Previous part Click Here

రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సంపాతి పురం లోని వర్మ గారి ఇంటికి చేరుకుంది బస్సు…అప్పటికే ఆ ఇంటిని అంగరంగ వైభవంగా పెళ్లి కళ ఉట్టిపడేలా తీర్చిదిద్ది ఉన్నారు అజయ్ అరుణ్ ఊరి వాళ్ళ సహాయంతో…

తమ కుటుంబం అంతా మొదటిసారి ఆ ఇంటికి చేరుకోవడంతో దాన్ని మెమొరబుల్ గా మార్చదలచిన అరుణ్ ఇంటి ముందర అందర్నీ నిల్చోపెట్టి ఇల్లు మొత్తం కవర్ అయ్యేలా ఒక గ్రూప్ ఫోటో తీపించాడు ఫోటోగ్రాఫర్ తో…తరువాత యూత్ ఒక ఫొటొ దిగారు వాల్ల మెమొరి కొసమని.

పెద్ద వాళ్ళందరినీ కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పిన అంత సమయం లేదని అందరూ పనులకి నడుం బిగించారు ముందుగా కాబోయే వధూవరులకి అభ్యంగన స్నానాలకి ఏర్పాట్లు ప్రారంభించారు…

వీలైనంత తొందరగా అందరూ రెడీ అయ్యి గుడికి చేరుకోవాలని జానకమ్మ గట్టిగా చెప్పింది.. పాతకాలం నాటి రెండంతస్తుల మండువా తో పాటు ఆరు బయట స్నానాలు గదులు ఇంటికి సంబంధించిన కూరగాయలు పండించడానికి సరిపడా గార్డెన్ తో చూడడానికి రెండు కళ్ళు సరిపోనంత అందంగా ఉంది ఆ ఇల్లు…

అలనాటి వైభోగం తో పాటు ఇప్పటికీ ఆధునికరణకి సరితూగేలా అందంగా ఉంది ఆ ఇల్లు… పరుల పాలు కాకుండా వర్మ గారు తన కష్టంతో తన పూర్వీకుల ఇంటిని కాపాడుకున్నారు…

పెళ్లి కొడుకులు ముగ్గురితోపాటు మిగిలిన అబ్బాయిలందరినీ కలిపి మొత్తంగా తొమ్మిది మందిని అరుబయట కూర్చోబెట్టింది జానకమ్మ స్నానాలకి…

ఇంట్లో అబ్బాయిల్ని అమ్మాయిని రెడీ చేపించి గుడికి తీసుకొచ్చే బాధ్యత ని ఆడవాళ్లకు అప్పగించి రాఘవ రఘురాం చంద్ర వర్మ గారు ముందుగా రెడీ అయిపోయి శరత్ వెంకటేష్ శ్యామ్ రామ్ ని అలాగే శ్రావ్య తాత గారిని పూజ తాత గారిని వెంటపెట్టుకొని గుడిలో ఏర్పాట్లని చూసుకోవడానికి బయలుదేరి వెళ్లిపోయారు…

అప్పటికే అక్కడికి సుధాకర్ అర్జున్ అలాగే శంకర్ గారు చేరుకుని ఉన్నారు… అందరి కుశల ప్రశ్నలు అయ్యాక పనుల్లో బిజీ అయిపోయారు..

ఇంట్లో జానకమ్మ తొమ్మిది మంది అబ్బాయిల్ని అభ్యంగన స్నానాలకి కూర్చోబెట్టాక అందరికీ రోషిని చేత బొట్టు పెట్టించింది… అందరికీ నూనెతో మసాజ్ చేపించింది.. పెళ్ళికొడుకుల ని తప్ప మిగతా వాళ్లని స్నానానికి పంపేశాక… పెళ్ళికొడుకులకి ఆడవాళ్ళతో వరుసగా నలుగు పెట్టించి అక్షింతలు వేపించి ఆశీర్వదించాక అక్కడే వాళ్ళ వాళ్ళ తల్లులతో అభ్యంగన స్నానం చేపించింది.

