అజయ్ మాటలకి ఒక ఇంత ఆశ్చర్యపోయింది పూజ.. పూజ మాట్లాడుతున్నంత సేపు మధ్యలో మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయింది రోషిని కూడా..

ఓకే  ఇప్పటివరకు ఆలోచనలేదేమో ఒకవేళ  అరేంజ్డ్ మ్యారేజ్ లో నీకు రుచి మ్యాచ్ వస్తే ఎలా ఫీల్ అవుతావ్… మా పేరెంట్స్ మీ పేరెంట్స్ ముందర ప్రపోజల్ పెట్టి మీ పేరెంట్స్ ని డిసిషన్ అడిగితే ఏం చెప్తావ్ అని అడిగింది పూజ ….

అప్పుడు ఏం చెప్తానో తెలియదు కానీ అలాంటి సిచువేషన్ రాకూడదని మాత్రం కోరుకుంటాను వదిన ప్లీజ్ మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది ఇంకా ఈ విషయం పొడిగించొద్దు అన్నాడు అజయ్…

నిన్ను హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు అజయ్ నా చెల్లెలే నాకు తోడుకోడలుగా రావాలని చిన్న స్వార్థం అంతే అంది…

సారీ టు ఇంటరప్టు వదిన మీకు.. ఒక తోటి కోడలే కాదు ఇంకో తోడికోడలు కూడా ఉంది తను పరాయి దేగా మరి తనని మీ తోడికోడలుగా కన్సిడర్ చేయరా అని అడిగింది రోషిని…

చి చి అలా ఏం లేదు రోషిని అవకాశం ఉంది కదా అని అడిగాను… పైగా మా చెల్లికి అజయ్ అంటే ఇష్టం కూడా ఉంది అందుకే తప్పుగా అనుకోవద్దు అని ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది పూజ…

ఇప్పటివరకు అన్నయ్య పెళ్లి విషయం అమ్మమ్మ తాతయ్యల చేతిలోనే ఉంది వదిన ఇక్కడితో డిస్కషన్ ఆపేద్దాం ప్లీజ్ అంది రోషిని…

దాంతో ఒకింత డిస్సప్పాయింట్ అయిన పూజ ఎక్కువ పొడిగించకుండా.. ఇట్స్ ఓకే  ఆశ పడినవి అన్ని జరగాలని లేదు కదా… ఒకవేళ నేను నీకు ఈ విషయం చెప్పి ఉంటే నువ్వు ఒప్పుకోనుంటే అవకాశం నేను చేతులారా వదిలేసాను అనే రిగ్రెక్ట్ ఫీల్ అవ్వకూడదని నా మనసులో మాట మీకు చెప్పాను అంతే ఇంకేమీ లేదు… ఈ విషయం మన ముగ్గుర మధ్యనే ఉండాలి ఎవరితో డిస్కస్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది పూజ…

ఇట్స్ ఓకే వదిన దీంట్లో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని సిచువేషన్ ని తేలికపరిచింది రోషిని…

వాళ్ల మీటింగ్ ని చల్ల చల్లని ఐస్ క్రీమ్ తో ముగించి.. పూజ ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి వర్మ నిలయం కి బయలుదేరారు… రోషిని అజయ్ లు..

వదిన ఈ విషయం ఎవరితో చెప్పొద్దనింది కానీ మన అన్నయ్యకి చెప్పకుండా ఉండలేముగా అంది రోషిని… సమయం చూసి చెప్పేద్దాములే  అన్నాడు అజయ్…

నువ్వు ఒక విషయం చెప్పు బుజ్జి బిందు అలాగే పూజ వదిన ప్రపోజల్లో ఎవరిది నీకు జెన్యూన్ గా అనిపించింది అని అడిగాడు అజయ్

పూజ వదినది తన పర్సనల్ ఒపీనియన్ లాగా అనిపిస్తే బిందు వదినది ఫ్యామిలీ మీద కన్సన్ అనిపించింది అని తన ఒపీనియన్ చెప్పింది రోషిని

ఇద్దరిలో ఒకరిని నీ వదినగా సెలెక్ట్ చేసుకోవాలంటే నీ ఓటు ఎవరికి వేస్తావు అని అడిగాడు అజయ్…

ఓ మై డియర్ బ్రదర్ వదిన సెలక్షన్ ఫస్ట్ నీ వైపు నుంచి ఉండాలి నా వైపు నుంచి కాదు.. వాళ్ళిద్దరే కాదు ఇంకా ఏ అమ్మాయి అయినా నీ లైఫ్ లోకి లైఫ్ పార్టనర్ గా అడుగుపెడితే తనే నా వదిన అవుతుంది తప్పితే ఎవరో చెప్పారని కాదు…

