అరుణోదయ రోషిని తదుపరి భాగానికి స్వాగతం.
ఎగ్జిబిషన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిశాక ఛారిటీ గురించి అనౌన్స్ చేయగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా వర్మ కుటుంబ సభ్యులు మాత్రమే హాల్లో మిగలగా అందరి ముందుకు వచ్చింది రమ్య
అప్పటికే యంగ్ బ్యాచ్ అంతా చాటింగ్ ద్వారా రమ్య గురించి ఒకరికొకరు తెలుసుకున్నారు రోషిని రమాకి రాంకి ఫోన్ చేసి వెంటనే ఎగ్జిబిషన్ దగ్గరికి రమ్మని చెప్పగా వాళ్లు కూడా అక్కడికి అప్పుడే చేరుకున్నారు
వర్మ గారు రమ్యని ఎవరమ్మా నువ్వు ఎందుకు సుచరితకి చెల్లిని అని చెప్తున్నావు తను మా అల్లుడు కూతురు నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అన్నాడు అసలు తన మనసులో ఏముందో తెలుసుకోదలచి
అయ్యో నేను నిజంగా తన చెల్లిని తాతయ్య మా అక్క గురించి నాకు తెలియదా ఎవర్నో చూసి ఎవరు అనుకోవడమేంటి అని అంది అవునా నిజంగానే తన మీ అక్కనా అయితే ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావని అడిగింది జానకమ్మ
నేను చదువుకోడానికి నాలుగు సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్లిపోయాను బామ్మ గారు రీసెంట్ గానే తిరిగి వచ్చాను మీ పెళ్లి రోజు ఫోటోలు పేపర్ లో వచ్చినపుడ తనని చూసి గుర్తుపట్టి తనని అప్రోచ్ అవ్వడానికి అప్పటినుంచే ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కుదిరింది అని చెప్పింది
అయినా మీ అక్కని పేపర్లో చూసి గుర్తుపట్టడం ఏంటమ్మా మీ అక్క మీతో ఉండదా అని అడిగింది ఏమీ తెలియనట్టు కుందన, మా అమ్మ మీద అలిగి మా అక్క ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నాకు రీసెంట్ గానే తెలిసింది ఆంటీ అప్పటినుంచి మా అమ్మ దిగులుతో బయటకు రావడమే మానేసింది మా నాన్న మా అక్కని వెతికిస్తూనే ఉన్నాడు అని అమాయకంగా చెప్పింది
అయ్యో ఇదే ఊర్లో ఉన్న మీ అక్కని కలుసుకోవడానికి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా అంది రాధిక బాధగా ముఖం పెట్టి
మా అమ్మ అంటే అక్కకి ఇష్టం లేదండి అందుకని ఇంట్లో నుంచి వచ్చేసింది, మాకు తెలిసినంతవరకు మా సూచీ బంగారమే తనకి అమ్మ నచ్చకపోవడమేంటి నువ్వు చెప్పేది ఒక్కటి కూడా నమ్మసక్యంగా లేదమ్మా నువ్వు ఎవరో ఎందుకు వచ్చావు నాకైతే తెలియదు కానీ నీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు మర్యాదగా వెళ్లకపోతే పోలీసులు పిలుస్తానని బెదిరించింది జానకమ్మ
అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి కావాలంటే మా అక్కని అడగండి మా అమ్మ తనకి సవతి తల్లి అందుకే మా అమ్మంటే తనకి ఇష్టం లేక ఇంట్లో నుంచి వచ్చేసింది అని ఇంకొకసారి చెప్పింది అవునా సరే మీ అమ్మ అంటే సవతి తల్లి కాబట్టి ఇంట్లో నుంచి వచ్చేసింది మరి మీ నాన్న ఏం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు అని అడిగింది రమా
వీళ్లంతా తనని అడుగుతున్న త చూపు మాత్రం ఆరుణ్ మీదే ఉండడం గమనించిన రోషిని నా జీవితానికి ఇంకో బ్లాక్ క్యాట్ అనుకొని మెల్లిగా రమ దగ్గరికి వెళ్లి పక్కన కూర్చొని పెద్దమ్మ నీకు నీ కూతురు కావాలా నీ డిగ్నిటీ కావాలా నువ్వే డిసైడ్ చేసుకోవాలి అంది. అయ్యో పెదనాన్న గారు ఏమైనా అనుకుంటారేమో తల్లి అని అమాయకంగా రమా అడిగితే నేను చూసుకుంటాను కదా నువ్వు రెచ్చిపో అంది రోషిని
దాంతో రమ కుర్చీని ఎడంకాలితో తన్ని మరి పైట తీసి నడుముకు దోపుకుని, చూడమ్మాయ్ నువ్వెవరో నాకు తెలియదు గానీ నువ్వు మాట్లాడేది ఒక్కటి కూడా సరిపోలడం లేదు సుచరిత నా కూతురు వాళ్ళింటికి కాబోయే కోడలు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లలేదంటే జుట్టు పట్టుకుని బయటికి తోసేస్తాను జాగ్రత్త అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది
అక్క తొక్క అంటూ మళ్ళీ ఇంకొకసారి ఈ దారిదాపల్లో కనిపించావంటే బాగోదు నా గురించి నీకు తెలియదు అంది, వెంటనే రాధిక అందుకుని నా కోడలు వైపు ఇంకోసారి చూసావు అంటే గుడ్లు పీకేస్తాను ఇకనుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే నీకు అంత మంచిది ఎవరికి చెప్పుకుంటావో చెప్పు కో అంది.
