సాయంత్రం ఆఫీసు పనులు వీలైనంత త్వరగా ముగించిన రోషన్ అదే విషయం మిగతా అందరికీ పాస్ చేయగా వాళ్ళు కూడా అప్పటికే రెడీగా ఉండడంతో అందరూ కలిసి మాల్ కి ప్రయాణమై దారిలోనే సుచరితకి మెసేజ్ చేశారు అక్కడికి రమ్మని..
ఇంటికి వెళ్లే రూట్లో కాకుండా వేరే రూట్ లో వెళ్తున్న సుచరితని గమనించిన రుచిత ఆ దారి ఎటు వెళ్తుందో తెలిసి అంటే అందరూ మీటింగ్ పెట్టుకున్నారా తనని ఫాలో అయితే తనకి ఏమన్నా లాభం ఉంటుంద అని ఆలోచించి.. అలాగే ఈ విషయం అక్కకి తెలుసా అని కాల్ చేసింది ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగే దానికి… కానీ రోషన్ చెల్లెలు వంటరిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చిందనే టెన్షన్లో వెళ్తుండడంతో ఆ విషయం పూజిత కి ఇన్ఫోర్మ్ చేయలేదు…
నేను ఎక్కడికి వెళ్లడం లేదు ఇంటికే వెళ్తున్నాను నువ్వు కూడా ఇంటికి వచ్చేయ్ అని చెప్పిన పూజితతో నేను కొంచెం లేటుగా వస్తాను ఆ విషయం అమ్మకి చెప్పు అని కాల్ కట్ చేసి సుచికి కొంచెం దూరంలో తనని ఫాలో అయ్యి అనుకున్నట్టుగానే మాల్ కి చేరుకుంది…
అప్పటికే అందరూ ఫన్ జోన్లో స్పెషల్ ఎంట్రీ తో గేదరయ్యారు.. వరుణ్ సుచరితని తీసుకెళ్లగా రుచిత కి ఆ ఫెసిలిటీ లేకపోవడంతో వాళ్ళు బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.. ఏదో క్యాజువల్ గా వచ్చి తను వాళ్ళని చూసినట్టు మాటలు కలపాలని ఆలోచించుకుంటూ… కానీ తనకి తెలియని విషయం ఏంటంటే సుచరిత తనని ఫాలో అయిన రుచిని ఆల్రెడీ చూసింది…
సుచరితను చూసి సంతోషించిన తనని వెళ్లి హగ్ చేసుకోకుండా దూరంగా నిలబడిన రోషిని నీ చూసిన వరుణ్ కి ఆశ్చర్యం వేసి అదే విషయం అడిగాడు రోషిని ని… ఏమైంది బంగారం నువ్వు మీ అక్కని చూసి కూడా దూరంగా నిలబడ్డావ్ అన్నాడు వరుణ్..
నీకు కాబోయే ఆవిడ నన్ను తనని మీట్ అవడానికి కాలేజీకి రావద్దనింది బావ అంది రోషిని. ఉక్రోషంగా. ఎందుకు అన్నట్టు అందరూ క్యూస్షన్ మార్క్ పేసులతో సుచి ని చూడగా… అంటే తను ఆల్రెడీ తాతయ్య మనవరాలుగా ఎక్స్పోజ్ అయిపోయింది కదా.. తను కాలేజీకి వచ్చి నన్ను కలిస్తే నన్ను కూడా అందరూ స్పెషల్ గా ట్రీట్ చేస్తారుగా అందుకే రావద్దన్నాను అంది..
ఆ మీ అందరికీ మాత్రం మీ ఫ్రీడం బానే కావాలి నాకు మాత్రం వద్ద అంది…
చూస్తూ ఉండు తాతయ్యని త్వరలో మీ పెళ్లి అనౌన్స్ చేయమని ఒప్పించకపోతే అడుగు అంది రోషిని…
ఆ పని చెయ్ బంగారం నీ బెడ్ రూమ్ సెల్ఫ్ లని కొత్త కొండపల్లి బొమ్మలతో నింపే బాధ్యత నాది అన్నాడు వరుణ్… నేనే నీకు కావాల్సినన్ని చిప్స్ స్పాన్సర్ చేస్తాను నాకు కొద్దిరోజుల్లో ఫ్రీడం ఉండనివ్వు బంగారం అంది సుచి…
ఈ రోషిని నీ మీరు ఇచ్చే లంచాలతో కొనలేరు కానీ మీ ఇద్దరినీ ఇలా ఫ్రీగా వదిలేయడం నాకు నచ్చలేదు.. సో నేను తాతయ్య తో మాట్లాడేది పక్క అంది… నేను చెప్పిన చిన్న నో కి ఇంత పెద్ద పనిష్మెంట్ న్యాయం కాదు బంగారం అంది సుచి…
ఏంటి బావ అక్క నీతో పెళ్లి నీ పనిష్మెంట్ గా ఫీల్ అవుతుంది అంది రోషిని… వీళ్ళ ఆర్గుమెంట్ ని మిగిలిన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే… రోషిని చాలు నాన్న సూచి ఫీల్ అవుతుంది అన్నాడు రోషన్.. నేనేమీ ఫీల్ అవ్వట్లేదు అన్నయ్య ప్రపోజల్ మన నుంచి కాకుండా నాన్న వచ్చి అడిగితే బాగుంటుంది ఏమో అనుకుంటున్నాను అంతే అంది..