అయినా నీ పెళ్లి ఏంటి అన్నయ్య ఇంత కాంప్లికేటెడ్ గా తయారవుతుంది…

అందరూ లవ్ చేసి చూస్ చేసుకున్నట్టు నువ్వు కూడా ఏవరో ఒకరిని లవ్ చేసి ఉంటే పని అయిపోయి ఉండేదిగా చూడు ఇప్పుడు ఇద్దరమ్మాయిలకు అసలు రేపు పెట్టావు అంది రోషిని…

ఆశలు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు తల్లి నాకు అంత సీన్ లేదు అన్నాడు అజయ్ నవ్వుతూ…

సరే నాకు ఒక విషయం చెప్పు తాతయ్య ఇందూ రుచితలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకోమంటే ఎవరికి నీ ఓటు అని అడిగింది రోషిని…

రుచి అయితే కచ్చితంగా కాదు బుజ్జి అన్నాడు అజయ్… ఎందుకు అని అడిగింది రోషిని…

ఇందు మీద నాకు పర్టికులర్గా ఎలాంటి ఒపీనియన్ లేదు అయినా నీకు తెలుసు కదా మనం వాళ్ళని కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువ.. ఇక రుచి గురించి అంటావా నేను గమనించినంత వరకు తను… మనల్ని కలవడానికి చాలా సందర్భాలలో పూజ వదినని యూస్ చేసుకుంది..

తను చేసిన చాలా విషయాల్లో తన స్వార్థం నాకు పర్ట్టికలర్గా కనిపిస్తుంది.. అందుకే తన విషయంలో ఎగ్జాక్ట్ గా నో అని చెప్తున్నాను..

మన ఫ్యామిలీలోకి రావాలంటే స్వార్థం ఫ్యామిలీ గురించి అయి ఉండాలి కానీ పర్సనల్గా ఉండకూడదు..

అని తన ఆలోచన రోషిని తో చెప్పి కార్ని పార్కింగ్లో నిలిపి వీళ్లకోసమే ఎదురు చూస్తున్న మిగతా ఫ్యామిలీలో జాయిన్ అయిపోయారు ఇద్దరు..

మిగతావాళ్లంతా డిన్నర్ కంప్లీట్ చేసి ఉండడంతో వీళ్ళిద్దరికే వడ్డించింది రంగి…

వాళ్లు కూడా డిన్నర్ తరువాత ఫ్యామిలీతో కలిసి పోయారు నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరి కోసమే ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంది చాలా రోజులుగా అందరూ ఎవరు పనులతో వాళ్ళు బిజీగా ఉండడంతో కుటుంబానికి సమయం తగ్గిందని అందరి ఫీలింగ్ అది ఈరోజు ఫిల్ఫిల్ చేసుకోవాలని అందరూ హాల్లోనే గ్యాదర్ అయ్యారు…

అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వర్మ గారు వాళ్ల పిల్లలతో మీటింగ్ అనంతరం ఎవరి బాధ్యతలు వాళ్లకి అప్పగించడంతోపాటు మీకు కాబోయే కోడల్ని కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను ఇది మీకు సమ్మతమేనా అని కూతుర్లని అల్లుళ్ళని కొడుకు కోడల్ని అడిగాడు…

పిల్లలకు ఇష్టమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అందరూ ఏక కంఠంతో చెప్పారు…

ఆఫీస్ విషయాల నుంచి ఇంట్లో విషయాలు వరకు అలాగే పర్సనల్ విషయాలు అన్నిటిని మాట్లాడుకొని 12 గంటల వరకు టైం స్పెండ్ చేశారు అంతా… ఎలాగో నెక్స్ట్ డే సండేనే కాబట్టి…

పెద్దవాళ్లంతా జంటలు జంటలుగా తమ తమ రూములకు వెళ్ళిపోతే..

మిగిలిన ఆరు మంది మాత్రమే హాల్లో మిగిలారు …

రోషన్ సోఫాలో కూర్చుని ఉంటే రోషిని తన ఒడిలో పడుకుని ఉండగా మిగిలిన వాళ్లు కూడా బీన్ బ్యాగ్స్ అడ్జస్ట్ చేసుకొని రౌండ్ గా కూర్చున్నారు…

అరుణ్ రోషిని కాళ్లు తన ఒడిలో పెట్టుకొని తను కూడా సోఫాలో సెటిల్ అయితే మిగిలిన వాల్లు ఓ అన్నారు…