అయ్యో మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అండి నేనుతనని మీ నుంచి వేరు చేయడానికి రాలేదు ప్లీజ్ తనని కన్విన్స్ చేసి మా ఇంటికి పంపిస్తారని వచ్చాను అని చెప్పింది
ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయినా తనని ఇప్పుడు మీ ఇంటికి పంపించే ఉద్దేశాలు మాకు లేవు త్వరలో తన పెళ్లి అప్పుడు పర్మినెంట్‌గా తను మా ఇంటికి కోడలు అయిపోతుంది నువ్వు కాదు కదా మీ నాన్న వచ్చినా అప్పుడు ఏమీ చేయలేడు ఇన్నిరోజులు ఎలాగో తనని గాలి కి వదిలేసారు గా ఇప్పడు కూడా అలాగే వదిలేయండి చెల్లి నాన్న పిన్ని అంటూ ఎవరు రావడానికి వీల్లేదు అంది జానకమ్మ
ఇక వేళ్ళతో తో పని అవ్వదని ఎలాగైనా రిలేషన్ పెంచుకోవాలంటే సుచరితే తనకి దిక్కని వెంటనే వెళ్లి సుచరిత రెండు చేతులు పట్టుకుని అక్క నీకు నాన్నకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు అప్పుడు నేను చాలా చిన్న పిల్లని కదా, ప్లీజ్ మనింటికి వచ్చేయ్యవా నాన్న తన మొఖం నీకు ఎలా చూపించాలో తెలియక నన్ను పంపించాడు నీ పెళ్లి బాధ్యత పూర్తిగా తనదని చెప్పమన్నాడని చెప్పింది
ఇంత తొందరగా ఆయనకి ఇంకో కూతురు కూడా ఉందని గుర్తు తెచ్చుకున్నందుకు థాంక్స్ చెప్పానని చెప్పు నా గురించి బాధపడొద్దు అని కూడా చెప్పు నా గురించి నేను చూసుకోగలను ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు ప్లీజ్ అని రోషిని ఇక్కడ రారా అని పిలిచి తినే నా ఒక్కగానొక్క చెల్లెలు అని కూడా చెప్పింది
చూడండి మిస్మీరు మీ అక్క కోసం వెతుక్కుంటూ శ్రమపడి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి తన పెళ్లికి ఇన్విటేషన్ పంపిస్తా వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అంతే ఇక తమరు దయచేయండి అని నిక్కచ్చిగా చెప్పింది రోషిని
మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి? ఒకవేళ సుచరితకి తన కుటుంబంతో కలవాలని ఉంటే ఎలా అని రత్న కుందన చెవి కొరికింది, ఇందుకే నువ్వు బంగారం దగ్గర అమ్మ దగ్గర తిట్లు తినేది, ఒకవేళ తనకి తన కుటుంబంతో కలవాలని ఉంటే వాళ్ళు ఏమైనా వేరే గ్రహంలో ఉన్నారా ఇదే ఊర్లోగా ఉన్నారు తనకి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియదా వెళ్లడానికి పిచ్చి మొద్దు కాసేపు ఊరుకో ఇది గాని రమక్కా చెవిలో పడింది అనుకో బంగారం తో నీకు తిట్ల ప్రోగ్రాం పెట్టిస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది
ఇక తెగే వరకు లాగితే బాగోదని ఏదైనా కుటుంబంతో వచ్చి తెలుసుకోవాలి అని మిమ్మల్ని అందరిని బాధ పెట్టినందుకు మన్నించండి మా అక్క మీద నాకున్న ప్రేమ ఇలా చేసేలాగా చేసింది అని లాస్ట్ లో ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రమ్య అరుణ్ణి కల్లారా చూసుకొని
బంగారం నీకు ఇంకో శత్రువు యాడైనట్టుంది గా అంది శ్రావ్య, నాది కూడా సేమ్ డౌట్ ఉంది బిందు, ఇందు నాది కూడా నాది కూడా అంటే రాధ మాత్రం ఉన్న వాళ్ళతోనే పీక్కోలేక చస్తుంటే ఇప్పుడు ఇది కొత్త క్యారెక్టర్ అనుకుంది
