💖 అరుణోదయ రోషిణి 💖 27- తెలుగు కథలు – ముందు భాగానికి కొనసాగింపు

ముందుగా వర్మ గారు మాట్లాడుతూ హాజరైన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు, అదితి మర్యాదలు అందరికీ బాగా జరిగాయని భావిస్తున్నాము ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నామని చెప్పారు.

అదితి మర్యాదలలో లోపమా అది ఇక్కడ కలలో కూడా అలా జరగదని మేము భావిస్తున్నాము ముందుగా మీ ఆతిథ్యానానికి ధన్యవాదములు అని చెప్పాడు ఒక సీనియర్ రిపోర్టర్.

మీడియాకి దూరంగా ఉండే మీరు స్వయంగా మమ్మల్ని ఆహ్వానించడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఒక రిపోర్టర్.

మీరే అంటున్నారు కదా మీడియా కి దూరంగా ఉంటాను అని, ఆ అలవాటు మార్చుకుందామని అనుకుంటున్న లెండి అన్నారు వర్మ గారు. ఇంకేమి మాకు చాలా ఇన్పుట్ దొరుకుతుంది ఇక మీదట అన్నాడు ఒక రిపోర్టర్.

మేము ఎంత దూరం గా ఉన్న మీకు చేరాల్సిన సమాచారం చేరుతూనే ఉంటుందిగా అన్నాడు రాఘవ్. ఎంత మాట అది డ్యూటీ కదండీ మరి అన్నారు రిపోర్టర్స్.

మా ధర్మం నిర్వర్తించేదానికే మిమ్మల్ని పిలిపించాము అన్నాడు రఘురామ్. మేము ఇంకా వెయిట్ చెయ్యలేము అదేంటో చెప్పండి సార్ అన్నారు అంత.

మా తరువాతి వారసులు ఇక మీదట మా బిజినెస్ నీ ముందుకు తీసుకువెళతారు, వాళ్ళని మీ ద్వారా అందరికీ పరిచయం చెయ్యడానికే మిమ్మలిని పిలిపించము అన్నారు వర్మ గారు.

మీ మనవళ్లు అని బాధ్యత ఇస్తున్నారా లేక వాళ్ళు మీ లాగే వాళ్ళు కూడా  నిరూపించుకున్నార  అని అడిగాడు ఒక రిపోర్టర్.

వేల మంది జీవితాలు అలా ఎలా బాధ్యత లేనివాళ్లు కి అప్పగిస్తను వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నారు, వాళ్ళ మొదటి ప్రాెక్టులన్నీ విజయవంతం గా పూర్తి చేశారు,

నా నమ్మకాన్ని గెలుచుకున్నారు కాబట్టే బాధ్యత లు వాళ్ళకి అప్పగించి నేను రిలాక్స్ అవ్వదలిచే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను అని చెప్పారు వర్మ గారు.

నా మనవరాలు చైర్మన్ బాధ్యత నీ, న మనవళ్లు ఐదుగురు MD లు గా బాధ్యత లని తీసుకుంటారు. నా కొడుకు కోడలు, అల్లులు కుతురులు డైరెక్టర్ లు గ వ్యవహరిస్తారు అని చెప్పగా

ఐదుగురు మనవళ్లు ఉండగా మనవరాలు నీ ఎందుకు చైర్మన్ గా చేస్తున్నారు అదికూడా ఆమె మీరు దత్తత తీసుకున్న కూతురు కి కూతురు కద అని ఒకరి తరువాత ఒకరు అడిగారు.

దత్తత కూతురా కడుపున పుట్టిన కూతురా అని కాదు, ఎవరైన  కూతురు కూతురే అని ఘాటుగా చెప్పింది జానకమ్మ.

ఇక పోతే మనవరాలు ఎందుకు మనవళ్లు ఉండగా అని అడిగారు కదా, మీరు వేళ్ళకి విలువిస్తారా లేక ఆ వేళ్ళని కలిపే అరచేతికి విలువిస్తారా, ఇకపోతే మేము అయితే కనిపించే పువ్వులు తో పాటు కనిపించని దారాన్ని కూడా

దాని కష్టాన్ని కూడా గుర్తిస్తాం. ఇక్కడ వేళ్ళు నా మనవళ్లయితే అరచేయి న మనవరాలు, పువ్వులు నా మనవళ్ళు అయితే వాళ్లని దగ్గర దగ్గరగా బంధించి ఉంచే బంధం నా మనవరాలు అని చెప్పారు వర్మ గారు

ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలని మా ఉద్దేశం కాదు కానీ దీన్ని మీ కుటుంబ సభ్యులందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా అని అడిగాడు ఒక రిపోర్టర్

నా మనవరాలుని ఒప్పించడానికి నాకు చాలా కష్టమైంది మిగతా వాళ్లంతా వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే అని  చెప్పారు మరి అన్నారు వర్మ గారు

మరి మీ వర్మ బిజినెస్ ఎంపైర్ కి కాబోయే సీఈవో ఎవరో చెప్పలేదు అన్నాడు ఒక రిపోర్టర్, అది మాత్రం నేనింకా డిసైడ్ చేయలేదు నా ఐదుగురు మనవళ్లలో ఎవరు క్యాపబులో వాళ్లే కాబోయే సీఈవో.