అంతే కదా నాతో పెళ్లి ఎక్కడ ఇష్టం లేదని టెన్షన్ పడ్డాను అలాగే చేసేద్దాంలే మన బంగారం బుర్రలో ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుందిలే అన్నాడు వరుణ్..
దీనికైతే లంచం కావాలి బావ అంది రోషిని… ఇప్పుడే ఎవరో లంచాలతో కొన లేరని డైలాగ్ వేశారు అదేంటో అడుగు అన్నయ్య అన్నాడు అరుణ్… తన ప్రియ సఖి వేషాలని ఇష్టంగా భరిస్తూ..
అప్పటివరకు శ్రావ్యతో ఫోన్ మాట్లాడి శ్రావ్యా వచ్చే డేట్ కన్ఫర్మ్ చేసుకున్న విజయ్ బంగారం మీ చిన్న వదిన వచ్చేస్తుంది అంటరా అన్నాడు ఇవేమీ పట్టించుకోకుండా.. నీకు కంఫర్ట్ ఏ గా అన్నాడు అజయ్… నువ్వు కూడా నీ పెయిర్ నీ సెట్ చేసుకోరా కుళ్ళుకోకు అన్నాడు..
ఆ సెట్ చేసుకో సెట్ చేసుకో అసలే తమరి కోసం చాలా మంది వెయిటింగ్ అలాగే ఫాలోయింగ్ అంది సుచిరీత.. నువ్వు కూడా నన్ను టీష్ చేసే పార్టీలో చేరిపోతే ఎలా అక్క అని వాపోయాడు అజయ్..
నేను కూడా నీ బాధితుల టీంలో మెంబర్ నే మరి ఏం చేయను అంది రుచి నీ తలుచుకుంటూ…
అప్పటికే అన్ని ఫన్ గేమ్స్ ఆడి అలసిపోయిన రోషిని నీ చూసిన రోషన్ లైట్ గా స్నాక్స్ ఆర్డర్ చేశాడు. అందరికీ కలిపి.. అవి వచ్చాక అందరూ తింటూ రౌండ్ గా కూర్చొని మాట్లాడుకో సాగారు చాలా రోజులైంది అందరూ కలిసి మాట్లాడుకుని మరి…
బంగారం ఎప్పుడూ ఇలాంటి ఫీట్లు చేయొద్దు నాన్న అన్నాడు రోషన్.. మళ్లీ ఏం చేసింది అన్నయ్య అన్నాడు అజయ్…
ఏమీ లేదులే అనుకోకుండా అందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పింది కదా.. ఇప్పుడున్న బిజీలో అందరికీ కుదరదు కదా అదే చెప్తున్నాను అన్నాడు రోషన్…
అప్పటికే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు మీద ఫోన్లు రావడంతో పైగా రోషిని మేడం ఇంట్లో చెప్పకుండా వచ్చేసి అందర్నీ టెన్షన్ పెట్టడంతో మేడంకి క్లాస్ తీసుకోవడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు..
రుచి మేడంకి కూడా ఇంటికి వెళ్లే టైం దాటి పోవడంతో ఎక్కడ నాన్న వచ్చేస్తాడో అని టెన్షన్ పడుతూ చ వీళ్లేంటి ఇంకా రాలేదు అని తిట్టుకుంటూ.. ఉఫ్ అజయ్ తో మాట్లాడే ఛాన్స్ లేదు ఈరోజు కూడా అనుకుంటూ విసురు గా వెళ్లిపోవడం.. వీళ్లంతా ఫన్ జోన్ నుంచి బయటికి రావడం ఒకేసారి జరిగింది.
అందరూ సరదాగా నవ్వుకొని బయటకు వచ్చాక సుచరిత తన స్కూటీలో ఇంటి దారి పడితే మిగిలిన వాళ్ళు వర్మ నిలయం కి బయల్దేరారు..
మాల్ నుంచి కోపంగా ఇంటికి బయలుదేరిన రుచిత.. నేరుగా తన రూమ్ కి వెళ్లి పూజిత చేతిలో ఉన్న ఫోన్ లాగి బెడ్ మీద కి విసిరేసి… 24 అవర్స్ అంత వర్క్ మైండెడ్ గా ఉండాల్సిన అవసరమేమీ లేదు… కాస్త బయట ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ ఉండు అది నీకే మంచిది అని చెప్పింది.. ఏమైందే వచ్చి రాంగానే నా మీద పడ్డావు అని అడిగింది పూజ..
