ఉదయాన్నే నిద్ర లేచిన పూజిత తనకొచ్చిన మెసేజ్ చూసి కంగుతినింది ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే నువ్వు చెప్తే మీ అన్నయ్య వింటాడు కదా అని అన్నావు కదా వదినా జస్ట్ ఫర్ చేంజ్ అజయ్ అన్నయ్యకు కాకుండా రోషన్ అన్నయ్యకి చెప్పనా తన డిసిషన్ మార్చుకోమని లేకపోతే నువ్వే నీ బిహేవియర్ మార్చుకుంటావా ఇంకో విషయం

నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు నువ్వు అన్నయ్య సంతోషంగా ఉంటే చాలు నేను అన్నయ్యకు దూరంగా ఉంటాను అలాంటి విషయాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు నా అన్నయ్య సంతోషం నాకు ముఖ్యం అది నీతో లేనప్పుడు మీ ఇద్దరినీ విడగొట్టడానికి క్షణం కూడా ఆలోచించను అంత పని నాకు పెట్టవని అనుకుంటున్నాను నువ్వు సంతోషంగా ఉంటూ మా అన్నయ్యని సంతోష పెడుతూ కుటుంబంలో ఒకరిగా కలిసి పోతావని ఆశిస్తున్నాను

ఇక మీద జరిగేదంతా నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇకమీదట ప్రతిక్షణం నిన్ను గమనిస్తూ ఉండడమే నా పని నీతో అన్నయ్య సంతోషంగా ఉన్నాడా సరే లేకపోతే చెప్పానుగా నా వదిన మారిపోతుంది జాగ్రత్త అని

తనని చూస్తే ప్రేమ కురిపించే కళ్ళు ఈమధ్య అసహనంగా చూడడం పూజిత గమనిస్తూనే ఉన్నా చెల్లెల మీద గుడ్డి ప్రేమ ఆ మార్పుని కొట్టిపారేసింది. ఇది అలాగే ఉంటే రోషిని అన్నంత పని చేయడానికి క్షణం కూడా ఆలోచించదు మొదట నన్ను నేను మార్చుకోవాలి అనుకుంది పూజిత.

యంగ్ బ్యాచ్ డిస్కషన్ చేసిన విషయం పూర్తి వివరాలతో సహా డాక్యుమెంటేషన్ వర్మ గారికి కుటుంబ సభ్యులకు చూపించింది రోషిని. ఎగ్జిబిషన్ విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉండడం అదికాక రోషిని మోటివ్ కరెక్ట్ గా ఉండడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కుటుంబ సభ్యులంతా.

అదేం చేసినా ఏం చెప్పినా కరెక్ట్ అంటారు ఏంటి నాన్న అంత పెద్ద విషయాన్ని తను ఒక్కటే డీల్ చేయగలదా అని అడిగింది రత్న. తను ఒకటే డిలీ చేయడం ఏంటమ్మా మేమంతా ఉన్నాం కదా అన్నాడు రోషన్. మీరంతా ఉన్నా జ్యువెలరీ ఎగ్జిబిషన్ అంటే చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్న విషయం కదా నాన్న అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు ఎలాగో మన షో రూమ్ ఉంది కదా దాంట్లో సేల్స్ బాగానే ఉన్నాయి కదా ఏదైనా అటు ఇటు అయితే మనకు ఎంత నష్టం దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా అని తన మనసులో భయాన్ని బయట పెట్టింది రత్న

నీ బాధ భయం నాకు అర్థం అవుతున్నాయి రత్న కానీ బంగారం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మన షో రూమ్ లో సంవత్సరమంతా జరిగే సేల్స్ ఆ ఎగ్జిబిషన్ మూడు రోజుల్లో జరిగిపోతాయి టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకుందాం నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు అన్నాడు రాఘవ్

మీ ఇష్టం అన్నయ్య అంది రత్న భయపడకు అన్నట్టు భరోసా ఇచ్చాడు చంద్ర మా బుజ్జి తల్లి చాలా పెద్దది అయిపోయిందిగా అన్నారు కుందన రఘురాములు మా కోడలికి దిష్టి పెట్టకండి అంది రాధిక మరి చీఫ్ గెస్ట్ ఎవరే మనవరాల అని అడిగింది జానకమ్మ వేరే ఎవరో ఎందుకు అమ్మమ్మ నువ్వు తాతయ్యే నా మొదటి చీఫ్ గెస్ట్ లు అనింది రోషిని

రోషిని ప్లాన్ చేసినట్టుగానే శరవేగంగా పనులు జరగడం ప్రారంభం అయ్యాయి. సుచరిత మొదట కాలేజీలో ఆడిషన్స్ జరిపి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ దగ్గర అనుమతి తీసుకొని వాళ్ల హార్డింగ్స్ తో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నింపేసింది

పూజిత తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి మొదటిసారి మనసు పెట్టి బెస్ట్ యాడ్ చేసి పబ్లిష్ చేసిందిదాంతో పబ్లిక్ కి త్వరగానే కనెక్ట్ అయ్యింది

వారం రోజులు అందరూ క్షణం తీరిక లేకుండా ఎవరికి అలర్ట్ చేసిన పనిని వాళ్లు పర్ఫెక్ట్ గా చేయడానికి తమ సాయి శక్తుల ప్రయత్నించారు బెట్లో గెలిచిన విధంగానే రోషన్ కి ఆ వారం రోజులు రోషిని దగ్గరుండి చూస్తూనే అవకాశం దక్కింది అప్పుడప్పుడు పూజిత కూడా వీళ్ళతో ట్రావెల్ చేస్తూ రోషన్లోని భయాన్ని తగ్గించగా రోషిని మెసేజ్ బాగానే పనిచేస్తుందని మనసులోనే నవ్వుకుంది.