రాఘవ్ రఘురాం చంద్ర మిగిలిన ఆర్నమెంట్స్ అంతా లెక్క చూసి స్టాఫ్ కి వాలంటీర్స్ కి తగు జాగ్రత్తలు చెప్పి షోరూం కి పంపే పనిలో బిజీగా ఉంటే అరుణ్ వరుణ్ రోషన్ అజయ్ విజయ్ లు వర్కర్స్ తో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ని క్లియర్ చేపించే పనిలో పడ్డారు అందరి పనులు అయిపోయాక ఇందు బిందు రాధా అక్కడి నుంచి వెళ్లిపోగా, రామ్ కుటుంబం కూడా సుచరితను తీసుకొని అందరికీ వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు
ఒకటే ఉన్న పూజతో మీ చెల్లి ఏది అమ్మాయి అని అడిగింది జానకమ్మ తనకేదో పనుండి వెళ్ళిపోయింది నానమ్మ నేను బయలుదేరుతాను అని చెప్పింది పూజ ఒక్క దానివే వెళ్లడం దేనికి రోషన్ డ్రాప్ చేస్తాడులే వెళ్ళు అంది కుందన
అయ్యో అత్తయ్య ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అంత లేట్ ఏమీ అవ్వలేదు కదా నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను లెండి ప్లీజ్ అంది అయినా కూడా క్యాబ్‌లో వెళ్లడం దేనికి డ్రైవర్ ని తీసుకుని వెళ్ళు అంటూ డ్రైవర్‌తో తనని పంపేశాక
వర్మ దంపతులు కుందన దంపతులు ఒక కారులో వెళ్ళిపోగా, రత్న రాధిక దంపతులుఇంకొక కార్ లో వెళ్లిపోయారు
గిల్టీ గా కూర్చుని ఉన్న రోషన్ దగ్గరికి వెళ్లిన రోషిని, వదిన ఒక్కటే వెళ్తుంటే డ్రాప్ చేయడానికి వెళ్లలేదు ఎందుకు అన్నయ్య ఏమైనా జరిగిందా మీ ఇద్దరు మధ్యాన మళ్ళీ అని అడిగింది.
ఏం సమాధానం చెప్పలేక మౌనంగా రోషన్ మిగిలిపోతే మిస్సయిన కి ఎలా దొరికిందో తెలుసా బంగారం పూజ అక్క తెచ్చి ఇచ్చింది నాకు అని చెప్పాడు అరుణ్, కి వదిన దగ్గరికి ఎలా వెళ్ళింది అని రోషిని ఆశ్చర్య పోతే ఓయ్ ట్యూబ్ లైట్ కొంచెం బుర్రవాడు తాళం పూజిత అక్క చేరడానికి వాళ్ళ చెల్లి ఇక్కడ మిస్ అవ్వడానికి లింకు లేదంటావా అన్నాడు.
ఓ మై గాడ్ తన బుర్ర ఇంత చెడిపోయింది ఎన్టీ అరుణ్ అని అయినా దానికి నువ్వు ఎందుకు దిగులుగా కూర్చున్నావు అన్నయ్య అని అడిగింది మళ్లీ. ఆ కీ టైం కి దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత గందరగోళం అయ్యేదో తెలుసా అందరి ముందు మనం తలదించుకోవాల్సి వచ్చేది త్రుటిలో తప్పిపోయింది అది తలుచుకుంటేనే నాకు ఒక క్షణం ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు రోషన్
అయినా వీళ్లేంటి అన్నయ్య ఇలా మారిపోయారు వీళ్ళు మొదట్లో మనకి పరిచయం అయినప్పుడు ఎంత బాగా ఉండేవాళ్ళు అంకుల్ ఆంటీ కూడా ఇప్పటికీ అలాగే ఉన్నారు రుచి మాత్రమే తేడాగా అయింది.
ప్రేమ ఇలాగా మారుస్తుంది అనుకుంటే ప్రేమ తనకు ఒక్కటికే ఉంటే సరిపోతుందా? అజయ్ బావగారి సైడ్ కూడా ఉండాలి కదా ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు పైగా ఇప్పుడు బావగారికి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది అయినా తను మారడం లేదు అని శ్రావ్య తన దోరణిలో తను చెప్పుకుని వెళ్తూ ఉంటే కాసేపు కామ్ గా ఉంటావా అని తన చేతిని ప్రెస్ చేశాడు విజయ్
అరుణ్ రోషినీకి సైగ చేయగా నేను చూసుకుంటాను అని చెప్పింది.
రోషిని రోషిన్ని డైవర్ట్ చేయగల దా రమ్యా ఇంటెన్షన్ ఏంటో వర్మ కుటుంబ సభ్యులు అంచనా వేయగలిగారా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్
Super super super super super super