రోషన్ కి కుందన విజయ్ కి రత్న వరుణ్ కి రాధిక తలంటించి స్నానం చేపించాక రెడీ అవ్వడానికి లోపలికి పంపేశాక పెళ్లికూతురుల వైపు వెళ్లారు…

పెళ్లికూతురుల కోసం తెల్ల పంచలతో దడిలాగా పరదాలు ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టి మొదట నలుగు పెట్టాక తర్వాత అభ్యంగన స్నానం చేపించారు…

స్నానాలు అనంతరం లోపలికి వెళ్ళాక ఇంకొకసారి ఫ్రెష్ అయ్యాక వాళ్లని రెడీ చేసే డ్యూటీ వాళ్ళ వాళ్ళ తల్లులే తీసుకున్నారు… రమకి సుచరితని రెడీ చేయడమ్ తన చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేయడం తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే అప్పగింతలకి ఇంకా సమయం ఉందత్త అంటూ తనని డైవర్ట్ చేసింది రోషిని.. సుచరిత మాత్రం తన కన్నతల్లిని ఎక్కడ మిస్ అవ్వకుండా రమకే తన తల్లి స్థానం ఇచ్చేసింది

శ్రావ్య ని లహరి తన నానమ్మ రెడీ చేస్తే పూజని అమ్మా నాన్నమ్మలతో పాటు రుచి కూడా రెడీ చేయగా, సుచరితని రమతోపాటు రత్న కూడా రెడీ చేయగా… జానకమ్మ రోషిని పర్యవేక్షణ డ్యూటీ తీసుకున్నారు…

అంత అయిపోయాక.. శ్రావ్య కి రత్న బుగ్గ చుక్క పెట్టగా… సుచరితకి రాధిక అలాగే పూజితకి కుందన బుగ్గ చుక్క పెట్టారు. ఈ లోపల శారద తార రెడీ అయిపోగా… మిగిలిన వాళ్ళంతా కూడా పట్టుబట్టల్లో రెడీ అయిపోయారు…

పెళ్లి కూతుర్లు ముగ్గురు అందమైన హాఫ్ శారీలతో పొందికైన నగలతో రెడీ అవ్వగా… రుచిత కూడా సేమ్ తనక్కలాగే రెడీ అయితే.. రోషిని మాత్రం సింపుల్ గా లెహంగాలో రెడీ అయింది…

నువ్వు కూడా హాఫ్ సారీ వేసుకోవచ్చు కదా బంగారం అని అడిగింది శారద.. పెళ్లికూతురులు వాళ్లు కదా పెద్దమ్మ మనం రెడీ అయ్యే సందర్భాల్లో మనకి చాలానే వస్తాయిలే ప్రస్తుతానికి వాళ్లని ప్రత్యేకంగా ఉండనిద్దాం అని తన ప్రత్యేకతను ఇంకొకసారి చాటుకుంది మన రోషిని…

అప్పటికే జానకమ్మ అందర్నీ తొందర పెట్టడంతో.. అబ్బాయిలందర్నీ మొదట గుడికి పంప దలిచి అమ్మాయిల చేత ఆ ఇంట్లో దీపం పెట్టించి అందరూ ఒకసారి మనసారా దేవున్ని ప్రార్థించి గుడికి కదిలారు..అందరు. ముందుగా అబ్బాయిలందరూ ఒకరి తర్వాత ఒకరు నడవగా తర్వాత ఆడవాళ్ళంతా కదిలేక వెనుకగా అమ్మాయిలు కదిలారు…

అక్కడ భవాని ఇంట్లో తన మనవరాలని ముగ్గురిని ప్రత్యేకంగా దగ్గరుండి రెడీ చేయించింది… కోడలికి చెప్పి ఒకసారి ముగ్గురికి దిష్టి తీపించి… కళ్యాణి లక్ష్మీ లను కూడా త్వరగా రెడీ అవ్వమని చెప్పి తొందర పెట్టింది… ఏంటమ్మా అంత తొందర అని అడిగింది లక్ష్మి.. తొందరే మరి చాలా సంవత్సరాల తర్వాత అందరం ఒకచోట కలవబోతున్నాం ముఖ్యంగా నా మనవరాళ్ళు చూడు మెరిసిపోతున్నారు.

అందరికీ గొప్పగా  నా మనవరాలని పరిచయం చేసుకోవాలి కదా నేను.. అది కాక మా అన్నయ్య మనవళ్ల నిశ్చితార్థం కూడా కదా అన్నీ దగ్గరుండి చూసుకోవాలని మీ నాన్న అన్నయ్య నీ భర్త వెళ్ళిపోయారు మనము లేట్ చేస్తే ఎలా  అంటూ  అందర్నీ తీసుకొని తను కూడా గుడికి బయలుదేరింది….