శ్రావ్య తన క్రియేటివిటీ అంతా ఉపయోగించి మోడల్స్ కి మంచి అవుట్ ఫిట్ రెడీ చేయగా రోషిని డిజైన్ చేసిన జువెలరీ వాళ్లకి కరెక్ట్ గా సెట్ అవ్వడంతో హోర్డింగ్స్ పిక్చర్ పర్ఫెక్ట్ గా వచ్చాయి.

రోషిణి తనకున్న అద్భుతమైన క్రియేటివిటీతో డిజైన్లలో కొత్తదనం, క్వాలిటీలో రాజీ పడకపోవడం వల్ల చాలా తక్కువ కాలంలోనే వర్మ బ్రాండ్‌కి ఉన్న మంచి గుర్తింపు మరింత పెరిగింది.

ఈసారి వాళ్లు తమ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ని వైజాగ్ నడిబొడ్డున ప్లాన్ చేశారు.

ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. హాల్ అంతా రకరకాల అద్దాల కాంతులతో, వెల్వెట్ క్లాత్స్‌తో మెరిసిపోతోంది. రోషిణి ప్రతి స్టాల్‌ దగ్గరకు వెళ్తూ, నగలను అమర్చే విధానాన్ని చాలా దగ్గరుండి చూసుకుంటోంది. సాంప్రదాయబద్ధమైన నల్లపూసల హారాలు, వజ్రాల నెక్లెస్‌లు, అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే కాసుల పేరు ఇలా ఒకటేమిటి, ప్రతి డిజైన్ వెనుక ఆమె పడ్డ కష్టం దాగి ఉంది.

అరుణ్ ఫోన్లలో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్, సెక్యూరిటీ, గెస్ట్ లిస్ట్… ఇలా అన్ని బాధ్యతలూ తనే చూసుకుంటున్నాడు. రోషన్ అజయ్ విజయ్ వరుణ్ తమ వంతు సాయం అందించారు. అరుణ్ స్ట్రెక్టుగా చెప్పాడు తన బంగారం వేసిన మొదటి అడుగులో తన కృషి ఎక్కువగా ఉండాలి అనడంతో మిగిలిన వాళ్లు కూడా అది అంగీకరించారు, ఇంకా చెప్పాలంటే అంగీకరించక తప్పలేదు.

“రోషిణి! రేపు పొద్దున మన ఎగ్జిబిషన్‌ని చూడడానికి సిటీలోనే టాప్ సెలబ్రిటీస్ వస్తున్నారు. అలాగే ప్రెస్ వాళ్లు కూడా భారీగా వస్తున్నారు. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్‌ఫెక్ట్!” అన్నాడు అరుణ్ వచ్చి ఆమె పక్కన కూర్చుంటూ.

రోషిణి నవ్వి, “మీరు అంత పక్కనుంటే నాకేం టెన్షన్ అరుణ్? ఈ ఎగ్జిబిషన్ కోసం మనం రాత్రింబవళ్లు కష్టపడ్డాం. కచ్చితంగా సక్సెస్ అవుతుంది” అంది నమ్మకంగా. అన్ని పనులు ఒకసారి చెక్ చేసుకున్నాక రిలాక్స్ అవ్వడానికి అదే రోజు రాత్రి గార్డెన్లో కూర్చున్నారు అంతా. రోషిని పక్కన కూర్చున్న రోషన్ టెన్షన్ లో ఉన్నావా బంగారం అని అడిగాడు అదేం లేదు అన్నయ్య అన్నీ పనులు దగ్గరుండి మీరంతా చూసుకున్నారుగా నాకెందుకు టెన్షన్ అని అడిగింది పనులు మేము చూసిన డిజైన్స్ నీవే కదా బంగారం చాలా స్ట్రెస్ తీసుకున్నట్టున్నావ్ అన్నాడు అజయ్

తన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కితే అంతే చాలు లే అన్నయ్య అన్నాడు విజయ్. వరుణ్ సుచికీ ఫోన్ చేసి అఖిల్ నిఖిల్ ని కాన్ఫరెన్స్ లో పెట్టి రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పి  టెన్షన్ పడొద్దు అని కూడా చెప్పి కొంచెం సేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు.

