ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్న అజయ్ ని రోషిని కాల్ డిస్టర్బ్ చేసింది.. అయినా తన చెల్లి కాల్ ని నెగ్లెక్ట్ చేసే అలవాటు లేని అజయ్ వెంటనే పిక్ చేసి ఏంటి మా బంగారం కి ఇప్పుడు నేను గుర్తొచ్చాను అని అడిగాడు…

మా బావగాడు ఫోన్ ఎత్తడం లేదా అని కూడా అడిగాడు.. నీకు మీ బావకి అంత సీన్ లేదు కానీ మనం ఒక హాఫెన్ అవర్ బయటకు వెళ్లాలి ఇవాళ అని అడిగింది…

మనం అంటే అందరమూ నా నువ్వు నేను మాత్రమేనా అని అడిగాడు అజయ్…. ప్రస్తుతానికి నువ్వు నేనే మన ఫ్యాన్స్ మనల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పింది… ఎవరు పూజ వదిననా అని అడిగాడు…

చో స్వీట్ అంటే వదిన నుంచి కూడా తమరికి కాల్ వచ్చిందా అని అడిగింది రోషిని…

కలవాలని నాకే నేరుగా కాల్ చేసింది నాకే టైం లేక అది ఎలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అని చెప్పాడు..

ఓకే అది కూడా ఫినిష్ చేసేద్దాం కానీ ఇప్పుడు మనం మీట్ అవ్వబోయేది బిందు వదినని ఒక పని చెయ్ ముందు వదినతో మాట్లాడిన హాఫ్ ఎన్ అవర్ తర్వాత తనని అదే ప్లేస్ కి రమ్మని చెప్పు ఏం మాట్లాడుతుందో చూద్దాం అంది అప్పుడే తను ఒక అంచనా కి వచ్చిన రోషిని…

ఏప్పుడో ఎందుకు ఇవాళే తేల్చేద్దాం ఇప్పుడు టైం 5 అవుతుంది 7:00 కి బిందు ని మన ఆఫీస్ కి ఇంటికి మధ్యలో ఉన్న కాఫీ షాప్ కి వచ్చేయమని చెప్పు అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేసి వెంటనే ఒక ప్రైవేటు టేబుల్ బుక్ చేసి ఆ డిటైల్స్ రోషినీకే మెసేజ్ పెట్టాడు అజయ్… అలాగే తమరు ఫీట్లు చేయొద్దు నేనే వచ్చి పిక్ చేసుకుని తీసుకుని వెళ్తాను అని కూడా చెప్పి సేమ్ మ్యాటర్ మిగతా నలుగురికి కూడా కన్వెయ్ చేశాడు మీ ఎవ్వరికి నో ఎంట్రీ నేను రోషిని మాత్రమే వెళ్తున్నామని కూడా చెప్పాడు అజయ్…

ఏమి భాగ్యము నాకు లేదా అదృష్టం అన్నాడు అరుణ్… చల్ దొబ్బెయ్ బే నాకు పని ఉంది మొదులే నేను మా చెల్లి తో బయటకు వెళ్తున్నాను అని కాల్ కట్ చేశాడు అజయ్…

రోషిని కాల్ కోసమే క్షణం ఒక యుగంలా ఎదురు చూస్తూ ఉంది బిందు.. తను ఎదురుచూపులు ఫలిస్తూ రోషిని నుంచి కాల్ తో పాటువాళ్ళు కలవబోయే ప్లేస్ డీటెయిల్స్ కూడా చెప్పి సెవెన్ కి అంత వచ్చేయమని చెప్పింది…

దాంతో ఆఫీస్ అలసట అంత మర్చిపోయిన బిందు రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి అమ్మానాన్నలకి బయటికి వెళుతున్నాను త్వరగా వచ్చేస్తానని చెప్పి తన కారులో రోషిని చెప్పిన ప్లేస్ కి బయలుదేరి వెళ్ళింది…

గ్రూప్ కాల్ తర్వాత అజయ్ పూజకు ఫోన్ చేసి వీలైతే ఆ ప్లేస్ కి రావడం కుదురుతుందా అని అడిగాడు లేట్ అయిన పర్లేదు తిరిగి నేనే డ్రాప్ చేస్తానని కూడా చెప్పాడు… తనకి కూడా ఎక్కువ టైం లేకపోవడంతో ఓకే అని చెప్పింది పూజ..