ఏమైందా ఇవాళ మీ గ్యాంగ్ అంతా మాల్ లో స్పెషల్ గ్యాదర్ అయ్యారు ఆ విషయం నీకు తెలుసా అని అడిగింది… ఆ విషయం నిజంగా తనకి తెలియకపోవడంతో తెలియదనే చెప్పింది పూజ.. అలాగే నీకెలా తెలుసు అని తిరిగి అడిగింది రుచితని…
ఆ ఇంటికి కాబోయే పెద్ద కోడలు ఉందిగా మా కాలేజీలోనే తను అటు సైడ్ వెళ్లడం చూశానని చెప్పింది.. సరే ఒకసారి కొత్త మాల్ కదా చూసినట్టు ఉంటుందని నేను వెళ్లాను…
అప్పుడే తెలిసింది స్పెషల్గా పై ఫ్లోర్ మొత్తం ఆకుపై చేసుకున్నారు అని ఎంతైనా ఓనర్స్ కదా నాకు అలో లేక నేను వెళ్ళలేకపోయాను అని తన అక్కస్సు కూడా వెలగక్కేసింది పనిలోపనిగా..
అంత స్పెషల్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు నువ్వు కూడా ఆ ఇంటికి కోడలు వే కదా నిన్ను ఎందుకు పిలవలేదు వాళ్ళు అని అడిగింది మళ్లీ.. రోషన్ ఏదైనా టెన్షన్ లో ఉన్నాడేమో లే అందుకే నాకు ఫోన్ చేయలేదు అంది పూజ..
ఏంటక్కా నువ్వు ఎప్పుడు వాళ్లనే వెనకేసుకొస్తావు అసలు ఇదివరకి నీకు తను ప్రపోజ్ చేశాడా నీకోసం నువ్వు స్పెషల్గా ఫీలయ్యే మూమెంట్ మీ మధ్యలో ఒక్కటైనా ఉందా.. ఫోన్లో చాటింగులు తప్పితే ప్రొఫెషన్ గురించి మాట్లాడుకోవడం అంతకుమించి ఏమైనా ఉందా పేరుకి పెద్దింటి వారసులు కోట్లకు అధిపతులు.. ఇది నాకేం నచ్చడం లేదు అక్క అంది..
అప్పుడే వీళ్ల కోసం స్నాక్స్ టీ తీసుకొచ్చిన కవిత వీళ్ళ సంభాషణ విని.. కష్టపడి సంపాదించారు కాబట్టే వాళ్లకి దాని విలువ తెలుసు… వాళ్ళింట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టే ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా పద్ధతిగా ఉంటున్నారు.. నీలాగా స్పెషల్ గా ట్రీట్ చేస్తేనో లేకపోతే వెర్రి వెయ్యి తల్లులన్నట్టు ప్రపోజ్ చేస్తేనో ప్రేమున్నట్టు కాదు బాధ్యత ఉన్నా కూడా ప్రేమ ఉన్నట్టే అంది కవిత..
రీల్లో జీవించడం మానేసి రియల్గా జీవించడం నేర్చుకో అది నీకే మంచిది.. త్వరగా ఫ్రెష్ అవ్వండి మీ నాన్న వచ్చే టైం అయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.. కవిత..
డబ్బుంటే చాలా చేయొచ్చని నీ థాట్ ఒకరకంగా కరెక్టే రుచి కానీ ఆ డబ్బుని వాళ్ళు వాడాల్సిన దగ్గర మాత్రమే వాడుతారు కాయిన్ కి టు సైడ్స్ ఉన్నట్టే దాన్ని ఖర్చు పెట్టే విధానాలు కూడా చాలా ఉంటాయి.. నువ్వన్నట్టు మా మధ్యలో ఏది స్పెషల్ మూమెంట్ లేకపోయినా తను నా వేలికి తొడిగే రింగు నా మెడలో వేసే మూడు ముళ్ళు మాకు స్పెషల్ మూమెంట్స్ ఏ కదా ఆ తర్వాత నీకేం కావాలో మీ బావ దగ్గర డిమాండ్ చేస్తూవులే అప్పటివరకు కొంచెం కామ్ గా ఉండు అని చెప్పింది పూజ..
పోర్టికోలో కార్ సౌండ్ వినిపించడం వెంటనే లేని గంభీరం తెచ్చుకొని స్టిఫ్ గా కూర్చుండడానికి నానా కష్టాలు పడ్డారు రత్న కుందనలు..
కూతుళ్ళ కష్టాలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు జానకి గారు.. కోడల్ని వీళ్ళ నుంచి ఎలా తప్పించాలో అని మనసులో ఆలోచనలు వేసుకుంటున్నారు రాధిక గారు…
రంగి నాకు పాలు అన్నయ్యలకు బావలకు టీ అని హాల్లో నుంచే గట్టిగా అరిచింది రోషిని.. అలాగే హాల్లో ఏంటో వాతావరణం వేడిగా ఉన్నట్టుంది ఏసీ కొంచెం కూలింగ్ పెంచు అని కూడా చెప్పింది.. తను సోఫాలో తల్లికి ఎదురుగా కూర్చుంటూ..