రోషిని వేషాలు చూసి మిగతా అందరూ నవ్వుకుంటూ ఉంటే కుందన రత్న మాత్రం కోపంగా చూస్తూ ఉండగా రంగి ఆ రూమ్ కి తాళం వేసావా అని అడిగింది కుందన… అట్లకాడ రెడీ చేసావా అని అడిగింది రత్న…
ఏంటమ్మమ్మా నీ కూతురులు ఇద్దరు బాగా వేడి మీద ఉన్నట్టున్నారు అంది రోషిని…
నాకీ సీన్ లో డైలాగులు లేవు నేను మీ తాతయ్యకి టీ తీసుకుని వెళుతున్నాను జాగ్రత్త అని మాత్రమే చెప్పి న జానకమ్మ వర్మ గారు ఉన్న ఆఫీసు రూమ్ కి వెళ్లిపోయింది అటు కూతుర్లని కంట్రోల్ చేయలేక ఇటు రోషిని కి చెప్పలేక…
ఇదిగో మీరేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు నా తప్పేమీ లేదు అంతా మీ అల్లుడు చేసింది మీ అల్లుడు రమ్మంటేనే నేను వెళ్ళాను.. కాకపోతే మన కారులో కాకుండా క్యాబ్లో వెళ్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అంతే కదా దానికి ఎందుకు ఇద్దరు నా వైపు అలా గుర్రుగా చూస్తున్నారు అంది రోషిని…
అల్లుడు చెప్తే వెళ్ళావా మరి అల్లుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నే రమ్మన్నాడా అని రత్న..అడుగగా.. లంచ్ చేద్దాం రా అంటే నాకు ఆకలిగా లేదు నేను డ్రాయింగ్ లో బిజీగా ఉన్నాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని కలరింగ్ ఇస్తావా అంది కుందన…
పైగా తలుపు నేను లోపల గడివి పెట్టుకుంటున్నాను ఎవరూ భయపడద్దని కూడా చెప్పింది వదిన అంది రాధిక…
అత్తా నువ్వు కూడా నా చెప్తున్నాను కదా నా తప్పేం లేదని అంతా నీ కొడుకే చేశాడు కావాలంటే అరుణ్ణి అడుగు అంది ప్లీజ్ అన్నట్టు అరుణ్ని బతిమిలాడుకుంటూ…
ఒక పది నిమిషాలు ఇంటిని అందరూ గందరగోళం చేసేసారు రోషిని మా దగ్గరే ఉందని రోషన్ కాల్ చేసేంతవరకు ఎవరికీ కుదురు ఉండలేదు…
రోషిని దూరంగా క్యాబ్ ఎక్కడమ్ గమనించిన సెక్యూరిటీ.. వర్మ గారికి ఇన్ఫార్మ్ చేయడంతో ఎలా జరిగింది ఇది అని సెక్యూరిటీ మీద అరిచినా వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి రోషన్ కి కాల్ చేయడం అప్పటికే అరుణ్ అదే విషయం చెప్పి ఉండడం వెంట వెంటనే జరగడంతో తను మా దగ్గరికి వస్తుంది లేండి తాతయ్య అని ఆయన్ని సమాధానం పరచగా నిదానించారు వర్మ గారు కానీ ఈ గందరగోళం అంతా రత్న చెవిన పడనే పడింది…
తను ఇంటికి వచ్చేంతవరకు మిగిలిన వాళ్ళు కుదరుగా ఉండలేకపోయారు. అందర్నీ బాధించిన విషయం ఏంటంటే ఎవరికీ చెప్పకుండా కారు తీసుకుని వెళ్లకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడం ఎందుకో ఏంటో అని నానా హైరానా పడ్డారు..
ఇంట్లో ఈ పంచాయతీ జరుగుతూ ఉండంగానే ఆఫీస్ నుంచి రఘురామ్ రాఘవ చంద్రులు కూడా వచ్చేశారు…
విషయం ఆల్రెడీ వాళ్లకి కూడా తెలిసి ఉండడంతో ఏమీ మాట్లాడకుండా కామ్ గా కూర్చున్నారు…
ఆఫీస్ నుంచి వచ్చాక కనీసం తనని ఎవరు పలకరించకుండా కూర్చోవడంతో తను చేసిన చిన్న పొరపాటు వీళ్ళందర్నీ ఎంత బాధించిందో అన్న రియలైజేషన్తో సారీ అంటూ చెవులు పట్టుకుని అందరికీ ఒకేసారి చెప్పింది రోషిని…
ఇలాంటి పొరపాట్లు మళ్లీమళ్లీ జరగకూడదని దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలని అప్పటిదాకా రూమ్లో ఆలోచించిన వర్మ గారు వెంటనే ఏదో ఆలోచన స్ట్రైక్ అవడంతో భార్యతో సహా హాల్లోకి వచ్చారు…
రోషిని క్షమాపణ చెప్పడం చూసినా ఆయన నీ క్షమాపణ ని మేము యాక్సెప్ట్ చేయాలంటే అందరి ముందర నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి అన్నారు…
వర్మ గారు అలా అడగంగానే అందరికీ ఆయన ఏదో గట్టిగానే చేయబోతున్నారని స్ట్రైక్ అయింది…
అలాగే తాతయ్య ఏంటో చెప్పండి అంది…. నువ్వు ఈరోజు చేసిన పొరపాటు మళ్ళీ రిపీట్ చేయకూడదు.. నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే అది మన కార్లలో మాత్రమే వెళ్లాలి.. ఒకవేళ మన కార్లు అవైలబుల్ లేకపోతే మాలో ఎవరో ఒక్కరిని తీసుకుని నువ్వు బయటికి వెళ్లాలి అంతేకానీ ఎవ్వరికీ చెప్పకుండా ఇలా బయటకు మాత్రం వెళ్ళకూడదు ఇది నేను బ్రతికుండగా రిపీట్ కాకూడదు అని కొంచెం గట్టిగానే చెప్పి చేయి ముందుకు చాచారు వర్మ గారు ప్రామిస్ చేయమన్నట్టు.
