్వాస తీసుకుని నా తర్వాత తరం వారసులు కి బాధ్యతల్ని అందించి వాళ్ళని బిజినెస్ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నట్టు తన నిర్ణయాన్ని చెప్తూ మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పచ్చు అన్నట్టు కూతుర్లు కోడలు అల్లుళ్లు కొడుకు వైపు చూశారు..
ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నారు ఆరుగురు ముక్తకంఠంతో..
అయితే నేను అనుకుంటున్న ది కూడా వినండి.. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి ఎండిగా రోషన్ ని.. టెక్స్టైల్స్ కి ఎండిగా మన వరుణ్ ని… హోటల్స్ అలాగే మాల్కి ఎండిగా అజయ్ ని కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండిగా విజయ్ ని.. సాఫ్ట్వేర్ వింగ్ కి ఎండిగా అరుణ్ణి నియమించి చైర్మన్గా,, వర్మ జ్యువెలర్స్ కి ఎండిగా రోషిని ని అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మీ ఆరుగురిని నియమించదల్చుకున్నాను అని చెప్పారు వర్మ గారు..
ఇప్పటికీ మనకి సీఈవో అవసరం లేదని అనుకుంటున్నాను.. మీ అందరి పెళ్లిళ్లు అయిపోయాక మీ జీవిత భాగస్వాముల మధ్యలో మన వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే సీఈఓ ఎవరు అనే నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు..
నాన్న చైర్మన్ అంటే చిన్న విషయమా అంత పెద్ద బాధ్యతని రోషిని అప్పుడే మోయగలదని మీరు అనుకుంటున్నారా అంది రత్న.. తను మోయగలదని నేను నమ్మాను కాబట్టే ఆ బాధ్యతని తనకు అప్పగించాలనుకుంటున్నాను.. ఒకవేళ తను మోయలేని పరిస్థితులే ఉంటే మిగతా ఐదుగురు ఏం చేస్తూ ఉంటారు తనకి తెలియని విషయాలు చెబుతూ తనని ముందుకు నడిపించుకుంటారులే .. ఆ విషయంలో నువ్వేమీ దిగులు పడకు అన్నారు..
రోషినికి తోడుగా తన నాన్న డాడ్ మామయ్యలు ఇకమీదట వర్మ జ్యువెలర్స్ లోనే వర్క్ చేస్తారు.. సైనింగ్ అథారిటీ మాత్రమ్ రోషినికే ఉంటుందని చెప్పారు..
రోషిని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కంప్లీట్ గా అంచనా వేసిన రోషన్ అరుణ్లు మాత్రం తాత గారి నిర్ణయానికి ఎదురు చెప్పలేక అప్పటికీ ఊరుకున్నారు.. ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నాదే కాబట్టి ఆ క్షణం తనకి కూడా ఎదురు చెప్పాలి అనిపించక రోషిని కూడా ఊరుకుంది..
కాసేపు అందరూ ఫ్యామిలీ విషయాలు గురుంచి ఆరోజు వాళ్ళ దినచర్య వరకు అన్ని విషయాలు చర్చించుకుని డిన్నర్ ముగించుకుని ఎవరి గదులకు వాళ్ళు చేరుకున్నారు.. రోషినికి మాత్రం ఎంతకీ నిద్ర పట్టక ఒక అర్థగంట తర్వాత వెళ్లి అమ్మానాన్నల గది తలుపు తట్టింది…
ఏమి మాట్లాడకుండా రోషిని వెళ్లి తన అమ్మానాన్నల మధ్యలో పడుకొని.. కాసేపు మౌనం తర్వాత మీరెందుకు ఏమీ చెప్పలేదు నాన్న తాతయ్య నిర్ణయాన్ని అలాగే అంగీకరించారు ఎందుకు అని అడిగింది.. నువ్వెందుకు ఏమీ మాట్లాడలేదు మరీ అని అడిగింది రత్న.. నేను మాట్లాడటం మీరు మాట్లాడటం ఒకటేనా అమ్మ అంది రోషిని..
