మరుసటి రోజు అందర్నీ నిద్రలేపే సూర్యుడు కంటే ముందరే వర్మ నిలయం మేలుకుంది… మగవాళ్లంతా బయట గార్డెన్ లో వాకింగ్ లో ఉంటే.. ఆడవాళ్లంతా పూజ గదిలో వంట గదిలో ఉంటే.. అబ్బాయిలంతా జిమ్ రూమ్లో చెమటలు చిందిస్తుంటే అరుణ్ మాత్రం మెల్లిగా చిన్న మామ గదిలోకి దూరి ముద్దుగా నిద్రపోతున్న రోషిని ని చూసి… తన నిద్రకి ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా తన రెండు చేతుల్లో రోషినిని ఎత్తుకొని.. డాబా మీదకు వెళ్లాడు…
అక్కడ జిమ్ లో అరుణ్ మిస్ అవ్వడంతో నలుగురు జోకులు వేసుకుంటూ వర్క్ అవుట్స్ చేస్తూండగా.. ఏంటి బావ ఎక్కడ మీ తమ్ముడు అన్నాడు అజయ్.. వాడి పాట్లు ఏవో వాడు పడుతుంటాడు లేరా మీకెందుకు మీరు కానివ్వండి అన్నాడు వరుణ్..
ముందు మీ అన్నయ్య సంగతి చూసుకోండి బంగారం కి ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఆ త్రెడ్ మిల్ ని పరిగెత్తిస్తున్నాడు అన్నాడు… ఎందుకన్నయ్య అంత తొందర ఇప్పుడు వాడు రోషిని ని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడో మనకు తెలుసు కదా వర్క్ అవుట్ అయిపోయాక నేరుగా అక్కడికే వెళ్దాం కంట్రోల్ అన్నాడు విజయ్…
నేను ఆలోచిస్తుంది బంగారం ని ఎలా కంట్రోల్ చేయాలా అని.. ఎటు తాత ఏమో డెసిషన్ తీసేసుకున్నారు.. ఆ రోషిని మెంటల్ గా దానికి ఇంకా ఫిక్స్ అవ్వలేదు.. ఇప్పుడు మనం ఈ విషయం గురించి మాట్లాడిన తాతయ్య దగ్గర ఎంత కామ్ గా ఉందో మన దగ్గర అంత వైలెంట్ అవుతుంది దాని గురించే ఆలోచిస్తున్నానన్నాడు రోషన్…
అబ్బా మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు రా అలా ఏం కాదు మనం వెళ్లే లోపల అరుణ్ గాడు రోషిని ని ఒప్పించేస్తాడు చూడండి అన్నాడు వరుణ్.. నీ తమ్ముడు మీద ఎంతైనా నీకు భలే నమ్మకం బావ అయినా ఈసారి అదే జరగాలని నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు అజయ్…
ఇంకా నిద్ర పోతున్న రోషినితో ఏంటి చిన్ను ఈరోజు ఇంకా నిద్ర పోతున్నావ్ ఆల్రెడీ పూజ టైం కూడా అయిపోయింది అమ్మమ్మ చేతిలో బడిత పూజ చేయించుకోవడం అవసరమా నీకు అన్నాడు తన బుగ్గ మీద తట్టి నిద్ర లేపుతూ…
నేను ఇప్పుడే పడుకున్నాను అప్పుడే నిద్ర లేపుతావేంటి అన్న రోషిని తో అంటే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చున్నావా అన్నాడు అరుణ్…
ఆ ఒక్కటే గా నేను ఫ్రీగా చేయగలిగేది వేరే ఇంకా ఏదైనా నా చేతుల్లో ఉందా చెప్పు అంది రోషిని నిద్రలోనే..