అది కొత్త చైర్మన్ డిసైడ్ చేస్తుంది అదే తన మొదటి టాస్క్ అని కూడా చెప్పారు వర్మ గారు

ఇంత అనుభవంతో మీ వల్లే కానిది జస్ట్ కాలేజీ పాస్డ్ అవుట్ లాగా ఉంది తను నిర్ణయించగలరా సీఈఓ ని ఎటువంటి పొరపాత్యాలు లేకుండా అని అడిగారు రిపోర్ట్.

కచ్చితంగా, వాళ్ళ పీల్డ్ డిసైడ్ చేసి వాళ్లని విజయవంతంగా దాంట్లోకి నడిపించగలిగిన కెపాసిటీ ఉన్నతను తప్పకుండ నిర్ణయించగలదని నేను అనుకుంటున్నాను అన్నారు వర్మ గారు.

మీ తాత గారికి మీ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది దాన్ని మీరు ఎలా నిలబెట్టుకోబోతున్నారని రోషిని ని అడిగాడు ఒక రిపోర్టర్.

నా ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు భావలు నా వెనువెంటే ఉన్నారు కదా వాళ్ళే నా నమ్మకం నేను తప్పు చేస్తే వాళ్ళు సరి చేస్తారు అని చెప్పింది.

సీఈవో ఐదుగురిలో ఒకరే కదా అవుతారు ఆ ఒక్కరిని మీరే ఎంచుకున్నప్పుడు మిగిలిన నలుగురు అప్సెట్ అవుతారు కదా అని అడిగిన రిపోర్టర్ కి అది కాపబిలిటీ ని బట్టి ఉంటుంది బంధాన్ని బట్టి కాదు కదా.

ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళే సీఈఓ అవుతారు. అది ఎవరో ఫీచర్లో మీరే చూస్తారు కదా తినబోతూ రుచి అడగడం దేనికి అని చెప్పింది రోషిని

దీనివల్ల మీ కుటుంబంలో ఇంటర్నల్ గా ఎటువంటి సమస్యలు రావని మీరు అనుకుంటున్నారా అని ఒక రిపోర్టర్ అడిగాడు

సమస్యలు లేని రాని కుటుంబం ఉండదని నేను అనుకుంటున్నాను వచ్చినా అవి ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఎలా ముందుకు వెళ్లాలో నా మనవాళ్ళకి మనవరాలకి బాగా తెలుసు

బయట వ్యక్తులు కాదు కదా ఇంట్లోని మేము కూడా వాళ్ళ బంధానికి బీటలు వేయలేము అది మా పెంపకం పైన మాకు ఉన్న నమ్మకం అని చెప్పింది రాధిక

నమ్మకం మంచిదే కానీ అతి నమ్మకం మంచిది కాదేమో మేడం, కొత్తకోడళ్ళు వస్తారు కదా వాళ్లు కూడా మీ అంత అన్యోన్యంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా అని అడిగింది ఒక లేడీ రిపోర్టర్

వాళ్లని ఎలా సెట్ చేసుకోవాలో మా పిల్లలకి తెలుసులెండి అని కుందన చెప్పగా, తొందర్లోనే మా పిల్లల జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు రాబోతుంది దానికి మీరందరూ తప్పకుండా హాజరు అవ్వాలని మా తరఫునుంచి ముందుగా ఆహ్వానం ఇస్తున్నామని చెప్పారు చంద్ర రత్నలు

మేము మీకు కాబోయే కొత్త కోడల్ని కూడా మాకు పరిచయం చేస్తారనుకున్నాము అని అడిగారు ఒక రిపోర్టర్

అది ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుంది కదా ఒకేసారి పెళ్లి తర్వాతే అందరికీ రివిల్ చేస్తాము కానీ నా ఐదుగురు మనవళ్ళకి వాళ్ల లైఫ్ పార్ట్నర్స్ డిసైడ్ అయిపోయారు నా నలుగురు మనవళ్ళకి నిశతాబ్దం కూడా పూర్తయిపోయింది అని చెప్పింది జానకమ్మ

