వాళ్లకి కావలసినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఫ్రీడం వాళ్ళకు ఉంది కదా బంగారం వాళ్లు తీసుకుంటారులే లేకపోతే వాళ్ళ అమ్మలు సపోర్ట్ చేస్తారులే అని చెప్పింది రాధిక…
మా కూతురికి మేమే తీసుకుంటాం లేమ్మా నువ్వు నీ కోడలికి చూసుకో అంది రమ… లేకపోతే వదిన సపోర్ట్ కి వస్తే ఎలా అక్క నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా ఎంజాయ్ అంది రత్న .. మొహమాటం లేకుండా అందరికీ కావలసినవి తీసుకోండి వదిన అని కవితకి కూడా చెప్పింది కుందన..
నీకైతే అవసరమే లేదు కదా వదినా అందుకే కదా కూతుర్ని ఫ్యాషన్ డిజైనర్ ని చేశావు అంది రత్న లహరితో…
మగవాళ్ళంతా ప్లానింగ్ తో బిజీగా ఉంటే ఆడవాళ్లంతా. సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ బడ్జెట్ గురించి ఏమాత్రం దిగులు పడకుండా ఎవరికి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు జానకమ్మ ప్రోత్బలంతో…
ఆడవాళ్లంతా ఒకేలా ఉండే చీరలు తీసుకుంటే అమ్మాయిలందరికీ కలిపి ఒక లేహంగా ఒక హాఫ్ సారీ ఫైనల్ చేశారు…
ఫైనల్ గా జానకమ్మ బంగారం ఇలా రా అని రోషినిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని.. నీ చేతుల మీదుగా సీతారాములకి పట్టుబట్టలు తీయమని చెప్పింది…
దాంతో రోషిని రాములవారికి పట్టు పంచ టవల్ తో పాటు సీతమ్మవారికి బంగారు బోర్డర్ తో అలాగే బంగారు పుటలతో నిండిపోయిన నిండు మెరూన్ కలర్ సెలెక్ట్ చేసింది…
ఎంతైనా మా బుజ్జమ్మ సెలక్షన్ సూపరో సూపర్ అంది రంగి…
ఊరిలో చాటింపు వేయడంతో పాటు అందరినీ బంధువులు కూడా కబురు పంపుకోమని ఇక్కడి నుంచే ఫోన్లో ఊరి పెద్దలకి చెప్పించారు వర్మ గారు…
ఆ రాత్రికే భోజనాలు అనంతరం అనుకున్నట్టుగానే అరుణ్ అజయ్ ఊరికి బయలుదేరి వెళ్లిపోయారు…
శ్యామ్ లహరి శ్రావ్య లు అక్కడే ఆగిపోగా… రామ్ రమ పిల్లల ని తీసుకొని వెళ్ళిపోగా… కవిత వెంకటేశ్ కూడా వాళ్ల పిల్లలతో ఇంటి బాట పట్టారు…
వాళ్ల బట్టలు వాళ్ల ఇంటికే నేరుగా డెలివరీ చేయమని మరీ మరీ చెప్పింది జానకమ్మ బోటిక్ వాళ్లతో…
అంత ఫైనల్ అయ్యాక భారీగా అందిన టిప్ తో అక్కడి నుంచి హ్యాపీగా వెళ్లి వెంటనే పని మొదలుపెట్టారు బొటిక్ వాళ్ళు… కావలసినంత మంది పని వాళ్ళని పెట్టుకుని వెంటనే పని పూర్తి చేయమని మేనేజర్ కి మరీ మరీ చెప్పింది రాధిక…
మేడం మనకి మనమే చేసుకోకపోతే ఇంక కస్టమర్స్ ని ఎలా సాటిస్ ఫై చేస్తామ్ చెప్పండి మీరు హ్యాపీగా మిగతా పనులు చేసుకోండి టైం టు టైం బట్టలు అందించే పూచి నాది అని చెప్పాడు మేనేజర్ ..
