చూసావా నువ్వు చెప్పిన సమాధానం లోనే ఆన్సర్ ఉంది అని అడిగింది రాధిక. అర్థం కాలేదు అత్త అన్న రోషినితో..
సింపుల్ కోడలు పిల్ల.. ఎలా మీ లెక్చరర్ గైడెన్స్ తో అలాగే ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతో కాలేజ్ ఫస్ట్ రాగలిగావో… అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా మీ తాతయ్య అనుభవం చెప్పే పాఠాలు.. మా సహాయ సహకారాలతో పాటు నీ వెనక ఉండి నిన్ను నడిపించటానికి మీ బావలు అన్నయ్యలు మావయ్య డాడ్ నాన్న ఎలాగో రెడీగా ఉన్నారు కదా…
ఇక తప్పులు గురించి అంటావా తప్పులు చేయని మనిషి ఉండనే ఉండడు. అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు అలాగే ఏదైనా పరిస్థితులైనా కావచ్చు.. తప్పొప్పులు గురించి కాలానికి వదిలేసి కొండంత ధైర్యంతో వెనక ఫ్యామిలీ ఉందన్న ఆనందంతో ముందుకు అడుగు వేయి.. విజయం నిన్ను వరించకపోతే అప్పుడు అడుగు అని హితబోధ చేసింది రాధిక…
దాంతో ఎక్కువ ఆలోచించకూడదని డిసైడ్ అయిన రోషిని థాంక్యూ అత్త యువర్ ద బెస్ట్ అంటూ రాధిక బుగ్గ మీద ముద్దు పెట్టి సంతోషంగా తన రూమ్ కి వెళ్ళిపోయింది…
దూరం నుంచే ఒక్కొక విధంగా వీళ్ళ సంభాషణ గమనించిన జానకి గారు కుందన రత్నలు.. రాధిక దగ్గరికి వచ్చి అయ్యాయా అత్తా కోడలు ముచ్చట్లు అని అడిగారు..
కుళ్లు కోకండి మా అత్త ఎలాగో నాకు ముచ్చట్లు చెప్పలేదు అందుకే నేను నా కోడలికి చెప్పుకుంటున్నాను అంది రాధిక..
నిన్ను నీ కోడల్ని చూసి కుళ్ళుకోవాలి నేను మరి అంది జానకమ్మ చేతులు తిప్పుతూ.. ఈ అత్తా కోడలు సంభాషణని వింటూ నవ్వుతూ కూర్చున్నారు కుందన రత్నలు..
ఇదిగోండి ఆడపడుచులు మీ అమ్మకి నాకు గొడవ వస్తే మీరు ఎప్పుడూ నా సైడే ఉండాలి అని చెప్పింది రాధిక..
గొడవ వస్తే అలాగే చూద్దాంలే వదిన అంది రత్న.. ఏ మాకెందుకు గొడవలు రావు మేం మాత్రం అత్తా కోడలు కాదా ఏంటి అంది రాధిక …
అప్పుడంటే బిజినెస్ అంటూ పిల్లలు అంటూ వాళ్ళ చదువులంటూ మొత్తం ఇంటిని నా మీద వదిలేసి వదిన మరదలు పరిగెత్తారు ఇప్పుడు ఖాళీ టైం బాగా ఎక్కువ ఉన్నట్టుంది అందుకే ఈ వయసులో అత్తగారితో గొడవ పడాలని మీ వదినకి బాగా ఇష్టంగా ఉన్నట్టుంది అంది జానకమ్మ…
నీ కోడలు ముచ్చట ఎందుకు కాదనడం తీర్చేయమ్మా అంది కుందనా… నీ చిన్న కూతురు ఏమో గాని పెద్ద కూతురు మాత్రం మనం గొడవ వేసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తుంది అత్తమ్మ అంది రాధిక…
హ మరి ఇంకొక కొద్ది రోజుల్లో ఇంకొ తరం కోడళ్లు కూడా రాబోతుంటే ఇప్పుడు మీ ఇద్దరు గొడవలు వేసుకుంటే నేనే ఎంజాయ్ చేయాలి మరి అంది కుందన…
అప్పుడే అక్కడికి వచ్చిన రంగి మీ ఆదివారంకి ఏం స్పెషల్స్ వండమంటారు అమ్మగారు అని అడిగింది..
