మీ బావ కంపెనీని బాగా ఎంజాయ్ చేయరా బామ్మర్ది అంటూ అరుణ్ బుగ్గ తట్టాడు రోషన్..
బావ ఇది అన్యాయం అంటూ గారాలు పోతున్న అరుణ్ తో రేయ్ ఇప్పటికే బాగా లేట్ అయింది బంగారం బాగా అలసిపోయింది నకరాలు పడ్డావు అనుకో మక్కిలిరుగుతాయి అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు రోషన్..
అజయ్ టేక్కేర్ అని ఇంకొకసారి చెప్పి అందరూ ఎవరు రూములకు వాళ్ళు వెళ్లాక రోషన్ మాత్రం రోషిని రూమ్ కి వెళ్లి తను పడుకునే అంతవరకు మెల్లిగా కబుర్లు చెప్పి పడుకున్నాక లైట్ ఆఫ్ చేసి తన రూమ్ కి వెళ్ళాడు…
రూమ్ కి వెళ్ళిన రోషన్ కి ఎంతకీ నిద్ర పట్టలేదు.. పూజ ఎందుకు రుచిత విషయంలో అంత పట్టుదలగా ఉందో అర్థం కాలేదు.. ఎందుకు ఎవరి పర్సనల్ ఛాయిస్ వాళ్లకు ఉంటుందని విషయం తను అర్థం చేసుకోలేకపోతుందో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు…
అక్కడి నుంచి మనం కొంచెం వెనక్కి వెళ్దాం..
బిందు రెస్టారెంట్లో రోషిని తో మాట్లాడి తన మనసుని తేలిక పరుచుకొని ఎంతో కొంత హోప్ రావడంతో సంతోషంగా ఇంటికి వచ్చి చెల్లెలి రూమ్ డోర్ కొట్టింది..
డోర్ ఓపెన్ లోనే ఉండడంతో అక్కని చూసిన ఇందు ఏంటక్కా కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావ్ అని అడిగింది.. చెల్లెలు గారు ఏ బిజీ లో ఉన్నారో తెలియదు కదా అందుకని అంది..
నువ్వు మర్చిపోయినట్టున్నావ్ ఇంతకుముందు వరకు మనం ఇద్దరం ఇదే రూమ్ లో ఉండే వాళ్ళం ఏదో మీ మీటింగ్స్ కి నావల్ల డిస్టబెన్స్ అవ్వకూడదని నువ్వు వేరే రూమ్ లో ఉంటాను అంటే ఒప్పుకున్నాను కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంది ఇందు…
మీటింగ్స్ ఒక కారణం అయితే చెల్లెకి ఇండివిడ్యుఅల్టీ డెవలప్ చేయాలని వాళ్ల మధ్య ఫ్యూచర్లో రాబోయే దూరానికి ఇప్పటినుంచి తనని ప్రిపేర్ చేయాలని బిందు ఇలా రూమ్స్ వేరు చేసింది..
జనరల్ విషయాలు మాట్లాడుకుంటూ మాటల్లో మాటగా అఖిల్ నిఖిల్ వాళ్ల మీద నీ అభిప్రాయం ఏంటి అని చెల్లెల్ని అడిగింది.. తను రోషిని వాళ్ళని కలిసిన విషయం మాత్రం చెప్పలేదు… చెప్పి అనవసరంగా హోప్ పెంచడం తనకి ఇష్టం లేక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది.. పర్టికులర్గా వాళ్ల గురించి ఒపీనియన్ ఎందుకు అడుగుతున్నావు అక్క అని అడిగింది ఇందు… ఏం లేదు వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి నిన్న అంట కట్టేద్దామని అంది బిందువు నవ్వుతూ…
పాపం నన్ను భరించక శక్తి వాళ్లకి లేదు లే అక్క వదిలేయ్ అంది ఇందు… అదే అయితే నిజమేలే అని ఇద్దరు నవ్వుకొని… ఇద్దరు కలిసి కిందికి వచ్చి అమ్మానాన్నలతో కలిపి డిన్నర్ చేసి వాళ్ళ రోజుని ముగించారు…
వీకెండ్ అని ఊరు వెళ్ళొస్తానని చెప్పి రాదా వాళ్ళ ఊరికి చెక్కేసింది ఇక్కడ ఉంటే ఫ్రీగా ఫోన్ మాట్లాడడం కుదరడం లేదని…
అక్కడ పూజ మాత్రం రుచితతో తను రోషిని అజయ్ ని కలిసి మాట్లాడిన విషయం పూసగుచ్చినట్టు చెప్పింది… నా వంతు ప్రయత్నం నేను చాలా గట్టిగా చేశాను రుచి రిజల్ట్ ఏదైనా నువ్వు బాధపడకూడదు అని కూడా చెప్పింది…
అసలు అజయ్ కి ఏంటి అక్క ప్రాబ్లం బాగానే ఫ్రెండ్లీగా మాట్లాడుతాడు కదా… ఏదో గర్ల్ ఫ్రెండ్ పోస్టు ఖాళీగా ఉంది కదా అని అది నాకు ఇవ్వమంటే ఫోజులు కొడుతున్నాడు…
ఆ రోషిని మాత్రం ఏం తక్కువ ఏం ఒక్క మాట వాళ్ళ అన్నయ్యకి చెప్పచ్చు కదా అంది రుచి…
ఆ మాటలు విన్న కవిత పొరపాటున కూడా నీ నోట్లో నుంచి తన గురించి తప్పుగా మాట్లాడి మీ అక్కయ్య జీవితం నరకప్రాయం చేయొద్దు.. ఇష్టపడడం మీ హక్కు అయితే ఇష్టం లేదని చెప్పడం కూడా అబ్బాయి హక్కు అది నీకెందుకు అర్థం కావడం లేదు ఎందుకు ఈ విషయంలో మీ అక్క చెల్లెలు ఇద్దరు ఇంత మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారు…
ఒప్పుకుంటాను మీ ఇద్దరూ ఒకే ఇంట్లోకెళ్తే మీ అక్క అమాయకత్వానికి నీ గడుసుతనానికి.. కలిసిమెలిసి ఉంటారని మేము ఆశపడ్డ మాట నిజమే.. కానీ ఇప్పుడు మీ అక్క కోడలుగా వెళ్లే ఇంట్లో ఇక్కడ కంటే ఎక్కువ సంతోషంగా ఉంటుంది… తన గురించి ఇక దిగులు అక్కర్లేదు.. ఇక నీ గురించి అయితే మాకు అసలే దిగులు లేదు ఎక్కడికెళ్లినా నీ నోటితో బతికి పోతావులే అంది రుచితని ఉడికిస్తూ..
అమ్మ నువ్వు రుచి ణి మరీ ఏడిపిస్తున్నావు అంది పూజ… నేనేమీ ఏడిపించడం లేదు రియాల్టీ చెప్తున్నానంది కవిత..
నువ్వే అంటున్నావు గా అది నాకు ఇంకొక పుట్టిల్లు అని మరి అలాంటి ఇల్లు నా చెల్లికి కూడా ఉండాలని నేను అనుకోవడం తప్పు కాదు కదా అమ్మ అంది పూజ..
ఏ మాత్రం అవకాశం ఉన్న నేను కానీ మీ నాన్న కానీ వదులుకుంటామా… అలా అని ఎదుటి వాళ్ళకి ఇష్టం లేని పనిని మనం బలవంతంగా చేపించలేం కదా.. అసలు వాళ్లతో సంబంధం కలుపుకోగలగడమే మన అదృష్టం..
అది మనకి దక్కింది కదా అని ఇంకా ఎక్కువ ఆశపడడం అత్యాస అవుతుంది.. మీకు తెలుసు కదా అత్యాశ దుఃఖానికి చేటు..
ఆ అబ్బాయికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో మీ చెల్లి తలరాతలో ఎవరున్నారో కాలం నిర్ణయిస్తుంది కానీ వచ్చి భోన్ చేయండి అని కూతుళ్ళకి హితబోధ చేసి వెళ్లిపోయింది కవిత..
నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గివ్వపిచ్చేది లేదు నాకు కావాల్సింది విసిగించైనా సాధించుకుంటాను నేను ఓడిపోయే పక్షంలో నిన్ను కూడా గెలవనివ్వను మిస్టర్ అజయ్ అని మనసులో అనుకొని అక్కతో కలిసి వెళ్లి భోంచేసి అమ్మానాన్నలకి కాసేపు కబుర్లు చెప్పి వాళ్ళ రూమ్ కి వచ్చి నిద్ర పోయారు అక్క చెల్లెలు ఇద్దరు.
రూమ్ కి వెళ్ళిన అరుణ్ అజయ్ ఎప్పుడు నిద్ర పోతాడా అని ఎదురు చూస్తూ ఉండడంతో రేయ్ నోరు మూసుకొని నిద్రపో. నువ్వు నిద్రపోయేంతవరకు నేను ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోను అన్నాడు అజయ్… ఆల్రెడీ అన్నయ్య బంగారం రూమ్ లో ఉన్నాడు ఇప్పుడు వెళ్లావంటే తన్నులు తింటావని మరోసారి హెచ్చరించి అరుణ్ ప్రయత్నాన్ని విరమించాడు అజయ్…
సింగిల్ చింతకాయ గాడివి నీకేం తెలుసు నా కష్టాలు.. మిగిలిన ముగ్గురే మేలు వాళ్లకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు లేదంటే ఫోన్లతో టైం పాస్ చేస్తున్నారు..
నా పరిస్థితి చూడు ఎదురుగానే పెట్టుకుని కంటి నిండా చూసుకునే దానికి లేదు మనసారా మాట్లాడుకునే దానికి లేదు..
ఫ్యామిలీ తర్వాత నేను అయితే నా అదృష్టానికి సంతోషపడాలో బాధపడాలో నాకే తెలియట్లేదు అన్నాడు అరుణ్…
ముందుగా మీ పెళ్లి చేసేయమని తాతయ్యకి నా తరఫునుంచి రికమెండ్ చేయనా అన్నాడు అజయ్… అప్పుడు కదా నీ చెల్లి నా బ్యాండ్ మోగించేది నీ రికమండేషన్ నీ దగ్గరే పెట్టుకొని పడుకో ఇంకా అని దుప్పటి తన్ని పడుకున్నాడు అరుణ్… దాంతో అజయ్ కూడా నిద్రపోయాడు..
ఇంకొక రోజుకి వెల్కమ్ చెప్తూ సూర్య భగవానుడు ఎంట్రీ ఇచ్చి వర్మ నిలయాన్ని మేలుకొల్పాడు…
అందరూ రోజువారి పనులు ముగించుకొని పూజ అటెండ్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అనంతరం మధ్యాహ్నం అతిథి మర్యాదలకు రెడీ చేసుకుంటూ ఉంటుంటే రోషిని మాత్రం హ్యాపీగా వెళ్లి నిద్రపోయింది…
మొదట శ్రావ్యా ఫ్యామిలీ వర్మ నిలయంని చేరుకోగా తర్వాత సుచి అండ్ ఫ్యామిలీ రావడంతో చివరగా పూజ ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది…
మగవాళ్లంతా హాల్లో సెటిల్ అయితే ఆడవాళ్ళంతా లివింగ్ ఏరియాలో సెటిల్ అయ్యారు.. పిల్ల బ్యాచ్ అంత ఆ రోజుకి స్టడీ రూమ్ లో సెటిల్ అయ్యారు…
శ్రావ్య రాగానే పెద్ద వాళ్ళందరినీ పలకరించి నేరుగా రోషిని రూమ్ కి వెళ్లి తను నిద్రపోతూ ఉండడంతో
తనకి ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా తిరిగి వచ్చి మిగిలిన వాళ్ళతో కూర్చొని విజయ్ ని పలకరించింది… మొదట ఆడపడుచుని దర్శనం చేసుకుంటే గానీ పతిదేవుడు కనిపించలేదా అని ఆటపట్టించింది సుచి…
వదిన నువ్వు మా పార్టీ కదా మమ్మల్ని టీస్ చేయకూడదు అంది శ్రావ్య… దేని దారి దానిదే అంది సుచి కూడా….
