గురువు గారితో పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడి అందరూ వెళ్లిపోగా రఘురాం ఆగిపోయాడు రఘురాం వెనకే వర్మ గారు కూడా ఆగారు
ఏంటి రఘు నీ మనసును తొలిచి వేస్తున్న ప్రశ్న అని అడిగారు గురువుగారు
బంగారాన్ని జాగ్రత్తగా ఉండమన్నారు మీ నోటి నుంచి ఆ వాక్కు వచ్చిందంటే మీరు ఏదో గమనించారనే కదా అన్నారు
అంతలో వెనక్కి వెళ్ళినట్టే వెళ్లిన చంద్ర కూడా అక్కడికి వచ్చేసాడు
మీరు అనుకుంటున్నట్టుగా పెద్దగా ఏమీ లేదు చిన్నారికి దూకుడు ఎక్కువ అవుతుంది అది తగ్గించుకుంటుందని జాగ్రత్తగా ఉండమన్నాను అంతే ఏమీ లేదు అన్నారు
ఇంకొక విషయం తనకి కూడా పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి రెడీగా ఉండండి అని చిరునవ్వు నవ్వాడు గురువుగారు అప్పుడే పెళ్లి ఏంటి గురువుగారు అన్నాడు చంద్ర
నీకు తెలియందేముంది చంద్ర గడియలు వచ్చేస్తే ఆపలేము కదా ఎందుకైనా మంచిది రెడీగా ఉంటారని ముందు జాగ్రత్తగా చెప్పాను
పెళ్లికి సమయం తక్కువగా ఉంది కదా ఏర్పాట్లని జాగ్రత్తగా చూసుకోండి విజయోస్తు అని దీవించి గురువుగారు ధ్యానంలోకి వెళ్లిపోయారు
ఇక్కడ క్లిక్ చేసి కొనండి “Real Basics Women’s Cotton Animal Print Pajama Set Pack of 2″
పెద్ద వాళ్లంతా ఇంటికి వెళ్ళిపోతే అరుణ్ రోషిని మాత్రం ఆఫీసుకి వెళ్లి అక్కడికే అందరిని రమ్మని మెసేజ్ చేసి అందరూ వచ్చాక పెళ్లి విషయం చెప్పింది
ఈ హ్యాపీ అకేషన్ లో మనమంతా నైట్ డిన్నర్ కి బయటికి వెళ్దామని ప్రపోజల్ కూడా పెట్టింది
నువ్వు ఎలా చెప్తే అలా బుజ్జి అన్నాడు రోషన్ ఇంకొక విషయం మీ పెళ్లి గుడిలో జరగబోతుంది అని చెప్పింది రోషిని
సో కాబోయే పెళ్లి కూతుర్లు ఇద్దరికీ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఇప్పుడే చెప్పేయండి దాన్ని పట్టి డెకరేషన్ మనమే చేపించుకుందాం అని చెప్పింది
నాకైతే ఏమీ రిక్వైర్మెంట్స్ లేవురా నువ్వు ఎలా చెప్తే అలా అంది సుచరిత, నాది కూడా సేమ్ డైలాగే బుజ్జి ఒక్క మీ వదిన తప్ప మిగతా అంతా నీ ఇష్టమే అన్నాడు
దాంతో రోషన్ తనకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడో అర్థం చేసుకున్న పూజిత ఇంకా వాళ్లలో వేరుగా ఉండడం ఇష్టం లేక నువ్వు ఎలా చెప్తే అలానే రోషిని అంది పూజిత
దాంతో ఎప్పటినుంచో పెళ్లి మండపం గురించి రీసెర్చ్ చేసి ఫైనల్ చేసి పెట్టుకున్న రోషిని ఒక డెకరేషన్ ని వాళ్ళకి చూపించి ఇది మీకు ఓకేనా అని అడిగింది
ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశావు అని అడిగారు అందరూ
ఇప్పుడు ప్లాన్ చేసేదేంటి ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిందే కదా అందుకే నా జాగ్రత్త ల్లో నేనున్నానులే అని నవ్వింది
