అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగిన అనంతరం పెద్దల నిర్ణయంతో నాలుగు జంటల నిశ్చితార్థానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి ఆ రాముల వారి సన్నిధిలో.ముందుగా రోషన్ 💖 పూజ, వరుణ్ 💖 సుచరితల నిశ్చితార్థపు తాంబూలాలు అందుకున్నారు కుందన రఘురామ్ వెంకటేష్ కవితలు అలాగే రాధిక రాఘవ్, రామ్ రమ దంపతులు…

నా చెల్లికి నన్ను వియ్యంకుడిని చేసినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను తల్లి అన్నాడు సుచరితని దగ్గరకు తీసుకొని రామ్.. మన మధ్య రుణాలు ఏంటి నాన్న అంది సుచరిత…

నన్ను మీ ఇంటి తో పాటు మీ గుండెల్లో పెట్టుకొని మోస్తున్న మీ రునం కదా కూతురుగా నేను తీర్చుకోవాల్సింది అంది సుచరిత… ఓహో సెంటి క్వీన్ అన్నాడు అఖిల్.. అవును మా నాన్న నా ఇష్టం నీకేంటి మధ్యలో పో అంది సుచరిత.

అది కదా మా సుచి అంటే నువ్వు ఎప్పుడూ మా ఇద్దరి మీద ఇలా అధికారం చలాఇస్తూ అమ్మానాన్నలకి మంచి కూతురుగా మాకు మంచి చెల్లి అక్కగా బావ గాడికి మంచి పార్ట్నర్ గా  జీవితాంతం ఉండిపో అదే నువ్వు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అన్నాడు నిఖిల్.

వెధవ ఇలానేనా చెల్లికి చెప్పేది అంటు తల మీద మొట్టింది రమా.. మా వాడు ఊరికే తమాషాలు చేస్తున్నాడు తెలుసు కదా ఎందుకు వాడ్ని కొడతావు అని అంది సుచరిత… అబ్బో నా కొడుకుని నేను కొట్టకూడదా అంది రమా.. కూడదు కూడదు నా ముందర అస్సలు కొట్టకూడదు అంది సుచి.. నా కూతురు ఏది చెప్తే అదే కరెక్ట్తె ఫాలో అయిపో రమా అన్నాడు రామ్.

అబ్బో మీకే ఉంది పెద్ద కూతురు ఇంకొద్ది రోజుల్లో అత్తారింటికి వెళ్లిపోతుంది గా అప్పుడేం చేస్తారు అంది రమా.. ఎక్కడికి వెళ్తుంది నా చెల్లెలు ఇంటికే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళిపోతాను నా కూతురు దగ్గరికి అన్నాడు రామ్.  వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే..

అజయ్ 💖 బిందు,  విజయ్ 💖 శ్రావ్య ల నిశ్చితార్థపు తాంబూలాలు అందుకున్నారు కుందన రఘురామ్ లక్ష్మీ అర్జున్, రత్న చంద్ర, శ్యామ్ లహరిల దంపతులు..

నిశ్చితార్థం అనంతరం లహరి జానకమ్మ మహేంద్ర వర్మ గార్ల కాళ్ళు పట్టుకుని ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను అత్తయ్య.. నా కూతురికి ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు అంది..

లక్ష్మి కూడా జానకి, వర్మ గారి ఆశీర్వాదం తీసుకుంటూ.. జరిగిన చిన్న పొరపాటుకి బాధ్యత తీసుకుంటూ నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా తీసుకెళుతున్నందుకు మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ ఒక్కటైతే చెప్పగలను మీ మేన కోడలుగా మేనల్లుడుగా నాకు అన్నయ్యకి దక్కని అదృష్టం నా కూతురికి దక్కినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంది.

ప్రతి తండ్రికి తన కూతురు ఎటువంటి ఇంటికి వెళ్తుందో ఎలా ఉంటుందో అనే దిగులు రాత్రులు నిద్ర లేకుండా చేస్తుంది ఇక మీదట నేను మనశ్శాంతిగా నిద్రపోతాను ఎందుకంటే నా కూతురు మా దగ్గర ఎలా అయితే ఉందో మీ దగ్గర అంతకంటే సంతోషంగా ఉంటుంది. రాముల వారి కళ్యాణం చూడ్డానికి వచ్చిన మాకు మా కూతురి కళ్యాణం నిశ్చయించుకునే భాగ్యం కలిగింది ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను బాబాయ్ గారు అన్నాడు అర్జున్..

