అజయ్ మీద రోషన్ కి కంప్లైంట్స్ చెప్పేశాక సుచరితని అక్క అంటూ గట్టిగా పలకరించింది రోషిని.
ఇక్కడ నేను కూడా ఉన్నాను బుజ్జి అంది శ్రావ్య… అక్క నీకేమైనా వినిపిస్తుందా అంది రోషిని… వదిలే బంగారం ఎక్కువ చేస్తే ఏడ్చేస్తుంది అసలే చాలా రోజుల తర్వాత కలుసుకున్నామన్నాడు విజయ్.
చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నారు… ఒప్పుకుంటాను కానీ ఫోన్ కి ఏమైంది అన్నయ్య రోజు మీరు మాట్లాడుకుంటున్నారు గా నాకు మాత్రం మీ ఆవిడకి కాల్ చేయలేదు అందుకే నేను అలిగాను అంతే అంది బుజ్జి…
మీ ఆవిడకి ఊరెళితే నేను అసలు గుర్తే ఉండను అన్నయ్య అంది రోషిని మళ్లీ.. అది కాదురా బుజ్జి మా బంగారానికి ది బెస్ట్ డ్రెస్ రెడీ చేయాలి కదా అందుకే కొంచెం బిజీగా ఉన్నాను ఈ ఒక్కసారికి క్షమించవా ప్లీజ్ అంది శ్రావ్య రోషిని గడ్డం పట్టుకుని బతిమిలాడుతూ.
కరిగేదాకా బతిమిలాడుకుంటే కరుణిస్తాను అంది రోషిని చెయ్యెత్తి దీవించినట్టు చూపిస్తూ.
పాపం బంగారం మన శ్రావ్య నే కదా ఈ ఒక్కసారికి పెద్ద మనసుతో క్షమించేసెయ్ అంది సుచి… అక్క చెప్తే ఓకే అంది… ఆ తర్వాత అఖిల్ నిఖిల్ ని కూడా పలకరించి పూజకి రుచికి హాయ్ చెప్పి వెళ్లి రోషన్ పక్కనే కూర్చుంది తిరిగి… డ్రామా అయిపోయింది గా అనుకుంది మనసులో రుచి…
చూసావా వాళ్ళిద్దర్నీ చూసి ఎంత ఎక్సైట్ గా ఫీల్ అయిందో ఏదో సంవత్సరాల తరబడి దూరంగా ఉన్నట్టు లాస్ట్ వీక్ గా అంతా మాల్లో కలుసుకున్నారు నిన్ను మాత్రం జస్ట్ హాయ్ అని పలకరించింది అని అడిగింది రుచి… అలా అయితే నేను జస్ట్ నిన్నే తనని కలిసాను కదా అందుకే అలా చెప్పిందిలే కాసేపు కామ్ గా ఉండు అంది పూజ…
ఇక హాల్లో అందరూ కూర్చుని వర్మ గారు ఏం చెప్తారు అన్నట్టు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు…
దాంతో ఆయన గొంతు సవరించుకొని రామ్ రమ… వెంకటేష్ కవిత శ్యామ్ లహరి మనమంతా కలిసి ఇంకొక రెండు రోజుల్లో పిల్లల్ని తీసుకొని మా సొంతూరికి వెళ్తున్నాం
అక్కడ రామాలయంలో రాముల వారి కళ్యాణం జరిపించి తిరిగి వచ్చాక ఈ ఆదివారం ఇక్కడే ప్రెస్ మీట్ తో పాటు బిజినెస్ సర్కిల్ వాళ్లకు కూడా గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను మన ఇంటి గార్డెన్ లోనే అని తన ప్లాన్ ని వివరించారు ఈ మార్పులు చేర్పులు మా పిల్లలకు కూడా చెప్పలేదు మొదట మీకే చెప్తున్నాను.