జానకమ్మ ఇక అందరూ వెళ్లి రెస్ట్ తీసుకోవాలని స్ట్రిక్ట్ గా చెప్పడంతో అందరూ కుటుంబ సభ్యులు ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూములకు వాళ్ళు వెళ్లిపోయారు. రోషన్ మాత్రం అరుణ్ వైపు చూస్తూ నేను బంగారం రూమ్లో నిద్రపోతున్నాను. ఇంకెవరికి ఆ రూమ్ లోకి ఎంట్రీ లేదు అన్నాడు దాంతో చేసేదేమీ లేక తన రూమ్ కి వెళ్ళిపోయాడు వరుణ్ మిగిలిన వాళ్ళు నవ్వుకొని తనని అనుసరించారు.

మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. వర్మ నిలయ సభ్యులంతా ఇంట్లో పూజ అనంతరం గుడికి వెళ్లి శివయ్య ఆశీస్సులతోపాటు గురువుగారి ఆశీస్సులు కూడా తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు.  వర్ణ దంపతుల చేతుల మీదగా ఎగ్జిబిషన్ హాల్‌ గ్రాండ్‌గా ఓపెన్ అయ్యింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం తరలివచ్చారు. రోషిణి డిజైన్ చేసిన యాంటిక్ కలెక్షన్స్‌ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పెళ్లి కూతుళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వడ్డాణం, లాకెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అరుణ్ కస్టమర్లతో డీల్స్ క్లోజ్ చేస్తూ, కలెక్షన్ వివరాలు చెప్తూ బిజీగా ఉన్నాడు.

అదితి మర్యాదలకి ఎక్కడ ఏ లోటు జరగకుండా అందరూ చమటోడ్చి పనిచేస్తున్నారు. అనుకోని అతిధుల ఆ ఎగ్జిబిషన్  కి ఊడిపడ్డారు వర్ధన్ అలాగే రమ్యలు, సుచరిత హ్యాండిల్ చేస్తున్న కౌంటర్ కే వెళ్లింది రమ్య, అందరి కస్టమర్ల లాగానే రమ్యకి కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది సుచరిత. నిజం చెప్పాలంటే స్వచ్ఛదిత తనని గుర్తుపట్టలేదు కానీ రమ్య మాత్రం రీసెంట్ ఫోటోస్ చూస్తూ తన తండ్రి దగ్గర సూచీ విషయాలన్నీ తెలుసుకుని ఉండడంతో వెంటనే గుర్తుపట్టింది దాంతో సుచరిత వివరించడం అయిపోగానే ఎలా ఉన్నావ్ అక్క అని అడిగింది మరోవైపు అరుణ్ ఎక్కడున్నాడో వెతుకుతూనే

సుచరిత క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూడడంతో నన్ను గుర్తుపట్టలేదా అక్క నేను మీ చెల్లెల్ని నువ్వెక్కడున్నావని తెలుసుకునే వచ్చాను నిన్ను నాన్న ఇంటికి తీసుకుని రమ్మన్నాడు అని తేనె పలుకులు పలికింది

తన పక్క కౌంటర్ లోనే బిందు ఉండడంతో ఏంటి వదిన ఎనీ ప్రాబ్లం అని అడిగింది తన నోటి నుంచి ఆ పిలుపు వినడం సూచిక సంతోషంగా అనిపించింది

తను నిన్ను వదినా అని పిలుస్తుందంటే మనకి రిలేటివ్న అని  ప్రేమగా కన్నింగ్ గా అడిగింది రమ్య. బిందు జరిగేది గమనిస్తూనే అజయ్ కి కాల్ చేసింది

అజయ్ కాల్ అటెండ్ చేయడంతో సుచి వదిన కౌంటర్ కి వీలైనంత త్వరగా రావా అని చెప్పి పెట్టేసింది. ఏమైంది అక్క ఎనీ ప్రాబ్లం అని అజయ్ కంగారుపడుతూ రాగా, అలాంటిదేమీ లేదు అజయ్ అంటూ రమ్య వైపు చూపించింది. హలో బ్రదర్ నేను సుచరిత అక్క వాళ్ళ చెల్లిని తనని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పింది.

మా వదినకి నీలాంటి చెల్లి ఎవరూ లేరే ఉండేది ఒక అన్నయ్య ఒక తమ్ముడు అలాగే మా ఫ్యామిలీ నువ్వు ఎవరిని చూసి ఎవరని ఆనుకుంటున్నావో దయచేసి సీన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పింది బిందు

ఇందు నిఖిల్ కి ఫోన్ చేసి ఇక్కడ జరిగే విషయం చెప్పింది.

ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండగానే రుచి మేడం మాత్రం చేయకూడని పని ఒకటి చేసేసి ఏమీ తెలియనట్టు అన్ని కౌంటర్స్ తిరగడం మొదలుపెట్టింది

రుచి చేసిన పనేంటో రమ్య ఇంటెన్షన్ ఏంటో ఇంకా ఎగ్జిబిషన్లో ఏమేం జరగబోతున్నాయో తెలుసుకోవాలంటే వెయిట్ పర్ థి నెక్స్ట్ ఎపిసోడ్

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *