అరుణోదయ రోషిని – 38

అరుణోదయ రోషిని తదుపరి భాగం:

అరుణ్ రోషిని ఒక అందమైన రోజుని తమ ఖాతాలో వేసుకుని బీచ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి

రోషీనీ అనుకున్నట్టుగానే మిగిలిన వాళ్ళు హాల్లో కూర్చుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

వీళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి నాకు నిజంగా నిద్ర వస్తుందని పరిగెత్తుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయింది అరుణ్ణి అక్కడే వదిలేసి.

రూమ్ కి వెళ్ళిన వెంటనే హమయ్య తప్పించుకున్నాను అని తలుపుకి గడియ పెట్టేసింది.

వెంటనే తను చేయాల్సిన పని గుర్తొచ్చి ముందుగా తన నంబర్ నుంచి పూజిత కి బిందుకి సుచరితకి హరి రాజులకి నిఖిల్ కి థాంక్యూ మెసేజ్ పంపింది

తర్వాత రోషన్ నెంబర్ హ్యాక్ చేసి పూజిత కి  జరిగినవి మనసులో పెట్టుకోకుండా అన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్ర పొమ్మని నాకు ఎటువంటి కోపం లేదని

వీలుంటే రేపు కలుద్దామని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి ఆన్లైన్లోకి వెళ్లిపోయింది కొద్దిసేపటి తర్వాత

అజయ్ నంబర్ హాక్ చేసి బిందుకి థాంక్స్ ఫర్ టుడే అని మెసేజ్ పెట్టింది.

https://omg10.com/4/11363402

థాంక్స్ ఫర్ ది అండర్స్టాండింగ్, నీతో జర్నీ అంత టఫ్ గా ఏమీ ఉండదని అనుకుంటున్నాను ఆ రామయ్య సన్నిధిలో ముడిపడిన మన బంధానికి మనస్ఫూర్తిగా

ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. గుడ్ నైట్ అని చెప్పి తిరిగి మళ్ళీ ఆఫ్లైన్లోకి వెళ్లిపోయింది.

కొద్దిసేపు తర్వాత వరుణ్ నెంబర్ హ్యాక్ చేసి జరిగినవి మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా

నిద్ర పొమ్మని ఏది జరిగిన ఇద్దరం కలిసి పేజ్ చేద్దామని నీ ఫ్యామిలీ ఎప్పటికీ ఇదేనని మెసేజ్ చేసింది.

జరిగిన వాటినీ తలుచుకొని ఆలోచిస్తూ ఉన్న సుచి మెసేజ్ చూసి ఏదైనా డైరెక్ట్ గా చేప్పోచు కదా ఎందుకు

మీ బావ నెంబర్ హాక్ చేసి మరి మెసేజ్ చేస్తున్నావ్ అని రిప్లై ఇచ్చింది.

తెలిసిపోయిందా ఎంతైనా మా అక్క 2 స్మార్ట్ అయినా ఎలా కనిపెట్టావు నేనేనని అని రిప్లై ఇచ్చింది.

మీ బావ మెసేజ్ స్టైల్ వేరే ఉంటుందో లే అయినా నేనేమీ బాధపడట్లేదు

నా వెనక నా బంగారు కొండ ఉండగా నేను ఎందుకు భయపడతాను చెప్పు అయినా

నేను ఆలోచిస్తుంది ఇన్ని రోజులు పట్టించుకోని వాళ్ళు సడన్ గా నా ముందుకు ఎందుకు వస్తున్నారు బుజ్జి

దీనివల్ల మన ఫ్యామిలీలో ఏమైనా డిస్టబెన్స్ వస్తాయేమో అని భయంగా ఉందిఅని తన మనసులో బాధని బయటపెట్టింది సుచి.

అయినా నువ్వు ఇప్పుడు మేజర్ వి నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే రైట్ నీకు ఉంది అయినా నిన్ను పట్టించుకోని వాళ్ల గురించి నువ్వు ఇంతగా ఆలోచించడం

టైం వేస్ట్ హ్యాపీగా భావని తలుచుకుని నిద్రపో ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం

నాకు ఫుల్లుగా నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి హాల్లో అరుణ్ పరిస్థితి ఏంటో అని తలుచుకుని నవ్వుకొని నిజంగానే డీప్ స్లీప్ లొకి వెళ్లిపోయింది

రోజంతా పనితో అలసిపోవడం అలాగే హ్యాపీగా బీచ్ లో టైమ్స్ స్పెండ్ చేయడంతో.

హాల్లో అరుణ్ణి రౌండప్ చేసేసారు అందరూ. అజయ్ విజయ్ అరుణ్  చెరొక వైపు కూర్చుని నువ్వు నువ్వు

మాత్రమే టైమ్ స్పెండ్ చేస్తే చాలా ఇక్కడికి ఎందుకు వచ్చాం బె అన్నారు.

