వర్మ గారి నిర్ణయంతో  అందరూ ఆ రాత్రికి గుడిలో నిద్ర చేయడానికి అంగీకరించారు, చాలా సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చారు మీరు,  కనీసం ఒక్కసారైనా మీకు అతిధి మర్యాదలతో భోజనం ఏర్పాట్లు చేసే అవకాశం మాకు ఇవ్వండి బాబాయ్ గారు అని అడిగింది కళ్యాణి.

నేను మీ అత్తయ్య కి అన్నయ్య గా మీ బాబాయిగా వచ్చుంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినమ్మా చూసావు కదా ఇప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ అందరితో నేను మీ ఇంటికి వస్తే బాగోదేమో కదా అన్నారు వర్మ గారు.

అందరూ మనవాళ్లే కదా మామయ్య ఒకరికి ఒకరు కాబోయే వియ్యంకులే కదా మీ అతిథులు మా అధితులు కదా ఒప్పుకోండి మామయ్య అన్నాడు సుధాకర్.

ఈ లోపల బిందు రోషిని వైపు చూసి ఒప్పించ్చు ప్లీజ్ అన్నట్టు చూసింది. ఏం చేద్దాం అన్నట్టు వర్మ గారు జానకి గారి వైపు చూస్తే ఒప్పుకోండి తాతయ్య అంతా మనవాళ్లే కదా అందరం కలిసి వనభోజనాల్లాగా ఇవాళ గుడి భోజనం చేద్దాం.

బయట వేసిన టెంట్లు అలాగే ఉన్నాయి కదా అక్కడే మనమంతా కలిసి భోజనం చేద్దాం అని చెప్పింది రోషిని.

అలాగే మామయ్య చిన్ని తల్లి చెప్పినట్టు అందరికీ భోజనాలు ఇక్కడే అరేంజ్ చేస్తాను అన్నాడు సుధాకర్.

వర్మ గారు అందరం వైపు చూసి సరే అనడంతో సుధాకర్ కళ్యాణి తో కలిసీ తన అమ్మానాన్నలని చెల్లిని బావని తీసుకొని ఇంటికి బయలుదేరగా రాదా ఇందు బిందు లు గుడిలో ఆగిపోయారు.

శరత్ ఇవాళ కార్యక్రమం బాగా జరిగింది మామయ్య అని చెప్పగా తార కూడా అదే విషయం కన్ఫామ్ చేసింది.

పెద్దవాళ్లంతా ఒక దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటే యంగ్ బ్యాచ్ అంతా ఒక దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు.

వదిన మీరు కూడా రేపు ఉదయం బస్సులో మాతోపాటు రావచ్చు కదా అని అడిగింది రోషిని.

ఇకమీదట మీరంతా కలుస్తూనే ఉంటారు కదా ఇప్పుడైనా మా అక్కని మాతో ఉంచండి అంది ఇందు.

మీరు అంటున్నావ్ నువ్వు కలవవా అని అడిగింది రోషిని. కలిసే సందర్భాలు వచ్చినప్పుడు కచ్చితంగా కలుస్తాను అంతేకానీ మా అక్క వెనకే తోకలా ఉంటే బావకి కష్టం కదా అంది ఇందు.

ఈరోజు జరిగినది నువ్వు ఇంత స్పోర్టివ్ గా తీసుకుంటావని నీ ఆటిట్యూడ్ కి నేను అసలు అనుకోలేదు అంది శ్రావ్య.

అమ్మ తల్లి మీ అందరికీ ఓ దండం నా టైం బాగాలేక బావ మీద చూపు ఎక్కువయ్యి మన ఫస్ట్ మీట్ అంత వరస్ట్ గా తగలడింది.

ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని అవ్వడంతో నా మాట నెగ్గడంతో కొంచెం పొగరు కూడా ఎక్కువ అయింది అనుకోండి అది ఇప్పుడిప్పుడే తగ్గించుకుంటున్నాను మా అక్క దయవల్ల

చాలాసార్లు నీకు సారీ చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు ఈరోజు కంటే మంచి రోజు ఇంకేముంది చెప్పు సారీ రోషిని అంది ఇందు.

ఓకే ఓకే నో మోర్ క్షమాపణలు ఇప్పుడు మన బంధుత్వం ఇంకా బలపడింది కదా మనమంతా ఒక గ్యాంగ్ అంది శ్రావ్య.

వీళ్ళ మాటలన్నీ ఒక సైడ్ కూర్చుని వింటున్న అరుణ్ అబ్బా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది డిస్టర్బెన్స్ గాళ్లంతా బిజీ అయిపోతున్నారు. వీడొక్కడే తప్పించుకున్నాడు అనుకున్నాను వీడు కూడా సెట్ అయిపోయాడు నౌ ఐ యాం హ్యాపీ అన్నాడు అరుణ్ అజయ్ ని చూపిస్తూ.

