రామ్ ఆఫీస్ కి రెడీ అవుతున్నండంగా రమా తన దగ్గరికి వచ్చి.. రాధిక ఫోన్ చేసిందండి అంది..
ఓహో ఏంటంట వదిన మరదలు ముచ్చట్లు అన్నాడు రామ్..
పెదనాన్న గారు మీకు కాల్ చేస్తారంట అని చెప్పి ఇంట్లో జరిగిన డిస్కషన్ అంతా రాదిక వర్షన్లో రామ్ దగ్గర చెప్పింది రమ…
అవునా సరే వెళ్లి టిఫిన్ సంగతి చూడు ఆఫీస్ కి టైం అవుతుంది అన్నాడు రామ్.. ఓకే నేను వెళ్లి పిల్లలు రెడీ అయ్యారా లేదో చూస్తాను మీరు వచ్చేయండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది రమా…
నిఖిల్ రోషిని మాటతో సొంతంగా కంపెనీ పెట్టుకొని బడ్జెట్ ఫ్రెండ్లీ అని కస్టమర్స్ దగ్గర మంచి రివ్యూ తెచ్చుకొని ముందుకు సాగుతుంటే అఖిల్ వాళ్ళ నాన్నతోనే వర్క్ చేస్తున్నాడు..
సుచిత్ర ప్రస్తుతానికి వర్మ గారి కాలేజీలోనే.. జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంది..
రమ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు కొడుకులు మాత్రమే ఉండడం సుచి కనిపించకపోవడంతో సుచి టైం అవుతుంది అని అక్కడి నుంచే పిలిచింది.. అయిపోయిందమ్మా వస్తున్నాను అంటూ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది సుచి.. ఎప్పుడు హడావిడైన కొంచెం ముందుగా లేచి రెడీ అవ్వచ్చుగా అన్నాడు నిఖిల్..
ఎలా లేస్తారు మేడంగారు అర్ధరాత్రి వరకు ఫోన్ లో బిజీగా ఉంటే అన్నాడు అఖిల్..
చూసావా అమ్మ వీళ్ళకి ఫోన్లో మాట్లాడుకునే దానికి ఎవరూ లేరని నా మీద పడి ఏడుస్తున్నారు అని అలకగా చెప్పింది సుచి..
మీ అమ్మ కూడా వాళ్ళ కొడుకులకే సపోర్ట్ లేరా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రామ్…
లేక ఆరోగ్యం పాడైతే పాడైంది లేమ్మా అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడుకో అని ఎంకరేజ్ చేయమంటారా మీలా అంది రమ కూడా తగ్గకుండా.. అవి స్వీట్ మెమోరీస్ లెవో పెళ్లికి ముందు అలాంటి చిన్న చిన్న సరదాలు కూడా లేకపోతే ఎలా అయినా నా బంగారు తల్లికి తెలియదా ఆరోగ్యం గురించి నీకంటే ఎక్కువ తెలుసుగాని అందరికీ టైం అవుతుంది త్వరగా టిఫిన్ వడ్డించు అన్నాడు రామ్..
వేవే అని అఖిల్ నిఖిల్ నీ వెక్కిరించి పెట్టమ్మా పెట్టు టైం అవుతుంది అని హడావిడి చేసింది సుచి కూడా..
ప్లేట్ల వడ్డిస్తున్న టిఫిన్ చూసి అమ్మ చాలా చాలు అని అరిచింది సుచి… ఎంత పెట్టాలో నాకు తెలుసు కానీ తిను రోజురోజుకీ చిన్న పిల్లలు కంటే దారుణంగా తయారవుతున్నావ్ అంది రమా.. దాంతో అఖిల్ నిఖిల్ కూడా వేవే అన్నారు.. నాన్న అంది సుచి.. రేయ్ మీకేం టైం అవడం లేదా త్వరగా తిని బయలుదేరండి అన్నాడు రామ్..
నాన్న వరుణ్ ఫోన్ చేసి తాతయ్య గారి నిర్ణయం ఏంటో చెప్పాడు. అంది సుచి.. మీ అత్తయ్య ఆల్రెడీ అమ్మకి ఫోన్ చేసిందంట లేరా.. మామయ్య గారే మనకి ఫోన్ చేస్తారేమో లే వెళ్దాం అన్నాడు రామ్..
అలా అందరూ అన్ని విషయాలు సరదాగా మాట్లాడుకుంటూ గొడవ పడితూ టిఫిన్ ముగించుకుని రమా ఇచ్చిన లంచ్ బాక్సులు తీసుకొని ఎవరు పనికి వాళ్ళు వెళ్లిపోయారు..