అబ్బ చిన్ను మళ్లీ మొదటికి రాకు.. ఇంత ఆహ్లాదకరమైన ఉదయాన్నే ఏకాంతాన్ని నీరు కారుస్తున్నావేంటే అని వాపోయాడు అరుణ్…
నీకు మాత్రం ఏకంతాలు కావాలి నాకు మాత్రం అక్కర్లేదా అంది రోషిని.. హాలిడేస్ వచ్చాయని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయగా ఎగురుకుంటూ జైపూర్ వెళ్లి మీ కంట్లో పడ్డాను అంది రోషిని ఉక్రోషంగా… చిన్ను జరిగిపోయిన వాటి గురించి ఎందుకురా జరగాల్సిన వాటి గురించి ఆలోచించొచ్చు కదా అన్నాడు అరుణ్…
అప్పటికే పూర్తిగా మెలకువ వచ్చిన రోషిని ఏంట్రా ఆలోచించేది ఏంటి ఆలోచించాలి… ఎక్కడో నా పాటికి నేను జాలిగా ఉంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసారు… అది చాలదన్నట్టు ఇప్పుడేమో సొసైటీకి మీడియాకి ఇంట్రడ్యూస్ చేస్తారంట… అయిపోయింది అంతా అయిపోయింది ప్లాస్టిక్ నవ్వులు ప్లాస్టిక్ మొఖాలు ఎప్పుడు చూడు పక్క వాళ్ళ కోసం బతకాలి నావల్ల కాదురా ప్లీజ్ అర్థం చేసుకొని తాతయ్యకి చెప్పచ్చు కదా అంది రోషిని…
కావాలంటే నీ వర్క్ కూడా నేను చేస్తాను కానీ రెస్పాన్సిబిలిటీస్ వద్దంటే తాతయ్య ఊరుకోరు బంగారం అర్థం చేసుకో అన్నాడు అరుణ్… ఆ అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? ఎంత పాపం నేను.. కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయినివ్వలేదు ఇప్పుడేమో కొద్ది రోజులు జాలిగా ఉందామంటే తీసుకెళ్లి ఆఫీసులో పడేస్తున్నారు.. మీరెవరు ఏమీ ఆలోచించరు గాని నేనే ఆలోచించాలా అంది అరుణ్ణి… నచ్చిన తిండి తినకూడదు నచ్చిన్న డ్రస్సులు వేసుకోకూడదు నచ్చినట్టు రెడీ అవ్వకూడదు.. అది అలా చేయకూడదు ఇది ఇలా చేయకూడదు అబ్బ ఈ రెస్ట్రిక్షన్స్ నావల్ల కాదు… ఒకరోజు చెప్పా పెట్టకుండా ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోతాను చూడండి అంటూ ఉండగా బుజ్జి అనే అరుపు గట్టిగా అనిపించింది…
షిట్ అంటూ వెనక్కి తిరిగి చూశాడు అరుణ్… కోపంగా బాధగా ఉన్న రోషన్ మొఖం కనిపించి ఒక క్షణం గిల్టు ఫీల్ అయింది రోషిని కూడా…
బుజ్జి ఎందుకురా అలా మాట్లాడతావు పైన తధాస్తు దేవతలు ఉంటారని నానమ్మ చెబుతూ ఉంటుంది కదా మర్చిపోయావా అన్నాడు వరుణ్…
నీ తింగరి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాత్రం పెరగట్లేదు నీకు అన్నాడు అజయ్… నేను కూడా అదే కదా చెప్తున్నాను నాకు బుద్ధి లేదు అని అయినా ఎవరు వినరు ఏంటి అంది రోషిని ఉక్రోషంగా…
ఇంతలో రోషన్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని.. బుజ్జి ఇది మనం ముందు నుంచి అనుకుంటున్నాదే కదరా ఎందుకు నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అన్నాడు.. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్న నేను ఈ పొజిషన్ కి ఫిట్ కాదనే నా మనసు నాకు చెబుతుందన్నయ్య అంది రోషిని.. మన మోటివేషనల్ క్లాసెస్ తర్వాత పెట్టుకుందాం గానీ పూజకే టైం అయింది మనమంతా ఫ్రెష్ అయ్యి పూజకు వెళ్లకపోతే అమ్మమ్మ వాయించేస్తుంది అన్నాడు విజయ్..
మీరు వెళ్లి రెడీ అవ్వండి నేను తీసుకొస్తాను బుజ్జిని అన్నాడు రోషన్.. అందరు వెళ్లిపోయి అరుణ్ ఆగడంతో నీకేంటి రా బొట్టు పెట్టి చెప్పాలా అన్నాడు.. వెళ్తున్నాం లే అని రోషన్ కి జాగ్రత్త అన్నట్టు సైగ చేసి వెళ్ళిపోయాడు అరుణ్..