లక్ష్మీ అర్జునులు కి కూడా వర్మ దంపతుల నుంచే సమాచారం వెళ్ళింది…
బిందు వెంటనే రాధకి ఫోన్ చేసి తామంతా కూడా ఊరికి వస్తున్నట్టు తనని అక్కడే ఉండమని చెప్పింది.. దాంతో రాదా మీతో పాటు నాకు కూడా షాపింగ్ చేసుకునే రండి మరి అని చెప్పింది…
వెంకటేష్ గారు టెన్షన్ గా ఉండడం చూసిన కవిత ఏమైందండీ ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు అని అడిగింది… కూతురికి ఎంగేజ్మెంట్ అంటే ఆ మాత్రం టెన్షన్ ఉండదా.. అది రెండు రోజుల్లో ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అన్నాడు…
అంత టెన్షన్ పడకండి నాన్న వీలైనంత మందికి ఫోన్ చేసి చెప్పండి వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళని మనం ఏమి చేయలేం.. అంది పూజ.. అమ్మాయి చెప్పేది కూడా నిజమే అండి కావాలంటే పెళ్లికి అందర్నీ పిలుద్దాం లెండి అంది కవిత కూడా..
అయినా నువ్వేంటి రుచి వాళ్ళు ఎంత మొహమాటం లేకుండా తీసుకోమని చెప్పిన నువ్వు అక్కతో సమానంగా షాపింగ్ చేసావ్ ఏంటి అని అడిగింది కవిత… మా వాళ్లకు అంత ఉంది కదా పెళ్లికూతురు చెల్లికి ఆ మాత్రం పెట్టచ్చలే ఏమీ కాదు ఏమో ఎవరికి తెలుసు నేను కూడా ఇంటికి కాబోయే కోడల్ని ఏమో అంది రుచి నిర్మొహమాటంగా…
ఆశపడడంలో తప్పులేదు కానీ ఆశ నెరవేరుతుంది అనే భ్రమలో ఉండడం చాలా తప్పు అన్నాడు వెంకటేష్..
అలా ఎందుకు అనుకోవాలి నాన్న ఎక్కడ ఉండే మనం వచ్చి వీళ్ళ ఫ్యామిలీతో కలవలేదా అక్క ఆ ఇంటి పెద్ద కోడలుగా అవడం లేదా అంతే ఏదో ఒక వండర్ జరిగి నేను కూడా చిన్న కోడలుగా అవుతానేమో ఎవరు చూసి వచ్చారు ఇంకా టైం ఉంది కదా హోప్ వదులుకోవడం ఎందుకు ఇలా అనుకోవడం బాగుంది కదా అంది రుచి…
నేను ఆ ఇంటి చిన్న కోడలుగా వెళ్తేనే అక్కని సేవ్ చేసుకోగలను లేకపోతే ప్రతి విషయంలో ఆ రోషిని డామినేషన్ ని అక్క భరించాల్సి వస్తుంది అంది రుచి…
ఇప్పుడు కూడా చూశారు కదా ఆ ఇంటికి కాబోయే కోడళ్లు అక్కడే ఉన్న ప్రతి విషయంలో ఆ పెద్ద ఆవిడ రోషిని కె ఇంపార్టెన్స్ ఇస్తుంది అంది రుచి
( అది డామినేషన్ కాదని అది ఆ ఇంట్లో తన హక్కు అని ఎప్పటికి తెలుసుకుంటుందో ఈ బుజ్జి పాప)
నీకు కూడా అనిపిస్తుందా పూజ అది డామినేషన్ అని అడిగింది కవిత.. చూడు ఇలా మనసులో ఒకటి పెట్టుకొని ఆ ఇంటికి కోడలుగా వెళ్లడం మంచి పద్ధతి కాదు.
మీ చెల్లి అనుకుంటే పర్వాలేదు తను ఇప్పటికీ బయట వ్యక్తి కానీ నువ్వు ఆ ఇంటికి కాబోయే కోడలివి.. ఇలా మనసులో ఒకటి పెట్టుకొని ఆ ఇంటికి కోడలుగా వెళ్తే వాళ్ళు నీ మీద చూపించే ప్రేమ నీకు కనపడదు.
ఇంకా మించిపోలేదు… 100% నువ్వు కరెక్ట్ అనుకుంటేనే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళు.. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంటి మనుషులు మంచితనం వల్లే నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నావ్ అది ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు అని తల్లిగా హితబోధ చేసింది కవిత…
కానీ నా భర్త నాకే ప్రయారిటీ ఇవ్వాలని నాకు కూడా కొన్ని విషయాలు లో అనిపిస్తుంది కదమ్మా అంది పూజ.
