అరుణోదయ రోషిని తదుపరి భాగానికి స్వాగతం.
పూజిత రుచిత విషయం గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుని ఉన్న రోషన్ని డైవర్ట్ చేయడానికి సత విధాలగా ప్రయత్నిస్తుంది రోషిని. ఎగ్జిబిషన్ హాల్ నీ పెద్ద వాళ్ళందరూ వదిలేసి ఇంటికి వెళ్ళిపోగా చిన్నవాళ్లు మాత్రమే అక్కడ మిగిలారు.
అన్నయ్య ఇప్పుడు దిగులుగా కూర్చో ఉండాల్సింది నువ్వు కాదు, ఎందుకంటే హాకీ మనకి టైంకి అందేలాగా చేసింది పూజిత వదినే అని అరుణ్ రోషిని కి చెప్పిన విషయమే తను తన అన్నయ్యకి చెప్పింది
రమ్య ఇంటెన్షన్ ఏంటో తెలియక ఒకరకంగా భయపడ్డాడు వరుణ్. అది తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే రోషన్ కి ఒకసారి వరుణ్ బావ వైపు చూడు అన్నట్టు సైగ చేసింది రోషిని. ఏంటి అన్నయ్య బావ ఇది మన రోషిని సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద ఈవెంట్ ని కంప్లీట్ చేసింది ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కదా మీ దగ్గర ఇలా దిగులుగా కూర్చుంటే తను ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది దాని గురించి ఆలోచించర మీరు అని అడిగింది శ్రావ్య.
ఓకే ఓకే ఇది మనము పొట్లాడే టైం కాదు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం సో మనమంతా బీచ్ హౌస్ కి వెళ్తున్నాం. ఆర్ యు రెడీ అన్నాడు అజయ్. అన్నయ్య ఇది టూ మచ్ ఈ విషయం ముందే చెప్పుంటే బిందు వదినని సూచీ అక్కని ఇక్కడే అపి ఉండే వాళ్ళం కదా వాళ్ళు వెళ్ళిపోయాక చెప్తున్నావ్ అంది రోషిని.
మనమందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే రోజులు ముందు ముందు చాలా వస్తాయిలే బుజ్జి ఇప్పుడైతే మనం వెళ్దామా ప్లీజ్ అన్నాడు ఒకే అని రోషినీ చెప్పగా రాజు హరి కాలేజ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు బీచ్ హౌజ్ కి స్టార్ట్ అయ్యారు.
రంగి స్పెషల్ ఐటమ్స్ అన్ని వండి బీచ్ హౌస్ కి పంపగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసి అందరూ బాల్కనీలో సెటిల్ అయ్యారు. అప్పుడే పూజిత నుంచి రిక్వెస్ట్ మెసేజ్ వచ్చింది రోషినీకి. దయచేసి తాళం విషయంలో రుచిత చేసిన విషయం తన తండ్రికి చెప్పొద్దని ఆ మెసేజ్ సారాంశం.
ఆ మెసేజ్ రోషన్ కి చూపించి వదిన బేసిగ్గా చాలా మంచిది అన్నయ్య కాకపోతే వాళ్ళ చెల్లిల మనమా అనే సిచువేషన్ చాలాసార్లు వస్తున్నాయి తనకి. నాకు తెలిసి వాళ్ళు తన సొంత పేరెంట్స్ కాకపోయినా తనకి మంచి లైఫ్ ఇచ్చారని కృతజ్ఞత కాబోలు చాలా విషయాలలో తనని మనం కూడా ఫ్రెషర్ చేయకూడదు బట్ ఎట్ ది సేమ్ టైం రుచిత నీ మన ఫ్యామిలీలో ఇన్వాల్వ్ కాలేయకుండా చూసుకోవాలి తాతయ్య చెప్పినట్టు కణ్నింగ్ పీపుల్ కి వర్మ నిలయంలో చోటు ఇవ్వకూడదు
సో మన తక్షణ కర్తవ్యం వదిన బాధపడకూడదు అలాగే రుచిత మన ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఏదైనా చేసేటప్పుడు ఈ విషయం అందరూ మైండ్లో పెట్టుకోండి అని అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది రోషిని.
రమ్య ఇంటెన్షన్ వేరే ఉంది బావ తను మీ తమ్ముడు కోసం వచ్చింది అక్క కోసం రాలేదు అని నవ్వుతూ చెప్పింది రోషిని అవునా తను అరుణ్ కోసమే వచ్చిందని నీకు ఎలా తెలుసు మరదల్ అని అడిగింది శ్రావ్య, మేడం గారు మాటలు మన అందరితో ఉన్న చూపులు మాత్రం మీ అన్నయ్య గారి మీద ఉన్నాయిలే అలా తెలుసు అంది రోషిని.
