అజయ్ వేలికి తొడిగి ఉన్న బి లెటర్ తో ఉన్న ఉంగరం చూపించి దీని గురించి మీ అందరికీ ఉన్న డౌట్ ఉంది కదా అని అడిగింది రోషిని.
నీ మీద డౌట్ ఏంట్రా కానీ ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు రోషన్. మీ ముగ్గుర వేలుకి ఒకే రకమైన ఉంగరం ఉన్నప్పుడు అన్నయ్య చేతికి కూడా ఉండాలి కదా అని ఏ లెటర్ తో చేయించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు తన జీవితంలోకి వచ్చినా ఆ అమ్మాయి అన్నయ్య బెటర్ హాఫ్ ఏ కదా అని బి లెటర్ తో చేయించాను ఇంట్లో చెప్పలేదు కానీ నాకు బావ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంగరాలు చేయించాను అని చెప్పింది రోషిణి.
అది బావ గాడికి లక్కు బాగా కలిసి వచ్చి బంగారం ఆలోచన వేస్ట్ కాకుండా బిందు వీడి జీవితంలోకి వచ్చేసింది ఏం చేయలేం అన్నాడు అరుణ్.
చూడు అజయ్ నువ్వు ఎప్పుడో నీ పెళ్లి నిర్ణయం పెద్దవాళ్ళకి ఇచ్చేసావ్, ఆ అమ్మాయిని మన నిఖిల్ ఇష్టపడుతున్నాడని తప్ప నీ మనసులో ఆ అమ్మాయి గురించి ఎటువంటి ఒపీనియన్ లేదని నాకు తెలుసు.
కానీ నిర్ణయం మన చేతుల్లో లేకుండా అంతా అలా జరిగిపోయింది. నిఖిల్ విషయం పక్కనపెట్టి ఆ అమ్మాయి నీ జీవితంలో అడుగుపెట్టబోతుంది తనతో ఎలా కలిసి అడిగేయాలని మాత్రమే ఆలోచించు అన్నాడు రోషన్.
ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మనకు అనవసరం నీకు ఆ అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది పెళ్లి జరగబోతుంది అదే ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నాడు వరుణ్.
అలా జరగడం మనకి ఒక రకంగా మంచే జరిగిన తెలిసి తను చేసిన పొరపాటుని నేను ఒప్పుకోలేను అన్నయ్య అంది రోషిని.
తనకి తగిన గుణపాఠం చెప్పే తీరుతాను బెటర్ ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష వేయవని అనుకుంటున్నాను అన్నయ్య అంది రోషన్ వైపు చూస్తూ.
చ చ చెల్లి చేసిన తప్పుకి అక్కకి శిక్ష వేయడం ఏంట్రా అలా అని తను వాళ్ళ చెల్లి చేసిన తప్పును వెనకేసుకొస్తే మాత్రం నేను ఊరుకోను అని నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పాడు రోషన్.
బుజ్జి ఈ విషయం మన ఇంట్లో చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు విజయ్ ఖచ్చితంగా చెప్పాలన్నయ్య కానీ ఇప్పుడు కాదు ఈ లోపల నేను ఒక పని ముగించుకుని వస్తానని అరుణ్ వైపు చూసింది.
నేను రెడీ బంగారం వెళ్దాం అన్నాడు అరుణ్, రేయ్ ఎక్కడికి అన్నాడు అజయ్ నీకెందుకురా వీళ్ళతో పాటు కాబోయే పెళ్లి కొడకా వెళ్లి నలుగురు డ్రీమ్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి మేము వెళ్లి మా పని ముగించుకుని వస్తాము అంటూ రోషిని చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అరుణ్.
కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాలని ఇంట్లో ఆడవాళ్లు ఆల్రెడీ నిర్ణయించడం తో తప్పక అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లారు.
రంగిని కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాక అయ్యగారికి మాత్రమే వంట చెయ్ మిగిలిన వాళ్ళకి వంట వాళ్ళు చేస్తారు లే అని జానకమ్మ మరీ మరీ చెప్పి తను కూడా రూమ్ కి వెళ్ళిపోయింది పూజ అనంతరం. అరగంట ప్రయాణం తర్వాత పూజిత వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అరుణ్ రోషిని. అప్పుడే అందరూ హాల్లో కూర్చుని టీ తాగుతూ ఉండగా సడన్‌గా అక్కడ ప్రత్యక్షమైన వాళ్ళని చూసి పొలమారింది రుచికి.
మిగిలిన వాళ్ళు అర్థం కాకుండా అయోమయంగా వాళ్ళిద్దరు వైపు చూస్తుంటే రోషిని మాత్రం డైరెక్ట్ గా పాయింట్ కి వస్తూ నీ రిజగ్నేషన్ లెటర్ అర్ధగంటలో తాతయ్యకి మెయిల్ వెళ్లాలి అని చెప్పింది రోషిని రుచిత తో.
