మండపంలో తన అక్కకి తోడుగా కూర్చున్న రుచి ఆలోచనలు తన అక్క నిశ్చితార్థం జరిగిందన్న సంతోషం కన్నా తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న బాధ గురించి ఎక్కువగా ఉన్నాయి.
బిందు తన చెల్లి చేతిని గట్టిగా పట్టుకుని కూర్చోవడంలోనే తెలుస్తుంది తన చెల్లి గురించి తను ఎంతగా బాధపడుతుందో.
తను కోరుకున్న వాడు తన అక్కకి భర్త కాబోతున్నాడు అనే బాధ కన్నా తన అక్క మంచి ఇంటికి కోడలుగా వెళుతున్న సంతోషమే ఇందు మొహం లో కనిపిస్తుంది.
అజయ్ వేలికి ఉన్న ఉంగరం అప్పుడే చూసిన రోషన్. ఇది ఎలా సాధ్యం దీనివల్ల బంగారానికి ఏం ప్రాబ్లమ్స్ రావు కదా అనుకున్నాడు మనసులో.
అప్పుడే అజయ్ చేతికున్న ఉంగరం చూసిన రుచి ఇదంతా మేడం గారు ముందే ప్లాన్ చేసుకునే వచ్చారా లేకపోతే ఇది ఎలా సాధ్యం అనుకొని తన అక్కకి చెవిలో అజయ్ చేసుకున్న ఉంగరం చూడు అన్నట్టు చెప్పింది.
చూసావా నువ్వు వెళ్లి మరీ పర్సనల్గా వాళ్ళిద్దరితో మాట్లాడాను అని చెప్పావు కదా అయినా కూడా వాళ్ళు నీకు ఇచ్చిన విలువ చూడు పైగా నువ్వు వాళ్ళకి కాబోయే వదినవి.
వాళ్ళు ఏమి నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు అంటూ తన కుళ్ళునంత తన అక్క బుర్రలోకి ఎక్కించింది రుచి.
ఇంతలో రోషిని అరుణ్లు రంగి రాజు హరిల సాయంతో కొత్త దంపతులకు భోజనాలు తీసుకొని మండపం దగ్గరికి వచ్చారు.
బుజ్జి కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు కదరా ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావ్ అన్నాడు విజయ్. అవునవును మేడంగారు అందరు కళ్ళల్లో పడాలి కదా అని ఉడికిపోయింది రుచి.
రంగి అన్ని ప్లేట్లలో వడ్డించగా వాటిని అందరికీ సర్వ్ చేస్తున్నారు రాజు హరి. రాజు చేతిలో నుంచి ప్లేట్ తీసుకున్న సుచీ.. థాంక్యూ ఫర్ ఎవరీ థింగ్ రాజు ఒక బ్రదర్ గా అన్ని సందర్భాలలో నువ్వు నా పక్కనే ఉన్నందుకు అంది. మనలో మనకి ఏంటి సుచి ఎంజాయ్ యువర్ డే అన్నాడు.
హరి చేతిలోంచి ప్లేట్ తీసుకున్న శ్రావ్య థాంక్యూ సో మచ్ అన్నయ్య అంది మనస్ఫూర్తిగా. అన్నయ్య అని పిలుస్తూ మళ్ళీ థాంక్స్ దేనికి నేనే బంధాల్ని బంధవ్యాలని అర్థం చేసుకోవడంలో లేట్ చేశాను. ఇంకెప్పుడు లేట్ చేయను సరేనా అంటూ తన నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆ క్షణం రోషిని రాజుల మదిలో ఒకప్పటి రూడ్ హరి మెదలగా అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పొ అని అనుకోకుండా ఉండలేకపోయారు.
కాలం ఎంతటి వారినైనా మారుస్తుంది అనేదానికి హరి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు తల్లి అయినా తార చేతిలో కీలుబొమ్మగా దేనికి పనికిరాని వెదవ గా ఉన్నవాడు ఇప్పుడు సీతాకోకచిలుక మాదిరిగా మార్పు చెంది వర్మ ఇన్స్టిట్యూట్లో ఎందరో స్టూడెంట్స్ కి ఆదర్శంగా ఉన్నాడు.
అజయ్ కి ప్లేట్ ఇచ్చిన అరుణ్ ద్రోహి నాతోపాటు పనులు చేయడానికి వచ్చి పెళ్ళికొడుకువైపోతావా అంటూ ఆటపట్టించాడు. బలంగా కోరుకున్నట్టున్నావ్ అన్నాడు అజయ్ బిందు వైపు చూసి వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ బిందు అన్నాడు అరుణ్ థాంక్యూ అరుణ్ నీకు అభ్యంతరం లేకపోతే నన్ను అక్క అని పిలవచ్చు అంది.