సుచరిత ఇంటికి వెళ్ళాక దిగులుగా సోఫాలో కూర్చోవడంతో నిఖిల్ తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏమైంది సుచి భయపడుతున్నావా అని అడిగాడు. లేదు అని తల ఊపి నిఖిల్ వెనక నిలబడున్న రమా రామ్ అఖిల్ ని చూస్తూ అమ్మ నాన్న నాకోసం ఒక సహాయం చేయగలరా తాతయ్యతో మాట్లాడి మా పెళ్లి వీలైనంత త్వరగా పెట్టించగలరా అని అడిగింది.
ముందు పెళ్లంటే మిమ్మల్ని వదిలి వెళ్లాలేము అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకునే ఉద్దేశం నాకు లేదు నా కన్యాదానం అంటూ జరిగితే అది మీ చేతుల మీద గానే జరగాలి వేరే వాళ్లకు అవకాశం నేను ఇవ్వదలుచుకోలేదని తన మనసులో భయాన్ని బయట పెట్టింది సుచరిత
పిచ్చి పిల్ల అంత భయం దేనికి, మన వెనక వర్మ గారి కుటుంబం మొత్తం ఉంది నువ్వు అన్నట్టే తాత గారితో నాన్నగారు మాట్లాడుతారు లే అని తన కన్నీళ్లు తుడిచింది రమా. ఏంటో మేడం గారికి మమ్మల్ని వదిలి పోవాలని చాలా తొందరగా ఉన్నట్టుంది అంతేలే ఇక్కడ మేమైతే ఇద్దరమే అక్కడ ముగ్గురు ఉన్నారుగా తోకలు అన్నాడు అఖిల్ సిచువేషన్ ని తేలిక పరచడానికి.
అసలే నా ప్రియమైన శత్రువు మీద గెలిచే అవకాశం ఇచ్చిన బంగారు తల్లివి నువ్వు ఇలా ఏడవచ్చ అయిన మా నుంచి నిన్ను దూరం చేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఆ ఛాన్స్ నేను ఇవ్వను ఊరుకో తల్లి అన్నాడు రామ్.
ఇంటికి వెళ్ళిన రమ్య తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చిటపటలాడుతుంటే సముదాయించడానికి నీవల్ల కాకపోతే ఏమైంది డాడీ చూసుకుంటారులే అని చెప్పింది శ్రీదేవి. వాళ్లని డీల్ చేయడం చాలా టఫ్ నాన్న వాళ్ళు రిచ్ పీపులే కానీ ఎక్కడ బిజినెస్ సర్కిల్లో మీటింగ్లకు రావడం కానీ క్లబ్లో కానీ లేరు అన్నాడు హరి.
నెగిటివ్ గానే ఎందుకు వెళ్లడం మీ పెద్ద కూతురుని ఉపయోగించుకుని తనని మిస్ అవుతున్నట్టు వెళ్ళండి అని చెప్పింది రమ్య. అంత పెద్ద బిజినెస్ ఎంపైర్ రన్ చేస్తున్నారు అంటే ఆ కుటుంబం ని తక్కువ అంచనా వేయకూడదు నాన్న పర్ఫెక్ట్ గా లేకపోతే మనం వెంటనే దొరికిపోతాం పర్మినెంట్గా ఆ ఇంటికి వెళ్లే దారి మూసుకొని పోతుంది నేను ఏదో ఒక దారి ఆలోచిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు అన్నాడు హరి
ఇంట్లో భోజనాల తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ నాన్నగారు నాకు ఎందుకో పెళ్లిళ్లు కూడా కొంచెం త్వరగా చేసేస్తే మంచిదని అనిపిస్తుంది అన్నాడు రాఘవ. అవును మామయ్య ఇవాళ ఎగ్జిబిషన్లో జరిగింది తలుచుకొని సుచరిత బాగానే భయపడినట్టుంది అని చెప్పాడు రఘురాం కూడా. ముందు రోషన్ ది వరుణ్ ది చేద్దాం మామయ్య తర్వాత అజయ్ విజయ్ కి చేద్దాం అన్నాడు చంద్ర.
మీరు చెప్పింది కూడా బాగానే ఉంది రేపు ఒకసారి వెళ్లి గురువుగారిని కలుద్దాం అన్నారు వర్మ గారు కూడా. విన్నారుగా మీ కాబోయే కోడళ్ళకి కావలసిన నగలేవో మీకు నచ్చినట్టుగా చేయించుకోండి అలాగే వాళ్ళకి నచ్చినవి కూడా తీయించి మిగతా పనులు చూసుకోండి అని కుతుర్లకి కోడలికి చెప్పింది జానకమ్మ.