ఇక్కడ రోషిని ఇంట్లో వాళ్లకి తాను బయటకు వెళ్తున్నట్టు అజయ్ వచ్చి పిక్ చేసుకుంటాడని చెప్పింది ఏంటో అన్నా చెల్లెలు సీక్రెట్ మిషన్ అని అడిగింది కుందన… అంతలేదు మామ్ మిగతా వాళ్లంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడుకుంటారని నేనే దయ తలిచాను అని నవ్వుతూ చెప్పింది..

నాకు ఏదో తేడా కొడుతుంది కుందన అని అడిగింది రాధిక… అత్త ఇది టూ మచ్ ఎప్పుడు నీ కొడుకుతోనే బయటకు వెళ్లాలా ఏంటి అప్పుడప్పుడు మా అన్నయ్యతో కూడా వెళ్లాలి అంది…

నిజంగా అజయ్ వస్తున్నాడా నువ్వే ఫీట్ చేయబోతున్నావా అని అడిగింది రత్న డౌట్ గా.. చూసావా అమ్మమ్మ నీ కూతురికి నా మీద ఎంత డౌట్ ఏదో ఒకసారి తప్పు జరిగిందని ప్రతిసారి అదే తప్పు చేస్తూ మీ దగ్గర తిట్లు తింటామా ఏంటి అని వాదలాడుకుంటున్న వాళ్ళ దగ్గరికి అప్పుడే వచ్చిన అజయ్ రెడీనా బుజ్జి వెళ్దామా అని అడిగాడు…

సూపర్ ఎంట్రీ అన్నాయ్ పద వెళ్దాం వీళ్ళు నా బుర్ర తినేస్తునారు అంది… జాగ్రత్తగా వెళ్లి త్వరగా ఇంటికి వచ్చి చేరండి అని వార్నింగ్ తో ఇద్దరికీ బాయ్ చెప్పారు అంతా.

అందరికీ బాయ్ చెప్పి బయటికి వచ్చారు అజయ్ రోషిని… కారువైపు వెళుతున్న అజయ్ తో బైక్ లో వెళ్దామా అని అడిగింది రోషిని… అప్పుడు కదా అన్నయ్య చేతిలో నాకు పెళ్లయ్యేది ఆల్రెడీ పెద్ద సింహం ఆర్డర్ వేసేసాడు కార్ లోనే వెళ్లాలని నాకు వాడితో తన్నులు తినిపించే ప్రోగ్రాం పెట్టుకోక కార్ ఎక్కు బుజ్జి అన్నాడు…

ఎలా మీరంతా ఇంత అలర్ట్ గా ఉంటారు అని అడిగింది రోషిని… నీ ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోకపోతే మేము మీ అన్నయలమీ ఎలా అవుతాం చెప్పు అన్నాడు…

అంతలేదు ఇప్పుడు వరకు తమరు లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ అనే ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఒన్స్ ఆ పోస్ట్  ఫిల్ అయితే నన్ను చూసే టైమ్ కూడా ఉండదు అంది…

అంతలేదు మా జీవితంలోకి ఎప్పుడు ఎవరు వచ్చినా నీ ప్లేస్ నీదే దాన్ని ఎవరు ఫిల్ చేయలేరు సంతోషపడకు మా టార్చర్ నీకు లైఫ్ టైం ఉంటుంది అన్నాడు…

చూద్దాం చూద్దామంటూ వాదులు ఆడుకుంటూ ఇద్దరు ఆల్రెడీ రిసర్వ్ చేసుకున్న కాఫీ షాప్ కి చేరుకున్నారు…

వాళ్లు చేరుకున్న రెండు నిమిషాలకి బిందు కూడా అక్కడికి చేరుకుంది…

మొహమాటంగా అక్కడికి చేరుకున్న బిందు ఇంకా మొహమాటపడుతూ ఉంటే తనని ఫీల్ ఫ్రీ చేయడానికి కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసింది రోషిని ముగ్గురు కి కలిపి… రోషిని కనుసైగతో నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్పి అజయ్ ఆ ప్లేస్ ఖాళీ చేసి కౌంటర్ దగ్గరికి వెళ్లి పోగా ఇప్పుడు చెప్పండి వదిన ఏంటి నాతో మాట్లాడాలని కాల్ చేశారు అని అడిగింది రోషిని…

