వేద పండితులు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరు తాళిబొట్టు కళ్ళకు అద్దుకునేలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి తాంబూలంలోని తాళిబొట్టు చూపిస్తూ వస్తు ఉండగా రుచిత దగ్గరికి చేరుకునే లోగా తన మనసులో ఒక క్రూరమైన పథకం రచించి రెడీగా పెట్టుకుంది…ఎలాగైనా అజయ్ చేతిలోనే తాళి తన మీద పడేలా చేసుకుంటే మిగతా కార్యక్రమం పెద్దలే చేస్తారని క్రూరంగా ఆలోచిస్తూ ఎలా తనని తన మీద పడేలాగా చేసుకోవాల అని అనుకుంటూ ఉండగా మెరుపులా ఒక ఐడియా తట్టింది….

అందరికీ చూపించుకుంటూ వస్తు… ముగ్గురు పెళ్లికూతురులని జాగ్రత్తగా అద్దుకోండి అన్నాడు.. ముందు సుచరిత అద్దుకోగా.. తర్వాత రోషిని తర్వాత శ్రావ్య తర్వాత పూజిత కళ్ళకి అద్దుకున్నాక… పూజిత పక్కనే కూర్చున్న రుచిత టక్కున పళ్ళెంతట్టుకునేలా పైకి లేచింది… అజయ్ జాగ్రత్తగానే ఉన్న… అనుకోని ఆ పరిణామానికి కొంచెం పళ్లెం జాగ్రత్తగా పట్టుకునే  లోపల తాంబూలంలోని తాళి వెనక కూర్చుని ఉన్న బిందు మెడలో పడిపోయింది.,. పసుపు పచ్చని తాడు తన మెడనలంకరించడంతో ఏం జరిగిందో అర్థం కాక బిందు షాక్ కి గురైంది…

వెంటనే జనంలో కలకలం రేగింది.. అమ్మవారి మెడలో పడాల్సిన తాళి ఆ అమ్మాయి మెడలో పడిందంటే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలని కొందరు అనుకుంటే ఇది అపచారమని కొందరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఆ గుసగుసలు కొద్దిసేపు వేదమంత్రాలు ఆగేలాగా చేశాయి. జరిగిన పరిణామానికి యవ్వనంలో ఉన్న వాళ్లంతా దిగ్భ్రాంతికి గురైతే.. వయసైన వాళ్లు దీనికి పరిష్కారం ఏంటి అని మాట్లాడకపోవడం మొదలుపెట్టారు….

నిఖిల్ కంట్లో అప్పటికే ఒక కన్నీటి చుక్క మెరిసి మాయం అయ్యింది… రుచికి తను చేసిన ప్రయత్నం ఇంకొకరికి ఫలితం ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాలేదు… ఇందుకు మాత్రం తను కోరుకున్న స్థానం తన అక్కకు దక్కబోతుందని ఒకవైపు సంతోషం ఇంకొక వైపు బాధ… రాధకి మాత్రం.. వర్మ నిలియంలోకి శాశ్వతంగా ఫ్రీ టిక్కెట్ దొరికిందని సంతోషం… భవానికి మాత్రం తన రెండు తరాలు నిరీక్షణ ఫలించిందని సంతోషం… మిగతా వాళ్ళందరు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు… రోషిని మాత్రం వెంటనే లేచి అజయ్ పక్కన నిలబడింది అజయ్ కి భరోసాగా…

ఇంత గందరగోళం ఒక పక్క జరుగుతూ ఉంటే వర్మ గారు మాత్రం అప్పటికప్పుడు తన ఫ్రెండ్ అయినా ఊర్లో బంగారం ఆభరణాలు చేసే కంసాలితో తాళిబొట్టు తెప్పించారు… అది వేద పండితులకు అందించి కళ్యాణం జరిపించమని చెప్పారు. ఈసారి వేద పండితులే స్వయంగా స్టేజ్ మీద నిలబడి తాళి అందరికీ చూపించి సీతారాముల కల్యాణ వైభవాన్ని పూర్తి భక్తిశ్రద్ధలతో జరిపించారు.

తీర్థ ప్రసాదాలు అందరికీ అందించిన తర్వాత వేద ఆశీర్వచనాలు అనంతరం చర్చ మొదలయ్యింది మామూలుగా అయితే ఈ కార్యక్రమం అనంతరం అనుకున్న ప్రకారం నిశ్చితార్థం జరగాల్సిందే కానీ మధ్యలో ఆ సీతారాముల ఆశీర్వచనమో లేకపోతే ఇంకొకరి అత్యుత్సాహమో కానీ… ఈ పరిస్థితి వచ్చింది..