అరె వెధవన్నర వెధవల్లారామీ పార్ట్నర్స్ తో టైం స్పెండ్ చేయక మా ఇద్దరి మధ్య పుల్లలు పెడతారేంటి  అన్నాడు.

మా తమ్ముడికి చాలా ధైర్యం వచ్చింది అన్నాడు వరుణ్ ఏంటి అన్నయ్య మీ బావలతో పోటాపోటీకి దిగుతున్నావ్ అంది శ్రావ్య.

లేకపోతే ఒక్కరైనా ఒక్కరూ నాకు సపోర్ట్ వచ్చే వాళ్ళు ఉన్నారా ఇంక్లూడింగ్ బంగారం వాళ్ళ అన్నయ్యల విషయానికొస్తే నన్ను

పక్కన పెట్టేస్తుంది అందుకే నా గురించి నేనే ఫైట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను

వదినని బిందు ని నా పార్టీలో చేర్చుకుని మీకు అగైనెస్ట్ గా టీం బిల్డ్ చేయకపోతే అప్పుడు అడగండి అన్నాడు అరుణ్ బింకంగా

శబదాలు వద్దులే అన్నయ్య అంది శ్రావ్య. నువ్వు మాట్లాడకు నువ్వు  అన్నయ్య ఇద్దరు గోడ మీద పిల్లులే, నేను మీ అందరి మీద అలిగాను

నాకు నిద్ర వస్తుంది బాయ్ అంటూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.

మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వుకొని ఎవరి రూములకు వాళ్ళు వెళ్లిపోయారు.  విజయ్ మాత్రం వెళ్తూ వెళ్తూ శ్రావ్య కి ఒక ముద్దు పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.

రోషిని ఎలాగో గడిబెట్టుకుని నిద్రపోయి ఉంటుంది లేకపోతే ఇంతసేపు కిందకు రాకుండా ఉండదని ఆలోచించిన శ్రావ్య వేరే రూమ్ లోకి వెళ్లి పడుకుంది.

మరుసటి రోజు కాలేజీకి వెళ్తున్న సుచరితని దారిలోనే అడ్డగించింది రమ్య. ఈ విషయం ముందే పసిగట్టిన రోషిని సుచరిత కి కూడా తెలియకుండా సెక్యూరిటీని పెట్టింది.

ఇంటి దగ్గర నుంచి కాలేజీ వరకు జాగ్రత్తగా వాచ్ చేయమని ఏదైనా అవసరం అనుకుంటే వెంటనే యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది.

సెక్యూరిటీ ఆరేంజ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న అరుణ్ గట్టిగా నవ్వడంతో బావగారికి హాస్యం ఎక్కువైనట్టుంది అంది.

నా బంగారం ఎంత డెవలప్ అయిందో తలుచుకుంటే నవ్వొస్తుంది అన్నాడు.

నిజమే ఒకప్పుడు ఈ సెక్యూరిటీ టైప్ లైఫ్ అంటే ఎంత విసిగించుకునిందో ఇప్పుడు దానికి అంతగా అలవాటు పడిపోతుంది

అందుకు కారణం కుటుంబం మీద తనకి ఉన్న అంతులేని ప్రేమే అని చెప్పాలి.

దారిలో అడ్డగించిన రమ్య ఏంటక్కా చాలా రోజుల తర్వాత  చెల్లిని చూసిన ఆనందం నీలో కనపడలేదు నిన్న అని అడిగింది.

ఇన్ని రోజులు తరువాత కొత్తగా పుట్టుకు వచ్చిన ఈ చెల్లికి ఇప్పుడు అక్క సడెన్ గా ఎందుకు గుర్తుకొచ్చిందా

అని ఆలోచిస్తూ పట్టించుకోవడం మర్చిపోయానులే అని అంతే వెటకారంగా సమాధానమిచ్చింది సుచి.

పట్టించుకోకపోవడం ఏంటి చిన్నప్పటినుంచి బెస్ట్ స్కూల్లో చదువుకున్నావ్ మంచి కాలేజీలో చదువుకున్నవ్వా

టికి అంత డబ్బు నాన్న పెట్టిందే కదా నిన్ను ఎక్కడ పట్టించుకోలేదు అని అడిగింది.

మరి నువ్వు కూడా నాలాగే అలాగే స్కూల్లో కాలేజీలో చదువుకోకపోయావా ఎందుకు ఇంట్లో ఉన్నావు మరీ.

ఏం మాట్లాడాలో తెలియక ఒక్క క్షణం ఆలోచించిన రమ్య జరిగిందేదో జరిగిపోయింది నాన్న చాలా బాధపడుతున్నాడు

తన మొహం నీకు ఎలా చూపించుకోవాలో తెలియక  నన్ను ఎలాగైనా ఒప్పించి నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు.