వెంటనే రుచిత నానమ్మ మాట్లాడుతూ చేస్తే గీస్తే పెళ్లి తర్వాత వర్క్ చేయడం ఇష్టం లేకపోతే పూజిత రాజీనామా చేయాలి కానీ రుచిత ఎందుకు చేయడం అని అడిగింది.
వదిన జాబ్ చేయాలా లేదా అనేది తన ఇష్టం అన్నయ్య ఇష్టం ఇందులో నేను కల్పించుకునేది ఏమీ లేదు నేను రుచితని రిజైన్ చేయమంటుంది తను ఆ జాబ్ కి అర్హురాలు కాదు కాబట్టి అంది.
ఏం జరిగిందమ్మా తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగిందా అని అడిగారు రుచిత తాతయ్య. చిన్న తప్పు కాదు తాతయ్య చాలా పెద్ద తప్పే చేసింది. ఇద్దరి మనసులు బాధపడేలాగా చేసింది.
తన అత్యాశ వల్ల మా అన్నయ్య జీవిత భాగస్వామి తన ప్రమేయం లేకుండానే నిర్ణయించబడింది, అజయ్ అన్న బిందు వదిన ప్రమేయం లేకుండానే వాళ్ళ జీవితం ముడి పడేలాగా అవ్వడానికి కారణం నీ చిన్న మనవరాలి అత్యాశ.
అన్నయ్య తన వైపు నుంచి ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కూడా ఎలాగైనా తనని పొందాలనే క్రూరత్వం తో అజయ్ అన్న చేతిలోని తాళి తన పైన పడేలాగా చేసుకోవాలని ప్రయత్నం చేసి విఫలమయింది, ఈవిడ గారు చేసిన పిచ్చి పని వల్ల అది బిందు వదిన మెడలో పడి, వాళ్ళిద్దరూ పెద్దలు నిర్ణయానికి తలవంచి అప్పటికప్పటికీ బంధంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది.
తనకి కావాల్సింది ఎలాగైనా దక్కించుకుంటే చాలు పక్కన వాళ్ళ అభిప్రాయంతో నాకు పని లేదనుకునే ఈవిడ లాంటి మెంటాలిటీ ఉన్నవాళ్లు పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ఆ పొజిషన్లో ఉండడం కరెక్ట్ కాదు ఈ విషయం నేను ఇంట్లో పెద్ద వాళ్ళ దాకా తీసుకెళ్లాలనుకోవడం లేదు కానీ నిజమైతే దాగదు కదా అది ఎప్పటికైనా బయటపడుతుంది దానికి నేను బాధ్యురాలిని కాదు.
చెల్లి మీద ప్రేమ ఉండడం కరెక్టే వదిన కానీ తను ఏం చేసినా కరెక్ట్ అనడం మాత్రం కరెక్ట్ కాదు, మీరు అన్నారు కదా అంకుల్ నా పెద్ద కూతురు అమాయకరాలు తోడుగా నా చిన్న కూతుర్ని కూడా తోటి కోడలుగా ఒకే ఇంటికి పంపాలనుకుంటున్నారని, నీ పెద్ద కూతురికి దొరికిన తోడికోడళ్ళు నీ చిన్న కూతురు కంటే వంద రెట్లు మంచివాళ్లు ఇది నా వదిన ల మీద నా కుటుంబం మీద నమ్మకంతో మీకు ఇస్తున్న హామీ.
మీ కూతురికి ఎలా బుద్ధి చెప్పుకుంటారో మీ ఇష్టం, అంటూ వచ్చిన పని అయిపోయింది వెళ్దామా బావ అని అరుణ్ వైపు చూడగా వెళ్దాం బుజ్జి అంటూ ఇద్దరూ లేచి అందరికీ నమస్కారం పెట్టి వచ్చినదారినే వెళ్లిపోయారు.
వాళ్ళు ఏం చెబుతున్నారు రుచిత నువ్వు అక్కడ ఏం చేసావు అని అడిగారు వెంకటేశ్వర గారు. నేనేం చేయలేదు నాన్న అజయ్ తాళిబొట్టుని అందరికీ కళ్ళకు అడ్డుకోవడానికి చూపిస్తున్నప్పుడు పొరపాటున నా కాళ్లు తగిలి పళ్లెంలోని తాళిబొట్టు ఎగిరి బిందు మెడలో పడిందని చెప్పింది. Click here to buy this beutiful saree at Rs: 520
పూజ మీ చెల్లి చెప్తుంది నిజమేనా అని అడిగింది కవిత, ప్లీజ్ కాపాడు అన్నట్టు కళ్ళతోనే రిక్వెస్ట్ చేసింది రుచిత. అక్కడ ఏం జరిగిందో నిజంగా నేను చూడలేదు అమ్మ, రుచి చెప్తుంది కదా పొరపాటుగా తన కాళ్లు తగిలిందని అది చూసి వాళ్ళు అపార్థం చేసుకున్నారు ఏమో లే అని సర్ది చెప్పడానికి ట్రై చేసింది పూజిత.