మన మధ్య రుణాలు ఏంటబ్బాయి పిల్లల సంతోషమే కదా మనకు కావాలి అంటూ భుజం తట్టారు వర్మ గారు

అజయ్ కి బిందు లకి సరిపడా ఉంగరాలు లేవని పెద్దలు మదన పడుతూ ఉండగా వాళ్ల టెన్షన్ కి తెర దించుతూ,  ఎదురెదురుగా నిలుచుకున్న రోషన్ 💖పూజిత, వరుణ్ 💖సుచరిత, అజయ్ 💖 బిందు, విజయ్ 💖శ్రావ్య.. ల జంటలుకి ఉంగరాలు తన చేతుల మీదుగా  అందించింది రోషిని..

అజయ్ చేతిలో ఉన్న ఉంగరం చూసి ఎలా అన్నట్టు చూసాడు రోషిని వైపు తర్వాత చెప్తాను అన్నట్టు కళ్ళు అర్పింది రోషిని.

పూజిత వెనక తనకి సపోర్టుగా రుచి, సుచరితకి సపోర్టుగా అఖిల్ నిఖిల్, బిందుకు సపోర్టుగా రాధా ఇందు, నిలబడగా శ్రావ్య వెనక హరి నిల్చున్నాడు. రోషన్ వెనుక రాజు వరుణ్ వెనుక అరుణ్, అజయ్ విజయల మధ్యలో రోషిని నిల్చుకొని ఫుల్ మస్తీ చేస్తుండగా నాలుగు జంటలు తమ అంగీకారం తెలుపుతూ ఉంగరాలు ఒకరికొకరు మార్చుకున్నారు..

వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఊరి ప్రజలందరూ అక్షింతలు చల్లి వాళ్ళ ఆనందాన్ని తెలుపుగా, వర్మ గారి కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఆ క్షణం..

ఆడపిల్ల తల్లిదండ్రులుగా తమ కూతుర్లకు దక్కిన అదృష్టానికి ఆ క్షణం వాళ్లు కూడా అ రామయ్యకి ధన్యవాదాలు తెలుపుకున్నారు..

అక్షింతలు వేసి ఆశీర్వదించిన అనంతరం ఊరి వాళ్ళందరినీ ఉద్దేశించి తొందర్లో పెళ్లి ముహూర్తం నిర్ణయించి మీ అందరికీ కబురు పెడతాం అందరూ వచ్చి నా మనవళ్లని మనవరాలని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నానని అందర్నీ ఒకేసారి ఆహ్వానించారు వర్మ దంపతులు.

అనంతరం భోజనాల బాధ్యతల్ని కొడుకు అల్లుళ్లకు అప్పగించగా రాఘవ రఘురాం చంద్రలు ఆ పనుల్లో బిజీ అయిపోగా అప్పటికే వంటలు దగ్గర బిజీగా ఉన్నా రంగిని తీసుకొని వచ్చి తన చేత కూడా నాలుగు జంటలకి అక్షింతలు వేపించింది రోషిని.

అర్జున్ సుధాకర్ లు కూడా భోజనాల దగ్గరికి వెళ్ళగా లక్ష్మీ కళ్యాణి మిగిలిన ఆడవాళ్ళకి సహాయం చేయడానికి వెళ్లారు.

వర్మ గారికి ఆ ఊరితో ఉన్న అనుబంధం తక్కువే అయినా మిగిలిన తన బాల్య స్నేహితులందరూ ఆయన చుట్టూ చేరిపోగా భార్య తో కలసి వాళ్లతో కబుర్లలో పడ్డారు వర్మ గారు..

వాళ్లలో ఒకాయన మాట్లాడుతూ ఈ ఊరు నీకేమిచ్చిందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఈ ఊరికి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉన్నావ్ నీ ఇంట ఈ తరానికి జరిగినా మొదట శుభకార్యాన్ని ఇక్కడ చేయాలని నిర్ణయించుకొని ఇంత ఖర్చంతా నీ నెత్తిన వేసుకున్నవ్.

ఈ ఊరిని ఈ ఊరు నుంచి పొట్ట చేత పట్టుకొని నీ దగ్గరికి చేరిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకున్నావ్  కొడుకుని కూతుర్లని ఒకే దగ్గర పెట్టుకునే అదృష్టం దక్కించుకున్నావ్..

నిన్ను గౌరవించి పూజించే నీ కను సన్నల్లో నడిచే వారసుల్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాడు నీ జన్మ ధన్యం వర్మ అన్నాడు.

అంతా భగవంతుడి దయ నా తల్లిదండ్రులు పుణ్యం నాదేముంది అని సున్నితంగా తిరస్కరించారు వర్మ గారు ఇంతలో ఒకాయన మాట్లాడుతూ నీ చెల్లెలు మనవరాలని అనుకోకుండా నీ ఇంటి కోడలుగా చేసుకోవాల్సి వచ్చింది అది మీకు ఓకేనా అని అడిగారు..

ఆ అమ్మాయికి ఏమైంది బంగారు బొమ్మలా ఉంది ఒంటి చేత్తో వాళ్ళ నాన్న బిజినెస్ ని చూసుకుంటుంది గా అంది జానకమ్మ నీ ఆడబడుచు బుద్ధి నీకు తెలిసిందే కదా జానకమ్మ కాస్త జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నామన్నారు గుంపులోని ఆడవాళ్లు.