ఒకసారి ఆలోచించు కోట్లకి అధిపతి అయ్యి వుంది తన కూతురు ఎక్కడో పరాయి వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటుంటే ఎలా ఫీలవుతాడు అంది.

ఎస్ యువర్ రైట్ కోట్లకు అధిపతి మీ నాన్న  దాంతో నాకేంటి సంబంధం, నువ్వు అన్నావే స్కూల్కి కాలేజీలకి

డబ్బులు కట్టడని కన్నాడ కాబట్టి కట్టడని నేను అనుకుంటున్నాను, లేదు

నాకు అంత సీన్ లేదు అనుకుంటే తను నా మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వడ్డీతో సహా తిరిగించేస్తాను.

ఇదే మాట వెళ్లి మీ నాన్నకి నా మాటగా చెప్పు, ఇక తమరి కారూ పక్కకు జరిగితే నేను కాలేజీకి వెళ్ళాలి ఈ విధంగా

రోడ్డుమీద వేస్ట్ చేసేంత టైం నా దగ్గర లేదు నా కోసం స్టూడెంట్ చేస్తున్నారు అంది.

కోట్లకి వారసురాలివి ఈ విధంగా కాలేజీలో లెక్చరర్ గా పని చేయడం నీకు అవమానంగా లేదా అంది.

also a కోట్లు ఎంత మంది కన్నీటితో సంపాదించాడు అని నీకు మీ అమ్మకి తెలిసినంత మంచిగా ఇంకా ఎవరికీ తెలుసు చెప్పు నాకు తెలుసు అనుకో కానీ నాకు అనవసరం.

మీ నాన్న మహానుభావుడు నాకు జన్మనిచ్చినందుకు ఆ పాపం నాకు ఏదైనా కొంచెం తగిలిందంటే నా జీవితం అంత పేద వాళ్లకు

న్యాయం చేసి ఆ రుణాన్ని కర్మ ఫలితాన్ని నేను కడిగేసుకుంటాను.

నేను కనిపించేందుకు మంచిదాన్ని కాదు ఇంతకుముందు నాతో నీకు పెద్దగా పరిచయం లేదు కదా అందుకే నాతో పెట్టుకుంటున్నావ్ బెటర్నా

కు దూరం మైంటైన్ చేస్తే నీకు మీ నాన్నకి మీ అమ్మకి అంత మంచిది

ఇంకొకసారి నాకు ఎదురుపడితే ఇంత ఈజీగా సమాధానం చెప్పను జాగ్రత్త అంటూ కారు పక్కనించి తప్పుకుని వెళ్లిపోయింది.

ఇప్పుడే కొనండి ఇక్కడ క్లిక్ చేసిWooden Partition Divider for Living Room,

Partition Wall, Privacy Divider,

Freestanding Folding Panels for (6 Feet 3 Panel with 3 Shelve) (6 Feet 3 Panel with 3 Shelves)

రోషన్ నుంచి వచ్చిన మెసేజ్ చూసిన పూజిత హ్యాపీగా ఫీల్ అయ్యి థాంక్యూ ఫర్ గివింగ్ మీ అని మెసేజ్ పెట్టింది.

ఆ మెసేజ్ చూసిన రోషన్ ఆ పని ఎవరు చేశారో తెలుసు కాబట్టి నవ్వుకున్నాడు. హ్యాపీగా చాటింగ్ చేస్తున్న పూజిత దగ్గరికి వచ్చిన రుచిత

అక్క నేను నీతో పాటు మీ ఆఫీస్ కి రావచ్చా అని అడిగింది. నీకు తెలుసో లేదో ఆ అధికారం నాకు లేదు.

ఇంకొక విషయం నిన్న నువ్వు ఎగ్జిబిషన్లో చేసిన విషయం నాన్న వరకు రాకుండా ఎలా జాగ్రత్త పడతావో పడు

ఈసారి మాత్రం నేను నీకు సపోర్ట్ చేయదలుచుకోలేదని కచ్చితంగా చెప్పేసి ఆఫీస్కు వెళ్లిపోయింది పూజిత.

(పూజిత కి కొంచెం జ్ఞానోదయం అయినట్టు ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే అయినట్టే అనిపిస్తుంది చూద్దాం మరి)

ముందు ముందు అరుణ్ రోషిని లా ప్రయాణం ఎలా సాగబోతుందో తెలుసుకోవాలంటే చదువుతూనే ఉండండి మన అరుణోదయ రోషిని నీ

ఎపిసోడ్ ఎలా ఉందో చదివేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పేసేయండి

ఇంకో ఎపిసోడ్ రేపు ఉదయం లోపల అప్లోడ్ చేయడానికి నా సాయి శక్తుల ప్రయత్నిస్తాను.

2 thoughts on “అరుణోదయ రోషిని – 38”

Comments are closed.