మీ నాన్న నాకు ప్రయారిటీ ఇవ్వాల్సిన సమయంలో మీ ఇద్దరికీ ప్రయారిటీ ఇస్తే నేను మిమ్మల్ని చూసి కుళ్ళుకోనా అని అడిగింది కవిత…
అలా ఎలాగమ్మా అన్నారు ఇద్దరూ ఒకేసారి… కదా మరి ఇది కూడా అంతే తను వాళ్ళింట్లో చిన్నది అది కాక ఏకైక ఆడపిల్ల..
ఆ మాత్రం ప్రయారిటీ ఇచ్చుకోరా అది చూసి మీరు అసూయ పడితే ఎలా.. అది మీకే మంచిది కాదు గుర్తుపెట్టుకోండి.. అన్ని వెధవ ఆలోచనలు మనసులో నుంచి తుడిచిపెట్టి సంతోషంగా నిశ్చితార్థానికి రెడీ అవ్వండి.. అని ఒక ఇంత కోపంగా చెప్పి అప్పటికే ఇల్లు రావడంతో ఇంట్లోకి వెళ్లిపోయింది కవిత.
నాది కూడా అదే మాట ఆలోచనలని పక్కనపెట్టి సంతోషంగా నిద్రపోండి అని తను కూడా రూమ్ కి వెళ్ళిపోయాడు వెంకటేష్.
అక్కడ వర్మ గారి సొంత ఊరు అయినా సంపాతిపురం ( ఇంతకుముందు ఏదైనా పేరు చెప్పానా గుర్తులేదు.. సంపాతిపురం నా ఆలోచన నుంచి పుట్టిన ఊరు గూగుల్ లో వెతకండి 🤣) లో ముఖ్యమైన వాళ్లందరికీ విషయం తెలిసింది.
ఊర్లో కంసాలి తాత అప్పటికే ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్లి వర్మ గారి సొంత ఇంటిని శుభ్రం చేయించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఆ రాత్రికి అరుణ్ అజయ్ అక్కడికి చేరుకుంటారు కాబట్టి .
భవాని నిలయంలో ఆ రాత్రికి ఊరెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా రాధా బిందు కాల్ తో ఆగిపోయింది.. ఎలాగో ప్రయాణం ఆగిపోయింది కదా అని తన నానమ్మ దగ్గరికి వెళ్ళింది… అప్పటికే తను బీరువాలో ఉన్న నగలన్నీ బయటికి తీయడం చూసి ఎందుకు నానమ్మ ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నావ్ అని అడిగింది..
సీతారాముల కళ్యాణం అంటే మాటలా.. ఎంత ఘనంగా జరుగుతుందో నీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా… ఆరోజు గొప్పగా రెడీ అవ్వాలి కదా అందుకే ఈ నగలన్నీ బయట తీస్తున్నాను.
నా ముగ్గురు మనవరాలు ఇవి వేసుకుంటే చూసి మురిసి పోవాలి అని నా ఆశ అంది భవాని…
నగలు వేసుకుంటే చూసి మురుసుకోవడమేనా..నేను మీ అన్నయ్య ఇంటి కోడలుగా వెళితే మురిసిపోవాలని లేదా అని అడిగింది రాదా..
ఎందుకు మురిసిపోను కోటి రూపాయలు లాటరీ నాకే తగినంత మురిసిపోయేదాన్ని నువ్వు ఆ చిన్నోడిని వదిలేసి పెద్దోడు వెనుకాల పడుంటే ఏదైనా ఉపయోగం ఉండేది అందని దాని గురించి ఆశపడి బొక్క బోర్ల పడ్డావ్ అంది భవాని..
నేనేమీ అంత తెలివి తక్కువ దాన్ని కాదులే నా ప్రయత్నాల్లో నేనున్నాను… ఈ పెళ్లిలో నీ తెలివితేటలతో ఏమన్నా పని జరుగుతుందేమో చూడు అంది రాధ… అక్కడినుంచి వెళ్తూ.