అజయ్ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగింది బిందు… నాతో మాట్లాడాలన్నారు కాదా అన్నయ్యతో మాట్లాడాలా అని అడిగింది రోషిని… లేదు లేదు నీతోనే మాట్లాడాలి కానీ మీ అన్నయ్య గురించి మాట్లాడాలి అని డైరెక్ట్ గా విషయానికి వచ్చింది బిందు… అన్నయ్య మనసులో ఎవరైనా ఉన్నారా లేదో నాకెలా తెలుస్తుంది వదినా అది అన్నయనే కదా మీరు అడగాలి అని అడిగింది…

కరెక్టే కానీ మీ అన్నయ్యల గురించి నీకు తెలియని సీక్రెట్స్ ఏమి ఉండవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకే నిన్ను అడిగాను అని బిందు కూడా తగ్గకుండా సమాధానం చెప్పింది…

నీ గెస్ కరెక్టే వదిన నాకు తెలిసి అన్నయ్య మనసులో ఇప్పటివరకు ఎవరు చోటు చేసుకోలేదు అయితే ఏం అని అడిగింది రోషిని…

ఇందు గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది బిందు… తన గురించి నాకేమీ అభిప్రాయం ఉంటుంది వదిన తనతో నేను సరిగా మాట్లాడింది కూడా లేదు అని అడిగింది రోషిని..

తనని నీ చిన్న వదిన ప్లేసులో ఊహించుకోవచ్చు కదా అని తన మనసులో మాట రోషిని ముందు బయట పెట్టింది బిందు… ఇది నా కోరిక మాత్రమే… నా చెల్లెలు తెలియక తప్పులు చేస్తుందేమో కానీ తెలిసి తెలిసి అయితే తప్పులు చెయ్యదు ఎవరికీ హాని కలిగించాలి అని కూడా అనుకోదు…

మీ ఇద్దరి ఫస్ట్ మీట్ ని దృష్టిలో పెట్టుకొని తనని ఎప్పుడు జడ్జ్ చేయొద్దు.. తను వేడిమీదున్న మైనం లాంటిది దేంట్లో పోస్తే ఆ షేప్ ని సంతరించుకొని రంగులు పూయించగలదు… హా నేను ఒప్పుకుంటాను చిన్నదవడం వల్ల అందరూ దాన్ని కొంచెం గారం చేయడం వల్ల కొంచెం మొండిగా ఉంటుందేమో గాని చెడ్డగా అయితే ఉండదు…

మా అమ్మమ్మ నూరిపోసిన మాటల నుంచి బయట రావడానికి తనకి చాలా టైంనే పట్టింది…

నువ్వు అడగొచ్చు నేను కూడా చిన్నదాన్నే కదా తనకున్నంత మొండి పట్టుదల నాకు లేదు అని… కానీ నువ్వు పెరిగిన వాతావరణం వేరు నువ్వు ఉంటున్న మనుషులు వేరు కానీ మా చెల్లి అలా కాదు కదా… అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు కానీ తన తరఫున నేను ప్రామిస్ చేయగలను తను మీ ఇంటి గౌరవం ఒక మెట్టు పెంచగలదు…. తప్పులు అందరూ చేస్తారు వాటిని సరిదిద్దుకున్న వాళ్లే ముందుకు వెళ్ళగలరు… మా చెల్లి మీ ఇంటి కోడలు అయితే రెండు తరాల నిరీక్షణ ఫలిస్తుంది.

ఆ ఈ విషయం నేను కచ్చితంగా అజయ్ మనసులో ఎవరైనా ఉండుంటే చెప్పుండే దాన్ని కాదు… అవకాశం ఉంది కాబట్టే అడుగుతున్నాను…

నా విషయంలో ఆ ఛాన్స్ లేదు అని నాకు తెలుసు దానికి నేనేమీ ఫీల్ అవడం లేదు నా తలరాతలో ఎవరున్నారో కూడా నాకు అర్థమైంది…

ఇంకొక విషయం నీకు సొంత వదిన ని కాలేకపోయాను కానీ ఎప్పటికీ నీ వదిననే… ఈ విషయం మా అమ్మ నాన్నల తర్వాత నీకే చెప్తున్నాను మా చెల్లికి కూడా ఇంకా చెప్పలేదు … నేను నిఖిల్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అది నీకు కూడా తెలుసు అని నాకు తెలుసు… ఈ విషయం నేనేదో నీకు గొప్పగా చెప్పాలనుకోవడం లేదు కానీ ఈ విషయం విన్న వెంటనే సంతోషించే వాళ్ళలో మొదట నువ్వు ఉంటావని చెప్తున్నాను…

