ఆఫీస్ లో అరుణ్ తన పర్సనల్ కాబిన్ నుంచి శ్రావ్య కి కాల్ చేసి తమకి త్వరలో రాబోతున్న స్పెషల్ డే కి తన ప్రియ సఖి డ్రెస్ ఎలా ఉండాలో ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లైన్ చేశాడు.. అన్ని నోట్ చేసుకున్న శ్రావ్య.. నువ్వు కూడా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాల్సింది అన్నయ్య అంది నవ్వుతు.. ఆ మాటకి అరుణ్ కూడా నవ్వుతూ మీలా అందరికీ ఓపికగా చేసే సహనం నాకు ఎక్కడున్నాయి రా ఏదో నా తింగరబుచ్చి కోసం ట్రై చేస్తున్నాను దానికి నీ హెల్ప్ ఉండనే ఉందిగా… అన్నట్టు మేడంగారు అలిగి మునగ చెట్టు ఎక్కక ముందే పిన్నిని బాబాయిని కన్విన్స్ చేసి త్వరగా వచ్చాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి తన పనిలో పడ్డాడు..
కాలేజీ లో స్టాఫ్ రూమ్ లో ఎదురు పడ్డ రుచి సుచి ఒకరి కి lఒకరు విష్ చేసుకుని ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్లారు…
గత రెండు సంవత్సరాలుగా జరిగేది అదే కాబట్టి సుచరిత పెద్ద పట్టించుకోలేదు.. మొదట్లో అంటి ముట్టనట్టుగా ఉన్న రుచిత ని చూసి చాలా ఫీల్ అయ్యేది సుచరిత… తన వైపు నుంచి తనతో మాట్లాడటానికి చాలా ప్రయత్నించినా దూరంగానే ఉన్న రుచిత వైకరి ఏంటో అర్థం కాక మెల్లిగా సుచరిత కూడా దూరంగా ఉండటం అలవాటు చేసుకుంది…
రుచికి వీళ్ళు ఎవరు ఇంపార్టెంట్ కాదన్నట్టు అసలైన వ్యక్తి మాట్లాడకపోతే వీళ్ళు ఎందుకు అన్నట్టు దూరంగా ఉంటూ… మిగతా వాళ్ళ దృష్టిలో తన విలువని తను తగ్గించుకుంటుంది ఆ విషయం ఎప్పటికి రియలైజ్ అవుతుందో వేచి చూడాల్సిందే…
హరి.. రాజు ఆ కాలేజీలో ఫ్రీగా చదివిన రుణం తీర్చుకోవడానికి అక్కడే స్టాఫ్ నెంబర్స్ గా జాయిన్ అయ్యి ప్రస్తుతం వాళ్ల వాళ్ల డిపార్ట్మెంట్లో మంచి లెక్చరర్స్ గా స్టూడెంట్స్ దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు…
వీక్ డేస్ లో ఇక్కడ వీకెండ్స్ లో ఊరికి వెళ్లి వస్తు ఫ్యామిలీని ప్రొఫెషన్ ని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నారు..
బిందు తన నాన్నకి సపోర్టుగా ఆయన బిజినెస్ లో జాయిన్ అయితే.. ఇందు మాత్రం చదువైన ఇంకా ఖాళీగా ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..
రాద కూడా తన సొంత ప్లాన్లు తను గీస్తూ మామయ్య ఆఫీస్ లోనే బిందుకి తోడుగా ఉంటుంది.. ఎలాగో తన నాన్న కూడా ఆ బిజినెస్ లో పార్టనరే కాబట్టి..
ఒకరోజు ఈవినింగ్ తన ఇద్దరు కూతుర్లు కోడలి తో మాట్లాడదలచిన అర్జున్ తన ఇంట్లోనే మీటింగ్ ఏర్పాటు చేశాడు…
బిందు రాదలని బిజినెస్ ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు ఎంకరేజ్ చేసి ఇందు ని కూడా త్వరలో ఏదో ఒక డెసిషన్ తీసుకోమని మూడు నెలల టైం మాత్రమే ఇస్తున్నట్టు చెప్పాడు…
ఇదే మాతో మాట్లాడాలి అన్నార నాన్న అని అడిగిన బిందు తో… యాక్చువల్ గా అయితే ఇది కాదు మీ పెళ్లి విషయం గురించి మీతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని.. అలాగే మీ డీటెయిల్స్ మన సర్కిల్లో స్ప్రెడ్ చేయాలని మీ నిర్ణయం కోసమే ఈ మీటింగ్ అన్నాడు..