వర్మ గారి మాటలు కొంచెం సీరియస్ గా ఉన్న ఆ మాత్రం సీరియస్ నెస్ అవసరమే అని మిగతా కుటుంబ సభ్యులు ఎవరు జోక్యం చేసుకోకుండా రోషిని సమాధానం ఏంటో అని ఎదురుచూస్తూ కూర్చున్నారు..
అంతంత పెద్ద మాటలు మాట్లాడి మీరేమీ నన్ను భయపెట్టాల్సిన అవసరం లేదు.. ఒకసారి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తాము ప్రామిస్ అంది రోషిని వర్మ గారి చేతిలో చేయి వేసి…
చేసిన తప్పే మళ్ళీ చేయను అంటే ఇంకా కొత్త తప్పులు చేస్తావా అంది రత్న… అమ్మ నువ్వు లాజిక్కులు మాట్లాడకు..
తాతయ్య మాట అడిగారు నేను మాట ఇచ్చాను ఇంకెప్పుడు ఇలా చేయను ప్రామిస్ చాలా అందరికీ కోపం పోయిందా అని అడిగింది మళ్లీ అందర్నీ చూస్తూ…
ఇది కోపం కాదు బంగారం భయం అంటూ రోషన్ రోషిని పక్కన వచ్చి నిలుచుకొని అందర్నీ చూస్తూ చెప్పింది కదా ఇంకైనా మీ మొఖాలు మార్చండి అన్నా డు… దేవుడు మాకు ఒక ముఖమే ఇచ్చాడు దాని మారిస్తే ఎలా అంది కుందనా… అబ్బా ఇక చాలు అత్త ఇంకా ఎక్కువ చేస్తే మీ కూతురు ఇప్పుడే ఏడ్చేలాగా ఉంది అన్నాడు అరుణ్ రోషిని ముఖం చూస్తూ…
ఈ పంచాయతీ అంతా అయ్యేసరికి డిన్నర్ టైం అవడంతో రంగీ వచ్చి డిన్నర్ కి రండి అందరూ అని పిలిచింది.. సిట్యుయేషన్ తో నీకు పని లేదే అన్నాడు వరుణ్ నవ్వుతూ….
రంగి తన చిన్నిని కాపాడుకోవడానికి టాలెంట్ చూపిస్తుంది అన్నారు అజయ్ విజయ్ ఒకేసారి.. మీరిద్దరూ ఒకేసారి పుట్టారని మీ రూపాలు చూస్తేనే తెలిసిపోతుంది ప్రతిసారి ఇలా సింక్లో ఉండాల్సిన అవసరం లేదు అంది రోషిని…
దాంతో అందరూ నవ్వడంతో సిచువేషన్ ఎలా ఉన్నా దాన్ని నవ్వులతో నింపడం మా బంగారం కే సాధ్యమన్నాడు రాఘవ్..
అందరూ దీన్ని ఇలా వెనకేసుకొచే దీనికి కొమ్ములు వస్తున్నాయి.. వెళ్ళండి ఇక అందరూ త్వరగా ఫ్రెష్ అయ్యి పది నిమిషాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలని ఆర్డర్ వేసింది జానకమ్మ…
దాంతో ఊపిరి తీసుకున్న రాధిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది డిన్నర్ ఏర్పాట్లు చూడ్డానికి.. తనని అనుసరించారు కుందన రత్నాలు…
అనుకున్నట్టుగానే పదినిమిషాల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర హాజరయ్యి కమ్మని వంటలతో కడుపు నింపుకున్నారు అందరు…
డిన్నర్ తర్వాత యంగ్ బ్యాచ్ అంతా గార్డెన్ లో వాకింగ్ కి వెళ్ళిపోతే.. పెద్ద వాళ్ళందరినీ ఉద్దేశించి… వారంతం లో వాళ్లకి కాబోయే వియ్యంకులునీ ఇంటికి పిలిచి తను తీసుకున్న నిర్ణయం గురించి అందరికి చెప్పదలచినట్టు చెప్పారు వర్మ గారు…
ఆల్రెడీ నీ మనవళ్ల ద్వారా అందరికీ విషయం తెలిసే ఉంటుంది కదా నాన్న అన్నాడు రాఘవ్…
వాళ్లు చెప్పడానికి పెద్దరికంగా మనం చెప్పడానికి తేడా ఉంటుంది కదరా అన్నారు వర్మ గారు…
మీరు అన్నది నిజమే మామయ్య గారు మీరు చెప్పినట్టుగానే అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తానన్నాడు రఘురాం…
శరత్ అన్నయ వాళ్ళని ఒకేసారి పిల్లల్ని పరిచయం చేసేటప్పుడు పిలుద్దాం మావయ్య గారు ప్రతిసారి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి పిలవడం అంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చని తన అభిప్రాయాన్ని చెప్పాడు చంద్ర… అది కూడా నిజమే అవడంతో ఎలాగో రాజు ఇక్కడే ఉన్నాడు కదా తనని పిలుద్దాంలే అన్నారు..