అజయ్ కి అమ్మాయిని ఫైనల్ చేసేటప్పుడు ఇందు గురించి కొంచెం మనసులో పెట్టుకోమని మాత్రం రిక్వెస్ట్ చేయగలను ఆ విషయం మాట్లాడడానికి నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను… ఇబ్బంది పెట్టి ఉంటే ఐ యాం వెరీ సారీ అంది… నువ్వే అన్నావు కదా వదినా నాకు ఎప్పటికీ నువ్వు వదినవే అని మరి మనలో మనకి సారీలు ఎందుకు.. నువ్వు చెప్పిన విషయం ఆ నిఖిల్ గాడికి తెలిస్తే భూమి మీద నిలవడు .,.. ముందు నీ నుంచి పార్టీ తీసుకోవాలి కానీ వద్దులే ఫస్ట్ అటు సైడ్ పార్టీ లాక్కుంటాను తర్వాత నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది…

పాపం అజయ్ చాలా సేపటి నుంచి కౌంటర్ దగ్గరే స్ట్రక్ అయిపోయాడు ఇకనైనా పిలవవా అని చెప్పింది బిందు… పిలుస్తాను కానీ నాకు ఒక విషయం చెప్పు వది నేను చెప్తే అజయ్ అన్న వింటాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావ్ అయినా రికమండేషన్స్ తో ప్రేమలు పుడతాయా… నాకైతే తెలీదు కానీ నా వంతు ప్రయత్నం గా అజయ్ కి చెప్తాను… 100% కచ్చితంగా ఒప్పిస్తానని మాత్రం చెప్పలేను వదిన ఐ యాం వెరీ సారీ అంది రోషిని…

నో నో బలవంతం పెట్టొద్దు బుజ్జి జస్ట్ ఒక మాట చెప్పమని మాత్రమే నేను కూడా చెప్తున్నాను… అది కూడా ఇందు పెంచుకున్న ప్రేమ ఒక కారణమైతే మన రెండు తరాల దూరం తగ్గడానికి ఉన్న అవకాశం ఇంకొక కారణం అంతే అని బిందు చెబుతూ ఉండగా అజయ్ అక్కడికి వచ్చాడు…

ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీ ముగ్గురు తాగాక ఇక నేను బయలుదేరుతాను జరగబోయే ఫంక్షన్ కి అలాగే తాతయ్య మీకు ఇవ్వబోతున్న బాధ్యతలకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది బిందు…

ఓహో ఈ టైంలో కోల్డ్ కాఫీ తాగిస్తున్నావ్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా అనాలి నీ పేరే చెప్తానంది రోషిని.. నువ్వే కావాలని తాగావని నేను కూడా చెప్తాను అన్నాడు అజయ్ కూడా తగ్గకుండా… నేను పెద్దన్నకి చెప్తానంది రోషిని… అన్నకే కాదు నీకు కాబోయే మొగుడికి కూడా చెప్పుకో నేనేం భయపడను అన్నాడు అజయ్ కూడా… వీళ్లిలా వాదలాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చింది పూజ…

సారీ గాయ్స్ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు కానీ నాకు ఎక్కువ టైం లేదు అందుకే ఇంత త్వరగా కలవాలని చెప్పాను అని తన వర్షన్ చెప్పింది పూజ…

మనలో మనకేంటి వదిన అయినా ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మని చెప్పారు అని అడిగింది రోషిని… దాంతో ఏమాత్రం మొహమాటం లేకుండా అజయ్ తో రుచిత గురించి నీ ఒపీనియన్ ఏంటి అజయ్ అని అడుగుతూ తను నీకు చిన్న వదినగా ఓకేనా అని అడిగింది

దాంతో అజయ్ రెస్పాండ్ అవుతూ చూడండి వదిన తను మీకు చెల్లిగా నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పటివరకు తెలుసు . అంతేకానీ తనని మీరు చెబుతున్న ప్లేస్లో నేను ఎప్పుడూ ఊహించుకోలేదు…

దీని గురించి మాట్లాడడానికి పిల్చుంటే ఐ యాం వెరీ సారీ అన్నాడు అజయ్…