నాకేమీ అభ్యంతరం లేదు అక్క ఇప్పటివరకు మీ చెల్లి అల్లరిని భరించి ఉంటావ్ ఇకమీదట నా అల్లరిని భరించాలి మన ఇంట్లో అన్నాడు.
తన ముగ్గురు అన్నయ్యలకి తన చేతి మీద భోజనం ప్లేట్ అందించిన రోషిని నిఖిల్ కి కూడా అందించింది. అందించేటప్పుడు సారీ అన్నయ్య అని మనస్ఫూర్తిగా చెప్పింది. బిందు ని నిఖిల్ పక్కన ఊహించుకున్న రోషినికే జరిగిన మార్పు కష్టంగా ఉంటే నిఖిల్ కి ఇంకా ఎంత బాధగా ఉంటుందో అని తను కూడా బాధపడుతూ సారీ చెప్పింది.
ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజు బంగారం ఇలా బాధపడుతూ ఉండకూడదు నీ ముఖంలో చిన్న బాధ కనిపించినా నీ ముగ్గురు అన్నయ్యలు నన్ను కుమ్మేస్తారు అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు నిజం కాదని తెలుస్తున్న ఏమీ చేయలేని సిచువేషన్ తనది.
తన బాధ నీ పక్కన పెట్టి తన చెల్లికి ఇది ఇంపార్టెంట్ రోజు కావడంతో సుచరితకి భోజనం తినిపిస్తూ తను తింటూ అందరిలో కలిసి పోయాడు నిఖిల్.
అరుణ్ చేతుల మీదుగా భోజనం ప్లేట్ తీసుకోవాలని ఆశగా చూస్తూ ఉన్న రాధకి ఆశాభంగం కల్పిస్తూ హరి తన చేతిలో భోజనం ప్లేట్ పెట్టాడు. అఖిల్ చేతికి వచ్చిన భోజనం ప్లేట్ ని తీసుకొని పూజకు ఇచ్చిన రుచి ఇంకో ప్లేట్ తను తీసుకుంది.
నా అన్నయ్య బాధకి కారణమైన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను అంటూ రుచితను చూసి మనసులోనే శబదం చేసుకున్నాడు అఖిల్.
ఇందు చేతికి భోజనం అందించి లాస్ట్ గా రోషిని చేతిలో భోజనం ప్లేట్ పెట్టాడు రాజు.
హరి రాజులకు కూడా భోజనం ప్లేట్ అందించిన రంగి మీరిక్కడ బొంచేయండి నేను అక్కడ భోం చేస్తానని భోజనాలు దగ్గరికి వెళ్లిపోయింది.
రోషన్ అజయ్ విజయ్ లు తమ మొదటి ముద్ద రోషినికి తినిపించి వాళ్లు తినడం మొదలు పెట్టబోతుండగా ఎప్పుడు మీ చెల్లికే నా మా అక్కకి తినిపించరా బావగారు అంది రుచి.
ఎందుకు తినిపించరు కానీ ఇది సమయం సందర్భం కాదని మనము గుడిలో ఉన్నామని ఆగిపోయారు లే అని బదులిచ్చింది సుచరిత. బాగా చెప్పావు వదిన దీని కళ్ళని మన బంగారం మీదే ఉన్నాయని తన చెవిలో చెప్పింది శ్రావ్య.
అలవాటు ప్రకారం తన మొదటి ముద్దని ఇందుకి తినిపించిన బిందు తన రెండో ముద్దని రోషినికి తినిపించింది.
రోషిని తన చేతికి వచ్చిన ప్లేట్ ని మొదటగా తన ముగ్గురు అన్నయ్యలకి తినిపించి తరువాత అరుణ్ కి వరుణ్ కి పెట్టి రాజు సుచరిత శ్రావ్య ల కి మొత్తంగా తినిపించేసింది.
నాకు తెలుసు బంగారం నా ప్లేస్ ఎప్పటికీ నీ అన్నల తర్వాతే అని అన్నాడు అరుణ్. కష్టంగా ఉంటే చెప్పరా బావ డ్రాప్ అయిపోదామన్నాడు విజయ్ ఓరగా రుచిత పూజితలను చూస్తూ.
తను ఎప్పుడూ మన మధ్యలోకి రాడని నీకు తెలుసు కదా అన్నయ్య బొంచేయండి అంది రోషిని. బామ్మర్ది గాడికి ఎకసక్కలులే లైట్ తీసుకో అన్నాడు అజయ్.
పూర్ అరుణ్ అన్నా చెల్లెలుతో మనం గెలవలేమని తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళ మధ్యలో దూరుతావ్ అంది సుచరిత. థాంక్స్ వదిన నా అన్నగాడు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయకపోయినా నాకు సపోర్ట్ చేయడానికి నువ్వు వస్తున్నావు మన ఫ్యామిలీలోకి అన్నాడు అరుణ్.