సుచి మొదట్లో ముబావం గా ఉన్నా రాను రాను మెల్లిగా తనేంటో ఓపెన్ అయ్యి ఆ ఫ్యామిలీలో వాళ్ళ కూతురుగా కలిసిపోయింది.. అదే విషయాన్ని రఘురాం ముందర కాలర్ ఎగరేసి మరీ చెప్తూ ఉంటాడు రామ్ కలిసినప్పుడు అంత…
ఆఫీస్ కి రెడీ అవుతున్న పూజితతో అక్క నాక్కూడా మీ కంపెనీలో జాబ్ చూడొచ్చు కదా అంది రుచి..
నిన్ను రికమెండ్ చేస్తే నా జాబ్ కూడా క్షణంలో పీకేస్తాడు మీ బావ అడగమంటావా అంది పూజ..
ఎందుకులే అమ్మ నావల్ల నీ జాబ్ పోయిందని నన్ను జీవితాంతం తిడుతూనే ఉంటావ్.. అయినా నేను నా జాబ్ తో హ్యాపీ నేలే ఏదో నన్ను రికమెండ్ చేసి నేను కూడా కంపెనీలకు వస్తే నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ అజయ్ ని లైన్ లో పెట్టుకుందాం అనుకున్నాను… అది జరిగేలా లేదు పద అమ్మ అరుస్తుంది మళ్ళీ టిఫిన్ చేయకుండా ఆఫీసుకు పరిగెడితే అంది రుచి…
అది నిజమే పదపద అంటూ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి పరిగెత్తారు…
డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే తమ కూతుర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నారు వెంకటేష్ గారు..
పూజా రుచి నవ్వుకుంటూ వస్తూ ఉండడంతో అయిందా రెడీ అవ్వడం అంది అప్పుడే అక్కడికి వచ్చిన కవిత… రెడీ అయిపోయాము మాతాజీ మీరు టిఫిన్ వడ్డిస్తే తిని మేము మా ఆఫీసులకు పోయేదేము అంది రుచి…
నేను అదే అనుకుంటున్నానే బాబు నిన్ను త్వరగా ఇంట్లో నుంచి గెన్టేయాలని నిన్ను ఎనిమిది గంటల భరిస్తున్న ఆఫీసు వాళ్లకి దండేసి దండం పెట్టాలి అంది కవిత ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తూ..
వెంకటేష్ గారు నవ్వుకుంటూ కవిత నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే నేను పిల్లలతో మాట్లాడాలనుకున్న విషయం మాట్లాడతాను అన్నాడు.. ఏంటి నాన్న అది అన్నట్టు చూసారు ఇద్దరు.. పూజా తాతయ్య వాళ్ళు ఫోన్ చేశారు రా…
నీ పెళ్లి విషయం ఒకసారి మనల్ని వాళ్ళ దగ్గరకు వెళ్లి కన్ఫామ్ చేసుకోమన్నారు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నట్టు చెప్పారు అన్న వెంకటేష్ గారితో.. ఆ నాన్న మీకు చెప్పడం మర్చిపోయాను ఆల్రెడీ రోషన్ వాళ్ళ ఇంటిలో డిస్కషన్ స్టార్ట్ అయ్యాయట ఎవరికీ ఏ పొజిషన్ ఇవ్వాలని తాతగారు డిసైడ్ చేసి ఇదే విషయం మీడియా ముఖంగా సొసైటీ కి అనౌన్స్ చేయబోతున్నారంట అతి త్వరలో అని తనకు తెలిసిన విషయం చెప్పింది పూజ…
మరి మనం కూడా ఆలస్యం చేయడం బాగోదండి మీరు కూడా వీలైనంత త్వరగా అక్కడికి వెళ్లే ఏర్పాట్లు చేయండి అంది కవిత…
నాన్న నేను ఒక విషయం చెప్తాను తప్పుగా అనుకోరు కదా అంది పూజ.. తప్పుగా ఎందుకు అనుకుంటాను ముందు విషయం ఏంటో చెప్పు అన్నారాయన… మా పెళ్లి విషయం మాట్లాడేటప్పుడు అజయ్ కి రుచితని చేసుకోమని మీ వైపు నుంచి రిక్వెస్ట్ చేయగలరా అని అడిగింది..