వేద పండితులు ఊరి పెద్దలు మధ్యలో కూర్చోగా వర్మ కుటుంబ సభ్యులంతా ఒకవైపు భవాని కుటుంబ సభ్యులంతా ఇంకొక వైపు కూర్చున్నారు. ముందుగా పండితులు వర్మ గారిని అడిగారు. ఇది ఆ సీతారాముల అనుగ్రహంగా భావించి ఆ అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా స్వీకరిస్తారా అని. అజయ్ ముందుగానే పెద్దలు చూపించిన అమ్మాయి అయినా నాకు ఓకే అని చెప్పి ఉండడంతో వర్మ గారు అల్లుళ్ళని కూతుర్లని కొడుకు కోడల్ని ఒకసారి చూసి ఆ అమ్మాయి మా వాడికి వరసయినది మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అందరి మాట గా చెప్పాడు…

తర్వాత అర్జున్ లక్ష్మి లను చూసి మీ అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా పంపడం మీకు సమ్మతమేనా అని అడిగారు. బిందువైపు ఇందు వైపు ఒకసారి చూసి.. జరిగిన పరిణామం మార్చలేనటువంటిది.. ఏమైనా ఇంత మంచి అల్లుడు ని మా అమ్మాయికి చూడలేము ఏమో.. ఇది ఆ సీతారాములు మాకు స్వయంగా చూపిన దారి పెద్దల నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పారు..

బిందు ఇందు చేతిని గట్టిగా పట్టుకుని .. ఐ యాం సారీ అమ్మానాన్నలని ఎదిరించే ధైర్యం నాకు లేదని చెప్పింది.. ఎదిరించమని నేను చెప్పను మే బి అజయ్ బావ నీకే రాసిపెట్టి ఉన్నాడేమో ఇది నువ్వు కావాలని చేయలేదు కదా.. నేను బాధపడడం లేదని చెప్పలేను కానీ నీ మీద అసూయ పడడం లేదని చెప్పింది…

పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే రోషిని నిఖిల్ ని పక్కకి తీసుకెళ్తూ ఉండడం చూసిన కుర్ర గ్యాంగ్ తనని వెంబడించారు.. అజయ్ గిల్టుగా ఫీల్ అవుతూ నిఖిల్ చెయ్ పట్టుకొని ఐ యాం వెరీ సారీ అన్నయ్య అని చెప్తూ ఉండగా రుచిత చేసిన పని చూసిన సుచరిత జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు అజయ్ అక్కడ ఏం జరిగిందో నేను చూశాను అంటూ రుచిత చేసిన పనిని చెప్పింది సుచరిత..

రోషన్ ఆవేశ పడుతుండగా రోషిని కంట్రోల్ చేస్తూ ఇందులో వదిన తప్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు అన్నయ్య నిదానంగా ఆలోచించు ప్లీజ్ అంది. మన నిర్ణయాలు వల్ల ఎదుటి వాళ్ళని బాధపెట్టే హక్కు మనకు లేదు చెల్లెలు చేసిన తప్పుకి అక్కకి శిక్ష వేయవనే నేను అనుకుంటున్నాను నా అన్నయ్య మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అంది రోషిని..

మన తలరాతలో ఎవరు రాసుంటారు వాళ్లే మనకి దక్కుతారని గురువుగారు నన్ను ఆశీర్వదించారు కదా రోషన్.. అలాగే బిందు తలరాతలో అజయ్ రాసున్నాడేమో నేను కాదేమో దానికి మనం ఇంత బాధపడుతూ మన పెద్ద వాళ్ళ నిర్ణయాన్ని తప్పు పట్టడం సరికాదు మన పెద్దల మాటే మన మాటగా ఉండాలి ఏది జరిగిన మనం హ్యాపీగా తీసుకుందాం అంటూ అందరి మనసులని తేలికపరిచాడు..

ఈరోజు మీ అందరికీ మెమొరబుల్ డే అది నా వల్ల కొంచెం డిస్టర్బ్ అయినందుకు  ఐ యాం వెరీ సారీ అన్నాడు అజయ్. ఏది జరిగినా అంతా మన మంచికే ఇందులో ఎవరి తప్పులేదు రండి వెళదామంటూ అందర్నీ గుడిలోకి పంపి చివరగా నిఖిల్ కి బాధపడొద్దు అన్నయ్య ప్లీజ్ అని చెప్పింది.

నువ్వేం చేస్తావురా నా మనసులో బాధని సంతోషాన్ని ఎవరైనా టక్కున గుర్తించగలరంటే అది నువ్వే నువ్వే ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పు ఏం కాదు ఇది మనం సంతోషంగా ఉండాల్సిన రోజు నీ సుచీ అక్కకి సగం పెళ్లి అయిపోతుంది బావ గాడిది అలాగే ఆ ముగ్గురు అన్నదమ్ములది బ్యాచిలర్ జీవితం కతం పోతుంది.. ముందు దీనిని మనం సెలబ్రేట్ చేసుకుందాం . తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం అన్నాడు నిఖిల్..