వీళ్ల మాటలు మీద ఏ మాత్రం ఆసక్తి లేనట్టు తన చెల్లితో ఒక సైడ్ కూర్చుని ఉన్న పూజని ఒక క్షణం గమనించాడు రోషన్….
అది గమనించిన వరుణ్ తను మంచిదే బావ మన కుటుంబానికి కూడా పర్ఫెక్ట్ కాకపోతే ఇప్పుడు తన చెల్లెలి మీద ప్రేమ ఎక్కువగా ఉండడంతో మిగతా విషయాలు కనిపించడం లేదు అంతే అన్నాడు…
నేను ఆలోచిస్తుంది అది కాదు బావా.. బుజ్జి నా రుచి నా అనే సిట్యుయేషన్ తనకి వస్తే తను కచ్చితంగా రుచి వైపు ఉంటుంది… కానీ బుజ్జి నేనా అరుణ్ ఆ అనే సిచువేషన్ వస్తే న్యాయం ఎవరి వైపు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వైపే నిలబడుతుంది… దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు…
రోషిని విషయంలో పూజ బిహేవియర్ రోషన్ ని ఒకంత అసహనానికి గురి చేసిందనే చెప్పాలి.. యంగ్ బ్యాచ్ అంత కుశల ప్రశ్నలు అయ్యాక… వసంత ముబావంగా ఉన్న నిఖిల్ ని గమనించాడు వరుణ్..
ఏంటి సుచి నీ అన్న మొఖం మాడుచుకుని ఉన్నాడు నీ తమ్ముడేమో 1000 బల్బ్ వెలుగుల వెలిగిపోతున్నాడు ఏంటి కథ అని అడిగాడు…
ఏంటి బావ నా మీద పడ్డావు ఇవ్వాలా అని అడిగాడు అఖిల్… ఫేస్ లో బ్రైట్నెస్ పెరిగింది ఒంటిమీద స్మార్ట్ నెస్ పెరిగింది కచ్చితంగా డౌట్ వస్తుంది కదా మరి అన్నాడు అరుణ్…
ఇవాళ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి కాదేమో అన్నయ్య అంది రుచి… ఇవి కాదా? ఏం డిస్కస్ చేయబోతున్నామో నీకు తెలుసా మరి అని అడిగాడు రోషన్…
ఖచ్చితంగా తెలియదు కానీ ఒక ఐడియా అయితే ఉంది బావ అంది రుచి ఎగ్జైటింగా… రుచి ఎక్సైట్మెంట్ ని ఒకంత అసహనంగా చూశాడు అజయ్…
శ్రావ్య వైపు సైలెంట్ గా చూస్తూ సైట్ కొడుతున్న విజయ్ మీద పిల్లో విసిరేసాడు నిఖిల్.. ఏంట్రా మా మరదలుకి ఆ రేంజ్ లో సైట్ కొడుతున్నావ్ అన్నాడు… మీ మరదలు పక్కనే ఉన్న నన్ను పట్టించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంది అన్నయ్య మరి అన్నాడు…
ఎక్కడో ఎందుకు ఆలోచిస్తుంది మీ చెల్లిని మా చెల్లి బీభత్సంగా మిస్ అవుతుంది బావ అన్నాడు వరుణ్…
మరి ఎక్కడ మహారాణి గారు ఇక్కడ లేరు అని అడిగింది రుచి… మా ఇంటి యువరాణి కాబోయే మహారాణి కదా అందుకే ఇక్కడ లేదు తన మందిరంలో సేద తీరుతుందని అంతే వెటకారంగా సమాధానమిచ్చాడు అజయ్…
అందరికీ అన్ని అందిస్తున్న రంగి జానకమ్మ గారి దగ్గరికి రావడంతో… వెళ్లి రోషిని నిద్ర లేపే తీసుకుని రా అందరూ అక్కడ ఉంటే తను మాత్రం రూమ్ లో ఉంది అన్నారు….