గోడ వైపుకు తిరిగి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్న రోషిని ని బుజ్జి నా వైపు చూడు అన్నాడు రోషన్.. అయినా రోషిని నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో మళ్లీ బుజ్జి అన్నాడు.. వెంటనే తిరిగి రోషన్ ని హగ్ చేసుకుని సారీ ఇంకెప్పుడు అలా మాట్లాడను అంది… నువ్వు వెళ్తా అన్న మేము పంపించం గాని.. నీ నోటి నుంచి ఇంకొకసారి అలా అనకు బుజ్జి అన్నాడు.. సరేలే నా నుంచి తాతయ్యకి ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేయవా అంది రోషిని… ఏంట్రా అన్నాడు లాలనగా.. బిజినెస్ వరల్డ్ కి మీడియా కి మిమ్మల్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి నన్ను హైడ్ చేయమని చెప్పవా అంది… ఎప్పటికైనా నువ్వు మీడియాని సొసైటీని ఫేస్ చేయాల్సిందే కదరా అది ఇప్పుడైతే మాత్రం ఏంటి పైగా అందర్నీ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేస్తే నీ మీద ఫోకస్ కొంచెం తగ్గుతుంది కదా అన్నాడు రోషన్.. హలో నన్ను కూడా మీతో పాటు ఏదో ఒక వింగ్కి ఎండిగా ఇంటర్ డ్యూస్ చేస్తే నువ్వు చెప్పేది యజమానేమో కానీ తాతయ్య నన్ను చైర్మన్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు… ఇంతమంది మనవళ్ళు ఉండగా మీ మనవరాల్ని మాత్రమే ఎందుకు చైర్మన్ నీ చేస్తున్నారని వాళ్ళు అడిగితే మీకున్న అర్హతలు ఏంటి అని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని అడిగింది రోషిని..
నువ్వు ఈ ఇంటికి ఏకైక ప్రిన్సెస్ వి.. వెల్ క్వాలిఫైడ్ అండ్ వెరీ టాలెంటెడ్.. అలాంటిది నువ్వు నీకున్న అర్హత ఏంటి అని అడుగుతున్నావా.. అరుణ్ గాడిని ఒక మాటతో కంట్రోల్ చేస్తావ్.. ఇంటిళ్ల పాదిని నీ చూపుతో పడేస్తావ్.. ఇవి చాలవా అన్నాడు రోషన్ నవ్వుతూ… అన్నయ్య నువ్వు కూడా నా అంది రోషిని.. అరే నిజాలని ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయాలి బంగారం.. ఐదు సంవత్సరాల ముందు రోషిని లా కాకుండా.. ఇప్పటి రోషిని లా ఆలోచించు అందర్నీ చిటికెలో హ్యాండిల్ చేసేస్తావ్.. తాతయ్య తో పాటు మేము అందరం కూడా నిన్ను నమ్మాము కాబట్టే తాతయ్య నిర్ణయానికి మా ఫుల్ సపోర్ట్ ఇచ్చామ్… జరిగేది ఎలాగూ మారదు కదా దాని గురించి ఇప్పటి నుంచే బాధపడడం ఎందుకు ? మనకున్న ఈ కొద్దీ టైం ని ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం.. నువ్విలా ముడిగా ఉంటే మాకేం ప్లాన్ చేయ బుద్ధి కాదు .. నువ్వు ఇలా ఉంటే అరుణ్ గాడు మాక్కూడా చెప్పకుండా వాడు ప్రైవేట్ ప్లాన్ వేస్తాడు… ప్లాన్ వాడి చేసి నీ మీద నెపం నెట్టేస్తాడు.. నీకు అది ఓకేనా అన్నాడు అల్లరిగా…
రోషన్ చెప్పిన మాటలతో తన మనసు అప్పటికి కుదుటపరచకుని కిందకి వెళ్లి రెడీ అయి అందరితో కలిసి సరదాగా పూజకి అటెండ్ అయ్యింది రోషిని…
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు రోషన్ తాతయ్య మేమంతా ఒక వారం రోజులు ట్రిప్ కి వెళ్లి రావాలనుకుంటున్నాం దాని తర్వాత మీరు అనుకున్న ప్రోగ్రాం పెట్టుకుంటారా అని అడిగాడు… తను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం చేసుకున్న పెద్దవాళ్ళందరూ ఒప్పుకోమన్నట్టు వర్మ గారు వైపు చూడగా సరే అన్నారు వర్మగారు…
వర్మ గారు ఒప్పుకోవడంతో అందరూ సంతోషంగా ఎవరి పనులకు వాళ్ళు బయలుదేరి వెళ్లిపోగా.. రూమ్ కి వెళ్ళిన రోషిని చార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిన తన మొబైల్ బెడ్ మీద ఉండడంతో… ఆన్ అయితే ఇప్పటికీ ఎంతమందికి సమాధానం చెప్పాలో అని నిటూర్చి చార్జ్ పెట్టింది…
రోషిని ఫోన్ కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్న సుప్రియ తో వాళ్ళ అమ్మగారు ఏంటి మీ ఫ్రెండ్ ఇంకా ఫోన్ చేయలేదా అని అడిగింది.. లేదమ్మా నేను కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నాను అంది.,
నువ్వు తన అన్నయ్యని ఇష్టపడుతున్న విషయం మీ ఫ్రెండ్ కి తెలుసా అని అడిగింది సుప్రియ అమ్మ…
నేను ఒకటికి రెండుసార్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పాను కానీ డైరెక్ట్ గా ఎప్పుడు తనతో చెప్పలేదు అమ్మ తను కూడా ఆ విషయం పొడిగించలేదు..