ఏం బావా నా కూతుర్ని బాగా చూసుకుంటావు కదా అని అడిగాడు రామ్ రాఘవ్ ని, ఏంటి బావ నీ చూపు ఇవాళ నా మీద పడింది అన్నాడు రాఘవ్.

ఎంతైనా పిల్లని ఇచ్చుకుంటున్నాం కదా బావ అందుకే మర్యాద కూడా ఇస్తున్నాంలే వచ్చినప్పుడు తీసుకో అన్నాడు. అబ్బో చెల్లిని వచ్చినప్పుడు నేను మర్యాద ఇప్పుడు కూతుర్నిస్తుంటే వస్తుందా అన్నాడు.

వీళ్ళ మాటల్ని అందరూ నవ్వుతూ చూస్తుంటే అన్నయ్య ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది కదా అన్నాడు చంద్ర. ఎందుకు కనిపించదు నామీద గెలిచానని గర్వంలే అన్నాడు రఘురాం.

మీరు మీరు చూసుకోకుండా మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు అన్నాడు రాఘవ్. సరసం లే బావ అసలే ఒక్కగానొక్క బావవి బామ్మర్దివి అన్నాడు రఘురాం.

అదే కదా నా బాధ కూడా ఒక్కరంటే ఒక్కరు లేరు నన్ను సపోర్ట్ చేయడానికి, ఎదురుపడినప్పుడు ఏదో పెద్ద శత్రువుల్ల కొట్టుకుంటారు గాని ఎంతైనా మీరు మీరు ఒకటే అన్నాడు రామ్ రఘురాంలని చూస్తూ.

అలా అంటావ్ ఏంటి అన్నయ్య నేను నీ పార్టీనే అన్నాడు శ్యామ్, మీరు సపోర్ట్ చేసిన చేయకపోయినా పెద్ద తేడా ఏం లేదని బావకు ముందే తెలుసులే అంది లహరి.

అదేదో సినిమాలో చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరు అన్నయ్య మన పక్కనే ఉంటారు కదా అన్నాడు శ్యామ్.

తెలిసినప్పుడు ఎందుకు శ్యామ్, వదిలేయచ్చు కదా అంది కుందన  నువ్వు చెప్తే కరెక్టేలే అక్క వదిలేస్తున్నాను నీ మరదల్ని నేనేమీ వాదించడం లేదు అన్నాడు.

మీరంతా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని దీవించారు వెంకటేష్ నాన్నగారు. మేము ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకునే ఉంటాం అందుకనే ఎక్కడో ఉన్న మేము ఫైనల్ గా ఇక్కడ వచ్చి మీ కుటుంబంలో భాగం కాగలిగాము అన్నాడు వెంకటేష్.

ఇంత సంతోషమైన రోజు నిఖిల్ కి మాత్రం బాధగా మారడంకి ఏదో ఒక మూల బాధగానే ఉంది రోషినికి సుచరితకి.

ఎలా డైవర్ట్ చేయాలని మదన పడుతుంది రోషిని. నేను బాధపడడం లేదని చెప్పలేను కానీ మరి ఈ సంతోషకరమైన రోజు అని పాడు చేసే అంత బాధ పడటం లేదు బుజ్జి అన్నాడు నిఖిల్.

అందరికీ ఈయన గారి బాధ కనిపిస్తుంది గాని నా బాధ కనిపించడం లేదు చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది, శ్రమనాది ఫలితం వేరొకరిది అంటే నేనెలా ఒప్పుకుంటాను చివరి వరకు నా ప్రయత్నం నేను చేసుకుంటూనే ఉంటానని మనసులో గట్టిగా అనుకునింది రుచి.

ఏంటి ప్లాన్స్ కాబోయే పెళ్లికూతురులారా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యేంతవరకు షాపింగ్లతో ఫుల్ బిజీ అయిపోతారా అని అడిగింది రోషిని.

అంత అవసరం లేదులే బుజ్జి డ్రెస్సెస్ డిజైనింగ్ శారీ చూసుకుంటుంది గోల్డ్ డిజైన్ నువ్వు చూసుకుంటావు మిగిలినవన్నీ ఇంటికి వస్తున్నప్పుడు మనం పనులు మానుకొని ఎంజాయ్ చేయడం దేనికి అంది సుచి.

వదిన చెప్పేది కరెక్టే బుజ్జి నేను లీవ్ తీసుకుంటే మొత్తం భారం అంతా నాన్న మీదే పడిపోతుంది ఒప్పుకుంటాను ఒకప్పుడు నాన్న ఒక్కడే చూసుకునేవాడు కానీ నేను వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యాడు కదా అది సడన్గా మారి పోతే కష్టం నా వర్క్ అంతా ఇందు కి అలాట్ చేసేంతవరకు నేను కొంచెం బిజీ అంది బిందు.