మీ ఆలోచన ఆశ నాకు అర్థం అవుతున్నాయి రా అడిగానని ఉద్యోగం ఇచ్చారు కదా అని అడిగితే ఇంట్లో కోడలు స్థానం ఇవ్వరు…
ఇది జీవితానికి మనసుకి సంబంధించిన విషయం జీతానికి సంబంధించింది కాదు… అయినవాళ్లు వాళ్ళ బంధువుల అమ్మాయి విషయంలో కొంచెం సీరియస్ గా ఉన్నారని మనకి తెలిసిందే కదా.. అడిగి లేదనిపించుకోవడం కంటే అడగకుండా దూరంగా ఉండటమే మంచిది.. అని తన మనసులో మాట చెప్పారు ఆయన…
అయినా పెళ్లి విషయంలో రికమండేషన్లు ఉండకూడదు రా మనస్పూర్తిగా ఇష్టపడితేనే ఆ బంధం కలకాలం కలిసి ఉంటుంది..
చూద్దాం మీ చెల్లి అదృష్టం ఎలా ఉందో ముందు టిఫిన్ తినండి టైం అవుతుంది అని అప్పటికే ఆ సంభాషణ ని ముగించారు వెంకటేష్ గారు..
ఇంతకీ పూజిత రుచిత ఏం చేస్తున్నారో చెప్పలేదు కదా… మన పూజి వర్మ యాడ్ ఏంజెన్సీలో మేనేజర్ వర్క్ చేస్తుంటే.. రుచి తను చదివిన డిపార్ట్మెంట్లోనే జూనియర్ లెక్చరర్ గా వర్మ కాలేజీ లో పనిచేస్తుంది..కాలేజీకి బయలుదేరడానికి స్కూటీ దగ్గరికి వెళ్లిన రుచితో బాధపడకు నేను నా వంతు ప్రయత్నంగా ఆఖరి సారి రోషన్తో మాట్లాడుతాను అని చెల్లికి మరోసారి భరోసా ఇచ్చింది పూజ…
నావల్ల అనవసరంగా మీ ఇద్దరి మధ్య డిస్టబెన్స్ రావడం నాకు ఇష్టం లేదు అక్క ఏది జరగాలంటే అదే జరుగుతుంది బాయ్ జాగ్రత్తగా వెళ్ళిరా అని అక్కడి నుంచి కాలేజీకి వెళ్లిపోయింది రుచిత..
మెల్లిగా ఒక నిట్టూర్పు విడిచి తను కూడా ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళింది పూజ… తన కాబిన్ లో కూర్చుని దీర్ఘంగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా. అజయ్ కి ఫోన్ చేసింది… అప్పటికే ఆఫీసుకి వెళ్ళిపోయి తన పనిలో ఉన్న అజయ్ కి టైం గాని టైం లో వదిన గారు నుంచి ఫోన్ రావడంతో అన్నయ్యకి చేయబోయి నాకు చేసిందా ఏంటి అనుకొని లిఫ్ట్ చేసి హలో అనడంతో నేను నీతో మాట్లాడాలి వీలుండే టైం చెప్పావ అని అడిగింది పూజ ఎటువంటి నాంచుడు లేకుండా..
ఆఫీస్ కి సంబంధించిన విషయమా పర్సనల్ విషయం అని అడిగాడు అజయ్.. కొంచెం పర్సనల్ ఏ అంది పూజ..
రేపు ఓకేనా ఇవాళ నేను కొంచెం అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సిన వర్క్ ఉంది లేకపోతే అన్నయ్య నా తాటతీస్తాడు అన్నాడు అజయ్…
ఓకే అజయ్ రేపు ఏ టైం లో వీలవుతుందో నువ్వే నాకు మెసేజ్ చెయ్ అని చెప్పింది..
ఓకే అని కాల్ కట్ చేశాక ఏ విషయం గురించో అని ఒక క్లారిటీ రాక తన పనిలో పడ్డాడు అజయ్..
కాల్ కట్ అయ్యాక తన పనిలో పడిన పూజిత కి రోషన్ నుండి కాల్ వచ్చింది.. కాల్ లిఫ్ట్ చేసిన పూజ ఏంటో సార్ గారికి ఆఫీస్ టైం లో మేము గుర్తొచ్చాము ఇవాళ అంది…
గుర్తు రావాలంటే మర్చిపోవాలి కదా అది జరగదు కానీ నేను ఇప్పుడు నీతో ఒక విషయం మాట్లాడడానికి కాల్ చేశాను అన్నాడు…
ఏంటో అంత అర్జెంటు అంది పూజ.. తాతయ్య డెసిషన్ ఏంటో ఆల్రెడీ నీకు చెప్పాను కదా దానికి సంబంధించిన ఆడ్ మీడియాకి ఇవ్వడానికి ఇంప్రెస్సివ్ గా అట్రాక్టివ్ గా ఉండేలాగా చూసుకో…
తాతయ్య డెసిషన్ ఎంత ఇంప్రెస్సివ్ గా ఉందో నీ యాడ్ కూడా అంతే ఇంప్రెస్సివ్ గా ఉండాలి అని చెప్పాడు…డన్ నువ్వే చూస్తావు కదా.. ఇప్పటినుంచి పని మొదలు పెడతాను.. బై హావ్ ఎ నైస్ డే అంటూ కాల్ కట్ చేసి.. ఈ యాడ్ తో పాటు నా చెల్లెలు మీద కూడా మీకు మంచి ఇంప్రెషన్ కలిగించి నాకు తనని తోడుకోడలుగా తెచ్చుకోవడమే నా టార్గెట్ అనుకునింది మనసులో పూజ…
ఇక్కడ పూజ కాల్ తర్వాత సుప్రియ నుంచి రుచి నుంచి ఇందు నుంచి కూడా కాల్స్ రావడంతో వేటిని రిసీవ్ చేసుకోకుండా తన పనిలో పడ్డాడు అజయ్..