పార్టీని చూసి ఇంప్రెస్ అయిన శ్రావ్య ఈ అవకాశం ఓన్లీ పెద్ద బావకి పెద్దన్నయ్యకేనా మాకు కూడా ఉందా బుజ్జి అని అడిగితే
ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్, చిన్న వదిన గారు అంది
నా మరదలు గారు కొంచెం కష్టపడాలి తప్పదు వదినలు ఊరికనే వచ్చేయరు అంది
నోటెడ్ నా టైం వచ్చినప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని అంది
వెళ్లి లా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఆఫీస్ టైం దాటే డిన్నర్ టైం కూడా అయిపోవడంతో ఎవరిళ్లకు వాళ్లు ఫోన్ చేసి ఇంఫాం చేసి
అనుకున్నట్టుగానే అందరూ హోటల్ కి వెళ్ళారు
వాళ్ల కోసం బుక్ చేసుకున్న ప్రైవేట్ రూమ్లో అందరూ సెటిల్ అయ్యారు
బిందు పక్కన ఇందు నీ చూసిన పూజిత కి తన చెల్లిని మిస్ అయిన ఫీలింగ్ వస్తే
అది తన స్వయంకృత అపరాధమే కాబట్టి ఏమీ మాట్లాడలేక కామ్ గా ఊరుకుంది
వీళ్ళిలా వీళ్ళ పనుల్లో బిజీగా ఉంటే ఇంకా ఇంటికి రా నీ అక్క కోసం తన అమ్మని అడిగింది రుచిత
తను ఇంటికి రావడం లేట్ అవుతుందంట నువ్వు రా భోంచేద్దాం అని చెప్పింది కవిత
ఏంటి కొత్తగా అక్క రాకుండానే బొంచేద్దాం అంటున్నావ్ అంది తన పనులు తనకు ఉంటాయి కదా
అయినా తను అల్లుడు గారితో బయటకు వెళ్ళింది అలాంటప్పుడు నీకోసమే వెయిట్ చేస్తున్నాము రా అంటే ఎలా ఉంటుంది
తన ప్లేసు తనకు ఇవ్వడం అలవాటు చేసుకో అని చెప్పింది ఏమీ చేయలేక తన తల్లి చెప్పినట్టే భోంచేసి రూమ్ కి వెళ్ళిపోయింది రుచిత
గుడి నుంచి ఇంటికి వెళ్లిన పెద్దవాళ్ళు మాత్రం ఎక్కువ టైం లేకపోవడంతో ఎవరు పనులు వాళ్ళు షెడ్యూల్ వేసుకొని అప్పుడే పనిలో దిగిపోయారు
బట్టలు జ్యువలరీ పిల్లల ఛాయిస్ కే వదిలేశారు
ఇన్విటేషన్ ప్రింటింగ్ కి పంపించేసి టు డేస్ లో వచ్చేయాలని స్ట్రిక్ట్ గా చెప్పి డబల్ పేమెంట్ చేసేసారు వర్మ గారు
ఇక్కడ వీళ్ళు హడావిడిగా ఉండగానే బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేసారు
ఇంటికి రాగానే రంగీ అంటి వీళ్లంతా డిన్నర్ చేశారా లేకపోతే పెళ్లి కుదిరింది అన్న సంతోషంలో ఇలాగే ఉన్నారా అని అడిగింది రోషిని
గంట నుంచి చెప్తున్నాను అమ్మ డిన్నర్ రెడీ అయింది భోజనం చేయండి అని ఒక్కరు కూడా కదిలితేనా అంది రంగి
నీతులు పక్కవాళ్ళకి చెప్పడమే గాని మీరు ఫాలో అవ్వరా టైమ్ ఎంతయింది చూశారా ఒకసారి అని అందరిని ఉద్దేశించి అడిగింది రోషిని
ఫైవ్ మినిట్స్ లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలి, లేకపోతే ఇంకొక వారం రోజులు ఎవరూ నన్ను తినమని పోర్స్ చేయకూడదు అని చెప్పింది
అంతే దెబ్బకి అందరూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు
ఎవర్ని ఎలా కొట్టాలో నీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు చిన్ని మా బంగారమే అంది రంగి
అందరూ భోజనాలకు వెళ్లిపోవడంతో రోషిని కూడా తన రూమ్ కి వెళ్లి గుడిలో ఏర్పాట్లు చేసే ఈవెంట్ మేనేజర్ కి ఫోన్ చేసి డిస్కషన్ లో పడిపోయింది
అది ముందే ఎక్స్పెక్ట్ చేసిన అరుణ్ తనకోసం పాలు తీసుకుని రూముకి వెళ్లేసరికిఅలసిపోయి సోఫాలోనే పడుకుని ఉండిపోయిన
రోషిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి రూమ్ లో దగ్గరికి వేసి తీసుకెళ్లిన పాలని కిందకి తీసుకొని వచ్చేసాడు
మిగిలిన వాళ్ళు ఎవరు ఏ పనులు చేయాలో డివైడ్ చేసుకుని ఆఫీస్ విషయాలు ఎలా హ్యాండిల్ చేయాలో ప్లాన్ వేసుకుని ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు
పెళ్లి కుదిరింది అన్న సంతోషంలో ఆనందంగా ఇంటికి చేరుకున్న సుచరితని చుట్టూ ముట్టారు ఇంట్లో వాళ్ళు
ఏంటమ్మా ఆలా పెళ్లి కుదిరిందో లేదో ఇలా మమ్మల్ని వదిలేసి మీ ఆయనతో డిన్నర్ కి వెళ్ళిపోయావా అన్నాడు నిఖిల్
నేను రోషిని తో వెళ్లాను అక్కడికి మా ఆయన వచ్చాడు నాకేం తెలీదు అంది సుచరిత
అందరూ కలిసి తమ సంతోషాన్ని పంచుకొని హ్యాపీగా నిద్రపోయారు
పూజిత కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కవిత, సారీ మా లేట్ అయింది అని చెప్పింది
పడుకోవచ్చు కదా నువ్వు కూడా ఎందుకు నాకోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు అని అడిగితే ఇక నీతో మిగిలి ఉండే టైం చాలా తక్కువ కదరా ఎంత ఒకే ఊరిలో ఉన్న పెళ్లయ్యాక
ఇలా నీతో టైం గడిపే అదృష్టం వస్తుందో రాదో అందుకే ఎదురు చూస్తున్నానులే నాకేమీ ఇబ్బంది కాదు అంది
చూడు పూజి మన అదృష్టం మనం చేసుకున్న పుణ్యం కలిసి వచ్చి నీకు అంత మంచి ఇంట్లో సంబంధం కుదిరింది
మీ ఇంట్లో అందరూ స్వచ్ఛమైన మనుషులే నువ్వు ఈ విషయం ఇప్పటికే గుర్తించి ఉండాలి
పెళ్లయ్యాక వాల లో ఒకరిగా కలిసిపోయి నీ ఆత్మ అభిమానంతో కాపాడుకుంటూ నీ పుట్టింటి గౌరవాన్ని పెంచుతా వని అనుకుంటున్నాను
నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన నేను మీ నాన్న నీకు అండగా ఉంటాం అనేది ఎంత నిజమో నీకు మా అవసరమే రాకుండా వాళ్ళు చూసుకోగలరు అనేది కూడా అంతే నిజం
ఎటువంటి భయాలు లేకుండా నీ పెళ్లి గురించి కలలు కంటూ సంతోషంగా నిద్రపో అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోయింది కవిత
ఇదండీ ఇవాల్టి ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం
గివ్ యువర్ కామెంట్ రేటింగ్ అండ్ ఫైనల్లీ ఫాలో మీ
Super twaraga roshini arun la pelli baga mogistaru anukunta waiting