ఏంటి బంగారం బాగా బిజీ అయిపోయావా ఉదయం గుడ్ మార్నింగ్ కాల్ కూడా చేయలేదు నాకు అని అడిగింది ఫోన్ లిఫ్ట్ చేసిన సుచి… నా బిజీ సంగతి నీకు తెలిసిందే కదా అక్క ఫోన్ చార్జింగ్ లేదు అంతే నేను ఫ్రీ గా ఉన్నానని చెప్పకనే చెప్పింది… లంచ్ అయిందా పెదనాన్న ఏమంటున్నారు అని అడిగింది రోషిని తిరిగి.. ఏమంటారు తాతయ్య డెసిషన్ తో ఫుల్ ఖుషి.. ఈ వీకెండ్ ఇంటికి రావచ్చు మేమంతా అని చెప్పింది… మంచిదేగా మనమంతా కలిసి టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పింది.. ఓకే బంగారం నేను ఈవినింగ్ ఇంటికి వెళ్లాక కాల్ చేస్తాను నాకు క్లాస్ కి టైం అయింది బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి తన క్లాస్ కి వెళ్ళిపోయింది సుచరిత…
సుప్రియ కి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండడంతో అజయ్ నుంచి వాయిస్ నోట్ రావడంతో ఇక తప్పక కాల్ చేసింది.. ఏంటో మేడమ్ గారికి మేము గుర్తున్నట్టలేము అంది సుప్రియ.. ఎందుకే అన్ని తెలుసి కూడా ఇలా మాట్లాడతావని అడిగింది రోషిని…
అన్నీ తెలుసా నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పవే నీ గురించి ఏమైనా తెలుసా నాకు ఒక నీ క్వాలిఫికేషన్ తప్ప అని అడిగింది సుప్రియ తిరిగి..
ఓయ్ ఏం తెలీదు మా అన్నయ్యల గురించి తెలియదా మా బావల గురించి తెలియదా మా అక్క గురించి తెలియదా మా ఫ్యామిలీ గురించి తెలియదా అని అడిగింది.. ఫ్యామిలీ గురించ ఎవరి గురించి తెలిసే మీ తాతయ్య గురించి తెలుసా మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. కనీసం మా నాన్న ఎక్కడ పని చేస్తున్నారో తెలుసా కైనా చెప్పావా అని అడిగింది… ఏం చెప్పను మీ నాన్న పనిచేసేది మా కంపెనీ అని చెప్పనా.. అలా మొదట్లోనే చెప్పి ఉంటే నువ్వు ఇలా ఫోన్ చేసి నాతో ఇప్పుడు గొడవ పడే లాగా ఫ్రీగా గొడవ పడే దానివా అని అడిగింది రోషిని తిరిగి…
నీ కాలేజీలోనే నువ్వు చదువుతూ ఏమీ తెలియనట్టు ఏమీ లేనట్టు మా మధ్య తిరిగావు కదా అంటూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు అవును ఆ రాధ కూడా మీ బంధువు అని చెప్పావు కదా నువ్వు సరే చెప్పలేదు నువ్వంటే కోపం ఉన్నా అది కూడా ఎందుకు ఈ విషయం రివిల్ చేయలేదు అని అడిగింది సుప్రియ…
చెబితే నాకెక్కడలేని ఫేమ్ వచేస్తుందని కుళ్ళు కావచ్చు… రెండు మా ఇంట్లో వాళ్లంటే భయం కావచ్చు.. నాకు తెలిసిన కారణాలైతే ఇవి రెండే మరి ఎందుకు చెప్పలేదో నాకైతే తెలియదు అంది రోషిని..
నాకు కూడా మీ కంపెనీస్ లో ఏదో ఒక దాంట్లో జాబ్ చూడొచ్చుగా అన్న సుప్రియ తో… సారీ రికమండేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంది రోషిని.. కావాలంటే ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు విఐపి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను ఎంజాయ్ అంది…
మిత్ర ద్రోహి అంది సుప్రియ.. థాంక్యూ థాంక్యూ ఇంకేంటి మరి ఉండనా ఇంకా కాల్ మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంది సుప్రియ…
ఆగు ఆగు మీ గురించి తెలిశాక మీ అన్నయ్యని వదిలేస్తానని కలలో కూడా అనుకోకు మీ అన్న విషయంలో నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు ఆఫీసులో రికమండేషన్ కుదరదు అన్నావ్ ఇంట్లో కుదురుతుందేమో ట్రై చేయకూడదు అన్న సుప్రియ తో ఊరికెనే టైం వేస్ట్ చేసుకోకు అక్కడ ఆల్రెడీ ఉన్న కాంపిటీషన్ కి ఏదో ఒక డెసిషన్ తీసేసుకున్నాడని నా నమ్మకం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా బుద్ధిగా మీ అమ్మానాన్న చూసిన పిల్లాడిని చేసుకుని.. హ్యాపీగా ఉండక ఎందుకు వాడి నోట్లో తల పెడతావ్.. అన్న రోషినితో ఉచిత సలహా ఇచ్చినందుకు థాంక్స్ ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసింది…
నెక్స్ట్ స్టెప్ ఏంటా అన్న ఆలోచన సుప్రియ ది అయితే అందని వాటికోసం ఆశపడి ఎందుకు డిలాపడతారు అన్న ఆలోచన రోషిని ది…
ఇలాగే చెప్తే వినకుండా రాధాదేవి గారు కూడా ప్రతిజ్ఞలు చేసి నానా తంటాలు పడుతున్నారు ఇంతకీ మేడం గారి ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయో అని తలుచుకొని తనలో తనే నవ్వుకుంది రోషిని.