మా చివరి మనవడు మనవరాలు నిశ్చితార్థం మాత్రం మీ అందరి మధ్యలోనే జరుగుతుంది తప్పకుండా అని చెప్పింది జానకమ్మ

వెల్ మీ అందరి డౌట్స్ కి సమాధానాలు దొరికాయి అనుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు మా రెండు తరాలకు ఎలా అందించారో మా మూడో తరానికి కూడా అలాగే అందించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు వర్మ గారు

మీరు ఎలాగైతే ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఇంత దూరం వచ్చారో ఈ లెగసినీ నీ మనవళ్లు మనవరాలు కలిసి ఇలాగే నిలబెట్టాలని మేము కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు వాళ్ళ వెంట ఉంటాయని చెప్పారు రిపోర్టర్స్

మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నారా అని వారసులని అడిగారు రిపోర్టర్స్

ఏమో చెప్పలేం మీ ఆశీర్వాద బలం ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా విస్తరిస్తామ్. బిజినెస్ ఏ కాదు సోషల్ సర్వీస్ లో కూడా మేమెప్పుడూ ముందు ఉంటాం అని ప్రూవ్ చేసుకుంటాం. ఇప్పటివరకు మా కాలేజీలో 20% స్టూడెంట్స్ మాత్రమే ఫ్రీగా చదువుకుంటున్నారు దాన్ని 40% కి ఇంక్రీస్ చేస్తున్నాం ఇదే మా కొత్త చైర్మన్ మొదటి నిర్ణయం అని చెప్పాడు రోషన్

దాంతో ఆహాలంతా చెప్పట్లతో మారు మోగింది చెప్పాను కదా నా మనవళ్ళు మనవరాలు నన్ను ఎక్కడ తక్కువ చేయరు నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఇప్పుడే ప్రూవ్ చేశారు కదా అన్నారు వర్మ గారు

మీ నమ్మకం నిలబడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పారు రిపోర్టర్స్ అంతా ముక్తకంఠంతో

రోషన్ అజయ్ విజయ్ ల ని వరుణ్ అరుణ్ణి అలాగే రోషిని కి కూడా కంగ్రాట్స్ చెప్పి అందర్నీ కలిపి అలాగే విడివిడిగా జంటలు జంటలుగా వాళ్లకి కావాల్సిన ఫోటోలు తీసుకొని, ఒక కుటుంబంలో ఒక డబల్ ఫోటో ఉండడం చాలా ఇంట్లో చూశాం కానీ మీ ఇంట్లో రెండు డబల్ ఫోటోలు ఉన్నాయి అని రిపోర్టర్స్ అంతా కామెడీగా చెప్పి నెక్స్ట్ డే పేపర్ కి కావాల్సిన బెస్ట్ స్టఫ్ తీసుకొని వర్మ నిలయంని వీడారు అంత.

to buy Bajaj Pygmy Mini Fan 110MM | USB Charging | Multi-Clip Function | Rechargeable | 4-Hr Back-up | Silent Operation | Longer Battery Life | Energy Efficient | Portable Click Here

Conclusion:

నెక్స్ట్ ఎపిసోడ్ లోకొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఉంటుంది దానివల్ల వారసులకి ఎటువంటిఇబ్బందులు ఎదురవుతాయో వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొంటారో ముందు ముందు ఎపిసోడ్ లో చదువుకుంటూ వెళ్దాం అరుణ్ కి ఫ్యాన్స్ వస్తారు రోషిని కి ఫ్యాన్స్ వస్తారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయండి.

అరుణోదయ రోషిని ఎలా ఉందో చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్తే నా రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే దానికి నాకు ఉపయోగపడతాయి అర్థం చేసుకుంటారు కదూ ధన్యవాదాలు.

note: ఈ సైట్ లో ఉండే షాపింగ్ లింక్స్ అమెజాన్ నుంచి తీసుకున్నవే మికు ఎటువంటి ప్రోడక్ట్స్ గురించి కావాలో కామెంట్ రూపంలో చెప్తే వాటి గురించి సర్వే చేసి అవన్నీ ఒకే దగ్గర ప్రజెంట్ చేస్తాను

క్లిక్ హియర్ ఫర్ https://thequriouslife.com/

ఈ వెబ్సైట్లో వెయిట్ లాస్ గురించిన టిప్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించిన విషయాలు తెలుసుకోవచ్చు.

“తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు నా ప్రొఫైల్‌ను సందర్శించండి.”

2 Responses

  1. Sooooooperrrrrrrr🥳🥳🥳🥳🥳🥳🥳🥳❤️❤️❤️❤️❤️❤️chaalaa baaga rastunnav Mahi beta keep it up