రోషిని రోషన్ చేతులతో ఆడుతూ అన్నయ్య తాతయ్య లైఫ్ పార్ట్నర్స్ ని కూడా పరిచయం చేస్తామంటున్నాడు కదా మరి అజయ్ అన్న పరిస్థితి ఏంటి.. మీ మరదలు ఉంది కదా రుచి తనని తగిలించేద్దామా అంది తమాషాగా

నో నో తను మన ఫ్యామిలీకి కరెక్ట్ కాదురా అన్నాడు రోషన్.. కానీ వదినకి కోరిక ఉంటుంది ఏమో కదా వాళ్ళ చెల్లి తోడుకోడలుగా వస్తే బాగుంటుందని అంది రోషిని…

తన కోరికని వీడి మీద బలవంతంగా రుద్దడం కరెక్ట్ కాదు కదరా అని రోషన్ చెప్పడంతో…

రెస్టారెంట్లో పూజను కలిసిన విషయం చెప్పారు ఇద్దరు.. సేమ్ నీలానే అజయ్ అన్నది కూడా అదే ఒపీనియన్ అని నవ్వింది రోషిని..

అలాగే ఇవాళ రెస్టారెంట్లో బిందు ని కూడా కలిసాం అన్నాడు అజయ్…

అవునా తనేం మాట్లాడింది అన్నాడు వరుణ్… వాళ్ల చిన్న చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోమని రిక్వెస్ట్ చేసింది … మన చెల్లెల్ని మన కుటుంబానికి తగినట్టుగా మారుస్తుందట.. తనలో పెంకితనం ఉందేమో కానీ క్రూరత్వం లేదు అంటుంది మరి… అని చెప్పింది రోషిని.. మరి వీడేమన్నాడు అని అడిగాడు విజయ్.. అన్నగారు ఈ విషయంలో న్యూట్రల్ అంది రోషిని…

అందరి విషయం పక్కన పెట్టేసి ముందు నీ మనసులో ఏముందో ఇప్పటికైనా ఓపెన్ గా చెప్పరా బావగా అన్నాడు అరుణ్…

టు బి హోనేస్ట్ మీ అందరిదీ మీ పర్సనల్ ఛాయిస్ అయింది కదా నాది మాత్రం మన ఫ్యామిలీ చేతిలో పెట్టాలని నా దృఢమైన విశ్వాసం అన్నాడు అజయ్..

అలా ఎందుకు బావ మాది కూడా ఫ్యామిలీ డిసిషన్ ఏ కదా అన్నాడు అరుణ్… కోయి కోయి నువ్వు బంగారం కి జైపూర్ లోనే పడిపోయావని నాకు తెలుసు అన్నాడు అజయ్..

కుర్ర బ్యాచ్ అంత హాల్లో చేరి మాట్లాడుకుంటూ ఉండగా అజయ్ తన పెళ్లి పెద్ద వాళ్ళ చేతుల మీదుగా నిర్ణయించబడాలనుకుంటున్నానని చెప్పడంతో… నీ పెళ్లి మన ఇంట్లో వాళ్ళ నిర్ణయించిన అమ్మాయితోనే జరగాలని నేను మనస్పూర్తిగా విష్ చేస్తున్నాను రా బామ్మర్ది అన్నాడు వరుణ్…

అంత వెటకారం వద్దులే బావ ఏదో మన బంగారం దయవల్ల నీకు సుచి అక్క ఈజీగా దొరికేసింది అన్నాడు విజయ్….

కలిసొస్తే అంతే ర చిన్న బామ్మర్ది… మంచి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ అలా ఫిక్స్ అయిపోతారు సోల్మెట్ ఈజీగా దొరికేస్తారు… మీకులా టైం తీసుకోరు అన్నాడు వరుణ్…

బావా నువ్వు అన్నయ్యలని వెక్కిరిస్తున్నావ్ సుచి అక్క దగ్గర ఏదో ఒక విషయంలో ఇరికించేయ్ గలను జాగ్రత్త అంది రోషిని…

అంత పని మాత్రం చెయ్యకు బంగారం… మళ్లీ తనని ప్రసన్నం చేసుకోవడానికి నేను నాన్న ఫీట్లు పడాలి అన్నాడు వరుణ్…

బావ ఆ మాత్రం భయం ఉండాలి మేమంటే అన్నాడు అజయ్…

వీళ్ళ ఆర్గ్యుమెంట్ ని కామ్ గా వింటున్నా రోషన్తో … మేము వదినని రెస్టారెంట్లో కలవడం నీకు నచ్చలేదా అన్నయ్య అని అడిగింది రోషిని…

