మాటలతో నవ్వుతున్న బుజ్జిని చూసి ఇంకా కోపం వచ్చింది అరుణ్ కి.. నువ్వేంటి వెళ్లి తనని నాలుగు పీకాల్సింది పోయి నన్ను చూసి నవ్వుతావు అన్నాడు అని ఉడుక్కుంటూ…
తన ఆట బాగుంది కదా బావ నేను ఎంజాయ్ చేస్తున్నాను అయినా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుందట అలా ఉంది తన వరస… టైం వచ్చినప్పుడు తనని ఎక్స్పోజ్ చేసేద్దాంలే ఫీల్ అవ్వకు అంది…
ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక తమరు నా రూమ్ నుంచి వేకెట్ చేయకపోతే పెద్దన్నయ్య చేతిలో గట్టిగా దెబ్బలు తింటారు అవసరమా చెప్పండి గుడ్ నైట్ అని చెప్పి దుప్పటి ముసుగేసింది…
ఎప్పుడు చూడు టైం అయింది పెద్దన్నయ్య తిడతాడు నాన్న వస్తాడు అమ్మ కొడుతుంది అంటావు కానీ.. ఇంకాసేపు ఉండు బావా కబుర్లు చెప్పుకుందాం అన్నావా ఎప్పుడైనా అన్నాడు అరుణ్… కబుర్లే కదా చెప్పుకున్దం ఒక్కసారి అన్నయ్యకి కాల్ చేసి చెప్పైనా మరి అన్న రోషిని… పెదవుల్ని తన పెదవులతో మూసేసి ఒక ఐదు నిమిషాలు తనకి ఉపిరి ఆడకుండా చేసి తను తేరుకునే లోపల ఇప్పుడు చెప్పుకో అన్నయ్యకి బాయ్ గుడ్ నైట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు…
ఇడియట్ అని తిట్టుకొని మళ్లీ జరిగింది తలుచుకొని నవ్వుకుంటూ నిద్రపోయింది రోషిని…
అదే సిటీలో వర్మ నిలయానికి దూరంగా ఒక ఇంట్లో ఒక అమ్మాయి దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయింది.. తను చూసిన ఒక దృశ్యాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ ఏదో గుర్తొచ్చినట్టుగా అక్కడినుంచి పరుగున వెళ్లి వాళ్ళ అమ్మానాన్న గది తలుపు తట్టింది…
తలుపు తీసిన ఆ దంపతులు ఆ టైంలో కూతురు తమ గదికి రావడం ఎందుకు అర్థం కాక అయోమయంలో పడితే వచ్చిన కూతురు తన మొబైల్ ఓపెన్ చేసి ఒక ఫోటో వాళ్ల ముందర పెట్టి తనతో మనకి సంబంధం ఏంటి అని అడిగింది..
ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయిన దంపతులు.. ఈ ఫోటో నువ్వు ఎప్పుడు తీసావ్ ఎక్కడ తీసావ్ అని అడిగారు ఇద్దరు ఒకేసారి…
అది తర్వాత చెప్తాను కానీ ముందు తినతో అనుకున్న రిలేషన్ ఏంటో చెప్తారా అని కొంచెం కోపంగా అడిగింది…
దాంతో ఆ లేడీ వాళ్ళ ఆయన వైపు కోపంగా చూసి మీ నాన్నగారి మొదటి భార్య కూతుర్లే అంది…
అవునా మరి మన ఇంటికి రావట్లేదు ఏంటి ఈమధ్య అని తిరిగి అడిగింది.. రావట్లేదు అని నన్ను అడిగితే నేనేం చెప్తాను నేనైతే దరిద్రం వదిలిపోయిందని సంతోషంగా ఉన్నాను అంది ఆ తల్లి..