సుధాకర్ మాత్రం మామ ఇంటి దగ్గరికి వెళ్ళాడు తన అవసరం ఏమైనా ఉంటుందేమోనని కళ్యాణి మాత్రం తన కూతురికి మంచి భవిష్యత్తుతో పాటు తన వాళ్లకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఎప్పుడు దేవుని వేడుకుంటూ ఉంటుంది.
లక్ష్మి తన మామ ఇంటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో సంతోషపడుతూ అలాగే పుట్టింటికి వెళ్తూ ఉండడంతో సంతోషంగా లగేజ్ ప్యాక్ చేసే పనిలో పడింది… అర్జున్ తన సంతోషాన్ని ఒక కంట గమనిస్తూ ఏంటో మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు ఇవ్వాళ అన్నాడు… సీతారాముల కళ్యాణం కోసం వెళ్తున్నాం కదా అలాగే నా ఇద్దరు కూతుర్ల పెళ్లి కూడా త్వరగా జరిగిపోవాలని మనసులో వేడుకుంటున్నానులే అంది లక్ష్మి.
బిందు ఆఫీస్ పనులతో పాటు మనసులో ఏ దిగులు లేకపోవడంతో ప్రశాంతంగా నిద్రపోతే ఇందు మాత్రం.. అజయ్ ని ఎలాగైనా తన వాడిని చేయమని మనసులో దేవుడిని వేడుకుంటూ… ఈ పెళ్లిలో తను ఎలా స్పెషల్గా కనపడాలో దానికి తగిన స్పెషల్ డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసుకునే పనిలో పడింది..
ఇంటికి వెళ్ళాక రామ్ రమ రూమ్ కి వెళ్ళిపోతే… హాల్లోనే కూర్చున్నారు సుచి అఖిల్ నిఖిల్…
సోఫాలో కూర్చున్న సుచి కి చెరో వైపు కూర్చున్నారు అఖిల్ నిఖిల్… నువ్వు హ్యాపీన సుచి అన్నాడు నిఖిల్..
చాలా అన్నయ్య చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఒక్కటే త్వరగా పెళ్లయిపోతే నేను మిమ్మల్ని వదిలేసి ఆ ఇంటికి వెళ్ళాలి ఏమో కదా అంది సుచి… నువ్వు వెళ్లకపోతే బావగాన్ని ఇక్కడికి కొద్ది రోజులు రప్పించుకుందాం లే అన్నాడు నిఖిల్
వద్దులే అన్నయ్య నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళ అబ్బాయిని దూరం చేస్తే ఎలా అది కొద్ది రోజులైనా నాకు ఇష్టం లేదు… అక్క ఇదేం బాలేదు అని రోషిని అడిగితే నేను సమాధానం కూడా చెప్పలేను అంది.
నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు అయినా మమ్మల్ని తిరిగి వదిలి వెళ్లిపెట్టి వెళ్ళిపోతావంటే.. ఇప్పటినుంచే నేను నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది నాకే ఇలా ఉందంటే అమ్మానాన్నల పరిస్థితి ఏంటో మరి అన్నాడు నిఖిల్ …. వాళ్లు మిస్సయిన చాలా హ్యాపీ కదా నువ్వు ఆలోచించు నాన్న ఎన్నో సంవత్సరాల కల గదా ఇది..
దీంతో రోషినిని నాన్న నెత్తిన పెట్టేసుకుంటారు చూస్తూ ఉండు.. అంది సుచి..
అందరూ తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారేంటి అక్క అన్నాడు అఖిల్… ఎందుకు ఇవ్వకూడదు అఖిల్ నాకు ఒక కారణం చెప్పు అని అడిగింది సుచి తిరిగి.
నీకు గుర్తుందా నేను ఇంటికి వచ్చిన రోజు నీ రూమ్ నాకు ఇవ్వడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు అలాంటిది ఈరోజు నాకు పెళ్లి అయిపోతుందంటే ఇలా నా ఒడిలో పడుకొని బాధపడుతున్నావ్.