మొదట ఎక్కడైనా ఫంక్షన్ హాల్ లో చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ ముఖ్యమైన నిర్ణయాన్ని నలుగురితో పంచుకోవడానికి మన ఇంటి కంటే మంచి ప్లేస్ లేదనిపించింది.
మీకు అభ్యంతరం లేకపోతే రాముల వారి కళ్యాణం అనంతరం మూడు జంటలకి నిశ్చితార్థం జరిపించి అదే విషయాన్ని ఇక్కడ పార్టీలో అనౌన్స్ చేయాలనుకుంటున్నాను తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం నాకు ముఖ్యం కాబట్టి మీ నిర్ణయం ఏంటో చెప్పండి నాకు ఏదైనా ఓకే అన్నారు…
నా పిల్లలు మనవళ్ళు నా నిర్ణయమే ఫైనల్ అన్నారు అందుకే మీ నిర్ణయం అడుగుతున్నానని కూడా చెప్పారు వర్మ గారు… ఇంకో మాట
శ్యామ్ లహరి, శ్రావ్య విజయ్ ల నిశ్చితార్థం మాత్రం ఇప్పుడే అనౌన్స్ చేయదలచుకోలేదు నేను … అజయ్ కి కూడా సంబంధం కుదిరాక అరుణ్ అజయ్ విజయ్ ది ఒకేసారి అనౌన్స్ చేస్తాను అని చెప్పారు వర్మ గారు…
ఆ విషయం పిల్లలు కూడా వింటూ ఉండడంతో తాతయ్య అని నోరు తెరువ బోయిన పూజతని చూసిన రోషన్ .. టాపిక్ డైవర్ట్ చేస్తూ విజయ్ ఓకే అంటాడేమో గానీ అరుణ్ కి లోపల అంతా తగలబడి పోతున్నట్టు ఉంది తాతయ్య ఒకసారి చూసుకోండి అన్నాడు సరదాగా…
ఒరేయ్ అజయ్ నీ దెబ్బతో పాపం ఫస్ట్ పిల్లని సెట్ చేసుకున్నాడు వాడికి ఇంకా లేట్ అవుతుంది కదరా అన్నాడు అరుణ్ విజయని ఉద్దేశించి… వాడికి బాధ లేదు గాని నీకే ఓ బాధ ఉన్నట్టుంది నువ్వు ఎన్ని వేషాలు వేసిన మా పెళ్లిళ్లు అన్నీ అయ్యాక లాస్ట్ నీ పెళ్లి… కొంచెం ఓపిక పెట్టు.. లేదంటే ఏదో ఒక గండం సృష్టించి మా పిల్లలు పుట్టాకే నీ పెళ్లి అని చెప్పించగలను అన్నాడు అజయ్…
రామ్ నిఖిల్ కి సంబంధాలు చూస్తున్నావా వాడితోటి వాళ్లకి నిశ్చితార్థం జరిగిపోతుందని చెప్పింది జానకమ్మ…
అజయ్ విజయ్ అరుణ్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా… రోషన్ వరుణ్ మాత్రం తమ ప్రియ సకులకి సైట్ కొట్టుకుంటూ ఉండిపోయారు…
ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్లకు కూడా షాకింగ్ అండ్ సర్ప్రైసింగ్ న్యూస్ ఏ మరి…
రోషిని సుచిని పట్టుకుని గిర్రున తిప్పుతూ మా అక్క పెళ్ళంట మా అక్క పెళ్ళంట అని అరుస్తూ ఉంటే… నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ రుచి కూడా సేమ్ రోషిని ఇమిటేట్ చేసింది…
దీన్నే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారని శ్రావ్య మనసులో రుచిని రెండు తిట్లు తిట్టుకొని ఆపు బుజ్జి కళ్ళు తిరుగుతాయి అంది…
ఆగి పోయే సందర్భమా వదిన మా అన్నయ్యల పెళ్లి అంటూ రోషన్ ని విజయ్ ని పట్టుకొని వాళ్లను కూడా ఒక రౌండ్ తిప్పేసింది…
అంతే ఎక్సైట్మెంట్లో నిఖిల్ దగ్గరికి కూడా వెళ్లి నువ్వు కూడా తొందర్లో పప్పు అన్నం పెట్టేస్తున్నావ ని నా సిక్స్త్ సెన్స్ స్ట్రాంగ్ గా చెప్తుంది అన్నయ్య గెట్ రెడీ అంది అసలు విషయం చెప్పకుండా…
నీ నమ్మకం నిజమైతే సరే లేరా ముందైతే మనం సుచి పెళ్లి… శ్రావ్య పెళ్లిని బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు.. మరి నా పెళ్లి ని ఎవరు ఎంజాయ్ చేస్తారా దుర్మార్గుడా అన్నాడు రోషన్
మరి మా పెళ్లి ని ఎంజాయ్ చేయరా బావ అని అడిగింది పూజ కూడా .. మా ఎంజాయ్మెంట్ కూడా మీ చెల్లి చేసేస్తుందిలే పూజ డోంట్ వర్రీ అన్నాడు నిఖిల్ సరదాగా..
