సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోనే ఉన్న వర్ధన్ కి డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి తనని కలవడానికి మనుషులు వచ్చారని కాల్ చేయడంతో ప్రొడ్యూసర్ వెంటనే తన పని ముగించేసాడు అన్న ఆనందంలో అసలు విషయం తెలియక వాళ్ళని ఇంట్లోకి పంపించమని చెప్పాడు…
వీళ్ళు నేరుగా తన దగ్గరికి వెళ్ళడంతో ఆటిట్యూడ్ గా కాళ్ల మీద కాలు వేసుకొని కనీసం కూర్చోండి అని కూడా చెప్పకుండా తన డీటెయిల్స్ అన్నీ దొరికాయి అని అడిగాడు..
రోషన్ ఆవేశ పడే అంతలో తన చేయి పట్టుకొని మెల్లగా కంట్రోల్ చేసిన అరుణ్ దొరికాయి సార్ కానీ తన డీటెయిల్స్ మీకు ఎందుకో మాకు చెప్పగలరా అని అడిగాడు..
ఆ విషయం మీకెందుకు అయిన ప్రొడ్యూసర్ మిమ్మల్ని నేరుగా ఇక్కడకి ఎందుకు పంపించాడు మేము చెప్పమన్న డీటెయిల్స్ తెలుసుకున్నారా మీకు కావాల్సిన అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారా మీ పని అంతవరకే కదా అన్నాడు…
నిజమే సార్ కానీ మీకు డీటెయిల్స్ ఇచ్చే ముందర మీరు ఏ పర్పస్ తో ఎంక్వైరీ చేయించారో తెలుసుకోవడం కూడా మాకు అంతే ముఖ్యం ఆ ప్రొడ్యూసర్ ఆ విషయాలు తెలియకే మమ్మల్ని మీ వరకు పంపించాడు… మీరు చెప్పే కారణంతో మేము సటిస్ఫై అవుతే తప్ప అలా ఒకరి పర్సనల్ డీటెయిల్స్ మీకు అందివ్వడం కుదరదు అది మా ప్రొఫెషన్ లో ఒక భాగం అన్నాడు అరుణ్…
అది కాక మీరు ఒక పబ్లిక్ ఫిగర్ మీరు ఏ చిన్న విషయం చేసిన అది సెన్సేషన్ అయిపోతుంది అందుకే అడుగుతున్నామని లోపల లావాలా పొంగుతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని మరీ చెప్పాడు అరుణ్…
నేనేమీ ఇల్లీగల్ ఆక్టివిటీస్ చేయడానికి ఆ అమ్మాయి డీటెయిల్స్ మిమ్మల్ని కనుక్కోమని చెప్పలేదు తనని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను తనని చూసిన మొదటి చూపులోనే నాకు నచ్చింది..
మీరే అన్నారు కదా నేను పబ్లిక్ ఫిగర్ నని నేరుగా నేను అప్రోచ్ అవ్వలేక తన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఎలా అప్రోచ్ అవాలో నిర్ణయించుకుందామని.. మొదటగా మీలాంటి డిటెక్టివ్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది అన్నాడు…
అయ్యో అలాగా సార్ అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఎవరితోనో కాదు తన బావతోనే అన్నాడు రోషన్…
అవన్నీ మీకెందుకు తనని ఎలా నా భార్యగా చేసుకోవాలో నాకు తెలుసు అది నేను చూసుకుంటాను ముందు డీటెయిల్స్ ఇవ్వు అన్నాడు.. అయ్యో ఇస్తున్నాను సార్ అంటూ ముందుగా అరుణ్ తన పంచ్ పవర్ తో మూడు లోకాల దర్శనం చేపించాడు వర్ధన్ కి… తర్వాత రోషన్ కూడా అదే ఫాలో చేయడంతో.. నన్నే కొడతారా మిమ్మల్ని ఇప్పుడే పోలీసులకు పట్టిస్తానంటూ విర్రవిగాడు వర్ధన్…
అవునా అలాగే ఇద్దరం కలిసి ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం నువ్వు మేం కొట్టామని కేసు పెట్టు మేము నువ్వు మా మరదల్ని మా చెల్లిని ఏడిపిస్తున్నావు అని కేసు పెడతామన్నారు ఇద్దరు ఒకేసారి… అప్పుడు అయ్యగారు మొదటిసారి వీళ్ళని పరీక్షించి చూసాడు. వీళ్ళు కూడా ఆ ఫోటోలే వాళ్ళే కావడంతో ముందుగా గుర్తుపట్టినందుకు తన్ని తనే తిట్టుకున్నాడు వర్ధన్…
దాంతో సైలెంట్ అయిన వర్ధన్ని బావ బామ్మర్దులు ఇద్దరు ఫుల్లుగా కుమ్మేసి నెక్స్ట్ సినిమాకి ఒక నాలుగైదు నెలలు పనికిరాకుండా చేసేసారు.. ఇంకొకసారి నీ చూపు నీ ఆలోచన తనని చేరాలని చూసిన నీకు పాడి కన్ఫామ్ అని వార్నింగ్ ఇచ్చారు..