పొరపాటే జరిగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను లేకపోతే మీ అత్తారింట్లో మేము తలెత్తుకొని తిరగలేము అని చెప్పింది కవిత. అమ్మ మీరేమీ అంత భయపడాల్సిన అవసరం లేదు వాళ్లంతా ప్రీ ప్లాన్ గానే వచ్చారు. ఒకవేళ ఆ పొరపాటు జరుగి ఉండకపోయినా బిందుతోనే ఎంగేజ్మెంట్ జరిగిండేది అజయ్‌కి అని చెప్పింది రుచిత. ఆ విషయం అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తావ్ అని అడిగింది కవిత.
పూజిత వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగు చూపించి ఈ రింగ్ లోని అక్షరం పేరేంటి ఆర్ అని కదా ఉంది ఆర్ అంటే రోషన్ బావ నే కదా అలాగే అజయ్ వేలికి తొడిగిన ఉంగరంలో బి అనే అక్షరం ఉంది బి అంటే ఆ బిందు అనే కదా అర్థం. వాళ్ళు ముందే అనుకొని వచ్చారులే మీరేం ఫీల్ అవ్వకండి అని అప్పటికి దాటవేయడానికి ప్రయత్నించింది రుచిత.
చూడు రుచిత వాళ్ళు ప్రీ ప్లాన్ గా వచ్చుంటే అంత నాటకం ఆడి చేయాల్సిన అవసరం వాళ్లకు ఏమీ లేదు వాళ్లు అయిన వాళ్లు పైగా వరుసైన వాళ్ళు ముందే అనుకుని ఉంటే అక్కడ ఊరి పెద్దలంతా అంత డిస్కషన్ పెట్టి ఉండరు అంతా మన కళ్ళ ముందే జరిగింది దాన్ని మార్చాలని చూడొద్దు, నీ అక్క మీద నీకు అంత ప్రేమే ఉంటే తనని సంకట స్థితిలో పడయోద్దు నువ్వు చేసే పొరపాట్ల వల్ల తను అత్తారింట్లో తలదించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పారు వెంకటేష్.
ఆశపడడంలో తప్పులేదు కానీ అత్యాశ వద్దు తను చెప్పింది కదా ఆ రిజైన్ లెటర్ ఏదో మెయిల్ పంపు ఆల్రెడీ తను ఇచ్చిన టైం అయిపోవచ్చింది, తండ్రిని కదా ఇంతకంటే గట్టిగా చెప్పలేకపోతున్నాను అంటూ తన రూమ్ లోకి వెళ్లిపోయారు వెంకటేష్. మిగిలిన వాళ్లు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే హాల్లో గోర్లు కొరుక్కుంటూ మిగిలిపోయింది రుచిత రిజైన్ లెటర్ మెయిల్ చేసి.
రమా టీ టిఫిన్లు అరేంజ్ చేసి అందర్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది. అందని కూర్చోబెట్టి వడ్డించి అఖిల్ నిఖిల్ సుచరితలని చూస్తూ నిన్నటి నుంచి గమనిస్తున్నాను ఈరోజు కోసం ఎంతో ఎదురు చూసిన మీరు ఎందుకు ఇవాళ డల్ గా కనిపిస్తున్నారు నాకు అని అడిగింది.
ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారులే రమా ఎందుకు పిల్లల్ని విసిగిస్తావు అని చెప్పాడు రామ్. అమ్మ చెప్పేది నిజమే నాన్న అంది సుచరిత, అన్నయ్య బిందు ని ఇష్టపడ్డాడు ఈ విషయం తను బిజినెస్ లో సక్సెస్ అయ్యాక మీకు చెప్పాలనుకున్నాడు కానీ అనుకోకుండా నిన్న అలా జరిగిపోయింది అంది సుచరిత.
అనుకోకుండా ఏమీ జరగలేదమ్మా సుచి సగమే చెప్తుంది ఆ రుచిత ఉంది కదా రోషన్ మరదలు తనే కావాలని కాళ్లు అడ్డుపెట్టడంతో ఆ తాళి వెళ్లి బిందు మెడలో పడింది అని చెప్పాడు అఖిల్.
Like, follow, and subscribe
https://shorturl.fm/45AfS