ఈ బుధవారమే మనమంతా ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నాం అక్కడ గురువారం కళ్యాణం అనంతరం ఇక్కడికి తిరిగి వచ్చి ఆదివారం ఇక్కడి మీటింగ్ పూర్తి చేస్తున్నామన్నారు వర్మ గారు…
ఇక్కడ బిజినెస్ పీపుల్ కి ప్రెస్ కి ఇన్విటేషన్ పంపించే బాధ్యత ఇద్దరు అల్లుళ్ళకి కొడుకుకి అప్పగించారు…
అందరికీ కావలసిన పట్టు బట్టల షాపింగ్ ఇంటి దగ్గరే చేపించే బాధ్యతని కోడలికి అప్పగించారు…
బంధువులందరికీ ఇన్విటేషన్ పంపించే బాధ్యత కొడుకుకి కూతుళ్ళకి అప్పగించారు వర్మ గారు..
పెట్టిపోతల బాధ్యతని భార్యని సక్రమంగా చూసుకోమని కూడా చెప్పారు…
అరుణ్ అక్కడికి వచ్చి ఈవెంట్ మేనేజర్ ని తీసుకొని నేను అజయ్ ఇవాళే ఊరికి బయలుదేరుతాం తాతయ్య మిగిలిన ముగ్గురు పెళ్ళికొడుకులు కాబట్టి మీతో పాటే వస్తారు అని చెప్పాడు…
అలాగే అక్కడ గుడిలో ఏర్పాట్లకి పూజారి తాత కంసాలి తాత ఉన్నారు కదా వాళ్ళు మీకు సహాయం చేస్తారు అని చెప్పారు…
ముందుగా మీ చెల్లికి ఫోన్ చేసి విషయం చెప్పండి ఆమెతోనే పిలుపులు మొదలు పెట్టండి ఇది మీ ఆడపడుచుకి మనం ఇచ్చే మర్యాద అంది జానకమ్మ
అలా పనులన్నీ పంచుకున్నాక భోజనాలు ముగించి వెంటనే పిలుపులు మొదలుపెట్టారు ఎక్కువ టైం లేకపోవడంతో…
రత్న మొదట శారద కి ఫోన్ చేసి విషయం చెప్పగా కుందన తారకి ఫోన్ చేసింది…
రాధిక అప్పటికే బోటిక్ వాళ్ళకి ఫోన్ చేసి తనకి కావలసిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి ఒక రెండు గంటలలో ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది…
రోషిని ముగ్గురు పెళ్లి కూతుర్లు డ్రెస్ ఒకే లాగా ఉండాలని డిమాండ్ చేసింది… రంగులు వేరుగా ఉన్న పర్వాలేదని చెప్పింది..