అమ్మ వర్షన్ కరెక్ట్ గానే ఉంది మరి నువ్వు ఎందుకు పట్టించుకోలేదు నాన్న అని అడిగింది ఆ అమ్మాయి.. నాకు మన బిజినెస్ లు తోనే సరిపోతుంది కదా తల్లి తనకు కావాల్సిన డబ్బులు అవి మన మేనేజర్ చూసుకుంటూ ఉంటాడు నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తననీ అని అడిగి చెప్తాను అన్నాడు…
బాగా బిజీ నాన్న మీరు కన్న కూతురు విషయాలు మేనేజర్ ని అడిగి చెప్తారా మంచిది అని అంటున్న కూతురుతో అయినా తన విషయాలు ఇప్పుడు నీకెందుకే వదిలింది అనుకున్న దరిద్రం గురించి అంది తల్లి…
నాకే కావాలమ్మా నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాక మీకు చెప్తానులే అప్పటివరకు నన్ను ఏమి అడక్కండి.. నాన్న ఆ మేనేజర్ డీటెయిల్స్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి అంటూ అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోయింది…
ఓహో తమరు నాకు అక్క గారా.. చూద్దాం ఈ అన్వాంటెడ్ బంధం నాకు ఎలా ఉపయోగపడుతుందో.. ఉపయోగపడకపోయినా ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసులే అంటూ తనలో తనే పథకాలు రచించుకొని నిద్రకు ఉపక్రమించింది.
హాల్లో కూర్చుని ఒక ఫోటోని తదేకంగా చూస్తున్న తన కొడుకు దగ్గరకొచ్చింది ఆ తల్లి… దగ్గరకొచ్చిన ఆమెతో అయిపోయాయా నీ పతి సేవలు అని అడిగాడు తను..
ఆయన ఎంతైనా నీ తండ్రి అది మర్చిపోకు అంది ఆమె… పెద్ద గొప్పలే ఆ ముసలోడు అంత ముంచేదాకా ఇద్దరూ తెలుసుకోలేక అంత విలాసాల్లో మునిగితేలుతున్నారా అన్నాడు కోపంగా..
జరిగిపోయిన వాటి గురించి కాదు జరగవలసిన దాని గురించి ఆలోచించని నీకు నేను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను… ముందు నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్ నువ్వు సక్సెస్ అయితే డబ్బు నీ వెనకే వస్తుంది… సొసైటీలో మంచి పేరున్న డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నువ్వు అనుకునే నేమ్ ఫేమ్ అవే వస్తాయి…
ముందు వాటి గురించి ఆలోచించకుండా ఎప్పుడూ నన్ను అనడం కాదు అంటూ కోపంగా సమాధానం ఇచ్చింది ఆమె…
నేను ఆయన జీవితంలో ఉన్నాను కాబట్టే నువ్వు ఇక్కడ ఈ పెద్దింట్లో ఇలా కూర్చొని టైం గడపగలుగుతున్నావ్ అది మర్చిపోకు ఎట్టి పరిస్థితుల్లో అంది…
నేనేదైనా మాట్లాడితే ఇలా మాట్లాడి నా నోరు మూయిస్తావ్ కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండుంటే కోట్ల ఆస్తి మన చేజారిపోయి ఆశ్రమాలపాల అయ్యుండేది కాదు కదా అంత డబ్బు నేను తిరిగి సంపాదించాలంటే ఎన్ని సినిమాలు చేయాలో తెలుసా నీకు అన్నాడు…
తెలుసు తెలిసిన ఏమీ చేయలేను అయినా ఒకప్పుడు నీతండ్రి కున్న ఫేమ్ తోనే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిలబడగలుగుతున్నావ్. ఇకమీదట ఏం చేయాలో ఆలోచించు ఇక మీద జరిగిపోయిన వాటి గురించిన డిస్కషన్ మన మధ్య రాకూడదని ఆ తల్లి కూడా సీరియస్ గానే చెప్పింది…
హిట్ ఎక్కిన వాతావరణం చల్లబరచ తలిచిన అతను ఒక ఫోటో ఆన్ చేసి తన మొబైల్ తల్లి ముందర పెట్టాడు….