ఈ సండే వంట అంతా బుజ్జి తల్లి స్పెషల్ వెళ్లి తనని అడుగు అంది కుందన…
ఇంతకీ సెట్ అయ్యిందా నీ కోడలు అంది జానకమ్మ రాధికతో.. అయినట్టే అత్తమ్మ… ఇంకా కొద్దిరోజులు అప్పుడప్పుడు బూస్ట్ చాలా అవసరం మరి నా కోడలికి అంది రాధిక నవ్వుతూ..
సరే కానీ ఇంకొకసారి మీ కాబోయే వియ్యంకులు అందరికీ ఫోన్ చేసి ఆదివారం కంపల్సరిగా రావాలని గుర్తు చేయండి ఎక్కువ టైం లేదు మనకి అని అందరూ మాట్లాడుకుని ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోయారు…
అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన పూజ సోఫాలో అలసటగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా మంచినీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చింది కవిత… ఈవారం మనం మీ కాబోయే అత్తగారింటికి వెళ్లాలి అని చెప్పింది…
అలాగే అమ్మ రుచి వస్తుందా అని అడిగింది.. అందర్నీ రమ్మని చెప్పారు వెళ్లకపోతే బాగోదు ఇద్దరు పనులు చూసుకొని రెడీగా ఉండండి అని వంటింట్లోకి వెళ్లిపోయింది కవిత..
ఎలా అజయ్ తో తన చెల్లి గురించి మాట కలపాలో అని దీర్ఘాలోచనలోకి వెళ్లిపోయింది పూజ.
వర్మ నిలయం వాళ్ల పనులతో బిజీగా ఉంటే.. బిందు తన తండ్రి ఆఫీస్ ని ఒక మెట్టు పైకి ఎక్కించడానికి తన సాయి శక్తుల ప్రయత్నిస్తూ ఇంట్లో కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉండడం గమనించిన తన తండ్రి తన దగ్గరకు వచ్చాడు..
ఆఫీస్ పని ఆఫీసులో చేస్తే చాల్లే నాన్న ఇంట్లో కూడా చేస్తున్నావ్ అని అడిగాడు అర్జున్ నవ్వుతూ.. ఎక్కువ ఏం లేదు నాన్న కొంచెమే.. కొంచెం క్లయింట్స్ లిస్టు చూస్తూ ఉన్నాను డే బై డే రిక్వెస్ట్స్ ఎక్కువ అవుతున్నాయి ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది ఇలాంటి టైం లోనే ఎక్స్పీరియన్స్ బాగా పనిచేస్తుందేమో కదా అంది…
అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి తండ్రి కూతుర్లు ఇంట్లో కూడా బిజినెస్ మాటలు స్టార్ట్ చేశారా.. అంది ఇద్దరికీ టీ ఇస్తూ…
అయిపోయింది మా నిజం చెప్పాలంటే నేను నీ టీ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా అంటూ తల్లిని కూల్ చేసింది బిందు.. ఆఫీస్ మాటలే ఎక్కువ అయ్యాయి కానీ ఇకనైనా పెళ్లి గురించి ఆలోచించు నీ మనసులో ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా మాకు చెప్పు అంది లక్ష్మి నేరుగా.. రియాల్టీ ని ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది నువ్వు కూడా మీ చెల్లి లాగా మీ మరదలు లాగా చేయొద్దు…
కలలో విహరించడం ఎప్పటికీ మంచిది కాదు నేను కూడా మా అమ్మ మాటలు పట్టుకుని కలలో విహరిస్తూ ఉంటే మీ నాన్న చెయ్యి అందుకోగలిగే దాన్ని కాదు..
ఆశలు చాలా ఉంటాయి కానీ రాత ఒకటే ఉంటుంది ఈ విషయం మీ అందరూ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది త్వరగా మీకు నా కూతురు కి తగిన జీవిత భాగస్వామిని వెతకండి అంది లక్ష్మి..
నాన్న మీకు నిఖిల్ గురించి తెలుసా అని అడిగింది బిందు.. నిఖిల్ అంటే అంది లక్ష్మీ క్యూస్షన్ మార్క్ పేస్ తో..