ఇష్టం రెండు వైపుల నుంచి ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుందని నాతో ఒకసారి చెప్పింది.. దాంతో నేను ముందడుగు వేయలేకపోయాను ఇప్పుడు ఇక అసలుకే వేయలేను అంది…
ఏం ఎందుకు వేయలేవ్ ఇష్టానికి అంతస్థులతో పనిలేదు మీ నాన్న అలానే అంటారు… ఆ అబ్బాయికి కూడా నీపైన ఇష్టం కలిగించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి దానికి మీ ఫ్రెండ్ ని వాడుకోవడానికి కూడా వెనకాడకు అని చచ్చు పుచ్చు సలహాలు ఇచ్చింది…
దాంతో మోటివేట్ అయిన సుప్రియ తన ప్రయత్నాల్ని బలంగా చేయాలని ఫిక్స్ అయ్యింది…
శ్రావ్య వాళ్ళ ఇంటిలో పొలానికి వెళ్లడానికి రెడీ అవుతున్న శ్యామ్ తో.. నాన్న ఒక్క నిమిషం నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్లాల్సి రావచ్చు అని చెప్పింది… ఎందుకే మనవరాల అని అడిగింది శ్రావ్య నానమ్మ..
వర్మ తాతగారు తన వారసుల్ని ప్రకటించబోతున్నారని దానికి రెడీగా ఉండమని నిన్నే అందరికీ చెప్పారట… విజయ్ నన్ను అక్కడికి రావడానికి రెడిగా ఉండమని చెప్పాడు అంది…
అబ్బాయి ఏదో పెద్దదాన్ని నాకు తోచింది చెప్తున్నాను తప్పుగా అనుకోకుండా శ్రావ్య విజయ్ ల పెళ్లి గురించి ఒకసారి వర్మ గారి దగ్గర కదిలించి చూడు లేకపోతే కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేయమని అడుగు..ఎప్పటి నుంచో అనుకుంటున్నదే గా మరి ఆలస్యం చేస్తే ఎలా… అసలే బిజినెస్ ఫీల్డ్… ఆశపడే వాళ్ళు కోరుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు అంది… నా మాట కూడా అదేరా అన్నారు శ్యామ్ నాన్న గారు కూడా… ఏమంటావ్ లహరి వెళ్లి మాట్లాడదామ అని అడిగాడు శ్యామ్…
మీ ఇష్టం అండి అంది లహరి.. సరే రేపు మన ప్రయాణం కి ఏర్పాట్లు చేస్తాను వెళ్లి వస్తాను అని అందరికి చెప్పి తోటకి వెళ్ళిపోయాడు…
ఏంటి మనవరాల ముభావంగా ఉన్నావ్ అని అడిగిన నానమ్మ తో పెద్దవాళ్ళు బావ అన్నయ్య ఉండగా మీరు నా విషయం అడిగితే బాగుంటుందా నానమ్మ… తెలియక అడిగిన అదీవెరే విషయం తెలిసి ఒకె కుటుంబం అయినా మనం కూడా తొందర పడితే ఎలా అంది శ్రావ్య…
ఇన్ని రోజులు మీ అమ్మే అలా ఆలోచిస్తుందనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారయ్యావా.. నాకు వాళ్ళు దేవుళ్ళు నాకు వాళ్ళు దేవుళ్ళు అంటూ ఒకే పాట పాడుతుంది… అయినా నేను ఇప్పటికిప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టమన్నాను లేదు కదా… మీరు అక్కడికి వెళ్లేసరికే నా అంచనా కరెక్ట్ అయితే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉంటారు చూడు అంది రోషంగా…
శ్రావ్య చెప్పింది విన్నాక నాకు కూడా ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అత్తయ్య అంది లహరి.. సరిపోయారు అయినా మీరేం అడగడం లేదు కదా నా కొడుకు చూసుకుంటాడు లే.. ప్రయాణానికి సిద్ధం చేసుకోండి అని తన మాట కరాకండిగా చెప్పింది బామ్మ…