నవ్వుతూ చేతులూపుతో తన ముందర వాళ్లతో మాట్లాడుతున్నట్టు ఫోజులో ఉన్న ఆ ఫోటోను చూసి ఇంప్రెస్ అయినా ఆమె ఎవరి ఈ అమ్మాయి.. లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది నీ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఆ అని అడిగింది…
అన్నీ కలిసి వస్తే నా జీవితంలో ఉండబోయే హీరోయిన్ అన్నాడు… ఏం మాట్లాడుతున్నావ్ వర్ధన్ అందామె…
ఆ ఫోటో చూస్తే అర్థం కావట్లేదా తను హై ప్రొఫైల్ అమ్మాయి… ఇప్పటివరకు నేను తనని ఎక్కడ బయట చూడలేదు.. ఈరోజు మాల్ లో చూశాను… అది కూడా ఎల్లనో తెలుసా వాళ్లు ఆ ఫ్లోర్ లో ఉన్నారు అని ఆ ఫ్లోర్నే బ్లాక్ చేశారంటే ఆలోచించు… తను ఎంత స్పెషల్ అని ఒకవేళ తను హై ప్రొఫైల్ కాకపోయినా నాకేం అభ్యంతరం లేదు తనని చూశావా ఎలా ఉందో నా పక్కన రియల్ హీరోయిన్ లాగా ఫిట్ అవుతుంది అన్నాడు ఊహల్లో తేలుతూ…
ఆ ఫోటోని తదేకంగా చూసిన రోజా.. తన చుట్టూ ఉన్న అబ్బాయిలు ఎవరో తనకేమవుతారు డీటెయిల్ గా తెలుసుకో గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవద్దు అని తన అనుభవంతో హితబోధ చేసింది కొడుకుకి…
అలాగే లే అని ఇవాళ కొత్త స్టోరీ డిస్కషన్ కి డైరెక్ట్ వస్తా అన్నాడు ఇంటికి కొంచెం దాని అరేంజ్మెంట్స్ చూసుకో అన్నాడు…
ప్రొఫెషన్ ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయద్దు వర్ధన్… నీ పర్సనల్ అండ్ ఫ్యామిలీ గురుంచి కూడా ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడు… వన్స్ నువ్వు నెంబర్ వన్ పొజిషన్ కి రీచ్ అయ్యాక నీలో ఉండే నెగటివ్స్ అన్నీ అవే కొట్టుకుపోతాయి అప్పటివరకు చాలా జాగ్రత్తగా ఉండు ఎటువంటి వివాదాల్లో ఇరుక్కోవద్దు… ఇప్పటికే నీ మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించు అంది…
ఆ పెళ్లి చేసుకునేది ఏదో ఇలాంటి సెకండ్ హ్యాండ్ మొగుడ్ని చేసుకోకుండా ఇంకెవరినైనా చూస్ చేసుకో ఉండొచ్చుగా నువ్వు అన్నాడు… నీలాగా నాది అన్నీ ఉన్న జీవితం కాదు ఏది దొరికినా సర్దుకుపోవాల్సిన సిచువేషన్… నాకు ఈ జీవితం దొరకడమే ఎక్కువ… చెప్పాను కదా నీకు అన్నీ ఎక్కువ అయ్యి ఇలాంటి మాటలు వస్తున్నాయి…
అసలు వారసురాల్ని పక్కనపెట్టి నీ చేతికి పగ్గాలు అందించాను అది మర్చిపోవద్దు అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది రోజా.
రోజులు ఎవరికి వారికి మామూలుగా సాగిపోతున్నాయి… వర్మ నిలయం మాత్రం తమ వారసుల్ని మీడియాకి సొసైటీ కి పరిచయం చేయదలచినప్పటి నుంచి ఆ పనుల్లో బిజీగా ఉంది…
దానికి సంబంధించిన పనులు బ్యాక్ ఎండ్ లో వేగవంతంగా జరుగుతున్నప్పటికీ ఎవరికి వారు హైరానా పడుతున్న సమయంలో రోషన్ కి ఒక కాల్ వచ్చింది…
ఏదో అన్నోన్ నెంబర్ కావడంతో కొంచెం పక్కకు వెళ్లి అటెండ్ చేశాడు… సర్ నేను ఒక సీక్రెట్ డిటెక్టివ్ ని… మీ చెల్లెలు డీటెయిల్స్ ఎంక్వయిరీ గురించి నా దగ్గరికి ఒక కేసు వచ్చిందని చెప్పాడు.. తను మీ చెల్లెలు అని నాకు ఎలా తెలుసు అంటే నేను మీరు చదివిన కాలేజీలోనే చదివాను అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు.. నేను ఈ డిటెక్టివ్ ఏజెన్సీ ని స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ కూడా నాకు మీరే…
మీరు మా ఫైనల్ ఇయర్ లో ఇచ్చిన స్పీచ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయదలచి ఈ డిటెక్టివ్ ఏజెన్సీ ని స్టార్ట్ చేసుకున్నాను…
అనుకోకుండా నా దగ్గరికి మీ చెల్లెలు గారి డీటెయిల్స్ కావాలని వచ్చారు అందుకే మీకు ఇంఫార్మ్ చేస్తున్నాను… నా ప్రొఫెషన్ కి ఉండాల్సిన కట్టుబాట్లని దాటి మరి… అని చెప్పాడు…
ఎవరు ఆ క్లైంట్ అని అడిగాడు రోషన్… ఒక ప్రొడ్యూసర్ పేరు చెప్పి ఇతను సినిమా ప్రొడ్యూసర్ సర్ ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడని చెప్పాడు… ఓకే తన డీటెయిల్స్ నాకు పంపు అలాగే ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి ఈ విషయం ఇక నేను చూసుకుంటాను నువ్వేమీ తన డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు… అలాగే సార్ థాంక్యూ ఫర్ ఇన్స్పైర్ మీ అని చెప్పి కాల్ కట్ చేశాడా డిటెక్టివ్..