నేను బంగారం ని తీసుకుని బీచ్ లో వాకింగ్ కి వెళ్తున్నాను నా వెనక వచ్చారో బాగోదని అందరికీ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి రోషిని నీ తీసుకుని వాకింగ్ కి వెళ్ళాడు అరుణ్.
ఇద్దరు చేతులు పట్టుకొని అలా నడుస్తూ వెళ్తూ ఉండగా ఏంటి బావ స్పెషల్ ఎవర్ని రావద్దని అంత గట్టిగా చెప్పావు అని అడిగింది రోషిని. పెళ్లికి వెళ్తే పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లొద్దని మన పెద్ద వాళ్ళు చెప్పారు కదా బంగారం. అందుకే లే అన్నాడు కొంపతీసి ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడం లేదు కదా అనింది రోషిని నేనైతే రెడీ నీకు ఓకే కాదు కదా అందుకే కొద్దిరోజులు ఆగుతానులే అన్నాడు
అయ్యగారికి బాగా తొందరగా ఉన్నట్టుంది అంది రోషిని, దగ్గర దగ్గర అయిదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అయినా అమ్మగారికి కనికరం రావడం లేదు ఏం చేయాలి? నువ్వు ఇలాగే డిలే చేస్తూ ఉండు గ్రాండ్ వెడ్డింగ్ కాదు కదా గుడిలో తాలి కట్టేస్తాను అన్నాడు అరుణ్
అప్పుడు కదా మా అన్నయ్యల చేతిలో నీకు పెళ్లి జరిగేది అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేసి బతికేయండి ఫ్యామిలీ ఫ్యామిలీ అని సరదాగా కాసేపు నవ్వుకున్నాక హ్యాపీ నా బంగారం నీ ఫస్ట్ ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ కదా అన్నాడు
వామ్మో లాస్ట్ ఫైవ్ మినిట్స్ గుండె మళ్ళీ ఆగి కొట్టుకునింది తెలుసా అయినా అతను ఎందుకు బావ ఇంత వ్యూడ్గా బిహేవ్ చేస్తుంది మొదట్లో చాలా బాగానే ఉండేది కదా పైగా అంకుల్ దేశం కోసం పని చేస్తూ అంత లాయల్ గా ఉంటారు, ప్రేమ బంగారం ప్రేమ అలాగే ఎలాగైనా దక్కించుకోవాలని పిచ్చి ఇలాంటి పిచ్చి పనులు ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పాడు అరుణ్
ఏమోలే నాకు తెలిసి ఇంట్లో పెళ్లి బాజాలు మోగేటట్టు ఉన్నాయి అని అయిన సూచీ అక్క ఎలా ఉందో ఏంటో అంటే, బానే ఉందంటలే నేను నిఖిల్ బావ కి ఫోన్ చేశాను వదిన కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట అని చెప్పాడు
వాళ్లకేమో గానీ నీకు బాగా తొందరగా ఉన్నట్టుంది అని ఆట పట్టిస్తే ఉండదా మరి వాళ్ళందర్నీ పెళ్లి పేరుతో సైడ్ చేసేస్తే కదా నా లైన్ క్లియర్ అయ్యేది అందుకే ఈ తొందర అన్నాడు అరుణ్ కూడా తగ్గకుండా
అయ్యగారు లిస్టులో ఇంకొక ఫ్యాన్ ఆడ్ అయినట్టుంది అని రమ్యని ఉద్దేశించి రోషిని అనగా అమ్మగారి ఫాన్స్ కూడా ఈరోజు తారసపడ్డారుగా గమనించినట్లు లేరు మేడం అన్నాడు వర్ధన్ ని ఉద్దేశించి అరుణ్
అవునా అయ్యో సరిగా గమనించలేదే గమనించి ఉంటే బాగుండేది. నీకంటే బాగుంటే సైడ్ అయిపోతాను నేను చూసుకో మరి అంది, పొరపాటున ఈ విషయం మీ అన్నల దగ్గర కామెడీకి కూడా చెప్పదు బంగారం ప్లీజ్ నా మీద దయ ఉంచమ్మ బాగా పగబట్టేస్తున్నారు ఆల్రెడీ అన్నాడు
ఆ మాత్రం భయం ఉండాలి మేమంటే అంది రోషిని, అలాగే మేడం భయపడతాం సదా మీ సేవలో అంటూ ఇప్పటికైతే సారీ అని చెప్పి లిప్ లాక్ కిస్ ఇచ్చేసాడు. ఇందుకు తీసుకొచ్చావా ఇక్కడికి ఉండు నీ పని చెప్తానంటూ అరుణ్ణి పరుగులు పెట్టించింది బీచ్లో.
అలా సరదాగామల్ల రోజుని ముగించుకున్నారు
ఇంకో ఎపిసోడ్ మళ్లీ కలుద్దాం, లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి