ఎలా జరిగినా ఎందుకు జరిగినా జరగాల్సింది జరిగిపోయింది నిఖిల్ తను ఇప్పుడు వేరొకరికి కాబోయే భార్య ఆ విషయం నీ మనసుకి నువ్వు ఎంత త్వరగా సర్ది చెప్పుకుంటే నీకు అంత మంచిది అని చెప్పింది రమ. నాది ఒక సైడు మాత్రమే ఉండే ఇష్టం అమ్మ కానీ అక్కడ వాళ్ళ పెళ్లి నిర్ణయం అయిపోయినప్పుడు నేను తనని ఆ దృష్టితో ఇంకెలా చూస్తాను ఎంతైనా తను ఇప్పుడు నాకు కాబోయే మరదలు కదా ఆ విషయం నేను గట్టిగా గుర్తుపెట్టుకుంటాను, నావల్ల ఎటువంటి పొరపాటు జరగదు . నా కారణంగా మీరు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు ప్రామిస్ అన్నాడు నిఖిల్.

మంచిది ఇక మీదట సుచి పెళ్లి మీద ఫోకస్ పెట్టండి అలాగే మీ పనులను నెగ్లెట్ చేయొద్దు అని చెప్పాడు రామ్. సుచరితని ఆ రోజుకి లీవ్ తీసుకోమంటే వినకుండా మధ్యాహ్నం వరకు రెస్ట్ సరిపోతుందని మధ్యాహ్నం తరువాత కాలేజీకి వెళ్లిపోయింది.

To buy this neck set click here

బిందు హడావిడిగా ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటే ఒక రెండు నిమిషాలు కూర్చొ ర నీతో మాట్లాడాలి అన్నాడు అర్జున్ హాల్లో సోఫాలో కూర్చుని, చెప్పండి నాన్న అంది బిందు. అర్జున్ లక్ష్మీ వైపు చూడడంతో ఇందు రాధ ఒకసారి కిందకి రండి అని హాల్లో నుంచే కేక వేసింది.

వాళ్లు కూడా కిందకి వచ్చి బిందు పక్కన కూర్చోగా ఏంటి నాన్న విషయం అని ఇంకోసారి అడిగింది బిందు. నిన్న జరిగిందంతా మన చేతుల్లో లేకుండా జరిగిపోయింది కదమ్మా అది ఒక వైపు మనం కోరుకున్నదే అయినా ఏంటో హడావిడిగా జరిగినట్టు అనిపించింది నీ మనసులో ఏం బాధ లేదు కదా అన్నాడు అర్జున్. ఇందు గురించి నిఖిల్ గురించి ఆలోచన తప్పితే బాధ ఏమీ లేదు నాన్న అని చెప్పింది బిందు. నిఖిల్ నన్ను ఇష్టపడుతున్నాడని ఆ ఇంట్లో రోషిని బ్యాచ్ అందరికీ తెలుసు అజయ్ కూడా ఒప్పుకున్నాడు అంటే జరిగిన దానిని తను యాక్సెప్ట్ చేశాడనే కదా

కానీ నాన్న నా మనసులో ఒక ఆలోచన ఉంది అది మీ అందరికీ ఓకే అయితేనే ముఖ్యంగా ఇందు ఒప్పుకుంటేనే  సాధ్యం అని చెబుతున్నప్పుడే నేను ఒప్పుకోవాలా ఏంటక్కా అది అంది ఇందు.

జరిగిన దానిని నేను ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం నువ్వు ఎంత త్వరగా మూవ్ ఆన్ అయితే నేను అంత త్వరగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించగలను అందుకే వీలైనంత త్వరగా నువ్వు కూడా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలి అని చెప్పింది.

ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదరా నువ్వు వెళ్లిపోయి తను వెళ్ళిపోతే ఎలా తనని కొద్ది రోజులు మాతోపాటు ఉండనిద్దాంలే అంది లక్ష్మి. ఈ లోపల రామ్ అంకుల్ నిఖిల్ కి సంబంధం చూసేస్తే ఎలాగమ్మా నాకు తెలిసి ఇప్పటికే అందరూ పెద్దవాళ్ల దగ్గర ఓపెన్ అయిపోయి ఉంటారు ఎందుకంటే వాళ్లు సీక్రెట్ దాచుకోరు ఆ విషయం మనకు కూడా బాగా తెలుసు అందుకే తొందరపడదామని చెప్తున్నాను మన ఇందు కి ఉండే తొందరపాటు కి నిఖిల్ కుండే నిమ్మది తనానికి బాగా సరిపోతుంది.

పైగా ఇందు కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది అని తన అభిప్రాయం చెప్పింది బిందు. నీ ఆలోచన బాగుంది లేరా మీ పెళ్లి నిర్ణయం అయిపోయాక నేను వర్మ అంకుల్ తో మాట్లాడతాను అని చెప్పాడు అర్జున్.

ఏం మాట్లాడుతున్నావ్ నాన్న నేను అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటి అది నిఖిల్ గారిని అని అడిగింది ఇందు.

తను బిందు నీ ఇష్టపడ్డ వాడు అని కాకుండా ఏ చెడు అలవాట్లు లేని వాడు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకునేవాడు జీరో నుంచి మొదలై బిజినెస్ ఎంపైర్ ని క్రియేట్ చేసుకున్నవాడు, సుచరితని సొంత చెల్లిలా చూసుకుంటున్నాడు పైగా వర్మ తాత గారి ఫ్యామిలీతో రిలేట్ అయినవాడు ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా  ఆ కోణంలో చూడు మేబి నువ్వు కోరుకున్న వాడిలో ఉండే లక్షణాలు కూడా తినలో ఉన్నా ఏమో అని చెప్పింది లక్ష్మి  నాన్న చెప్పారు కదా తొందర ఏమీ లేదు కావలసినంత టైం తీసుకొని ఆలోచించమని కూతురికి సలహా ఇచ్చింది.

అక్క పెళ్లి కుదిరిందో లేదో నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు మరి నేను ఆఫీస్ ని ఎప్పుడు చూసుకోవాలి, ఇంకా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాను నేను అంది ఇందు. మీకు పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లిన ఆఫీసు బాధ్యతల నుంచి తప్పించుకునే వీలు లేదు  కాబోయే వాళ్లతో కలిసి చేసుకుంటారో లేకపోతే మీరే ఇప్పటిలా చూసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పాడు అర్జున్. నా తర్వాత మన వ్యాపార బాధ్యతలు మీ ముగ్గురికి సమానంగా నేను ఎప్పుడో డివైడ్ చేసేసాను  అని చెప్పాడు అర్జున్ రాధ ని కూడా ఉద్దేశించి.

అంత డిస్కషన్ అయ్యాక నేను బయలుదేరుతున్నాను అన్న బిందు తో నేను వస్తాను ఆగు అంటే రాధ కూడా నేను వస్తానని చెప్పగా ముగ్గురు కలిసి ఆఫీస్ కి వెళ్ళిపోయారు.

వాళ్ళ అలా వెళ్ళగానే రాధకు కూడా ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే మా అన్నయ్య బాధ్యత కూడా తీరిపోతుంది కదా అంది లక్ష్మి చూద్దాంలే తనకి ఎవరు రాసిపెట్టి ఉన్నారో అని చెప్పి మనకి ఎక్కువగా టైం లేదు పెళ్లికి మన తరఫునుంచి పిలవాల్సిన వాళ్ళ లిస్టు తయారు చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ఆ పనిలో పడ్డారు భార్య భర్తలు.

నిశ్చితార్థం అనంతరం శ్రావ్య వాళ్ళ ఊరికి చేరుకున్నారు వాళ్లంతా. సంతోషంగా ఉన్న శ్రావ్యతో ఏంటే మనవరాల సంతోషమేనా నువ్వు కోరుకున్న నీ బావ నీకు భర్త అయిపోతున్నాడు మరి అంది నానమ్మ. అది మనము వేరేగా అడగాల్సిన అవసరం లేదులే అత్తయ్య నీ మనవరాలు ముఖంలో కనిపించేస్తుంది కదా అంది లహరి.