సుప్రియ తో ఫోన్ మాట్లాడిన రోషిని… వాళ్ళ సంభాషణ మధ్యలో రాధ గురించి రావడంతో తన మీదకి ఆలోచనలు వెళ్లాయి… రాధ గురించి ఆలోచిస్తున్నా రోషిని తనకి రాధకి మధ్య జరిగిన సంభాషణ గురించి తలుచుకుని తనలో తనే నవ్వుకో సాగింది..
అదేంటంటే రోషిని మొదటి సంవత్సరం కాలేజ్ టాప్ చేయడంతో ఇంట్లో వాళ్లంతా దాన్ని ఒక పెద్ద పండగల సెలబ్రేట్ చేసిన విషయం తెలుసుకున్న రాదా… తనని ఎలాగైనా హర్ట్ చేయాలని తను కాలేజీకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూడ సాగింది హాలిడేస్ అనంతరం…
దానికోసం పక్క ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంది ఎందుకంటే మిగతా వాళ్ళకి అప్పటికే కాలేజ్ అయిపోవడంతో రోషిని ఒకటే రాబోతుందని తను తెలుసుకుంది..
కాలేజీ స్టార్ట్ అయినా మొదటి రోజు కార్ పార్కింగ్ దగ్గర తన కోసం ఎదురు చూడ సాగింది రాద,. బంధువు క్లాస్మేట్ పైగా రీసెంట్ గానే తన మామయ్య ఇంటికి వెళ్లిపోయిన రాదని చూడగానే సంతోషంగా పలకరించింది రోషిని..
తన పలకరింపు ని పట్టించుకోకుండా కాలేజీ ఫస్ట్ వచ్చామని గర్వపడుతున్నావేమో నెక్స్ట్ ఇయర్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను చూస్తూ ఉండు అంది రాధ..
ఆ మాట వినగానే చిరునవ్వు నవ్వుతూ ఆల్ ది బెస్ట్ ఆన్ది రోషిని దాంతో ఇంకా మండిపోయింది రాధకి…
నెక్స్ట్ ఇయర్ నీకు కాలేజీ ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఇవ్వకుండా నేను వస్తే నువ్వు అరుణ్ బావని మర్చిపోవాలి అంది రాద.. కోపంగా.
చూడు రాద అందని వాటి గురించి ఆశపడితే అది నీకే బాధని మిగులుస్తుంది.. అయినా నన్ను అరుణ్ బావని మర్చిపోమని చెప్తున్నావు గాని అరుణ్ బావ నన్ను మర్చిపోతాడా అది సాధ్యమని నువ్వు అనుకుంటున్నావా…. నువ్వు కాలేజీ ఫస్ట్ వస్తే సంతోషించి గోల్డ్ గిఫ్ట్ ఇవ్వమని తాతయ్యకి చెబుతాను కానీ నా జీవితాన్ని ఇవ్వమని ఎవరికీ చెప్పను.. నువ్వే చెప్పు అంది..
అరుణ్ కి చెప్పు.. ఎందుకంటే అరుణ్ణి నీకంటే నేనే బాగా చూసుకోగలను.. నీది ప్రేమ కాదు ఇంట్లో వాళ్ళు చెప్పారని తలవంచిన బంధం కానీ నాది ప్రేమ అంది రాధ..
నువ్వు చెప్పిందానికే నేను ఒప్పుకుంటాను నాది ప్రేమ కాదు నీది ప్రేమే మరి అరుణ్ బావది అని అడిగింది రోషిని.. చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు రోషిని.. మా రెండు కుటుంబాలు కలవాలని అందరూ కోరుకుంటున్నారు అలా కలవాలంటే నేను అరుణ్ బావని చేసుకోవడమే కరెక్ట్ అంది రాద..