బుజ్జమ్మ నిద్రపోతుందమ్మా అంది రంగి అంతే చిన్నగా… మళ్లీ మీరెందుకు నన్ను నిద్ర లేపలేదని తిరిగి గొడవ చేస్తుంది అందుకే వెళ్లి నిద్ర లేపు పో ఏం కాదు అంది జానకమ్మ….
దాంతో రోషిని గదిలోకి వెళ్ళింది రంగి…
టెడ్డీబేర్ని హగ్ చేసుకుని ముద్దుగా పడుకున్నా రోషిని ని నిద్ర లేప బుద్ధి కాలేదు రంగీకి… కానీ కింద ఏదో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నారని సెన్స్ చేసిన రంగి కష్టంగా వెళ్లి… బుజ్జి లేమ్మా కింద అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారంటూ నిద్రలేపింది….
అయ్యో అవునా అన్నయ్యని నిద్ర లేపమని చెప్పి మరీ పడుకున్నాను కదా అన్నయ్య నిద్ర లేపలేదు మరీ అన్నీ రంగీని ముద్దుగా అడిగింది నిద్రలో..
సరిపోయింది చెప్పక చెప్పక మీ అన్నయ్యకే చెప్పావా… మా బుజ్జి నిద్రలేక లేచాకే సమావేశం అనుకుని ఉంటాడు లేమ్మా అంది… నువ్వైనా వచ్చావ్ నిద్ర లేపడానికి థాంక్స్ రంగి అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ… నేను వచ్చేస్తాను కానీ అన్ని పనులు నెత్తి మీద వేసుకోకుండా మిగతా పని వాళ్ళని కూడా పనిలో వంచు అని సలహా ఇచ్చింది రోషిని.
అలాగే బుజ్జి తల్లి నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా వెళ్తున్నాను త్వరగా వచ్చేయమ్మ అని ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లి అదే విషయం జానకమ్మకు చెప్పింది…
త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన రోషిని అందరినీ పేరుపేరునా పలకరించి రోషన్ దగ్గరికి వెళ్లి అజయ్ అన్న నన్ను చీట్ చేశాడు నన్ను నిద్రపుచ్చి అందరు వచ్చిన వెంటనే నిద్ర లేపుతానని ప్రామిస్ ని బ్రేక్ చేసి నన్ను అందరి ముందర లేజీ అమ్మాయి గా నిలబెట్టాడు అంది…
అలా ఎందుకు అనుకుంటావ్ బుజ్జి ఇష్టంగా చేసేదే నిద్రపోవడం ఆ స్వతంత్రం కూడా నీకు లేకపోతే ఎలా చెప్పు…
అయినా వీళ్ళు వచ్చి ఐదు నిమిషాలు అయింది అంతే అన్నాడు రోషన్…
వాళ్ళు వచ్చి గంట అవుతున్న ఆ గంట ని ఐదు నిమిషాలు గా మార్చేసిన రోషన్ లోని అన్న ప్రేమను చూస్తున్నా రుచి… తన అక్కతో మన ఫ్యూచర్ నాకు బాగా అర్థం అవుతుంది అక్క అంది మెల్లిగా తనకి మాత్రమే వినపడేలా…..
మన ఫ్యూచర్ అంట రుచి మదిలో ఏముందో మరి నాకైతే తెలియదు…
ఇంకో రెండు మూడు ఎపిసోడ్స్ లో స్టోరీ మీరు అనుకోని మలుపు తిరగబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే జస్ట్ ఫాలో మీ…
వెయిట్ లాస్ టిప్స్ కోసం చూస్తుంటే ఈ లింక్ ఒక సారి చుడండి
https://thequriouslife.com/5-best-magic-drinks-to-reduce-4-5-kgs-in-one-month-in-a-healthy-way/
వెయిట్ లాస్ గురించి అలాగే ఇంకా చాలా విషయాలు గురుంచి అవగాహనా కావాలి అంటే ఈ వెబ్సైటు ఫాలో అవ్వండి
https://thequriouslife.com/