నా పెళ్లి విషయంలో నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు నాన్న మీ నిర్ణయమే నా నిర్ణయం… అనుకున్నవన్నీ జరగవు కదా నాన్న మీరు మాకు ఒక మంచి జీవితం ఇవ్వాలని మీ సాయి శక్తుల ప్రయత్నించారు అది నాకు బాగా తెలుసు.. పెళ్లి విషయం కూడా అంతే నాన్న పూర్తిగా నిర్ణయం మీదే అంది బిందు…
పుట్టినప్పటినుంచి తన అడుగుజాడల్లోనే నడిచే తన పెద్ద కూతురు అంటే ఒకింత గర్వం అర్జున్ కి.. మీ నిర్ణయం ఏంటి అన్నట్టు ఇందు రాదల ని చూశాడు.. నాకు ఇంకొక్క సంవత్సరం టైం కావాలి మామయ్య ఆ తర్వాత మీరు నాన్న కలిసి ఎవర్ని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పింది రాధ కూడా తన ప్రయత్నాన్ని ఇంకొక సంవత్సరం కొనసాగించదలచి…
ముందు అక్క పెళ్లిని నన్ను పూర్తిగా ఎంజాయ్ చేయనివ్వండి నాన్న తర్వాత నా పెళ్లి గురించి మీరే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పింది ఇందు కూడా… ఈ లోపల నేను అజయ్ బావని పడేసే దానికి నా సాయి శక్తుల ప్రయత్నించుకుంటాను అని మనసులో అనుకుంది…
ఆఖరి సారి ఒకసారి వర్మ గారితో మాట్లాడి తర్వాత తన పెద్ద కూతురు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలని మనసులో అనుకొని వెళ్లి భోంచేసి రెస్ట్ తీసుకోండి తల్లి అని ఆ మీటింగ్ ని ముగించారు అర్జున్.
గడుస్తున్న కాలంతో పాటు ఎవరికివారు వర్మ గారు ఎప్పుడు అందర్నీ ఇంట్రడుజ్ చేస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు..
ఒకరోజు సీరియస్గా ఆఫీసులో వర్క్ చేస్తున్న రోషన్ దగ్గరికి టెన్షన్ గా వచ్చిన అరుణ్… బావ మీ చెల్లి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి ఎస్కేప్ అయింది అన్నాడు… ఎవరికి చెప్పకుండా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ అన్నాడు రోషన్…
నిజం బావా మెమిద్దరం వాడే సీక్రెట్ వే నుంచి మీ చెల్లి ఇప్పుడే పాస్ అయింది నాకు సెన్సార్ అలర్ట్ వచ్చింది అన్నాడు తన మొబైల్లో చూపించి..( అంటే సార్ గారు వాళ్ళ అన్నయ్యలనించి చెల్లిని తప్పించి బయటికి తీసుకెళ్లడానికి ఆ దారి అరేంజ్ చేసుకున్నాడు ఆ విషయం అందరికీ తెలిసిన తెలియనట్టే ఉంటారు కాకపోతే సెక్యూరిటీలో చాలామందికి ఆ దారి తెలియదు అదే ఇప్పుడు రోషిని కి ప్లస్ అయింది)
అ వే పెట్టేటప్పుడు చెప్పాను ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందని విని చచ్చావా నువ్వు అని అరుణ్ణి తలంటు పోస్తూనే రోషిని కి కాల్ చేశాడు రోషన్…
సెక్యూరిటీని తప్పించుకొని ముందే బుక్ చేసిన క్యాబ్ ఎక్కిన రోషిని రోషన్ కాల్ ని అవాయిడ్ చేయలేక పిక్ చేసింది.. హాయ్ బంగారం ఏం చేస్తున్నావ్ కొత్త డిజైన్ ఏదైనా ట్రై చేస్తున్నావా అన్నాడు రోషన్…
ఆ కొత్తగానే ట్రై చేస్తున్నానంటూ సగం నిజం సగం అబద్ధం చెప్పింది..
నువ్వు ఏది చేసినా ఈ అన్నయ్య నీకే సపోర్ట్ రా ఆ విషయం నీకు తెలుసు కదా నువ్వు నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదని రోషన్ కూడా ఇండైరెక్టుగానే చెప్పాడు…
జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసిన రోషన్ తల పట్టుకుని కూర్చుంటే అరుణ్ బిక్క మొహం వేసుకొని చూసాడు…
ఒక పది నిమిషాల తర్వాత రోషిని నుంచి తనుండే లైవ్ లొకేషన్ రావడంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వెళ్తాను బావ అంటూ కార్ కీస్ తీసుకొని వేగంగా ఆఫీస్ దాటాడు అరుణ్…
ఏదో కొత్తగా అడ్వెంచరస్ గా ట్రై చేయాలని అందరి కళ్ళు కప్పి ఒకరోజు బయటకు వెళ్లి వస్తే ఎలా ఉంటుందని తింగరిగా ఆలోచించి బయటికి అయితే వచ్చింది కానీ మనసు ఊరుకోక రోషన్ కాల్ చేయంగానే తన లైవ్ లోకేషన్ తన అన్నయ్యకి పంపేసింది కచ్చితంగా ఎవరో ఒకరు అక్కడికి వస్తారని అంచనా వేసిన రోషిని…
ఎక్కడికో వెళ్లడం ఎందుకని రీసెంట్ గానే స్టార్ట్ చేసిన వర్మాస్ మాల్ లోకి ఎంటర్ అయ్యింది రోషిని… అది స్వయంగా తన చేతులతో పూజ చేసి ఓపెన్ చేసిన మాల్… భూమి పూజ మొదలుకొని అరుణ్ దాని వెనుక పడ్డ కష్టం తన నుంచి తీసుకున్న సలహాలు పెద్ద వాళ్ళందరూ సూచనలు.. వర్మ రాజసం అన్ని మాల్స్ కంటే డిఫరెంట్ గా ఉన్న స్టాల్స్ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నమాట మీదనే తన మొదటి ప్రాజెక్ట్ చేసిన తన బావ.. ప్రేమ అన్ని నెమరు వేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ తను నిలబడిన చోటు నుంచే చుట్టూ చూసి ముందుకు కదిలింది రోషిని..