స్టేటస్ ఎంజాయ్ చేయడం రాదు ఉండి మాత్రమే ఏం లాభం అని మనసులో తిట్టుకుని తిట్టుకొని అలసిపోతుంది రుచిత కానీ పాపం తనని ఎవరూ పట్టించుకోకపోయే.

సో పెళ్లికూతురులు ఎవరు షాపింగ్ పని పెట్టుకోవట్లేదు అబ్బా సంతోషం ఎక్కడ షాపింగ్ మాల్స్ చుట్టూ తిప్పేస్తారు అని తెగ ఫీల్ అయిపోయాను అన్నాడు అరుణ్.

ఇప్పుడు తిరగకపోతే ఏమైందన్నయ్య మీ పెళ్లికి ఫుల్లుగా తిప్పిస్తాం కదా అంది శ్రావ్య. మీ అందరికీ ఆ చాన్స్ నేనెందుకు ఇస్తాను అనుకుంది రాధ మనసులో త్వరలోనే బావ మనసును గెలుచుకొని రోషిని ని పక్కకు తప్పిస్తాను బిందు కూడా ఇంట్లోకెళ్తుంది కాబట్టి ఆఫీస్ వర్క్ అని చెప్పి నేను కూడా ఫ్రీక్వెంట్ గా అక్కడికి వెళ్లొచ్చు అని గాలిలో మెడలు కడుతుంది పాపం ఫ్యూచర్ తెలియక.

కళ్యాణి సంతోషంగా వంటలు వండటం చూసిన లక్ష్మి ఏంటి వదిన అంత సంతోషం అని అడిగింది. ఈ అదృష్టం మళ్ళీ మనకి వస్తుందో రాదో కదా వదిన అందుకేనేమోలే నా ముఖంలో సంతోషం కనిపిస్తుంది మీకు అంది. భవాని కూర్చుని పెత్తనం చేస్తూ ఉంటే లక్ష్మీ ఏదో తనకి తోచిన సాయం చేయగా ఊర్లో వాళ్ళ సహాయంతో రుచికరమైన వంటలు వండడం ముగించింది కళ్యాణి.

దగ్గరుండి అన్ని వంటల్ని గుడికి చేర్చాడు సుధాకర్ బావ కి తోడుగా ఉన్నాడు అర్జున్. అప్పటికే భోజనాలు టైం అయిపోవడంతో అందరూ భోజనాలు ముగించి కొద్దిసేపు ఊరి వాళ్ళు వచ్చి మాట్లాడాక అందరూ అక్కడే చాపలు పరచుకొని పడుకున్నారు.

బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని రాములవారిని దర్శించుకుని ఆ ఊరి వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని తిరిగి బయలుదేరిపోయారు వర్మ కుటుంబ సభ్యులంతా.

అర్జున్ కుటుంబం కూడా రాధతో సపరేట్ కారులో బయలుదేరిపోయింది.

ఐదు గంటల ప్రయాణం తర్వాత ఎవరు ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు సంతోషంగా.

శారద శరత్ తారలు ఎయిర్ పోర్ట్  చేరుకొని అక్కడి నుంచి వాళ్ళ ఊర్లకు వెళ్లిపోయారు. రోషిని దగ్గరుండి ఎయిర్ పోర్ట్ లో వదిలి పెళ్లి డేట్ ఫిక్స్ అయిన వెంటనే వచ్చేయాలని మరీ మరీ చెప్పి తిరిగి ఇంటికి చేరుకుంది.

ఇంటికి చేరుకున్న వెంటనే అన్నయ్యలని బావలని తీసుకొని మెడ పైకి చేరుకుంది రోషిని. రాజు హరి లు కూడా వాళ్లతోనే ఉన్నారు.

అజయ్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆ ఉంగరం చూస్తూ దీని గురించి మీ అందరికీ చాలా డౌట్లు ఉన్నాయి కదా అడిగేయండి అంది రోషిని.

రోషిని ఏం చెప్పబోతుందో అందరికి ఉన్న డౌట్లు ఎలా తీరుతాయో

గాలిలో మేడలు కడుతున్న రుచిత రాగల పరిస్థితి ఏమి కానుందో.

అఖిల్ నిఖిల్ లు ఏం చేయబోతున్నారో

అన్ని ప్రశ్నలకు సమాధానాలు ముందు ముందు ఎపిసోడ్స్ లో కవర్ చేసుకుందాం

రుచిత కి ఎవరి చేతిలో గట్టిగా పడితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్లు రూపంలో చెప్పేయండి

థాంక్యూ ఆల్ ఎపిసోడ్ కొంచెం లేట్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా ఇస్తాను.

Click here for next part

One Response

  1. Ruchithaki Roshni chethilone

    Sooper story maa keep it up but koncham regular GA evvura