తన బావ సీరియస్ గా కాల్ మాట్లాడటం గమనించిన అరుణ్ తన దగ్గరికి రావడంతో తన ఫోన్లో డీటెయిల్స్ చూపించి పది నిమిషాల్లో మనం ఈ అడ్రస్ లో ఉండాలి అని చెప్పాడు… విషయం ఏంటో సీరియస్ అని అర్థం చేసుకున్న అరుణ్ కార్ కాకుండా పోర్టికోలో ఉన్న బైక్ తీశాడు…
అడ్రస్ కి చేరుకున్న బావా బామ్మర్దులు ఇద్దరు సెక్యూరిటీ ఆపుతున్న కూడా ఆగకుండా నేరుగా ఆఫీస్ రూమ్ లోకి ప్రవేశించారు పాపం ఆ ప్రొడ్యూసర్ కర్మగాలి అప్పుడు ఆల్రెడీ అతని ఆఫీసు రూమ్ లోనే ఉండడంతో ఇద్దరు చేతిలో బాగా తన్నులు తిన్న తర్వాత…
ఎందుకు కొడుతున్నారో విషయం చెప్పి కొట్టండి అని చేతులెత్తి దండం పెట్టాడు… దాంతో రోషిని ఫోటో చూపించిన రోషన్ తిన డీటెయిల్స్ నీకెందుకు ఎందుకు డిటెక్టివ్ ని అప్రోచ్ అయ్యావు అని అడిగాడు…
సర్ నేను లో బడ్జెట్లో ఒక సినిమా చేయదలచి ఒక హీరోని అప్రోచ్ అయ్యాను తను నా సినిమాలో వర్క్ చేయాలంటే తిన డీటెయిల్స్ నాకు కావాలని కండిషన్ పెట్టాడు తనని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియక డిటెక్ట్ అని అప్రోచ్ అయ్యాను అని ఉన్నది ఉన్నట్టే చెప్పేసాడు అతను…
ఎవరు ఆ హీరో అని ఇంకొకసారి కాలర్ పట్టుకోవడంతో… తను వర్ధన్ డీటెయిల్స్ ఇచ్చేసాడు..
అసలు ఏం జరిగిందంటే కొత్త సినిమా డిస్కషన్ కోసం ప్రొడ్యూసర్ చెప్పినట్టే హీరోని వాళ్ళ ఇంట్లోనే మీట్ అయ్యాడు.. అప్పటికే రోషిని ఫోటోలు చూసి ఆలోచిస్తూ ఉన్న తనకి ఈ ప్రొడ్యూసర్ని చూడగానే ఒక ఐడియా వచ్చింది తనే నేరుగా రంగంలోకి దిగడం కంటే మూడో పర్సన్ ద్వారా ఎంక్వయిరీ చేస్తే తన డీటెయిల్స్ బయట రావని తెలివి చూపించి పాపమీ ప్రొడ్యూసర్ని ఇరికించాడు…
ఇంకేముంది నేరుగా బావా బామ్మర్దులు ఇద్దరు అక్కడి నుంచి ఆ వర్ధన్ ఇంటికి చేరుకున్నారు సోషల్ మీడియాలో తన అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి… దారిలోనే రోషన్ అరుణ్ కి అన్ని విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాడు…
తను ఎంతో కొంత పబ్లిక్ ఫిగర్ కావడంతో సెక్యూరిటీ దగ్గర గొడవ పడకుండా డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వచ్చినట్టు చెప్పారు ఇద్దరు…