ఒక్కొక్క ఫ్లోర్ తిరుగుతూ తను ఇచ్చిన చిన్న చిన్న ఐడియాస్ కూడా తన బావ ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశాడో చూస్తూ మనసులోనే ముసురుకుంటూ అన్ని గమనిస్తూ ముందుకు వెళ్తున్న రోషిని అడుగులు ఆగిపోయాయి ఒక్కసారిగా అరుణ్ ఎదురుగా వచ్చి నిలబడడంతో…
స్కార్ఫ్లో ఉన్నాను కదా బావ అంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టేసావ్ అని నవ్వుతూ తన పర్స్ లో రెడీగా ఉన్నా మాస్క్ తీసి అరుణ్ కి తగిలించింది…
అప్పటికే చుట్టుపక్కల ఉన్న సీతాకోకచిలుకల కళ్ళు అరుణ్ మీద ఉండడంతో.. బయటకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని తిరగచ్చుగా అంది…
టాపిక్ డైవర్ట్ చేయకుండా అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావో ఇదివరకు చెప్పలేదు అన్నాడు అరుణ్…
చెప్పడానికి ఏముంది బావ త్వరలో నేను ఎక్కడికి వెళ్ళినా హైలైట్ అయిపోతాను కదా అలా అవ్వకముందే ఒక రోజంతా ఇలా గడిపితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది అందుకే వచ్చేసాను అంది… అవునా ఎవరికి చెప్పావు ఎవరితో వచ్చావ్ అన్నాడు ఏమీ తెలియనట్టే అరుణ్…
నీకు ఆల్రెడీ విషయం తెలిసిపోయిందని నాకు తెలుసు క్యాబ్ లోనే వచ్చానులే ఇప్పుడు నువ్వు వచ్చావుగా నీతో పాటు ఇంటికి వెళ్ళిపోతాను అని నవ్వింది…
ఒంటరిగా బయట తిరగాలని ఫాంటసీ ఏంటే నీకు అన్నాడు అరుణ్. ఏది మనకి దూరంగా ఉంటుందో అదే చేయాలి అనిపిస్తుంది బావ.. చిన్నప్పుడంతా ఆ రాజు గాడు నా తోకలా తిరిగేవాడు.. ఇప్పుడేమో ఐదుగురు ఉన్నారు.. ఒక రోజంతా ఎవరు రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎవ్వరి గురించి ఆలోచన లేకుండా మనసుకు నచ్చింది చేస్తూ కంటికి నచ్చింది చూస్తూ గడిపితే ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ నన్ను నిలవనీయడం లేదు తెలుసా అది జరగదని తెలిసిన చేసేయాలని తపన ఆ ఫీలింగ్ ఉంది చూసావు … అది నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే.. పద అంతా ఒకసారి వెళ్లి తిరిగి చూద్దాం ఎప్పుడో పూజ సమయంలో చూశాను అని అరుణ్ చేతిలో తన చెయ్ వేసి ఆ ఫ్లోర్ నుంచి లాక్కొని ఇంకొక ఫ్లోర్ వైపు వెళ్ళింది…
అరుణ్ రోషిని మాటలు వింటూనే పెద్ద బావకి మెసేజ్ పెట్టాడు అందర్నీ మాల్ కి వచ్చేయమని.. తను ఈరోజు అంతా అక్కడే ఉండబోతున్నట్టు కూడా చెప్పి సాయంత్రం అందరం కలిసి ఇంటికి వెళ్దాం వచ్చేయండి అని చెప్పాడు.. రోషన్ అందరి అవైలబిలిటీ కనుక్కొని ఫైవ్ మినిట్స్ లో ఓకే అని రిప్లై ఇచ్చాడు…
ఒక్కొక్క ఫ్లోర్ టూ టైమ్స్ తిరిగి చూసినా బోర్ అనేదే లేకుండా ఎంజాయ్ చేస్తున్న రోషిని కళ్ళల్లో ఆనందం చూసిన అరుణ్ కి తన మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ అనే ఫీలింగ్ పరిపూర్ణంగా వచ్చింది…