అది నా మనవాళ్లు చూసుకుంటారు ఒకవేళ నా మనవళ్ళ వల్ల కాకపోతే నా మనవరాలు చక్కగా చూసుకోగలదు అని బదులిచ్చారు వర్మ దంపతులు.

మీ నమ్మకమే నిజమై మీ అందరూ చాలా సంతోషంగా ఉండాలి మన ఊరిని ఇంకా ఇంకా వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు అందరు.

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అయిపోయాయా మీ ముచ్చట్లు అయిపోతే వచ్చి భోజనం చేయండి లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలరు అంది రోషిని.

అది మీ తరం పిల్లలే బొమ్మ మేము చాలా స్ట్రాంగ్ అన్నారు భామ్మలు ఒప్పుకున్నాంలే మీరు స్ట్రాంగ్ అని అయినా టైం కి భోం చేయాలి కదా రండి అంది రోషిని.

వస్తున్నాం లే కానీ మీ తాతయ్య మీ అన్నయ్య ల బావ పెళ్లిని అక్కడ పెట్టాడు కదా నీ పెళ్ళైన ఈ ఊర్లో చేయమని అడుగు అన్నారు.

ఇప్పుడే కదా బామ్మ వీళ్ళ నిశ్చితార్థం అయ్యింది నా పెళ్లికి ఇంకా చాలా టైముంది కదా అప్పటికి చూసుకుందాంలే అంది రోషిని.

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలే మనవరాల తొందరగా మాకు పప్పన్నం పెట్టేయ్ ఈ లోపల మాకు దేవుడి నుంచి పిలుపు వచ్చేస్తే ఎలా అంది ఇంకో బామ్మ.

అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్ అలా ఎలా పంపించేస్తాం బామ్మ, గట్టిగా అనుకో ఏమో ఈ రాముల వారి గుడిలోనే మీరు కోరుకున్నట్టు మా పెళ్లి అవుతుందేమో, అలాగే మా పప్పన్నం తిన్నాకే నిన్ను దేవున్ని పిలవమని చెప్తాం లే రండి భోంచేద్దురు, స్వీట్ 16 కదా మీరు ఇంత సేపు లేట్ చేస్తే ఎలా అంటూ అందరినీ భోజనాల దగ్గరికి పంపారు అరుణ్ రోషిణి.

నిశ్చితార్థం జరిగిన జంటల్ని ఏ పని చేయడానికి వీల్లేదని అందరినీ మండపంలో కూర్చోబెట్టారు.. మిగిలిన కుర్ర గ్యాంగ్ కూడా వాళ్ళ దగ్గర తోడుగా కూర్చోగా

అరుణ్ రోషిణి అటు ఇటు తిరుగుతూ పలకరించిన వాళ్ళతో మాట్లాడుతూ.. అందర్నీ భోంచేసి వెళ్ళమని చెబుతూ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు.

రాదని వెళ్లి ఊరి వాళ్ళందరినీ పలకరించమని భవాని ఎంతగా చెబుతున్నా నాకు వాళ్ళు ఎవరో పెద్దగా తెలియదు నేను వెళ్ళను అంటూ మండపంలో కూర్చుంది..

ఎవరు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడలేవా అంతా మన ఊరి వాళ్లే కదా అంది భవాని.

అబ్బా నానమ్మ ఒకే ఊరైన చిన్నప్పటినుంచి ఎదురు పడిన కూడా కనీసం పలకరించకుండా ఇప్పుడు మాత్రం వెళ్లి నవ్వుతూ మాట్లాడితే నేను యాక్షన్ చేస్తున్నానని ఇట్టే ఎదుటి వాళ్ళకి అర్థం అయిపోతుంది దానికంటే నేను ఇక్కడ కూర్చోవడమే బెటర్ అంది అటు ఇటు తిరుగుతున్న అరుణ్ణి చూస్తూ.

నిన్ను కాదే చిన్నప్పటి నుంచి స్టేటస్ స్టేటస్ అంటూ నిన్ను పెంచిన నన్ను అనుకోవాలి లే అంటూ తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడడానికి వెళ్లిపోయింది భవాని.

భవాని లాగా స్టేటస్ పిచ్చి ఉండే వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. తెలిసి తెలియని పిల్లల మనసులో కూడా అది రుద్దుతూ ఉంటారు. మీ మధ్యన మీరు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశారో నాకు కామెంట్ లో చెప్పండి. స్టోరీ ఎలా ఉందో చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపితే నా రైటింగ్ స్కిల్స్ ఇంకొంచెం నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయం అవుతుంది. థాంక్యూ ఫర్ సపోర్టింగ్ మీ.

9 Responses