నువ్వు అరుణ్ బావని చేసుకోవడం ఎందుకు? మా అజయ్ అన్నయ కి బిందు ఇందు లలో ఎవరినో ఒకర్ని చేసుకుంటారు ఏమోగా… నువ్వు చెప్పిన ఆప్షన్ ఒకటే కాదుగా ఉండేది అంది రోషిని కూడా తగ్గకుండా…
అజయ్ కి ఆ ఫ్యామిలీ అంటేనే ఇష్టం లేదు అలాంటిది బలవంతంగా ఆ బంధంలో ఇరికిస్తావా అని అడిగింది రాద… ఈ వాదనంతా మొదటి రోజు అని కాలేజీకి సంతోషంగా వచ్చిన రుచిత కంట్లో చెవిలో పడి ఎలా స్పందించాలో తెలియక చాటుగా నిలబడిపోయింది…
ఇప్పుడు ఏంటి రాధా నీ బాధ ఇది కాలేజీ మనం బయట ఉన్నామని కూడా లేకుండా పిచ్చి వాదనలంతా నాతో పెట్టుకుంటున్నావ్ నేనొక్కదాన్నే ఉన్నానని ధైర్యం కాబోలు ఎవరో ఒకరు ఇదంతా గమనిస్తూనే ఉంటారు అన్నయ్యలకు బావల కి తెలిసిందనుకో నిన్ను ఎవరు రక్షించలేరు దయచేసి అడ్డు తప్పుకుంటే నేను క్లాస్ కి వెళ్తాను అంది రోషిని..
ముసుగులో గుద్దులాట అనవసరం రోషిని నేను ఈ ఊరికి వచ్చిందే ఈ కాలేజీ చూస్ చేసుకుంది అరుణ్ బావ కోసం.. నీకు వీలున్నారని తెలియక ముందే నేను అరుణ్ బావని ప్రేమించడం మొదలుపెట్టాను..
ఎటు చూసుకున్న అరుణ్ బావ మీద పూర్తి హక్కు నాకే ఉంది.. నీకు ఇష్టం లేదనీ నువ్వు తప్పుకుంటే నిన్ను ఎవరు బలవంత పెట్టరు.. నీకు నువ్వుగా తప్పుకుంటే మంచిది నేను ఎలాగో అలా అరుణ్ బావని దక్కించుకుంటాను.. తర్వాత బాధపడాల్సింది నువ్వే నీ మంచి కోసమే చెప్తున్నాను అంటూ అక్కడి నుంచి విసురుగా క్లాస్ కి వెళ్ళిపోయింది రాద…
కొందరిని ఎవ్వరూ మార్చలేం అనుకొని.. వీళ్ళ సంభాషణ అంతా గమనిస్తున్న కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లి.. ప్లీజ్ ఈ విషయం ఇంట్లో అన్నయ్యలకి చెప్పకు అని అడిగింది… చెప్పకుంటే ఎలాగమ్మా నా కళ్ళముందే జరిగింది కదా అన్నాడు డ్రైవర్..
ప్లీజ్ అన్న ఇదే మంత పెద్ద విషయం కాదు తెలిస్తే ఇంట్లో వాళ్ళు బాధపడడంతోపాటు తనని కాలేజీ నుంచి గెంటేసిన గెంటేస్తారు ఆ పాపం మనకెందుకు చెప్పు.. ప్లీజ్ ప్లీజ్ చెప్పద్దు నువ్వు చెప్పవులే అని బతిమిలాడి క్లాస్ కి వెళ్ళిపోయింది…
బాబోయ్ వీల్లు ఏంటి ఇలా ఉన్నారు అటు తిరిగి ఇటు తిరిగి నా హీరోకి పెట్టరు కదా అనుకొని రుచి త కూడా మొదటి రోజు కాలేజ్ అవ్వడంతో తన క్లాస్ వెతుక్కుంటూ వెళ్లి కూర్చుని తన క్లాస్మేట్స్ తో బాతకాని స్టార్ట్ చేసి తను ఎందుకు ఎలా ఆ కాలేజీకి వచ్చిందో పూర్తిగా వివరించేసింది ఒక పది నిమిషాల్లోనే..
రుచిత వాళ్ళ మాటలు విన్న విషయం ఇద్దరు గమనించుకోలేదు…
ఆలోచనల నుంచి బయటికి వచ్చిన రోషిని ఈ ఛాలెంజ్ గురించి అన్నయ్యలకి బావలకి తెలిసి ఉంటుందా తెలిస్తే ఇన్ని రోజులు నా దగ్గర ప్రస్తావించుకుంటా ఉండరు కదా ఎలా చెబుదామా.. అయినా చాలా రోజులు గడిచిపోయింది కదా చెప్పడం అవసరమా అని పరిపరి విధాల ఆలోచించుకో సాగింది రోషిని…
చెబితే ఒక బాధ చెప్పకపోతే ఒక బాధ.. అయినా ఇప్పుడు ఆ మేడం గారు ప్రొఫెషన్ లో బిజీగానే ఉండి ఉంటారులే బావని నన్ను డిస్టర్బ్ చేయదు గడిచిపోయిన దాన్ని చెప్పి.. మళ్లీ ఇన్ని రోజులు నేను చెప్పలేదని వీళ్ల దగ్గర తిట్టించుకోవడం అవసరమా అని ఆలోచించి అక్కడితో ఆ విషయం వదిలేసింది రోషిని..
తన ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వడానికి శ్రావ్య కి కాల్ చేసి ఎప్పుడు వస్తుందో కనుక్కొని కిందకి వెళ్లి ఇంట్లో వాళ్లతో తన టైం గడిపింది…