రాధిక ఆంటీ వాళ్ళ అన్న కొడుకు మా.. నాన్న ఈ విషయం మీకు ఇలా చెప్పచో లేదో తెలియదు..
తన ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వారం వాళ్లంతా వర్మ నిలయంలో మీట్ అవుతున్నారు.. అని చెప్పింది బిందు…
ఆ బిజినెస్ సర్కిల్ లో ఆల్రెడీ వర్మ నిలయం గురించి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది వారసులని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు బిజినెస్ బోర్డ్ ఫార్మ్ చేయబోతున్నట్టు వారసుల పొజిషన్స్ కూడా మీడియాకి అనౌన్స్ చేయబోతున్నారు అన్నాడు అర్జున్ తనకు తెలిసిన విషయాలు చెప్తూ…
ఈ విషయం నిఖిల్ నీతో ఎందుకు మాట్లాడారు అని అడిగింది లక్ష్మీ డౌట్ గా.. ఐ థింక్ నిఖిల్ నాకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు మా… బట్ సంథింగ్ ఏదో తనని ఆపుతుంది..
నాన్న నాకు తెలిసి తను మీకు మంచి ఆప్షన్ అవుతాడు అలాగే నాకు మంచి లైఫ్ పార్టనర్ కూడా అవుతాడు… తను నాకు ప్రపోజ్ చేసే ముందరే నా సమాధానం ఏమయి ఉండాలని మీరు అనుకుంటున్నారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పింది…
మా సమాధానం తర్వాత ముందు నీ మనసులో ఏముందో చెప్పు అని అడిగింది లక్ష్మి…
మా నిజం చెప్పాలంటే నా మనసులో ఇప్పటివరకు ఎవరు చోటు చేసుకోలేదు నాన్న నా ముందర పెట్టిన ఆప్షన్ ఐ థింక్ వర్కౌట్ అవ్వదు నువ్వు చెప్పినట్టు ఆలోచనలు ఎన్ని ఉన్నా రాత ఒకటే ఉంటుంది… రోషన్ ఆల్రెడీ పూజాకి కమిట్మెంట్ ఇచ్చేసాడు… పిల్లల అభిప్రాయాలు కాదని పెద్దలు కూడా ఏమి చేయరు… అందని వాటి వెనక పరుగులు తీయడం కంటే అంది వచ్చిన వాటిని అందుకోవడం తెలివైన నిర్ణయం నేను అనుకుంటున్నాను…
అలాగే నిఖిల్ ఫ్యామిలీ కూడా వర్మ నిలయం తో సంబంధం ఉన్నా ఫ్యామిలీనే… అలాగే తన బిజినెస్ ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడో మీకు బాగా తెలుసు కదా నాన్న ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ నిర్ణయం చెప్పండి అని అడిగింది బిందు.
కూతురు చెప్పిన మాటలతో దీర్ఘ ఆలోచనలోకి వెళ్లారు అర్జున్ లక్ష్మి… మీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే నాన్న సిచువేషన్ ని నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పింది బిందు…
నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పింది లక్ష్మి.. మీకు నాన్న అన్నట్టు అర్జున్ వైపు చూసింది బిందు… నాకు కూడా ఓకే నాన్న..
నాకు తెలిసినంతవరకు అబ్బాయి బుద్ధిమంతుడే ఏటువంటి బాడ్ హ్యాబిట్స్ లేవు కుటుంబానికి విలువిస్తాడు ముఖ్యంగా తను కూడా వర్మ కుటుంబానికి సంబంధించిన వాడే.. ఒకవేళ అబ్బాయి నిన్ను నేరుగా అప్రోచ్ అయితే ఓకే లేదు మమ్మల్ని నేరుగా వెళ్లి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడమన్నా ఓకే అని చెప్పారు తల్లిదండ్రులు ఇద్దరు…
మీరు వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడే ముందర నేను కొన్ని లెక్కలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి నాన్న కొద్దిరోజుల టైం ఇవ్వండి చాలు అని అడిగింది బిందు…
నీ ఇష్టం తల్లి అయితే నాకు పెద్దల్లుడిని వెతికే బాధ్యత తప్పించావు అన్నమాట అని నవ్వుతూ బిందు తల మీద చేయి పెట్టి నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని … అక్కడి నుంచి తమ రూమ్ కి వెళ్ళిపోయారు…ఇద్దరు..