ఇక దాని గురించి మాట్లాడుకుంటూ ఎవరెవరిని పిలవాలో ఎవరు ఎవరికీ ఫోన్ చేయాలో అనే నిర్ణయం అనంతరం పిల్లల్ని పిలిచి అదే విషయం చెప్పగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు…
ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళగా… రోషిని మాత్రం మామ్ డాడ్ ని ఇంకొంచెం కాకా పట్టడానికి రఘురామ్ కుందనల గది తలుపు తట్టింది…
రూమ్ లోకి వెళ్ళిన వెంటనే బెడ్ ఎక్కి రెండు చెవులు పట్టుకొని నేను కోపం లోనో బాధలోనూ బయటకు వెళ్లలేదు నిజంగా నిజం ఏదో కొత్తగా ట్రై చేద్దామని వెళ్లాను అంతే దానికే మీ ఆవిడ మరదలు ఇంత పెద్ద సీన్ చేసేసారు డాడ్ అంది అమాయకంగా.
రోషిని తన డాడ్ మామ్ లని ప్రసన్నం చేసుకోవడానికి పడుతున్న పాట్లు చూసి రఘురాం కుందనలు లోపల ఎంజాయ్ చేస్తూనే ముఖం సీరియస్గా పెట్టుకొని ఇక మీదట ఎప్పుడూ ఇలా చేయవు కదా అని అడిగారు…
ఒక్కసారికే మీ ఆవిడ మీ మరదలు నాకు వాతలు పెట్టడానికి ప్లాన్ చేశారు ఇక మళ్ళీ చేస్తాన బుద్ధుంటే నాకు అంత సరదా ఏం లేదు గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోయింది…
రోషిని తన రూమ్ కి వెళ్లేసరికి విష్ణుమూర్తి ఫోజులో బెడ్ పైన పడుకుని కనిపించాడు అరుణ్… ఏంటి బంగారం అయిపోయిందా బుజ్జగించే ప్రోగ్రాం అన్నాడు కళ్ళు ఎగరేస్తూ… నువ్వు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇవ్వకు స్వామి.
ఏదో ఒక రోజు నాకు హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఉన్నావ్… అయినా ఇలా రూమ్ లో మీటింగ్ పెట్టొద్దని పెద్దన్నయ్య మరి మరీ చెప్పాడు కదా అయినా నువ్వు తన మాట ప్రతిసారి మీరు తావ్ ఏంటి అని అడిగింది…
అబ్బ అచ్చా మాట మీరడం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి బంగారం…
అయినా నువ్వు అడ్వెంచర్ చేయాలనుకున్నప్పుడు… దొరకకుండా అస్సలు చేయలేనప్పుడు ఎందుకే ట్రై చేయడం.. నాకు చెప్తే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాను కదా అన్నాడు…
తను కూడా బెడ్ పైన బోర్లా పడుకొని కానీ ఎందుకో నాకే ఈసారి డిఫరెంట్ గా ట్రై చేయాలనిపించింది.. అలాగే నా సేఫ్టీ గురించి కూడా ఆలోచించుకున్నాను కదా.. అందుకే కదా ఎక్కడికి వెళ్లకుండా మన మాల్ కే వెళ్లాను… అది కూడా తప్పైపోయింది మనం ఓకసారి పబ్లిక్ కి ఇంట్రడ్యూస్ అయ్యాక ఇంత ఫ్రీడమ్ ఉండదు కదా అర్థం చేసుకోరు… వచ్చే సమస్యలు ఎక్కడున్నా వస్తాయి కదా అందుకని ఇంట్లో నే కూర్చోలేము కదా అంది రోషిని…
అరుణ్ ఏదో మాట్లాడే లోపల తన ఫోన్ కి నోటిఫికేషన్ రావడంతో అది చూసిన అరుణ్ ముఖం కోపంగా మారడంతో ఏంటి రాంగ్ నెంబర్ అంది రోషిని… దీనికి బుద్ధి లేదు బంగారం ఏదో ఒక రోజు నా చేతిలో గట్టిగా పడతాయి అన్నాడు…