పెళ్లి కూతుర్లు వాళ్ళు.. వాళ్ళు చూస్ చేసుకుంటారు నీ పెత్తనం ఏంటి మధ్యలో అంది రత్నం…
మా నేనేమన్నా వాళ్ళని ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పానా ఏంటి ముగ్గురిని ఒకేలాగా రెడీ అవమని చెప్పాను అది కూడా తప్పేనా నీకు అంది…
ఊరుకో రత్న ముగ్గురు నాకు సమానమే అని బంగారం ఈ విధంగా చెప్పింది అది నీ మట్టిబురకు అర్థం కాకపోతే ఎలా అంది జానకమ్మ…
ఇక మగవాళ్లందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే అప్పటికే వచ్చిన బోటిక్ వాళ్ళ చుట్టూ చేరిపోయారు ఆడవాళ్ళంతా…
మొహమాటం లేకుండా ఎవరికి ఏం కావాలో అన్ని ఈ రోజే పూర్తి చేసుకోండి అని చెప్పింది జానకమ్మ…
షాపింగ్ అంటేనే పడని రోషిని ఆరోజు మాత్రం మొదటి చీర తన అమ్మమ్మకి చూపించి ఇది నీకే బాగుంది కదా అమ్మమ్మ అంది…
నా మనవరాలు సెలక్షన్ కదా బాలేకుండా ఉంటుందా ఇది ఫిక్స్ అంది జానకమ్మ …
తన పని తను నిరాటంగా చేస్తున్న రంగిని దగ్గరికి పిలిచి… ఒక పదివేల రూపాయల పట్టు చీర తన భుజం మీద వేసి ఇది నీకు నా గిఫ్ట్ నచ్చకపోతే మార్చుకోవచ్చు అంది రోషిని…
రోషిని సెలెక్ట్ చేసిన పట్టు చీర ని చూసిన రంగి బలవంతంగా తన కంట్లో నీటిని ఆపుకుంది.. వర్మ నిలియం కు వచ్చాక తన తిండికి బట్టల కి లోటు లేకపోయినా ఈ విధంగా స్పెషల్గా చీరలు అంటూ కొనుక్కున్నది ఎప్పుడూ లేదు.. నిజం చెప్పాలంటే ఇంత రేట్లో కొనుక్కున్నది లేదు…
అలాంటిది తమ ఇంట్లో మనుషులతో పాటు అంత ఖరీదైన చీర బుజ్జి తల్లి తనకి తీసి ఇవ్వడంతో ఆనందంతో మాటలు రాలేదు రంగి కి…
ఇది అన్నయ్యలు పెళ్లికి నీ గిఫ్ట్.. బాడ్ లక్ మూడు పెళ్లిళ్లు కలిపి ఒకటే గిఫ్ట్ వచ్చింది ఏం చేయలేం అంది రోషిని నవ్వుతూ…
మీ పెళ్లికి ఇంకొంచెం పెద్ద గిఫ్ట్ ఇచ్చేద్దాం లే అంటూ అక్కడ సిచువేషన్ ని రంగి ఎమోషన్ ని కంట్రోల్ చేసింది జానకమ్మ…
రోషిని శ్రావ్య వైపు చూడడంతో తను బోటిక్ వాళ్లకి ఆ చీర ఎలా డిజైన్ చేయాలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉండాలో చెప్పింది…
ఏమి అండర్స్టాండింగ్ మా కోడలు వాళ్ళ వదినని ఏమైనా బలే కంట్రోల్ చేస్తుంది అని నవ్వింది రాధిక… అయ్యో అది కంట్రోల్ కాదు పెద్దమ్మ ప్రేమ అంది శ్రావ్య…
మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మెటికల్ విరిచింది శ్రావ్య వాళ్ళమ్మ… అలాగే ఉంటారులే అత్త అంది సుచి..