మరి రోషిని నాకంటే ముందు నుంచే మీ లైఫ్ లో ఉంది కదా నాకు తెలిసి తనకి నీకు ఎటువంటి పర్సనల్ ఇష్యూ లేదు . లేదు కాదు తను పెట్టుకోదు… తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని చూస్తుంది కానీ… ఎటువంటి సమస్యని ఇవ్వదు.. నువ్వు ఒకటికి రెండుసార్లు తనని ఇబ్బంది పెట్టిన ఆ విషయం ఫ్యామిలీ వరకు తను తీసుకెళ్లలేదు.
కారణం తన వల్ల అరుణ్ కి ఏ బంధం దూరం అవ్వకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచన తోటి.
దీన్ని తెగేంతవరకు లాక్కకూడదు అఖిల్… నీకు ఇష్టం లేకపోతే కామ్ గా ఉండు కానీ తనమీద ద్వేషం మాత్రం పెంచుకోవద్దు.
చూసుకోరా బిజినెస్ కి కాబోయే చైర్మన్… నీకా కంపెనీ నుంచి వస్తున్న ఫండ్స్ లో ఒక 20% కాస్ట్ కట్టని కోత పెట్టింది అనుకో మీ పరిస్థితి అంతే సంగతులు అన్నాడు నిఖిల్ కూడా నవ్వుతూ.
ఇదే ఇదే ఇందుకే తన నాకు మొదటి నుంచి నచ్చదు అన్నయ్య తను ఆ ఫ్యామిలీలోకి రాకుండా ఉండుంటే ఆ పోసిషన్ అరుణ్ గాడిది కదా.
ఫ్యామిలీలో చిన్నవాడు అవడం వల్ల అందరూ తనని ఎంత అపురూపంగా చూసేవారు.. కానీ తను వచ్చాక అటెన్షన్ మొత్తం అనను గాని సగానికి పైగా తన వైపు టర్న్ అయిపోయింది.
ఆ ఇంట్లో ఏం జరగాలన్న అది తన చేతుల మీదుగానే జరుగుతుంది.
అంతెందుకు అరుణ్ ని అల్లుడ్ని చేసుకోవాలని మన వైపు బంధువులు ఎంతమంది అమ్మని అడిగే వాళ్ళు నీకు గుర్తుందా.
తన వల్లే తన రాక వల్లే అన్ని మారిపోయాయి అందుకే నాకు తను అంటే నచ్చదు అన్నాడు అఖిల్
అంతా విన్న సుచి… నువ్వు చెప్పిన ఇన్ని విషయాలలో దీంట్లో అయినా డైరెక్ట్ గా రోషినికి సంబంధం ఉందా నువ్వే ఒకసారి ఆలోచించు అఖిల్.
ద్వేషం కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్… దానిని అనవసరంగా ఇన్ని సంవత్సరాలు రోషిని మీద చూపిస్తూ వేస్ట్ చేశావ్.
నాకు తెలిసి అరుణ్ కూడా రోషిని బాధపడకూడదు అని నీ విషయం లైట్ తీసుకున్నాడు… తనకి తెలియకుండా ఏదైనా చేయడం అరుణ్ కి ఒక్క క్షణం పట్టదు… సో జాగ్రత్తగా ఉండు అంది సుచి
వాడికి ఎంత చెప్పినా వేస్ట్ లే బంగారం వెళ్లి పడుకో ఇప్పటికే లేట్ అయింది గుడ్ నైట్ అని సుచిని తన రూమ్ కి పంపించి అఖిల్ వైపు ఒక రకంగా కోపంగా చూసి నిఖిల్ కూడా రూమ్ కి వెళ్ళిపోయాడు… ఇంత క్లాస్ పికించుకొని రూమ్ కి వెళ్లే ధైర్యం లేక సోఫాలో సెటిల్ అయ్యాడు అఖిల్.
ప్రోమో : దేవుడు కలపబోయే కొత్త బంధాన్ని సాదరంగా ఆహ్వానించు.. మనం అనుకున్నవన్నీ యధావిధిగా జరగాలని ఏం లేదు… బంధం బీటలు వారకుండా అడ్డుగా నిలవాల్సింది నువ్వే విజియోస్తు అంటూ రోషిని ని దీవించారు గురువుగారు.
Next part click here
Yento ee manushulu jealous tho jeevitham gadioestaru
First comment Amma meedhi, thanks