ఎవరు మాట్లాడిన ఉపయోగం లేదని తెలిసి ఎందుకు మాట్లాడడం నాన్న అన్నాడు చంద్ర.. నాకేంటో సడన్గా ఊపిరాడని ఫీలింగ్ వస్తుంది నాన్న.. ఇన్ని రోజులు గడిచిన నాకెందుకో మన ఊరు మన ముగ్గురం మన తోట మన ఇల్లే బాగుండేవి అనే ఫీలింగ్ మాత్రం వీడడం లేదు నాన్న.. అంది రోషిని.. విల్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే.. రోషిని రూమ్ కి వెళ్ళిన రఘురాం కుందనలకి తను అక్కడ లేకపోవడం అలాగే ఎక్కడ ఉంటుందో అని తెలియడంతో నేరుగా వచ్చి తమ్ముడు గది తలుపు తట్టాడు రఘురాం..
రత్న వెళ్లి డోర్ తీశాక.. అక్క చెల్లెలు ఇద్దరు సోఫాలో సెటిల్ అయితే రఘురాం వెళ్లి బెడ్ మీద కూర్చుని రోషిని కాళ్ళని తన ఒడిలో పెట్టుకున్నారు.. చంద్రు ఒడిలో పడుకొని ఉన్న రోషిని వెంటనే లేచి తల రఘురామ్ ఓడిలో పెట్టి కాళ్లు మాత్రం చంద్ర ఒడిలో పెట్టింది..
తాతయ్య నిర్ణయం గురించి ఫీలవుతున్నావా అన్నాడు రఘురాం.. ఫీలవుతోంది నిజమే కానీ దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలా అనే మోటివేషన్ కూడా నాకు కావాలి అని కూడా ఆలోచిస్తున్నానని చెప్పింది రోషిని.
రూమ్ కి వెళ్ళిన వెంటనే రాధిక మామయ్య గారి నిర్ణయాన్ని మీరు మనస్పూర్తిగా అంగీకరించార అని రాఘవని అడిగింది.. నాకు ఎటువంటి అభ్యంతరం లేదనే విషయం నీకు కూడా తెలుసు అయినా ప్రత్యేకంగా అడిగావంటే నీకేమైనా అభ్యంతరం ఉందా అని తిరిగి అడిగారు ఆయన..
నాకు మామయ్య గారు నిర్ణయం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు కానీ.. అబ్బాయిలందరికీ ఎండి పోస్టు మాత్రమే ఇచ్చి రోషినికి అదనపు బాధ్యతను కూడా పంచారు కదా ఇప్పటికే తను.. పరిస్థితుల్ని కష్టంగా అర్థం చేసుకొని అంగీకరిస్తుంది చాలా విషయాలు తను కాంప్రమైజ్ అవుతుంది.. చిన్న చిన్న విషయాల్లో తన ఇష్టాల్ని ఎప్పుడో వదిలేసి కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసింది.. ఈ బాధ్యతను కూడా కుటుంబం కోసమే తీసుకుంటుంది తప్ప తన మనస్ఫూర్తిగా అంగీకరించదు… అదే నాకు కొంచెం బాధగా ఉంది అనింది రాధిక… నాన్న చెప్పారు కదా మేము తన బాధ్యతని పంచుకోవాలని.. ఒకసారి తనకి పెళ్లయ్యాక తన బాధ్యతల్ని కూడా నీ చిన్న కొడుకు ఇష్టంగా మోస్తాడులే అని సర్ది చెప్పి తన భార్య సంకోచాన్ని దూరం చేసాక ఆనందంగా నిద్రకు ఉపక్రమించారు ఇద్దరు..తమ నిర్ణయాన్ని కుటుంబం ముందు ఉంచి వాళ్ల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకపోవడంతో ఆనందంగా నిద్రపోయారు వర్మ దంపతులు