బిందు మాత్రం అమ్మమ్మ ఎంత బలవంతం పెట్టిన సింపుల్గా రెడీ అయితే రాదా ఇందు మాత్రం… ఘనంగా రెడీ అయ్యారు. దారిలో కనిపించిన వాళ్లందరికీ తన మనవరాలను చూపించుకుంటూ మురిసిపోతూ కూతురు కోడలు తో పాటు గుడికి చేరుకుంది భవాని. అప్పుడే జానకమ్మ అండ్ కో కూడా గుడికి చేరుకోవడంతో ఒక్కరినొకరు సగవురవంగా పలకరించుకున్నారు…

బిందు ముగ్గురు పెళ్లి కూతుర్లకి కంగ్రాట్యులేషన్స్ చెప్పగా అబ్బాయిలు ఆ అవకాశం ఇవ్వకుండా అప్పటికే మండపం డెకరేషన్ దగ్గరికి వెళ్లిపోయారు. రోషిని అండ్ కో గుడి లోపల కి చేరుకున్న వెంటనే వర్మ దంపతులు రోషిని ని ప్రత్యేకంగా గర్భగుడి దగ్గరికి తీసుకువెళ్లి వేద పండితుల చేత మా ఇంటి మహాలక్ష్మి అని పరిచయం చేసి ఆశీర్వాదం ఇప్పించారు…

ఆ గుడిని గుడి అలంకరణ ని చూడడానికి అందరికీ రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ముస్తాబు అయ్యింది గుడి ఎటు చూసినా పచ్చని తోరణాలు స్వచ్ఛమైన సువాసనలు వెదజల్లే పువ్వులతో అందంగా తీర్చిదిద్దబడింది…

ప్రతి సంవత్సరం ఆ గుడిలో సీతారాములు కళ్యాణం జరిగేది అయినా ఈ సంవత్సరం మాత్రం వర్మ గారి చొరవ తో ఆయన ఖర్చుతోటి ఇంకా అంగరంగ వైభవంగా జరగబోతుంది…

గుడికి ఉన్న చిన్న చిన్న మరమ్మత్తులతో పాటు అందమైన పెయింటింగ్స్ తో గుడి ఆవరణ పూర్తిగా మారిపోయింది… ప్రతి సంవత్సరం ఊరి వాళ్ళ చందాలతో జరిగే కళ్యాణం ఈసారి మాత్రం అందరి అంగీకారంతో వర్మ గారి ఖర్చుతో జరుగుతుంది…

గుడిలో ఒకపక్క అన్నదాన కార్యక్రమాలకి కావలసిన వంటలు వండుతుండడంతో గర్భగుడి ఆవరణలో స్వామి వారి కళ్యాణం కి వేద పండితుల చేత ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి…

తలంబ్రాలు పట్టుబట్టలు బాసికాలు తాళిబొట్టు అన్ని రోషిని చేతుల మీదుగా ఆ సీతారాములకి సమర్పించారు వర్మ కుటుంబ సభ్యులు…

రోషిణి ఎందుకో కలవరపాటుగా ఉందని గ్రహించాడు అరుణ్.. కారణం ఏమై ఉంటుందా అని తనని మండపంలోని ఒక సైడ్ కి తీసుకువెళ్లి అడిగాడు… ఏంటి బుజ్జి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను నన్ను కనీసం పలకరించలేదు నువ్వు హుషారుగా ఉన్నట్టున్నావు కానీ దేని గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నావ్ అని అడిగాడు…

అదేం లేదు నేను బాగున్నాను పైగా అన్నయ్యల ది బావది నిశ్చితార్థం కదా… పైగా ఈ గుడి వాతావరణం లోని పాజిటివ్ వైబ్ ని ఫీలవుతున్నాను అందుకే ఎవరితో ఎక్కువగా మాట్లాడలేదు అంతే అంతే అంది…. కానీ మనసులో మాత్రం గురువుగారు దేని గురించి చెప్పారో ఏ కొత్త బంధం గురించి చెప్పారో అర్థం కాక ఒకింత నిజంగానే కలవరపడుతుంది రోషిని…

మండపంలోని ఒక సైడ్ కూర్చుని పది నిమిషాలు ధ్యానం చేసుకోదలిచి ధ్యానంలోకి వెళ్ళింది. తరువాత పెల్లికుతురు ల దగ్గరికి వెల్లిన్ది. సుచరిత రోషిని రెండు చేతులు పట్టుకుని నా ఈ సంతోషానికి కారణం నువ్వే బంగారం.. దీనికి నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అంది.. ఏంటక్కా రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బావతో చెప్పనా అనింది.