అమ్మాయి చెప్పిన అబ్బాయి మీకు ఓకేనా అని అడిగింది లక్ష్మి… నా కూతుర్లు సుఖంగా ఉండాలని మీ మామయ్య కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని చూశాను అలా అని అదే పట్టుకొని వేలాడుతూ నా పిల్లల మనసులో విషం నింపలేను… మీ అమ్మ మాటలు విని ఆల్రెడీ నా కూతుర్ల విషయాలలో ఒకసారి రాంగ్ స్టెప్ వేశాను మళ్ళీ అదే తప్పు చేయలేను అయినా నా సెలక్షన్ కంటే నా కూతురు సెలెక్షన్ మీద నాకు బాగా నమ్మకం ఉందిలే అని నవ్వాడు అర్జున్…
తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయాక వెంటనే రోషిని కి కాల్ చేసింది బిందు.. ఈ టైంలో తను నాకెందుకు కాల్ చేస్తుంది అని వెంటనే పిక్ చేసింది రోషిని… హలో రోషిని నేను బిందు అంది.. పరిచయం అక్కర్లేదేమో వదిన అంది రోషిని.. తన నోటి వెంట వదిన అనే పిలుపు విన్న బిందు వకింత ఆశ్చర్యపోయిన నిఖిల్ కి తను ఎంత క్లోజో వెంటనే పసిగట్టి…. నవ్వుకొని నేను నీతో ఒక హాఫ్ నవర్ పర్సనల్గా మాట్లాడాలి బయటకు రావడం కుదురుతుందా అని అడిగింది.. మళ్లీ వెంటనే ఒంటరిగా రావద్దు వీలైతే అజయ్ ని తోడు తీసుకుని రా అని చెప్పింది… వై అజయ్ వదిన ఇంకెవరు వద్ద అని అడిగింది రోషిణి…
అలా అని కాదు నీతో పాటు నేను తనతో కూడా మాట్లాడాలి అందుకే ఇద్దరితో ఒకేసారి మాట్లాడడం కుదురుతుంది కదా అని తనని తీసుకొని రమ్మని చెప్పాను వేరే ఇంకేం లేదు ప్లేస్ నువ్వు డిసైడ్ చేసి చెప్పినా ఓకే లేదంటే అజయ్ తో డిస్కస్ చేసి నాకు టైం ప్లేస్ చెప్పవా అని అడిగింది… ఒక టెన్ మినిట్స్ వదిన నేనే నీకు కాల్ చేస్తాను అని చెప్పింది రోషిని…
రోషినితో కాల్ మాట్లాడాక దీర్ఘాలలో వెళ్ళింది బిందు.. టీనేజ్ ఎఫెక్ట్ నుంచి తను బయటపడ్డంత త్వరగా తన చెల్లి బయటపడలేక పోతుంది మనసులో అజయ్ ని గట్టిగా ఫిక్స్ అయింది… ఇక రాదైతే చెప్పనవసరం లేదు . ఏం చేస్తుందో ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియడం లేదు.. పేరుకి ఇద్దరు ఆఫీస్ కి వెళ్లి బిందుకి హెల్ప్ చేస్తున్నారనే కానీ వాళ్ళిద్దరు పని కూడా చెప్పాలంటే బిందు నే చేస్తుంది…
ఫుల్ టైం ఆఫీస్ కి ఇచ్చేసి తన నాన్న స్థాపించిన బిజినెస్ ని చెప్పాలంటే ఒక మెట్టు పైకి ఎక్కించింది బిందు… రోషన్ ఆల్రెడీ కమిట్ అవ్వడంతో తన మీద ఆశలు పెంచుకోవడం తనని తాను హర్ట్ చేసుకోవడమే అని త్వరగా రియాలైజ్ అయింది బిందు… తనతో పాటు తన చెల్లిని కూడా మార్చడానికి తన సాయి శక్తుల ప్రయత్నిస్తూ ఓడిపోతూనే ఉంది….
ఆఖరి అవకాశంగా రోషిని తో ఒకసారి మాట్లాడి అజయ్ తోనే నేరుగా తేల్చుకోదలిచి వాళ్ళిద్దరిని కలవాలని అడిగింది.