రోషన్ వరుణ్ విజయ్ లు తమ ప్రియ సఖులు తో రొమాంటిక్ టాక్స్ లో బిజీగా ఉంటూ తమ తాతయ్య తీసుకున్న నిర్ణయం గురించి కూడా చెప్పేశారు.. అరుణ్ మాత్రం మా బావల అన్నయ్య పనే బాగుంది దూరంగా ఉన్న వాళ్లతో కనీసం ఫోన్లైన మాట్లాడుకొని సంతోష పడుతుంటారు.. కానీ నేను ఒక ఇంట్లో ఉండి కూడా మాట్లాడలేను ఇటు ఫోన్లో కూడా మాట్లాడలేను ఇప్పుడు మేడం గారు కచ్చితంగా పెదమామా రూమ్ లోనో చిన్నమామ రూమ్ లోనో ఉండుంటారు.. లాభం లేదు టైం చూసుకొని ఒక నెల రోజులు ఏదో ఒక ఐలాండ్ కి నిన్ను కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లాలి అప్పుడు గాని నేను మనస్ఫూర్తిగా నీతో మాట్లాడుకోలేను అని అనుకొని తన ఆలోచనకి తనే నవ్వుకొని తప్పక నిద్రకి ఉపక్రమించాడు అరుణ్… తన నిర్ణయంలో తనకే క్లారిటీ లేక ఇంకా సింగిల్ చింతకాయ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అజయ్ ఎప్పుడో దుప్పటి తన్ని నిద్రపోయాడు…
మామయ్య నిర్ణయం కష్టంగా ఉందా బంగారం అన్నాడు రఘురాం.. మామయ్య ఇప్పటికి నీకు ఇచ్చిన మాటకి కట్టుబడే ఉన్నాడు అందుకే తెలుసా ఆ హారం కి ఎన్ని ఆర్డర్స్ వచ్చినా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయమని చెప్పలేదు నిర్ణయం నీదే కావాలని ఆయన అనుకున్నారు.. అన్నాడు చంద్ర..
వ్యాపారంలో కష్టమర్సే దేవుళ్లు.. వాళ్ల సాటిస్ఫాక్షన్ మనకి ముఖ్యంగా ఉండాలి.. అది మామయ్య గారు బాగా వంట పట్టించుకున్నారు కాబట్టే ఇన్ని రోజులు వ్యాపారాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా.. తెలిసినవి నలుగురితో పంచుకుంటూ తెలియనివి తెలుసుకుంటూ సాఫీగా సాగించారు..
ఇప్పుడు తెలివిగా బాల్ మీ కోర్టులో వేసేసారు.. అయినా బాధ్యతల నుంచి మా బుజ్జి తల్లి ఎప్పటినుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది.. ఇందుకేనా నిన్ను నువ్వు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి స్ట్రాంగ్ గా మలుచుకుంది కాదు కదా సవాళ్లని స్వీకరించడంలోనే మన స్ట్రెంత్ ఉంది.. సో చీరప్ బంగారం.. వీటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో.. మన బాధ్యతల్ని మనం సక్రమంగా నెరవేర్చుదాం అని హితబోధ చేశారు రఘురాం చంద్ర లు..
తన మనవల్లని కూడా కాదని మనవరాల్ని నాన్న గారు ఎంచుకున్నప్పుడే ఆయన కి నీ మీద ఉన్న నమ్మకం ఎటువంటిదో అర్థం చేసుకో బుజ్జి అంది కుందన..
నువ్వు నీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలవని నాన్నతో పాటు మేమంతా కూడా నమ్ముతున్నాం.. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకుండా బాధ్యతల్ని స్వీకరించడానికి నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకో.. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా నిద్ర పొమ్మని చెప్పి ఆ రూమ్ నుంచి తమ రూమ్ కి వెళ్ళిపోయారు రఘురాం కుందనలు..
అమ్మ నాన్నలు ఇద్దరు మనసుకి ఊరట కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటే మెల్లిగా నిద్రలోకి జారుకుంది రోషిని.. తర్వాత రత్నాచంద్రులు కూడా అలసిన మనసులతో నిద్రలోకి జారుకున్నారు..