బాధ లేదని చెప్పను కానీ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తాను బంగారం అన్నాడు.. మా మంచి అన్నయ్య పద లోపలికి వెళ్దాం అంటూ నిఖిల్ చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. మా అన్నయ్య బాధకి కారణమైన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను గుర్తుపెట్టుకో మిస్ రుచిత అనుకున్నాడు అఖిల్… (ముందు ముందు ఏం చేయబోతున్నాడో నాకైతే తెలియదు)

అజయ్ కి అరుణ్ ఒకపక్క రోషిని ఒకపక్క కూర్చొని.. అజయ్ రెండు చేతులు పట్టుకుని ధైర్యం ఇస్తుంటే.. అరే బావా నేను లవర్ ని సెట్ చేసుకోమంటే నువ్వు ఏకంగా పెళ్ళాన్ని సెట్ చేసుకున్నావు నువ్వు సూపర్ బావ అన్నాడు అరుణ్. అన్నయ్య మొదలే టెన్షన్లో ఉంటే నువ్వేంటి భావ అంది రోషిణి… అబ్బా బావ సౌండ్స్ గుడ్ బంగారం.. మూడు వస్తే భావా అని పిలవాలి గాని నువ్వేంటే కోపంలో ఉన్నప్పుడు భయం లో ఉన్నప్పుడు పిలుస్తావు బావ అని అన్నాడు అరుణ్…

పక్కనే ఉన్న రోషన్ అరుణ్ తలపై మొట్టి మనం గుడిలో ఉన్నాం అన్నాడు… నేను నీ చెల్లిని ఏమీ అనలేదు బావ అన్నాడు  అరుణ్… అనే ధైర్యం అనాలనే ఆలోచన కూడా చేయకు అన్నాడు… బామ్మర్ది కాళ్లు కడగాలి కానీ బ్లాక్ మెయిల్ చేయకూడదు బావ అన్నాడు అరుణ్… కాళ్లు కడగాలి అంట అన్నయ్య కడిగేద్దామా అన్నాడు విజయ్…

అరే అన్నయ్య నువ్వు నీ తమ్ముడికి సపోర్ట్ చేయవా అన్నాడు వరుణ్ ని… అనడం అనిపించుకోవడం నీకు సరదా కదరా కానీ అన్నాడు  వరుణ్. కాసేపు కాంగ కూర్చుండని అందర్నీ ఒక చూపు చూశాడు రఘురాం…

పెద్దవాళ్ల నిర్ణయం అనుకూలంగా రావడంతో అజయ్ ని బిందుని.. ఉద్దేశించి యాదృచ్ఛికంగా జరిగిన ఇది ఆ సీతారాములు ఇచ్చిన సంకేతంగా మేము భావించి మీ ఇద్దరి బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాము..

మీ ఇద్దరూ ఈ బంధానికి కట్టుబడి ఉండగలరా అని అడిగారు.. పెద్దల నిర్ణయమే నా నిర్ణయం అలాగే తన సమ్మతమే నా సమ్మతం అన్నాడు అజయ్. మా అమ్మ నాన్న మాటే నా మాట అలాగే అబ్బాయి అంగీకారం నాకు ముఖ్యం అంది బిందు..

ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో అలాగే ఆ సీతారాముల ఆశీర్వాదంతో అజయ్ అనే అబ్బాయిని బిందు అనే అమ్మాయిని కాబోయే వధూవరులుగా నిర్ణయించడం జరిగిందని వేద పండితులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు…

వర్మ గారు మాట్లాడుతూ మా ముగ్గురి మనవళ్ల నిశ్చితార్థం ఇప్పుడు జరగబోతుంది అలాగే ఈ జంట నిశ్చితార్థం కూడా ఇప్పుడు జరిపి పెళ్లికి అందరికీ ఒకేసారి ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పారు. మాకు కూడా అమ్మాయి పెళ్లికి సంబంధించి అచ్చట ముచ్చట తీర్చుకోవాలి అని ఉంటుంది కాబట్టి మా మామయ్య నిర్ణయం మాకు ఓకే అంది లక్ష్మి

ఈ మొత్తం హంగామా లో ప్రేక్షక పాత్ర వహించడం శ్రావ్య కుటుంబం, రాజు కుటుంబం తార కుటుంబం వంతైతే రుచి మాటలతో ఎక్కడో ఆశ మొదలైన కవిత వెంకటేశులకి నిరాశ మిగలగ నిఖిల్ గురించి ఎంతో కొంత ఐడియా ఉన్న రామ్ కుటుంబం లో కలత మొదలైంది..

భవాని శంకర్ కళ్యాణి సుధాకర్లు తమ ఇంటి ఆడబిడ్డకు దక్కిన అదృష్టం కి పొంగిపోతూ అప్పటికప్పటికీ ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు…

నెక్స్ట్ ఎపిసోడ్ లో నాలుగు జంటల నిశ్చితార్థం హంగామా చూసేద్దాం. అజయ్ బిందుల నిశ్చితార్థం   సవ్యంగా జరుగుతుందా ఇంకా ఏమైనా అడ్డంకులు వస్తాయా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. ఎపిసోడ్ ఎలా ఉందో చదివేసి కామెంట్ పెట్టి నన్ను ఫాలో చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు ఇమీడియట్ గా వచ్చేస్తాయి.

Weight management: Read this article https://thequriouslife.com/10-best-and-powerful-daily-habits-for-your-healthier-and-happier-life/

For the best Pocket fan deals, click this link

https://amzn.to/49vKGEL

2 Responses