ఎక్కువ ఆవేశ పడకు రా నువ్వా తన చెల్లా అన్నప్పుడు తను తన చెల్లివైపు యు టర్న్ తీసేసుకుంటుంది అన్నాడు వరుణ్ సుచరితకి సైట్ కొట్టుకుంటూ .
అదైతే నిజమే అన్నయ్య నువ్వు మాత్రం నువ్వా బంగారం అనే సిచువేషన్ ఎప్పుడు మన ఫ్యామిలీకి తీసుకొని రావద్దు ప్లీజ్ అంది శ్రావ్య.
రోషన్ మొదట రోషినికి ఫుల్లుగా తినిపించేసాక తను తిన్నాడు. ఈ మొత్తం సిచువేషన్ లో అన్ని కామ్ గా గమనిస్తూనే ఉంది పూజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా.
మొదట అబ్బాయిలంతా చెయ్యి కడగడానికి వెళ్లిపోగా మీ అక్క మీద కోపం వచ్చిందా ఇందు అని అడిగింది రోషిని. లేదు అన్నట్టు తల ఊపగా నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేశావు కదా ఈ విషయంలో నిన్ను చాలామంది ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను నేను అన్నట్టు రుచి వైపు రాధవైపు ఓరగా చూసింది రోషిని. ఈరోజు నాది కాకపోయుండొచ్చు ఇంకా టైం ఉంది కదా నా ప్రయత్నాలు నేను తప్పకుండా చేసుకుంటానని మనసులో అనుకుంది రుచి.
(If you want start Yoga buy for alignment yoga mat https://amzn.to/4nBAkJp)
మొదట చేయి కడుక్కుని అమ్మాయిల దగ్గరికి వచ్చాడు నిఖిల్ అప్పటికే అమ్మాయిలు భోజనం అయిపోగా అందరూ చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోగా బిందు అక్కడే నిలబడి సారి నిఖిల్ గారు అంది.
మీరు సారీ చెప్పడం ఏంటి నేను ఎక్కువగా ఆశపడ్డానేమో నాకు అర్హత లేదని దేవుడు నాకు ఇలా చెప్పాడు ఏమో అన్నాడు నిఖిల్.
మీరు నా ఎప్పుడు బిందు అనే సంబోధించే నువ్వు ఇప్పుడు నన్ను దూరం పెడుతుంటేనే అర్థం అవుతుంది అని అంది బిందు. మనం ఎప్పటికీ బిజినెస్ పార్ట్నర్స్ మే నిఖిల్ గారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చేయి కడుక్కోవడానికి వెళ్లిపోయింది బిందు కూడా.
ఎప్పటికీ బిజినెస్ పార్ట్నర్స్ మే లైఫ్ పార్ట్నర్స్ మీ కాలేకపోయాం అనుకున్నాడు మనసులో నిఖిల్. అజయ్ వచ్చి నిఖిల్ చేతులు పట్టుకొని సారీ అన్నయ్య నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది అన్నాడు. జరిగిన దాంట్లో ఎవరు తప్పులేదు అజయ్ జరిగినదాన్ని మనమంతా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంగీకరించడం మంచిది అన్నాడు.
బాధపడుతూ ఇక్కడే ఆగిపోయి బంగారం మనసులో చెడ్డగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు నిఖిల్. అజయ్ తన చేతికి ఉన్న నిశ్చితార్థం ఉంగరం చూసి ఇది ఎలా సాధ్యమైంది బంగారం నీకు అనుకున్నాడు.
వచ్చిన ఊరి వాళ్ళందరూ భోజనాలతో పాటు అతిథులు భోజనాలు అంతా అయిపోయాక. మొదటగా వేద పండితులకి రోషిని చేతుల మీదుగా తాంబూలం అందించారు వర్మ దంపతులు.
వాళ్లు కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించాక వర్మ కుటుంబ సభ్యులందరినీ అతిధులందరినీ ఆశీర్వదించి సంతోషంగా అక్కడి నుంచి నిష్క్రమించారు.
తర్వాత కొత్త దంపతుల చేతుల మీదుగా ఊరి వాళ్ళందరికీ తాంబూలం ఇప్పించారు రాధిక కుందన రత్నలు.
ముందు చెప్పినట్టు గానే త్వరలో ముహూర్తాలు పెట్టించి మీ అందర్నీ అక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు మేమే చూసుకుంటాం ప్రతి ఒక్కరూ వచ్చి మీ ఆశీర్వాదాలు నా మనవళ్లకు అందించాలని మైక్ లో అనౌన్స్ చేశారు వర్మ గారు.