నేను చచ్చిన సరే నా ప్రయత్నాలు ఆపను అన్నాడు వర్ధన్ ఫ్యూచర్ లో ఏమైనా జరగొచ్చు నా సినిమాలో చూసి ఇష్టపడి తనే నన్ను కోరుకోవచ్చుగా అన్నాడు తనని నేను నన్ను ప్రేమించేలాగా చేసుకుంటాను మీరు ఎవరు మా మధ్యలోకి రాకుండా ఉంటే అన్నాడు వర్ధన్ పౌరుషంగా.. కిందపడిన వర్ధన్ ముందర మోకాలు మీద కూర్చున్న రోషన్.. నవ్వుతూ నీ సినిమాలు చూసి నీకు పడిపోద్ది అనుకుంటున్నావా చేతులు కట్టుకొని తనని చూస్తున్న అరుణ్ణి చూపించి వాడిని ఒకసారి చూసావా.. మనం నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు వాడికంటే నువ్వు అందంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు.. మా చెల్లి పెద్దగా అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు కానీ.. తనది తన వాళ్ళు అనుకున్న వాళ్ళు పక్క చూపులు చూస్తే అన్న అయినా బావ అయినా చేతులు విరిచేస్తది అలాంటిది నీ సినిమాలు చూసి నిన్ను ప్రేమిస్తుందా.. కలలో కూడా అనుకోకు నువ్వు చేసేది యాక్టింగ్ అయినా కూడా అమ్మాయిలతో నువ్వు చేసే ఓవర్ యాక్టింగ్ ని క్షమించేంత ఉదార స్వభావం తనకి లేదు.. తనకి దూరంగా ఉంటే నీకు నీ జీవితానికి నీ సినిమా కెరియర్ కి అంత మంచిది అన్నాడు అరుణ్.. వీడికి ఇది చాల్లే పద బావ అంటూ రోషన్ చేయి పట్టుకుని అక్కడ నుంచి కదిలాడు అరుణ్..
అప్పుడే ఏదో గుర్తొచ్చిన రోషన్ ఇంకొకసారి ఫుల్లుగా కుమ్మేసి అరుణ్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు.. బైక్ స్టార్ట్ చేసిన అరుణ్ రెండోసారి ఇంకా కసిగా కుమ్మేసావ్ ఎందుకు బావ అని అడిగాడు… వీడు ఎవడో కాదు పూజ వాళ్ళ నాన్న కొడుకు అన్నాడు… వీడికి నా చేతిలో తన్నులు ఎప్పుడో పడతాయి అనుకున్నాను మన రోషిని పుణ్యమా అని ముందుగానే జరిగిపోయింది లే పదా అన్నాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని స్ట్రెక్టుగా వార్నింగ్ ఇచ్చాడు రోషన్…
ఆ విషయం నువ్వు ఇంతగా చెప్పాలా బావ నాకు తెలుసులే అయినా మన బంగారం వీడి కంట్లో ఎప్పుడు పడింది అన్నాడు అరుణ్… మనం వెళ్లేటప్పుడు వాడు ఓ ఫోటో తదేకంగా చూస్తున్నాడు గమనించలేదా.. అది మన మాల్ లో తీసిన ఫోటోనే.. వెధవ కొంచెం జాగ్రత్తగా చూసి ఉంటే మనల్ని మొదటే గమనించి ఉండేవాడు… అంతముందు చూపు లేక మన చేత తన్నులు తిన్నాడు లే పదా అంటూ నవ్వుకొని ఇద్దరు ఇంటికి చేరుకున్నారు…
తమ వారసులని మీడియాకి పరిచయం చేసే విషయంలో వర్మ నిలయం బిజీ బిజీగా ఉండడంతో.. రోషన్ అరుణ్ చేసిన పని ఎవరికీ తెలియలేదు వాళ్ళు చెప్పలేదు…
వర్మ దంపతుల నుంచి శ్రావ్య పేరెంట్స్ కి పూజ పేరెంట్స్ కి అలాగే రాధిక పుట్టింటికి కబురు వెళ్ళింది..