దాంతో సుప్రియ సీనియర్ సర్ మీ చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.. ఒకసారి తనతో మాట్లాడించిరా అని మెసేజ్ చేసింది…,
ఎలాగో రిప్లై రాదు కాబట్టి దాంతో లైట్ తీసుకుని ఫోన్ కోసం వెయిట్ చెయ్ సాగింది సుప్రియ..
ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టిన రోషిని ఆరాంగ డిజైన్స్ గీస్తూ.. ఫోన్ విషయం మర్చిపోయి డ్రాయింగ్ రూమ్ లో తన లోకంలో తనుంది .. లంచ్ టైంలో ల్యాండ్ లైన్ మొగుడంతో అప్పటికే ఆఫీసులకి క్యారియర్ పంపి విశ్రాంతి గా ఉన్న రంగి ఫోన్ లిఫ్ట్ చేయడం తో.. లంచ్ అయిందా రంగి అని అడిగి బంగారం ఎక్కడుంది ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లో ఉంది అని అడిగాడు రోషన్..అప్పటికే ఇంట్లో వాళ్ళు టైంకి భోంచేసి ఉంటారని తెలియడంతో వాళ్ల గురించి అడగకుండా….
చిన్ని డ్రాయింగ్ రూమ్ లో ఉంది పెదబాబు.. తను అక్కడ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మీకు కూడా తెలుసు కదా అందుకే ఎవరు భోజనానికి పిలవలేదు నేను కూడా తన కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది…
ఇంతలో టైం వైపు చూసిన రోషిని అయ్యో టైం రెండు దాటిపోయింది నేను భోంచేసే వరకు అన్నయ్య వాళ్ళు భోంచేయరే అని హడావిడిగా పరిగెత్తుకుంటూ రావడం తో రంగి ఫోన్ మాట్లాడడం చూసి అది ఎవరో ఇట్టే కనిపెట్టేసి ఫోన్ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకొని అన్నయ్య ఇప్పుడే నేను భోంచేస్తున్నాను మీరు లంచ్ స్టార్ట్ చేయండి అని చెప్పింది…
టైం ఎంత అవుతుంది రా నీకు ఆ డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తే లోకమే తెలియట్లేదు అన్నాడు…
నేను ఇప్పుడు భోంచేస్తున్నాను కదా మీకు కూడా టైం అయింది వెళ్లి భోం చేయండి అని వేరే మాటకి తావీవ్వకుండా కాల్ కట్ చేసింది…
అక్కడ ఆఫీసులో కాల్ కట్ అయిన వెంటనే ఎందుకు బావ తెలిసి కూడా మాట్లాడతావ్ మేడం గారు తనని తాను బిజీ చేసుకొని ఉంది అంటే సంతోషపడాలి కదా లేదంటే పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు…
తెలిసిన ఇలా చిన్నగా కూడా చెప్పకపోతే మేడం రోజంతా అదే రూమ్ లో ఉండిపోతే కష్టం కదా అందుకేలే అన్నాడు అజయ్…
ఇంటి నుంచి వచ్చిన భోజనాలు అప్పటికే పెద్దవాళ్లు తినేయగా ఐదుగురు కూర్చున్నారు భోజనానికి.. ఆఫీస్ బాయ్ వడ్డిస్తున్న కూడా మీకు కూడా టైం అయింది వెళ్లి భోం చేయండి మేము భోంచేస్తామని తనని పంపేశారు…
ఇంట్లో రోషిని కూడా రంగీలా కంపెనీతో భోంచేసి తన రూమ్ కి వెళ్లి ఫోన్ ఆన్ చేయగా తన అన్నయ్యల నుంచి సుచి మంచి సుప్రియ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో… టైం చూసి సుచికి క్లాస్ కి టైం అవుతుండడంతో మొదట తనకే కాల్ బ్యాక్ చేసింది…