అందరూ తమ తమ సంతోషాలు వ్యక్తం చేసి తప్పకుండా వస్తామని అక్కడ కార్యక్రమం ముగియడంతో ఇంటికి బయలుదేరారు సంతోషంగా.
ఆ గుడి పూజారి దంపతులకు ప్రత్యేకంగా తాంబూలం అందించింది రోషిని తన పాకెట్ మనీ అంతా దాంట్లో పెట్టి.
ఎందుకమ్మా ఇది మీ తాతయ్య గారు మాకు అన్ని చూసుకుంటున్నారు కద అన్నారు పూజారి గారు. ఇది నా తరఫునుంచి పూజారి గారు ఆ రామయ్య సన్నిధిలో ఉండే అదృష్టం మీకు దక్కింది అప్పుడప్పుడు మా కుటుంబం బాగుండాలని మీకు తోచినప్పుడు స్వామివారికి అర్చన చేయండి చాలు అంతే అని చెప్పింది రోషిని.
నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఇంతే బాధ్యతగా అలాగే సంతోషంగా ఉండాలని ఆ దంపతులిద్దరూ ఆశీర్వదించారు.
నా బుజ్జి తల్లికి ఎప్పుడు ఎలా మసులు కోవాలో చాలా బాగా తెలుసమ్మా అంటూ మెటికలు విరిచింది రంగి.
పూజారి దంపతుల సలహా మేరకు వర్మ దంపతులు తమ ఆడపడుచు అలాగే ఆమె భర్త అయినా భవాని శంకర్లకి దంపతుల తాంబూలం ఇచ్చారు, తర్వాత లహరి అత్త మామ గార్లకి అలాగే పూజ నానమ్మ తాత ఇలకు కూడా ఇచ్చారు.
తర్వాత శారదా శరత్ దంపతులకు, తారకి ఇచ్చాక, కళ్యాణి సుధాకర్ లకి లక్ష్మీ అర్జునులకి, కవిత వెంకటేశులకి, శ్యామ్ లహరి లకి, రామ్ రమ లకి కూడా దంపతుల తాంబూలం ఇచ్చి ఆశీర్వదించారు.
నా వంశం నిలబడడానికి మీ ఇంటి లక్ష్మీ లని ని మా ఇంటికి పంపుతున్న మీ ఇల్లు ఎప్పుడు సుఖసంతోషా లతో వర్ధిల్లాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు జానకమ్మ మహేంద్ర వర్మలు.
ఈ లోపల గుడిలో మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకొని ఎవరికి అప్పగించవలసిన వాటిని వాళ్ళకి అప్పగించి వర్మ గారు బంగారం బిజినెస్ లో కి అడుగు పెట్టడానికి కారణమైన కంసాలి తాత దంపతుల్ని అక్కడికి తీసుకుని వచ్చాడు రాఘవ్.
వాళ్ళిద్దరికీ తాంబూలం రాఘవ్ రాధికల చేతగా ఇప్పించి ఎప్పుడు మీ కొడుకు ఇంటికే కాకుండా మా ఇంటికి కూడా అప్పుడప్పుడు రండి అని ఆహ్వానం పలికారు.
తప్పకుండా మీ మనవళ్ళు పెళ్ళికి వచ్చి మీ ఆతిథ్యం స్వీకరిస్తామని హామీ ఇచ్చి ఇంటికి కదిలారు వాళ్ళు.
వీలైతే ఈ రాత్రికి ఇక్కడ రామయ్య సన్నిధిలో నిద్ర చెయ్యండమ్మా అని పూజారి గారు చెప్పగ అప్పటికే పనులతో అలసిపోయిన పెద్దవాళ్లందరినీ చూసిన రోషిని బలవంతంగా పెద్దవాళ్లందరినీ ఇంటికి పంప దలచి మేముంటే సరిపోతుంది కదా తాతయ్య అని అడిగింది.
రామయ్య సన్నిధిలో ఉండే సౌకర్యం ఇంకెక్కడ ఉంటుంది తల్లి నువ్వు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అందరం ఈ రాత్రికి ఇక్కడ నిద్ర చేసి రేపు ఉదయాన్నే మన ఇంటికి బయలుదేరుదామని నిర్ణయించారు వర్మ గారు దాంతో అందరూ తప్పక అంగీకరించారు.
A portable outdoor shower is very useful for travelling. Find it in the link below.
ఈ స్టోరీ ఎలా ఉందో చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపితే నా రైటింగ్ స్కిల్స్ ఇంకొంచెం నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయం అవుతుంది.
థాంక్యూ ఫర్ సపోర్టింగ్ మీ.

Sooper sooper story
Super
Next episode please
ee roju upload chestanu andi
thank you andi