కబురు సారాంశం ఈ ఆదివారం తప్పకుండా అందరూ వర్మ నిలయం కి చేరుకోవాలని…
జరిగే పనులు జరుగుతూ ఉంటే పూజ మాత్రం రోషన్ కి తెలియకుండా.. రోషిని తో అలాగే అజయ్ తో మాట్లాడడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది…
హాల్లో ఒక్కటే కూర్చుని టీవీ ఆన్ చేసుకొని ఆలోచనలో మునిగిన రోషిని దగ్గరకు వచ్చింది రాధిక…
తను పక్కన వచ్చి కూర్చునింది కూడా తెలియకుండా ఆలోచనలో మునిగిన రోషినిని కదిలించింది రాధిక..
మా కోడలు పిల్ల ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అని అడిగింది రాధిక…
ఇంతలో అక్కడికి వచ్చిన అరుణ్ రోషినికి ఇంకో పక్కన కూర్చుని వీలైతే ఈ పంజరం నుంచి ఎగిరిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది నీ కోడలు అన్నాడు…
అవునా బంగారం. అంది రాధిక ఒక అంత కంగారుగా… నవ్వుతూ అదేమీ లేదులే అత్తా నీ కొడుకు ఊరికే కామెడీ చేస్తున్నాడు అని చెప్పింది రోషిని… లేదు మా నేనేం కామెడీగా చెప్పట్లేదు కావాలంటే నీ కోడల్ని ప్రామిస్ చేసి చెప్పమని చెప్పు అన్నాడు అరుణ్ కూడా తగ్గకుండా,.,.
దాంతో రాధిక రోషిని రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని చూడు బంగారం మనసులో ఏదైనా భయం బాధ ఉంటే అది పక్క వాళ్ళతో పంచుకుంటే భారం తగ్గుతుంది అంతేకానీ లోపలే పెట్టుకొని అదే ఆలోచనతో కృంగిపోవడం తెలివి లేని వాళ్ళు చేసే పని నీ చుట్టూ ఇంత మంది ఉన్నాం కదా నీ సమస్యకి పరిష్కారం చెప్పలేమా అంది…
దాంతో అరుణ్ వైపు కోపంగా చూస్తూ నిజం చెప్పనా అత్త నాకు ఈ హై ప్రొఫైల్ సెక్యూరిటీ అంటే ఒక రకమైన అలర్జీ తెలుసా… ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది తిరిగి ఊరికి వెళ్ళిపోవాలని కానీ మీ అందరి ప్రేమ గుర్తొస్తూ ఉంటే ఆ పని కూడా చేయలేకపోతున్నాను…
డైలీ నాలో నేనే యుద్ధం చేసుకున్నట్టుంది… నిజం చెప్పనా ఫస్ట్ సెమినార్లో వెనక ఇద్దరు గన్ మెన్స్ తో మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకో మీకు ఇంత సోకు అనుకున్నాను అని నవ్వుతూ చెప్పింది రోషిని…
నాకు సోకులు ఎక్కువ అనుకున్నావా అంటూ చెవి మెలేసింది రాధిక… రోషిని ఇస్ అనే లోపల మా నువ్వు ఉన్నావ్ చూడు నొప్పి పెడుతుందేమో అన్నాడు అరుణ్…
దాంతో అరుణ్ చెవి కూడా మెలేస్తూ నేను నీ పెళ్ళాం చెవి పట్టుకోలేదు నా కోడలు చెవి పట్టుకున్నాను అయితే ఏంట్రా ఇప్పుడు అంది…
నా చెవి అయితే మీరు ఎంతసేపైనా పట్టుకోవచ్చు మా అన్నాడు అరుణ్…
ఈ టైంలో సార్ గారు ఇంట్లో ఏం చేస్తున్నట్టు అని అడిగింది రాధికా.. ఏదో పని ఉండి వచ్చాను లేమా అత్త కోడలు ముచ్చట్లు విందామని ఇలా వచ్చాను అంతే అన్నాడు అరుణ్…
అమ్మ కొడుకులిద్దరూ నా మూడ్ డైవర్ట్ చేయడానికి చాలా కష్టపడ్డారు కానీ నౌ ఐ యాం ఓకే అంది రోషిని..
దాంతో అరుణ్ తల్లికి సైగ చేసి చూసుకో అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు ..
అసలు సార్ గారు ఆ టైంలో ఇంటికి ఎందుకు వచ్చారంటే.. వర్ధన్ కి ఫుల్లుగా కోటింగ్ ఇచ్చాక తనకెందుకో రోషిని చూడాలనిపించింది అందుకే బావని రిక్వెస్ట్ చేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగాడు.. రోషన్ కూడా తనని ఇంట్లో వదిలి రోషిని ని దూరం నుంచి చూసి అక్కడి నుంచి అంటే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు
అరుణ్ వెళ్ళాక ఇప్పుడు చెప్పు కోడలు పిల్ల ఏంటి అంత దీర్ఘాలోచనలో ఉన్నావ్ అని అడిగింది రాధిక.. ఏమీ లేదు అత్త నిజం చెప్పాలంటే ఈ మీటింగ్ గురించి కొంచెం టెన్షన్ గా ఉంది అంతే అంతకుమించి ఇంకేం లేదు… అయినా నువ్వు చెప్పు అత్త ఇన్ని రోజులు ఈ లైఫ్ ని ఎలా మేనేజ్ చేశావు ఒకవైపు ఆఫీసు ఒకవైపు ఇల్లు ఇంకోవైపు పెదనాన్న ఫ్యామిలీ.. ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు అదిగాక పెద్ద ఉమ్మడి కుటుంబం ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉండి ఉంటుంది కదా..
నేను వచ్చాక నేను తాతయ్యతో చెప్పానని నువ్వు మామ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ని చిటికెలో వదిలేశారు ఇదంతా ఎలా నా కోసమా నేను ఏమైనా తప్పుగా చేశానా… ఇప్పుడు మళ్లీ నేను అదే ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నాను కదా…
అసలు ఇవన్నీ నేను మేనేజ్ చేయగలనని మీ అందరికీ ఏంటి అంత నమ్మకం..
బావలు అన్నయ్యలు ఉండగా తాతయ్య చైర్మన్ పదవిని నాకే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు..
నా మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా నన్ను నేను ఎంత స్ట్రాంగ్ గా చేసుకున్నా తిరిగి తిరిగి న ఆలోచన అక్కడికే వచ్చా ఆగిపోతుంది …
అమ్మమ్మకి ఉన్నంత లోకజ్ఞానం నీకు మామ్ కి అమ్మకి ఉన్నంత సహనం నాకు ఉన్నాయా ఏమో నాకైతే అర్థం కావడం లేదు అత్త.. ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చెక్కిపోతుందనుకో…
ఆలోచించి ఆలోచించి ఏం చేయాలో తెలియక ఏదో ఎక్స్పరిమెంట్ అనుకోని మాల్ కి చెక్కేస్తే మీ అందరికీ దొరికిపోయి అందరి దగ్గర అక్షింతలు వేయించుకున్నాను.. అంది రోషిని…
తన ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తో రోషిని చెప్పిన మాటలన్నీ ఓపిగ్గా విన్న రాధిక తను ఓవర్ థింకింగ్తో మొదటి స్టేజ్ లో ఉందని ఇట్టే పసిగట్టేసి.. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది…
అయ్యో బంగారు తల్లి.. ముందు బుర్ర లో నుంచి ఈ ఆలోచనలన్నీ తీసేయ్… ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా నీకు… నువ్వు బీటెక్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ మన కాలేజీలో ఎంటర్ అయిన రోజు… నాలుగు సంవత్సరాల సిలబస్ నీకు అదే రోజు తెలుసా ఏంటి.. డే బై డే నేర్చుకున్నావ్ సెమిస్టర్ వైస్ ఎగ్జామ్స్ రాసావ్… కాలేజ్ టాప్ వచ్చావ్ కదా… అదెలా సాధ్యమైంది నీకు అదంతా అంతకు ముందు తెలియదు కదా మరి అని అడిగింది రాధిక…
అక్కడ నాకు తెలియని విషయాలు చెప్పడానికి లెక్చరర్స్ ఉన్నారు అర్థం కాని విషయాలు చెప్పడానికి అన్నయ్యలు బావలు ఉన్నారు స్టడీస్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడానికి మీరంతా ఉన్నారు కదా అంది రోషిని…
కదా నీ భయానికి ఆన్సర్ కూడా నీ ఆ సమాధానం లోనే ఉంది గమనించావా అని అడిగింది రాధిక… అవునా ఎలా అంది రోషిని…