అలా ఏమీ కాదురా తను కలవాలంటే వెళ్లి కలవడంలో మీ తప్పేముంది అయినా తను దేని గురించి మాట్లాడుతుందో మీకు ముందుగానే తెలియదు కదా అన్నాడు… కానీ తను మీతో మాట్లాడే ముందు ఒకసారి నాతో మాట్లాడుంటే నేనే తనకి క్లియర్ గా క్లారిఫై చేసి ఉండేవాడిని… అన్నాడు రోషన్…

మేబీ నీ డెసిషన్ తనకి ముందుగానే తెలుసేమో అన్నయ్య… అందుకే ఆఖరి ప్రయత్నంగా మమ్మల్ని కలిసిందేమో అన్నాడు అజయ్… అంతే ఉంటుంది లే బావ ఈ విషయం అంతగా సీరియస్గా తీసుకొని తనతో దూరం పెంచుకోవద్దు అన్నాడు అరుణ్…

అంతే అంతే అయినా బావ చెప్పినట్టు అన్నయ్య లైఫ్ లో ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్ళు అలా నడుచుకుంటూ వచ్చేస్తారు. మీరు చూస్తూ ఉండండి అంది రోషిని…

దాంతో అందరూ అంతే అంతే అనుకోగా బుజ్జి నువ్వు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్త ఎవరు తోడు లేకుండా బయటకు వెళ్లొద్దు శ్రావ్యా వచ్చాక షాపింగ్ అంటూ కూడా ఎక్కువ బయట తిరగకుండా బోటిక్ వాళ్ళని ఇంటికే పిలిపించుకోండి అన్నాడు రోషన్…

అలా ఎలా అన్నయ్య నేను వదిన సుచి అక్క బోలెడు ప్లాన్స్ వేసుకొని ఉన్నాం ఇష్టమై వస్తే పూజిత వదిన కూడా అంది రోషిని…

కానీ ఇప్పుడు ఎక్కువ టైం లేదు కదరా ఈ ఒక్కసారికి అలా చేయండి తర్వాత మీరు ఎక్కడ ఎంతసేపు షాపింగ్ చేయాలంటే నేనే దగ్గరుండి తీసుకెళ్తాను ప్రామిస్ అన్నాడు రోషన్…

శ్రావ్య కి నేను చెప్తాను లేరా అన్నాడు విజయ్.. సుచి కి వాళ్ళ అన్నయ్య నువ్వు ఎంత చెప్తే అంత కదరా బుజ్జి సో ప్రాబ్లమ్ ఏం లేదు అన్నాడు వరుణ్..

నాకేం ప్రాబ్లం లేదులే కానీ షాపింగ్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు అది మీ అందరికీ తెలుసు కదా కానీ నన్ను షాపింగ్ కి వెళ్లొద్దని స్పెసిఫిక్ గా చెప్పారంటే ఏదో జరిగింది అదేంటో నాకు చెప్పేయండి అంది రోషిని…

పెద్ద విషయమేం కాదులేరా నీ ప్రొఫైల్ ఒకరి ద్వారా ఎంక్వైరీ కోసం డిటెక్టివ్ ని చేరింది… అది నేను సాల్వ్ చేశాను కానీ వాళ్ళు నిన్ను పర్సనల్గా కలవాలని ట్రై చేయొచ్చు అందుకే చెప్తున్నాను అన్నాడు రోషన్

ఎవరన్నయ్య అంత సాహసం చేసింది అన్నాడు విజయ్  … దాంతో వర్ధన్ గురించి రోషన్ అరుణ్ ఇద్దరూ చేసింది డిటైల్డ్ గా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లైన్ చేశారు..

కామ్ గా ఏదో ఆలోచన చేస్తున్న అజయ్ తో రేయ్ వాడికి ఆల్రెడీ కోటింగ్ పడిపోయింది నువ్వు మళ్ళీ పర్సనల్ కోటింగ్ లాంటివి పెట్టుకోవద్దు అసలే అప్కమింగ్ హీరో వాడి ఫ్యాన్స్ కంట్లో మనం పడడం అంత మంచిది కాదు అన్నాడు రోషన్…

బుజ్జి ఇప్పటికే లేట్ అయింది వెళ్లి పడుకో మీరు కూడా అంత వెళ్లి నిద్రపోండి చాలా లేట్ అయిపోయింది అని అందర్నీ వాళ్ళ రూమ్ లకి పంపాడు రోషన్…

అజయ్ నువ్వు వెళ్లి మీ చినబావ గాడి రూమ్ లో పడుకో అన్నాడు అరుణ్ణి ఉద్దేశించి..

రోషన్ అలా ఎందుకు అన్నాడు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి..

గివ్ యువర్ కామెంట్ రేటింగ్ అండ్ ఫైనల్లీ ఫాలో మీ..https://thequriouslife.com/