To Buy this Handbag Click Here

నిన్న ఏదో జరిగింది కదా మీ బ్యాచ్ అంతా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు ఒకసారి సంతోషంగా ఉన్నారు, ఒకసారి బాధగా ఉన్నారు మొత్తానికి ఏదో జరిగింది కదా అని అడిగింది లహరి. ఆ అజయ్ బావ చేతిలో నుంచి తాళి బిందు మెడలో పాడడం పొరపాటున జరిగింది కాదు ఆ పూజిత చెల్లి ఉంది కదా రుచిత తను కాలు అడ్డు పెట్టి కావాలనే చేసింది అని జరిగింది చెప్పింది శ్రావ్య.

ఏంటో అమ్మ మొదట్లో నేను ఆ పూజిత ని రుచితని చూసినప్పుడు చాలా మంచివాళ్లు అనుకున్నాను, అక్క చెల్లెలుగా వాళ్ళు బెస్ట్ ఏమో కానీ పూజిత ఈ కుటుంబంలో సెట్ అవుతుందో లేదో అని నాకు భయంగా ఉంది అంది శ్రావ్య. చెల్లి విషయానికొచ్చేసరికి తనకల్లు మూసుకుపోతున్నాయి చాలా విషయాల్లో నేను అది గమనించాను అని తన బాధ చెప్పింది శ్రావ్య.

ఏది జరిగినా ఎలా జరిగినా ఇది కూడా ఒకందుకు మంచిదేలే ఆ భవాని తన మనవరాలుని ఎలాగో అలా ఈ కుటుంబంలోకి పంపాలని కుట్రలు కుతంత్రాలు చెయ్యకుండానే ఒక మంచి ఒక మంచి దారి ఆ రాముడే చూపించాడు అంది శ్రావ్య నానమ్మ.

నిఖిల్ బావ హార్ట్ బ్రేక్ అవ్వడం తప్పితే మిగతా మంచికే జరిగింది తనని బంగారం హ్యాండిల్ చేయాలి మరి అని చెప్పింది శ్రావ్య.

ఎక్కువ టైం లేదు కదా నీ పనులు అవి త్వరగా చూసుకో మనము ఏ క్షణమైనా అక్కడికి వెళ్ళిపోవాలి కదా ఏదో నిశ్చితార్థం జరిగి నేరుగా అక్కడికి వెళ్లకుండా మన ఇంటి ముఖం చూడాలని నేనే వాళ్ళని ఒప్పించే ఇక్కడికి తీసుకొచ్చాను మీ పనులు ఉంటే త్వరగా చేసుకోండి అని చెప్పింది శ్రావ్య నానమ్మ.

జరిగే పనులు జరుగుతూ ఉండగానే వర్మ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమ వారసుల్ని సొసైటీకి పరిచయం చేయదలుచుకున్నట్టు  దాని సారాంశం టైం ప్లేస్ కూడా అనౌన్స్ చేశారు.

ముఖ్యమైన చానల్స్ కి వార్తా పత్రికలకి వార్త చేరనే చేరింది. మీడియాకి వీలైనంత దూరంగా ఉండే వర్మ గారు స్వయంగా ఆహ్వానం పంపడంతో ఆ వార్త సిటీలో ప్రాముఖ్యత సంతరించుకుంది.

For Healthy protein choco Almond Bars Click Here

అనుకున్న టైం కి మీడియా సోదరులు హాజరవ్వగా ఆవేదికకి వర్మ గారి గార్డెన్ అంగరంగ వైభవంగా రెడీ అయింది.

వర్మ కుటుంబ సభ్యులంతా వేదిక నలంకరించగా మీడియా సోదరులందరూ తమ ప్రశ్నలు సంధించడానికి రెడీ అయ్యారు.

మీడియా సమావేశం ఎలా జరగబోతుందో వాళ్ళు ఏం అడుగుతున్నారు వర్మ గారు ఎలాంటి సమాధానాలు తెలుపబోతున్నారు తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ థి నెక్స్ట్ ఎపిసోడ్

ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే సంతోషిస్తాను అంతేకాకుండా ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసుకోవడం లేదా ఇలాగే కొనసాగించడం ఏదైనా నాకు ఒక అవగాహన వస్తుంది అందుకు మీ ప్రోత్సాహం చాలా అవసరం

ధన్యవాదములు.

(Without my permission, using this content is a violation; legal action will be taken.)

4 Responses