పెద్దమ్మ కవితత్త ముందుగా మీ ఇద్దరూ మీ కూతుర్లకి మీకు నచ్చిన సారీస్ సెలెక్ట్ చేయండి తర్వాత పెళ్లికూతురులు సెలెక్ట్ చేసుకుంటార్లే అంది రోషిణి…
తాతయ్యకి ముందుగా పట్టు పంచ పట్టు షర్టు ఎలా ఉండాలో చెప్పి చందు రఘురాం రాఘవ రామ్ శరత్ శ్యామ్ వెంకటేష్ లకి లైట్ క్రీం కలర్ షేర్వానీస్ వాళ్ళ సైజులకు తగ్గట్టు డిజైన్ చేయమని చెప్పింది రోషిణి…
అజయ్ అరుణ్ అఖిల్ నిఖిల్ హరి రాజ్ లకు లైట్ మెరూన్ కలర్ షేర్ వాణి అలాగే పెళ్లి కొడుకు కాబోతున్న రోషన్ వరుణ్ విజయ్ లకు గోల్డ్ కలర్ షేర్ వాణి ఫైనల్ చేసి అందరి మెసెర్మెంట్స్ జాగ్రత్తగా తీసుకుని రెడీ చెయ్యమని మరి మరి చెప్పింది…
మిగతా వాళ్లంతా తనని గుర్రుగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది లేడీస్ అందర్నీ చుసిన రోషిని…
మా కోసం ఎప్పుడైనా కనీసం చీర కలర్ చెప్పైనా సెలెక్ట్ చేసావా ఇవాళ మాత్రం మీ నాన్నకి డాడ్ కి మామయ్యలకు మొత్తం డ్రెస్ నువ్వే డిజైనింగ్ చెప్పావని అడిగింది కుందన..
అయ్యో మామ్ వాళ్ల కంటే ఆప్షన్స్ తక్కువ సెలెక్ట్ చేయడం ఈజీ… మీ అందరికీ నావల్ల కాదు కావాలంటే చూడండి మీ ముందు ఎన్ని చీరలు పడున్నాయో వాటిలోనే మీకు నచ్చడం లేదు ఇంక నేను సెలెక్ట్ చేస్తే ఎం నచ్చుతుంది ఐ యాం డన్ సారీ అంది రోషిని…
మొహమాటమే లేకుండా ఏదో తన సొంత షాపింగ్ అన్నట్టు తన అక్కయ్య కోసం తనకి నచ్చినవన్నీ పక్కనపెడుతుంది రుచి…
సుచి శ్రావ్య మాత్రం బుజ్జి మా కోసం ప్లీజ్ షేర్వానీ మాత్రం సెలెక్ట్ చేసినట్టే దానికి తగ్గ లేహంగా మాత్రం చూస్ చేయవా అని అడిగారు…
ముందు మీకు లెహంగా ఓకే నా లేకపోతే ఓన్లీ సారీ నా అని జాను డార్లింగ్ అడిగి కన్ఫర్మ్ చేసుకోండి అంది…
నిశ్చితార్థం మే కదా మీకు నచ్చిన లేహంగానే తీసుకోండి కానీ రాముల వారి కళ్యాణం తో పాటు ఊరందరు ముందర మీ నిశ్చితర్థం జరగబోతుంది కాబట్టి జాగ్రత్త చూస్తే డ్రెస్సు ఒంటికి నప్పేలా ఉండాలి అంతేగాని ఎబెట్టుగా ఉండకుండా మాత్రం చూసుకోండి అని తన ఆలోచన చెప్పింది జానకమ్మ…
రోషినికి మాత్రం కుందన ఒక నైస్ ఎలిగెంట్ హాఫ్ సారీ సెలెక్ట్ చేస్తే.. రాధిక ఒక ట్రెండీ లెహంగా సెలెక్ట్ చేసింది.. రత్న ఒక లైట్ వెయిట్ సారీ తీసింది…
ఒకొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే అయ్యో డార్లింగ్స్ పెళ్లి నాకు కాదు మీ కోడళ్ళకి మర్చిపోకండి ముందు వాళ్లకి సెలెక్ట్ చేయండి అంది
Sooper ra mahi