వదిన కొంచెం ఎమోషన్ లో ఉందిలే బంగారం ఇప్పటికి వదిలేద్దాం అంది శ్రావ్య… అక్క చెల్లెలు ఇద్దరు మాత్రం ఈ సీన్లో వాళ్లకు మాటల్లేనట్టు మౌనంగా ఉన్నారు…

ఊరిలోని ప్రతి ఒక్కరూ అది తమ ఇంటి కల్యాణంగా భావించి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తూ ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి కల్యాణంలో భాగం పంచుకుంటూ ఉండడం వర్మ గారికి మరింత సంతోషాన్ని కలిగించింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఆ సంవత్సరం కల్యాణానికి విచ్చేసినట్టు ఊరి పెద్దలు ఆల్రెడీ వర్మ గారికి చెప్పారు… అంతా మీ దయ అని చెప్పగా నాది ఏముంది అంతా ఆ రాముల వారి దయ అన్నారు వర్మ గారు..

మండపం అలంకరణ పూర్తవడంతో పాటు కళ్యాణ ప్రక్రియ మొదలు పెట్టబోతున్న వేద పండితులు అందరికీ ఒకసారి వినిపించేలా మైకులో అనౌన్స్ చేశారు… అందరూ గుడి మండపం కి చేరుకొని ఆ సీనులు కండి అని చెప్పారు…

స్టేజ్ మీద సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉండడంతో ముందు వరసలో వర్మ కుటుంబ సభ్యులు అందరూ కూర్చున్నాక తర్వాత వరుసలలో ఊరి వాళ్ళు కూర్చున్నారు…

మగవాళ్ళంతా ఒక సైడు ఆడవాళ్ళంతా ఒక సైడు పొందికగా  కూర్చుని అందరూ ఆ సీతారాముల కళ్యాణం చూడడంలో నిమగ్నమై పరవశిస్తూ ఉన్నారు…

పెళ్ళికొడుకులు మధ్య మధ్యలో తమ ప్రియ సకులకి వలపు బాణాలు విసురుతుంటే.. స్వామి వారి కళ్యాణం వైపు దృష్టి పెట్టండి అని అజయ్ ముగ్గురు కి చెప్పడంతో… రోషినికి సైట్ కొట్టుకుంటున్న అరుణ్ ఆ మాట విని.. అరేయ్ సింగిల్ చింతకాయ మా కష్టాలు నీకు తెలియవు కానీ నువ్వు భక్తిగా కళ్యాణం చూడు అన్నాడు..

వీళ్లు మారరు వీళ్ళతో నాకెందుకులే అని అజయ్ అక్కడి నుంచి లేచి వెళ్లి కళ్యాణం జరిగే పక్కగా నిలుచుకున్నాడు..

వేద పండితులు ఒక్కొక్క ఘట్టం అర్ధాన్ని పరమార్ధాన్ని వివరిస్తూ అందరి మనసులలో భక్తి భావాన్ని తట్టి లేపారు అనే చెప్పాలి. యువత కూడా తమకు తెలియని విషయాల్ని తెలుసుకుంటూ భక్తిశ్రద్ధలతో కళ్యాణ ఘట్టాన్ని గమనించారు..

ఒక్కొక్క ఘట్టం పూర్తి చేస్తున్న పండితులు అమ్మవారి మెడలో కట్టే తాళిబొట్టు అందరూ కళ్ళకద్దుకుని మనసులోని కోరికని ఆ సీతారాములకి విన్నవించుకోండి అని చెబుతూ తాళిని అందరి దగ్గరికి తీసుకువెళ్లే బాధ్యత పక్కనే నిలబడి ఉన్న అజయ్ కి అప్పగించారు…

ఒక్క అవకాశం దొరక్క పోతుందా అని ఎదురుచూస్తున్న రుచితకి ఇదే గొప్ప అవకాశం గా తోచింది…

రుచిత ఏం చేయబోతుందో దాని పరిణామాలేంటో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్..

నెక్స్ట్ ఎపిసోడ్ నోటిఫికేషన్ రావాలంటే నన్ను ఫాలో అయిపోండి..